DailyDose

కేసీఆర్‌కు వాస్తుపిచ్చి-రాజకీయం-06/15

Issues over destructing secretariat by KCR - June 15 2019 - Daily Political News

*సచివాలయం కూల్చ రాదని, కొత్త భవనాల నిర్మాణం కోసం నిర్ణయం అని వింటున్నాం గతం లో నే దీనిపై కోర్టుకు వెళ్ళాం
100 ఏళ్ల వుండే భవనాలను 20 ఏళ్ళ లోపే కీలగొట్టేయత్నం చేస్తోంది Nyt కూడా దీని అంగీకరించదు 9.5 లక్షల చదరపు ఫీట్ల భవనాలను కూల్చి 5 లక్షల చదరపు ఫీట్లు కట్టాలని చూస్తున్నారుగత ముఖ్యమంత్రుల కొడుకులు సీఎం లు కాలేదని, ఇప్పుడు కెటిఆర్ కోసం భవనాలను కులుస్తూన్నారు కాంగ్రెస్ దీన్ని వ్యతిరేకేస్తుంది…నిధుల దుర్వినియోగం తప్ప ఒరిగేది లేదు కెసిఆర్ గొప్పగా చెప్పే గురుకులాలకు భవనాలను ఎందుకు మంజూరు చేయడం లేదుప్రభుత్వ సొమ్ము తో జల్సా లు చేసేందుకు వాడుకుంటున్నారు సీఎం కేసీఆర్ ఈ ఆలోచన ను ఉపసంహరించాలి వాస్తు పండితుల సూచనలను పాటిస్తూ… ప్రజలను పట్టించుకోవడం లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇక్కడి నుంచే పాలన్ సాగింది కాంట్రాక్టర్లు కోసం వాస్తు పిచ్చితో కెసిఆర్ దుబారకు వెళుతున్నాడు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా మేము న్యాయస్థానాల కు వెలుతాం ఇబ్బందులు ఉంటే మరమ్మత్తులు చేసుకోవాలి సచివాలయంలో లో ఏ పి ఖాళీ చేస్తే ఇతర కార్యాలయలను ఏర్పాటు చేయవచ్చు సచివాలయం కుల గొట్టడాన్ని మేము ఒప్పుకోమ్ వాస్తు నమ్మ్మకం వేరు..వాస్తు పిచ్సి వేరు పిచ్చి తో కెసిఆర్ వ్యహరిస్తున్నారు
* వైయస్ జగన్ ను కలిసిన కర్ణాటక సీఎం
ఢిల్లీ ఏపీ భవన్‌లో వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి వైసీపీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు హాజరయ్యారు. పార్లమెంట్‌ ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఇందులో ప్రత్యేక హోదా, విభజన హామీలు..కేంద్రం నుంచి నిధులు సాధించడంపై ఎంపీలకు జగన్ దిశానిర్దేశం చేశారు. కాగా ఈ సమావేశం అనంతరం కర్ణాటక ముఖ్యమంత్రి కుమరస్వామి…వైఎస్‌ జగన్‌ ను కలిశారు. వైఎస్‌ జగన్ ఈ సందర్భంగా కుమారస్వామిని సన్మానించారు.
* పార్లమెంటులో మన గళం వినిపించండి : ఎంపీలకు జగన్‌ దిశానిర్దేశం
సమస్యలపై పార్లమెంటులో సామరస్య పూర్వక ధోరణిలో మన వాణి వినిపించాలని ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి జగన్‌ ఈరోజు ఏపీ భవన్‌లో పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంటు ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. రాష్ట్ర సమస్యలపై రాజీ పడకుండా మన గళం వినిపించాలని, అవసరమైన హక్కులను సాధించేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. ఎక్కువ మంది సభ్యులు కొత్తవారు కావడంతో వారికి పలు అంశాలు వివరించారు. ఇంకా సమావేశం కొనసాగుతుండగా పలు అంశాలపై సభ్యులతో జగన్ చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి లోక్‌సభా పక్షం నేత మిధున్‌రెడ్డితోపాటు పార్టీ ఎంపీలంతా హాజరయ్యారు.
