DailyDose

ఏపీలో పాఠశాలలపై దాడులు-తాజావార్తలు-06/15

Government Officials Inspect Illegal Schools In Andhra Pradesh-June 15 2019 - Daily Breaking News

* విశాఖపట్నంలో నారాయణ, నలంద సహా 10 పాఠశాలలు సీజ్. ప్రభుత్వ అనుమతి లేకుండానే నిర్వహణ తనిఖీలు చేపట్టి జప్తు చేసిన జిల్లా డీఈవో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచన ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు లేకుండా 10 పాఠశాలలు నడుపుతున్నారని జిల్లా విద్యాశాఖ అధికారి(డీఈవో) తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ఈ స్కూళ్లను జప్తు చేశామని వెల్లడించారు. ఈ జాబితాలో నారాయణ స్కూలు(కైలాస మిట్ట), జాగృతి స్కూలు(గాజువాక), గ్లోబల్ స్కూలు, సుపాద స్కూలు, లోటస్ స్కూల్స్ ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే స్టాన ఫర్డ్ స్కూలు, సన్ ట్రైట్ స్కూలు, నరసింహ స్కూలు, లిటిల్ ప్యారడైజ్ స్కూలు, నలందా హైస్కూల్ ను జప్తు చేశామని అన్నారు. తల్లిదండ్రులు అందరూ తమ పిల్లలను ఇలాంటి ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలలో చేర్పించకుండా జాగ్రత్త పడాలని సూచించారు. ఈ మేరకు విశాఖ డీఈవో పత్రికా ప్రకటనను విడుదల చేశారు.
* ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఈరోజు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని జగన్ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై వైసీపీ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో విందును ఏర్పాటు చేసిన జగన్.. ఇందుకు కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామిని ఆహ్వానించారు.ఈ ఆహ్వానాన్ని మన్నించిన కుమారస్వామి జగన్ ఇంటిలో జరుగుతున్న విందు భేటీకి హాజరు అయ్యారు. ఈ కార్యక్రమంలో వైసీపీ లోక్ సభ, రాజ్యసభ సభ్యులతో పాటు పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. కాగా, ఈ భేటీలో ఏపీ, కర్ణాటకకు లబ్ధి చేకూర్చే అంశాలపై ఇరువురు నేతలు కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందని వైసీపీ వర్గాలు చెప్పాయి. ఈ విషయంలో ఇరురాష్ట్రాల సీఎంలు కలసికట్టుగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తారని పేర్కొన్నాయి.
* దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రారంభమైన ప్రతీ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఏపీ జలవనరుల శాఖ మంత్రి పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. ఏపీ జలవనరుల మంత్రిత్వ శాఖను పారదర్శకంగా నిర్వహిస్తామని చెప్పారు. ఏపీ సచివాలయంలో తన ఛాంబర్ లో ఈరోజు అనిల్ కుమార్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పుత్తూరు మున్సిపాలిటీకి తెలుగు గంగ ప్రాజెక్టు నుంచి 1.3 టీఎంసీల నీటి విడుదలకు సంబంధించిన ఫైలుపై తొలి సంతకం చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రైతులు సుభిక్షంగా ఉంటారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని ప్రతీ ఎకరాకు సాగునీరు అందిస్తామని మంత్రి అనిల్ పేర్కొన్నారు. మాజీ సీఎం చంద్రబాబు హయాంలో వ్యవసాయశాఖలో భారీ అవినీతి చోటుచేసుకుందనీ, తమ ప్రభుత్వ హయాంలో జలవనరుల శాఖలో దోపిడీ ఉండదని స్పష్టం చేశారు. ప్రతీ టెండర్ ను జ్యుడీషియల్ కమిషన్ ముందు ఉంచుతామని పునరుద్ఘాటించారు.
* అవనిగడ్డ హై స్కూల్ లో రాజన్న బడిబట కార్యక్రమంలో స్కూల్ పిల్లలతో కలిసి సహపంక్తి భోజనాల్లో పాల్గొన్న అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు.
*దేశ రాజధానిలో మెట్రో రైలు సర్వీసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలన్తున్న కేజ్రీవాల్ ప్రభుత్వ ప్రతిపాదనను ఆమోదించా వద్దని ప్రధాని మోడీకి మెట్రో మ్యాన్ గా ప్రసిద్ది పొందిన ఈ శ్రీధరన్ విజ్ఞప్తి చేశారు. దీన్ని ఆమోదిస్తే ఇదో ప్రమాదకరమైన సంప్రదాయంగా మారిపోతుందని ఫలితంగా మెట్రో వ్యవస్థ దివాలాకు దారి తీస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈమ్రకు ప్రధాని మోడీకి లేఖ రాశారు. ప్రభుత్వ బస్సులు, మెట్రో రైళ్ళలో మహిళలకు ఉచితంగా ప్రయాణం కల్పిస్తానని ఇటీవల డిల్లి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
