DailyDose

₹2కోట్ల గంజాయి పట్టివేత-నేరవార్తలు-06/15

2Crore INR worth marijuana seized - June 15 2019 - Daily Crime News

* హైదరాబాద్‌ నగర శివార్లలో భారీగా గంజాయి పట్టుబడింది. కొబ్బరి కాయల లోడ్‌తో వెళ్తున్న లారీలో గంజాయి తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 944 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ మార్కెట్లో సుమారు 1.8 కోట్ల రూపాయలు ఉంటుందని పేర్కొన్నారు. కొబ్బరి కాయల లోడ్‌ ముసుగులో గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం అందిన మేరకు డీఆర్‌ఐ(డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటలిజెన్స్‌) అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణకు గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించడంతో పోలీసులు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు.
* యువతి శరీరంపై బ్లేడ్‌తో కోశాడు. పళ్లతో కొరికాడు. ఒళ్లంతా గాయాలతో యువతి తల్లడిల్లుతుంటే.. నడిరోడ్డుపై వివస్త్రను చేసి రాక్షసానందం పొందాడు. కోరిక తీర్చలేదని తోటి ఉద్యోగి సిద్ధూ అనే యువకుడు ఈ దారుణానికి తెగబడ్డాడు. హైదరాబాద్‌ బేగంపేటలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది.
* హైదరాబాద్‌లో ప్రేమ జంట దాడి చేసిన ఘటన విషాదంగా ముగిసింది. ప్రేమ జంట దాడిలో తీవ్రంగా గాయపడ్డ సాయి సాగర్‌ అనే యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. రెండు రోజులు మృత్యువుతో పోరాడి ప్రాణాలు విడిచాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు
* హైదరాబాద్‌ శివారు శంషాబాద్‌లో మందుబాబులు ఆగడాలు శృతి మించిపోతున్నాయి. తాగిన మైకంలో ముగ్గురు ముబులు ఓ ఎయిర్‌ లైన్స్‌ ఉద్యోగిని పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. వారి నుంచి తప్పించుకున్న బాధితురాలు.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ పోలీసులకు ఆశ్రయించింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
* గుజ‌రాత్‌లో దారుణం జ‌రిగింది. ఓ హోట‌ల్‌లోని సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తున్న న‌లుగురు పారిశుద్ధ కార్మికుల‌తో పాటు మొత్తం ఏడు మంది మృతిచెందారు. వ‌డోద‌రాలోని ఫ‌ర్తికుయి గ్రామంలో ఈ ఘ‌ట‌న జ‌రిది.
* ఉత్తరప్రదేశ్ మీరట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మొకంపూర్‌లోని ఓ పురుగుల మందు ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో.. పరిసర ప్రాంతాలను దట్టమైన పొగలను కమ్మేశాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడతున్నారు. కాగా, ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగిందని ఫ్యాక్టరీ యజమానులు వాపోయారు.
* హైదరాబాద్‌ నగర శివార్లలో భారీగా గంజాయి పట్టుబడింది. కొబ్బరి కాయల లోడ్‌తో వెళ్తున్న లారీలో గంజాయి తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 944 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ మార్కెట్లో సుమారు 1.8 కోట్ల రూపాయలు ఉంటుందని పేర్కొన్నారు. కొబ్బరి కాయల లోడ్‌ ముసుగులో గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం అందిన మేరకు డీఆర్‌ఐ(డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటలిజెన్స్‌) అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణకు గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించడంతో పోలీసులు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు.
* ప.గో జిల్లాలోని కొణితివాడలో విషాదం చోటు చేసుకుంది. నిన్న అదృశ్యమైన బాలుడు నేడు చెరువులో శవతేలాడు.
వివరాల్లోకి వెళ్లితే.. వీరవాసరం మండలం కొణితివాడలో మోక్షగౌతం అనే బాలుడు నిన్న అదృశ్యమయ్యాడు. దీంతో బాలుడి ఆచూకీ కోసం తల్లిదండ్రులు తీవ్రంగా గాలించారు. ఎంతకు బాలుడి ఆచూకీ దొరకకపోవడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేడు ఉదయం స్థానిక చెరువులో బాలుడి మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించారు.