*ఎంపీ రాయపాటికి షాకిచ్చిన ప్రభుత్వం
టీడీపీ నేత, మాజీ లోక్‌సభ సభ్యుడు రాయపాటి సాంబశివరావుకు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. రాయపాటికి ఇన్ని రోజులు కల్పించిన గన్‌మెన్లను తొలగించారు. అయితే తన గన్‌మెన్లను ఏపీ ప్రభుత్వం తొలగించడంపై రాయపాటి ఇంకా స్పందించలేదు. అయితే ఇటీవల మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు సైతం ఏపీ ప్రభుత్వం భద్రతను కుదించింది. ఇన్నాళ్లు చంద్రబాబుకు జెడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉండగా.. తాజాగా ఆయన వాహనానికి పైలెట్ క్లియరెన్స్ వాహనంతో పాటు ఎస్కార్ట్ కారును తొలగించిన విషయం తెలిసిందే.
*జగన్ ను కలిసిన కర్ణాటక ముఖ్యమంత్రి
ఢిల్లీ ఏపీ భవన్‌లో వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి వైసీపీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు హాజరయ్యారు. పార్లమెంట్‌ ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఇందులో ప్రత్యేక హోదా, విభజన హామీలు..కేంద్రం నుంచి నిధులు సాధించడంపై ఎంపీలకు జగన్ దిశానిర్దేశం చేశారు. కాగా ఈ సమావేశం అనంతరం కర్ణాటక ముఖ్యమంత్రి కుమరస్వామి…వైఎస్‌ జగన్‌ ను కలిశారు. వైఎస్‌ జగన్ ఈ సందర్భంగా కుమారస్వామిని సన్మానించారు
* జగన్ కృషిని అభినందిస్తున్నాం- యార్లగడ్డ
తెలుగు భాష అభివృద్ధికి జగన్ కృషిని అభినందిస్తున్నామని యార్లగడ్డ లక్ష్మిప్రసాద్ అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రతి పాఠశాలలో తెలుగు తప్పనిసరి చేస్తూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. గత ఐదేళ్లలో తెలుగు భాష అభివృద్ధికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆయన అన్నారు. తెలుగు వర్సిటీ, తెలుగు అకాడమీ విభజనను వేగవంతం చేయాలని యార్లగడ్డ పేర్కొన్నారు.
* ఏపీ భవన్‌లో సభ్యులతో భేటీ
కొత్తగా ఎన్నికైన వారికి పలు అంశాలను వివరించిన సీఎం రాష్ట్ర సమస్యలపై పార్లమెంటులో సామరస్య పూర్వక ధోరణిలో మన వాణి వినిపించాలని ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి జగన్‌ ఈరోజు ఏపీ భవన్‌లో పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంటు ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. రాష్ట్ర సమస్యలపై రాజీ పడకుండా మన గళం వినిపించాలని, అవసరమైన హక్కులను సాధించేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. ఎక్కువ మంది సభ్యులు కొత్తవారు కావడంతో వారికి పలు అంశాలు వివరించారు. ఇంకా సమావేశం కొనసాగుతుండగా పలు అంశాలపై సభ్యులతో జగన్ చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి లోక్‌సభా పక్షం నేత మిధున్‌రెడ్డితోపాటు పార్టీ ఎంపీలంతా హాజరయ్యారు.