* రాష్ట్రంలో బీసీల్లో మరికొన్ని కులాలు చేర్చేందుకు వచ్చిన విజ్ఞప్తులను బీసీ కమిషన్‌ పరిశీలిస్తోంది. దాదాపు 30 కులాలకు చెందిన ప్రతినిధులు ఇప్పటికే బీసీ కమిషన్‌కు ప్రతిపాదనలు సమర్పించారు.
*కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార్‌-2019, యువ పురస్కార్‌-2019లను ప్రకటించింది. త్రిపుర రాజధాని అగర్తలలో శుక్రవారం అకాడమీ అధ్యక్షుడు డాక్టర్‌ చంద్ర శేఖర కంబారా అధ్యక్షతన సమావేశమైన కమిటీ ఆంగ్లం, హిందీతో పాటు ప్రాంతీయ భాషలకు సంబంధించి 22 మంది రచయితలను బాల సాహిత్య పురస్కారాలకు, 23 మందిని యువ పురస్కారాలకు ఎంపిక చేసింది.
*భౌతిక దాడులను నిరసిస్తూ పశ్చిమ బెంగాల్‌లో ఆరంభమైన వైద్యుల సమ్మె తీవ్రరూపం దాలుస్తోంది. నాలుగో రోజుకు చేరిన ఈ ఆందోళన దేశంలోని ఇతర ప్రాంతాలకూ పాకుతోంది. అనేక రాష్ట్రాల్లో వైద్యులు వీరికి సంఘీభావం తెలుపుతూ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
*తెలంగాణ మంత్రిమండలి సమావేశం ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన భారీ ఎజెండాతో ఈ భేటీని నిర్వహిస్తున్నారు. మంత్రిమండలి సమావేశాన్ని గత నెల 28నే జరపాలని ప్రభుత్వం తొలుత భావించింది.
* కోస్తాలో మండుతున్న ఎండ‌లు రోజు మ‌ధ్యాహ్నం 1.00 గంట‌కు న‌మోదైన ఉష్ణోగ్ర‌త‌ల వివ‌రాలుప్ర‌కాశం జిల్లా టంగుటూరులో అత్య‌ధికంగా 45.27 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్ర‌త న‌మోదువిశాఖ‌ప‌ట్నం జిల్లా బోయిల కింటాడ‌లో 45.25 డిగ్రీల సెంటీగ్రేడు ఉష్ణోగ్ర‌త‌విజ‌య‌గ‌న‌రం ప‌ట్‌ాణంలో 45.19 డిగ్రీల సెంటీగ్రేడు ఉష్ణోగ్ర‌త‌ తూర్పు గోదావ‌రి జిల్లా చామ‌వ‌రం, తునిలో 45.18 సెంటీగ్రేడు ఉష్ణోగ్ర‌త న‌మోదు శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టిలో 44.90 డిగ్రీల సెంటీగ్రేడు ఉష్ణోగ్ర‌త‌ 31 ప్రాంతాల్లో 44 నుండి 46 డిగ్రీల సెంటీగ్రేడ్ మ‌ధ్య ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు172 ప్రాతాల్లో 42 నుండి 44 గ్రీల సెంటీగ్రేడ్ మ‌ధ్య ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదుఅత్య‌ధిక ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదుఈ నెల 18వ తేదీ వ‌ర‌కు ఎండ‌ల తీవ్ర‌త‌ వాతావ‌రణంలో గ‌ణనీయంగా ప‌డిపోయిన తేమ శాతం అనూహ్యంగా పెరుగుతున్న ఉష్ణోగ్ర‌త‌లు వ‌డ‌గాల్పుల తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంటుంది ప్ర‌జ‌లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌గా ఉండాలి ఎండ‌ల్లో బ‌య‌ట తిర‌గ‌కుండా, నీడ‌ప‌ట్టున సేద‌తీరాలి వృద్ధులు, చిన్న‌పిల్ల‌ల ప‌ట్ల జాగ్ర‌త్త‌లు పాటించాలి
*నైరుతి రుతుపవనాలు శుక్రవారం కేరళ దాటి కర్ణాటక దక్షిణ ప్రాంతంలోకి విస్తరించాయి. ఆదివారం నాటికి ఇవి కర్ణాటకలో మరింత వ్యాపించే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. తెలంగాణకు మాత్రం ఈ నెల 19 లేదా 20 తేదీల్లో వచ్చే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు.
* మిషన్‌ భగీరథలో మిగిలిన పనులను జులై 15 కల్లా పూర్తి చేసి రాష్ట్రంలో ఇంటింటికీ శుద్ధమైన మంచినీరు అందేలా చూడాలని పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారుల్ని ఆదేశించారు.
* నిర్మల్‌ జిల్లాలోని బాసర ఆర్జీయూకేటీలో 2019-20 విద్యా సంవత్సరానికిగాను ఎంపికైన విద్యార్థుల తొలి జాబితా శనివారం వెలువడనుంది.
* రైతుబంధు పథకం కింద 33.70 లక్షలమంది రైతుల ఖాతాల్లో రూ.3430 కోట్లను జమ చేసినట్లు వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి తెలిపారు. మిగిలిన రైతులకు కూడా దశలవారీగా జమ చేస్తామని శుక్రవారం ఆయన విలేకరులకు చెప్పారు.
* దేశవ్యాప్తంగా ఉన్న 31 ఎన్‌ఐటీలు, 20 జీఎఫ్‌టీఐ (గవర్నమెంట్‌ ఫండెడ్‌ టెక్నికల్‌ ఇన్‌స్టిట్యూట్‌), 23 ఐఐటీలు, 23 ట్రిపుల్‌ ఐటీల వంటి 97 విద్యా సంస్థల్లోని 36,268 సీట్ల భర్తీకి సంబంధించి జోసా (జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ) ఆధ్వర్యంలో ఈనెల 16 నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది.