DailyDose

మే నెలలో నాలుగు శాతం పెరిగిన ఎగుమతులు-వాణిజ్య–06/15

Indian exports have seen growth in May - June 15 2019 - Daily Business News

*హైదరాబాద్‌కు చెందిన ఫార్మాసూటికల్‌ సంస్థ డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబరేటరీస్‌ లిమిటెడ్‌ న్యూరాలజీ విభాగానికి చెందిన ఔషధాల హక్కులు విక్రయించనుంది.
*మారుతీ సుజుకీ నుంచి బీఎస్‌-6 శ్రేణిలో హ్యాచ్‌బ్యాక్‌ వ్యాగన్‌ఆర్‌ మోడల్‌ విపణిలోకి వచ్చింది. 1.2 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో దీన్ని రూపొందించింది.
*విదేశీ మారకపు నిల్వలు జీవనకాల గరిష్ఠ స్థాయి చేరువకు వెళ్లాయి.జూన్‌ 7తో ముగిసిన వారంలో 168.60 కోట్ల డాలర్లు పెరిగి 42355.40 కోట్ల డాలర్లకు (దాదాపు రూ.29.64 లక్షల కోట్లు) చేరాయి.
*భారత ఎగుమతులు మే నెలలో 3.93 శాతం వృద్ధి చెంది 30 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. ఎలక్ట్రానిక్స్‌, రసాయనాల ఎగుమతులు రాణించడం ఇందుకు నేపథ్యం.
*టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 22 నెలల కనిష్ఠానికి దిగి వచ్చింది. గత నెలలో 2.45 శాతంగా నమోదైంది.
* ఏటీఎం కేంద్రాల్లో దొంగతనాలు పెరుగుతున్నందున, వాటిని సురక్షితంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని బ్యాంకులను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఆదేశించింది.
*ఏటీఎం కేంద్రాల్లో దొంగతనాలు పెరుగుతున్నందున, వాటిని సురక్షితంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని బ్యాంకులను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఆదేశించింది.
*అమెరికా నుంచి దిగుమతి అవుతున్న 29 రకాల ఉత్పత్తులపై ప్రతీకార సుంకాలు వసూలు చేసే తేదీని ఎట్టకేలకు ప్రభుత్వం ఖరారు చేసింది.