*విశాఖ విమానాశ్రయంలో జగన్ పై దాడి కేసులో నిందితుడి శ్రీనివాసరావుకు విజయవాడలోని జాతీయ దర్యాప్తు సంస్థ కోర్టు గత మే 24న మంజూరు చేసిన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ ఎన్ఐయే అధికారులు శుక్రవారం హైకోర్టును ఆశ్రయించారు. నిందితుడు బెయిల్ ఆపి బయట ఉంటె ఈకేసుపై ప్రభావం చూపుతుందన్నారు. 2018 అక్టోబరు 25న విశాఖలో జగన్ పై శ్రీనివాసరావు కోడికట్టితో దాడి ఘటనలో ఎంఐయే కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
*గుజరాత్‌లోని వడోదరలో దారుణం జరిగింది. సెప్టిక్‌ ట్యాంక్‌లో చిక్కుకున్న ఓ వ్యక్తిని కాపాడబోయి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
*త్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని కాంకెర్‌ జిల్లా ముర్నార్‌ అటవీ ప్రాంతంలో శుక్రవారం పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు.
*ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాథమికోన్నత పాఠశాలల కోసం విజ్ఞానదాయక పుస్తకాల కొనుగోలు వ్యవహారంలో రూ.4.66 కోట్ల సొమ్మును అదనంగా చెల్లించారన్న అభియోగంపై సర్వశిక్ష అభియాన్‌ రాష్ట్ర ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ జి.శ్రీనివాస్‌కు ఏసీబీ అధికారులు శుక్రవారం నోటీసులు జారీచేశారు.
* స్కార్పియో వాహనం చెట్టును ఢీకొనటంతో నలుగురు మృతి చెందారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా వినుకొండ మండలం విఠంరాజుపల్లె వద్ద శుక్రవారం వేకువ జామున జరిగింది.
* విజయనగరం జిల్లా బొబ్బిలి పారిశ్రామికవాడ బాలాజీ రసాయన పరిశ్రమలో శుక్రవారం బాయిలర్‌ పేలడంతో ఇద్దరు ఉద్యోగులు మృతిచెందారు.
*విశాఖ నుంచి హైదరాబాద్‌ బయలుదేరిన గోదావరి ఎక్స్‌ప్రెస్‌ రైలుకు శుక్రవారం సాయంత్రం పెద్ద ప్రమాదం తప్పింది.
* బెంగళూరులో సంచలనం సృష్టిస్తున్న ఐఎంఏ ఆభరణాల సంస్థ కేసుపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దృష్టి సారించింది.
*తాంత్రికుడి మాటల మాయలో పడి జీవిత భాగస్వామిని నదిలో ముంచి చంపేశాడో భర్త. ఈ హత్యకు సహకరించిన తాంత్రికుడితో పాటు పారిపోతున్న భర్తను పోలీసులు అరెస్టు చేశారు.
*జమ్మూకశ్మీరులోని పుల్వామా జిల్లాలో శుక్రవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు.
*పోలీసులు గస్తీ తిరుగుతుండగా మావోయిస్టులు ఒక్కసారిగా వారిపై కాల్పులు జరిపారు. దీంతో మొత్తం ఐదుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు.
*ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని కాంకెర్‌ జిల్లా ముర్నార్‌ అటవీ ప్రాంతంలో శుక్రవారం పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు.
*ఇద్దరు అక్కాచెల్లెళ్లు విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. తండ్రి మందలించడంతోనే వారు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. గ్రామస్థులు మాత్రం కుమార్తెలను విక్రయించడానికి తండ్రి ప్రయత్నించాడని ఆరోపించారు. ఒడిశాలోని గంజాం జిల్లా కవిసూర్యనగర్‌ ఠాణా పరిధిలోని గుడియాలి గ్రామంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది.
*జేఈఈ ఫలితాల్లº మంచి మార్కులు రాలేదని హన్మకొండకు చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. హన్మకొండ ఎక్సైజ్‌ కాలనీలో ఉండే అరుణ్‌కుమార్‌ జేఈఈ పరీక్ష రాశాడు. శుక్రవారం అడ్వాన్‌డ్‌ ఫలితాలు వెలువడగా అనుకున్న మేరకు మార్కులు రాకపోవడంతో మనస్తాపం చెందాడు. ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
*వాహన తనిఖీల్లో భాగంగా వికారాబాద్‌ జిల్లా బొంరాస్‌పేట పోలీసులు శుక్రవారం భారీగా నకిలీ పత్తివిత్తనాలను పట్టుకున్నారు.
* మహబూబాబాద్ జిల్లాలో ఇద్దరు అంతర్‌జిల్లా దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మరో ఆరుగురు నిందితులు పరారీలో ఉన్నారు.
* సంగారెడ్డి జిల్లాలోని అమిన్‌పూర్ మున్సిపల్ పరిధిలోని వాణి నగర్ ప్రాంతంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఒంటరిగా ఉన్న అరుందతి(57) అనే మహిళ కళ్లలో కారం చల్లిన దుండగులు కర్రతో కొట్టి, గొంతు నులిమి హత్య చేశారు.