Agriculture

పాపం…పసుపు రైతుకు అంతా అశుభమే!

Turmeric Farmers Facing Lots Of Losses By Cultivating It

పసుపు … శుభానికి చిహ్నం! వంటల్లోకైతే చిటికెడేగానీ ఔషధాలు, సౌందర్య సాధనాల్లోనూ పసుపు వినియోగం ఎక్కువ! అందుకే రోజురోజుకీ ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ పెరుగుతోంది. రాష్ట్రంలోయైతే అధికార పార్టీ జెండా రంగు కూడా పసుపే! మిగిలిన పంటలతో పోలిస్తే పసుపు పంటకు పెట్టుబడి ఎక్కువ..రైతు చేసే చాకిరి కూడా ఎక్కువే! దుంప నాటి నప్పటి నుండి పంట తీసి ఉడకబెట్టి, గ్రేడింగ్‌ చేసేంతవరకూ.. కౌలు తీసుకున్న వారి కంటికి కునుకుండదు. వారి ఇళ్లలోని మహిళలతో పాటు, పిల్లలు కూడా తలా ఓ చెయ్యి వేయాల్సిందే. ఇంతా చేస్తే ధర నామమాత్రం! ఈ ఏడాది పరిస్థితి మరీ ఘోరం. అందుకే పసుపు రైతులు ఉద్యమ బాట పడుతున్నారు. దుగ్గిరాల పసుపు యార్డు సమీపంలోని బి.పి. గారి కళ్యాణమండపంలో నేడు సదస్సు జరుగుతోంది. . కష్టాలకు కారణాలు, కన్నీళ్లు తొలిగే మార్గాల గురించి చర్చించనున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతు సంఘాల నేతలుతో పాటు పెద్ద సంఖ్యలో రైతులు భాగస్వామ్యం కానున్నారు.