* ఏపీ మంత్రి పుష్పశ్రీవాణికి తప్పిన ప్రమాదం
ఏపీ ఉపముఖ్యమంత్రి, గిరిజన శాఖమంత్రి పుష్పశ్రీవాణికి తృటిలో ప్రమాదం తప్పింది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పుష్పశ్రీవాణి తొలిసారిగా సొంత జిల్లా విజయనగరం విచ్చేయడంతో అభినందనలు తెలిపేందుకు పార్టీ శ్రేణులు భోగాపురం మండలం రాజాపులోవ సమీపంలో జాతీయరహదారి పక్కన సభావేదిక ఏర్పాటు చేశారు. వేదికపైకి ముందుగానే కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. మంత్రితోపాటు మరికొందరు నాయకులు సభావేదికపై వెళుతుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో అప్రమత్తమైన మంత్రి వెంటనే కిందకు దిగడంతో ప్రమాదం తప్పింది. ఈఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ పరిణామంతో వెంటనే మంత్రి తిరిగి విజయనగరం పయనమయ్యారు.
* చంద్రబాబు హయాంలో భారీగా అవినీతి జరిగింది.. నా శాఖలో ఇకపై దోపిడీ ఉండదు! – మంత్రి అనిల్ కుమార్
దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రారంభమైన ప్రతీ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఏపీ జలవనరుల శాఖ మంత్రి పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. ఏపీ జలవనరుల మంత్రిత్వ శాఖను పారదర్శకంగా నిర్వహిస్తామని చెప్పారు. ఏపీ సచివాలయంలో తన ఛాంబర్ లో ఈరోజు అనిల్ కుమార్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.అనంతరం పుత్తూరు మున్సిపాలిటీకి తెలుగు గంగ ప్రాజెక్టు నుంచి 1.3 టీఎంసీల నీటి విడుదలకు సంబంధించిన ఫైలుపై తొలి సంతకం చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రైతులు సుభిక్షంగా ఉంటారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని ప్రతీ ఎకరాకు సాగునీరు అందిస్తామని మంత్రి అనిల్ పేర్కొన్నారు. మాజీ సీఎం చంద్రబాబు హయాంలో వ్యవసాయశాఖలో భారీ అవినీతి చోటుచేసుకుందనీ, తమ ప్రభుత్వ హయాంలో జలవనరుల శాఖలో దోపిడీ ఉండదని స్పష్టం చేశారు. ప్రతీ టెండర్ ను జ్యుడీషియల్ కమిషన్ ముందు ఉంచుతామని పునరుద్ఘాటించారు.
* కొత్తగా 2.20 కోట్ల మందికి భాజపా సభ్యత్వం
కొత్తగా ఈ ఏడాది 2.20 కోట్ల మందిని భాజపా సభ్యులుగా చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆ పార్టీ ఉపాధ్యక్షుడు, సభ్యత్వ నమోదు సమన్వయకర్త శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ చెప్పారు. శుక్రవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ‘సర్వ స్పర్శి-సర్వ వ్యాపి’ (అన్ని వర్గాలకు…అన్ని ప్రాంతాలకు) అన్న నినాదంతో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతామని తెలిపారు. ప్రస్తుతం పార్టీలో 11 కోట్ల మంది కార్యకర్తలు ఉన్నారని, వారి సంఖ్యను ప్రస్తుతం 20 శాతం మేర పెంచాలని నిర్ణయించామని తెలిపారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జులై ఆరో తేదీన ప్రారంభించి, ఆగస్టు 10న ముగిస్తామని తెలిపారు. ఈసారి పశ్చిమబెంగాల్‌, కశ్మీర్‌, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, సిక్కిం, తెలంగాణ, పుదుచ్చేరిలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని అన్నారు. గతంలో మిస్డ్‌ కాల్‌ ఇస్తే సభ్యత్వం ఇచ్చేవారమని, కానీ ఇప్పుడు ఫారం కూడా నింపాల్సి ఉంటుందని తెలిపారు.
*రాజ్యసభలో మేజర్తీకి ఇంకా దూరమే.
మోడీ ప్రభుత్వానికి లోక్ సభలో పూర్తీ ఆధిక్యత ఉన్నా. రాజ్యసభలో మాత్రం విల్లుల అమోడంలో ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. లోక్సభలో భాజపా నాయకత్వంలోని ఎన్డీఏకు 353 సీట్లు ఉన్నాయి. అదే రాజ్యసభలో ఉన్న సీట్లు 98 మాత్రమే . రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్యా 250 కాగా, కీలక సమయాల్లో సగం కన్నా ఎక్కువ సీట్లు ఉండాల్సిన అవసరం పడుతుంది. ఎగువ సభకు మెజార్టీ లేక గతంలోనూ మోడీ ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంది.
*అన్నా నమస్తే.. చంద్రబాబుకు వైకాపా ఎమ్మెల్యే అభివాదం
అన్నా నమస్తే అంటూ వైకాపా ఎమ్మెల్యే ఒకరు తెదేఅపా ధినేత చంద్రబాబునాయుడుకు అభివాదం చేశారు. చంద్రబాబు కూడా ఆయనతో కరచాలనం చేసి బాగున్నావా? అంటూ బుజం తట్టారు. అనుకోకుండా చోటు చేసుకున్నన ఈ ఘటనను అక్కడున్న పలువురు ఎమ్మెల్యేలు ఆసక్తిగా తిలకించారు. శుక్రవారం శాసనసభ వాయిదా పడ్డాక బయటకు వెళుతున్న చంద్రబాబును ఎదురుగా వచ్చిన వైకాపా ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి పలకరించారు. అన్నా నమస్తే అంటూ దగ్గరకు వచ్చారు. చంద్రబాబు ఆయన్ను కుశలమా అడిగి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయారు.
*మల్లాది విష్ణు గెలుపు ఉత్త్రవ్యులు రాదు చేయండి.
తమ నియోజకవర్గంలోని పదకొండు పోలింగ్ కేంద్రాల్లో వీవీ ప్యాట్లను లెక్కించాకే ఫలితాల్ని ప్రకటించాలని కోరినా రిటర్నింగ్ అధికారి పట్టించుకోలేదని పేర్కొంటూ ఓట్ల లెక్కింపు ప్రక్రీయ పై అభ్యంతరం ప్రకటిస్తూ విజయవాడ మధ్య నియోజకవర్గం తెదేపా అభ్యర్ధి బొండా ఉమామహేశ్వరరావు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై పాతిక ఓట్లతో వైకాపా అభ్యర్ధి మల్లాది విష్ణు గెలుపొందినట్లు అధికారులు మే 23న జారీ చేసిన ఉత్తర్వ్యులను రద్దు చేయాలని ఆయన కోరారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా పలు వత్యాసాల్ని గమనించానన్నారు. ఈ వ్యవహారమై అదే రోజు జిల్లా ఎన్నికల అధికారి వినతి సమర్పిస్తూ ఫలితాల ప్రకటనకు ముందే వీవీ ప్యాట్స్ లేక్కుమ్పునకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరినా పట్టించుకోలేదని అన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని తానూ ఇచ్చిన వినతి పై ప్రజాప్రాతినిధ్య చట్ట నిబంధనల మేరకు వ్యవహరించేలా ఎన్నికల అధికారిని ఆదేశించాలని కోరారు. వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు వ్యాజ్య ప్రతులను ఈసీ తరపు న్యాయవాదికి ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాదికి సూచించింది. విచారణకు ఈనెల పద్దెనిమిదికి వాయిదా వేసింది.
*మన్మోహన్‌ సింగ్‌ దారెటు?
మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్థిక వేత్త మన్మోహన్‌ సింగ్‌ రాజ్యసభ పదవీ కాలం శుక్రవారంతో ముగిసింది. దీంతో రానున్న బడ్జెట్ సమావేశాలకు ఆయన దూరంగా ఉండనున్నారు. కాంగ్రెస్‌ హయాంలోని ప్రభుత్వాలలో ఆయన కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. 1991 ఆర్థిక సంస్కరణల అమలులోనూ కీలకంగా వ్యవహరించారు. 2008లో ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యమాన్ని ఎదుర్కొన్నా భారత్‌పై మాత్రం అది పెద్దగా ప్రభావం చూపలేదు. మన్మోహన్‌ వ్యూహాలే అందుకు కారణమని అప్పట్లో వివిధ వర్గాల నుంచి ఆయన ప్రశంసలు అందుకున్నారు.
*18న మంత్రిమండలి సమావేశం
తెలంగాణ మంత్రిమండలి సమావేశం ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన భారీ ఎజెండాతో ఈ భేటీని నిర్వహిస్తున్నారు. మంత్రిమండలి సమావేశాన్ని గత నెల 28నే జరపాలని ప్రభుత్వం తొలుత భావించింది. కానీ, ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో వాయిదా వేసింది. చివరిసారిగా మంత్రిమండలి భేటీ రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఫిబ్రవరిలో జరిగింది. అప్పటి నుంచి రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలు పెండింగ్‌లో ఉన్నాయి.
*26 లేదా 27 తేదీల్లో నూతన సచివాలయానికి శంకుస్థాపన?
రాష్ట్రంలో నూతన సచివాలయ నిర్మాణానికి ఈ నెల 26 లేదా 27 తేదీల్లో శంకుస్థాపన చేసే అవకాశాలున్నాయి. ఈ నెల చివరన ఈ రెండు రోజుల్లో మంచి ముహూర్తాలున్నాయి. ప్రస్తుతం ఉన్న సచివాలయ ప్రాంగణంలోనే నూతన భవనాలను నిర్మించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. సచివాలయ నిర్మాణానికి 2016లోనే ముంబయికి చెందిన ఆర్కిటెక్ట్‌ సంస్థ భవన నమూనాలను రూపొందించింది.
*వైకాపా దాడులకు ప్రభుత్వానిదే బాధ్యత
రాష్ట్రవ్యాప్తంగా తెదేపా కార్యకర్తలపై వైకాపా దాడులు పెరిగిపోవడం ఆందోళనకరమని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెదేపా జాతీయాధ్యక్షుడు చంద్రబాబు పేర్కొన్నారు. ఈ దాడులకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. శుక్రవారం విజయవాడలో జరిగిన తెదేపా రాష్ట్ర స్థాయి సమావేశంలో చంద్రబాబు ‘ఎన్నికల తరువాత కార్యకర్తలపై దాడులు- దౌర్జన్యాలు’ అంశంపై చర్చించారు.
*చంద్రబాబు ఎదుట గళం విప్పిన నేతలు
తెదేపా నాయకులు నిర్మొహమాటంగా గళమెత్తారు. శుక్రవారం విజయవాడలో జరిగిన తెదేపా విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ ఓటమికి కారణాలపై లోతైన చర్చ జరిగింది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఎదుట, నాయకులు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. వేల మందిని ఒకేసారి లైన్‌లోకి తీసుకుని టెలికాన్ఫరెన్స్‌లు నిర్వహించడం సరికాదని అశోక్‌గజపతిరాజు అభిప్రాయపడ్డారు.
*తెరపైకి ‘స్పెషల్‌ ఫోకస్‌ స్టేట్స్‌’!
ప్రత్యేక హోదా! ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా సహా దేశంలోని పలు రాష్ట్రాల డిమాండ్‌ ఇది. ఏ రాష్ట్ర కారణాలు ఆ రాష్ట్రం చెప్పుకొని తమకు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతున్నాయి. ప్రస్తుతం ఆ అవకాశాలపై పురోగతి కనిపించకపోడంతో ఆయా రాష్ట్రాల ఆశలు సన్నగిల్లినట్టయింది. అయితే… ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయంగా కేంద్రం నుంచి ఎక్కువ నిధులు రాబట్టేందుకు ఒడిశా ముఖ్యమంత్రి సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు.
*వైకాపా దాడులకు ప్రభుత్వానిదే బాధ్యత
రాష్ట్రవ్యాప్తంగా తెదేపా కార్యకర్తలపై వైకాపా దాడులు పెరిగిపోవడం ఆందోళనకరమని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెదేపా జాతీయాధ్యక్షుడు చంద్రబాబు పేర్కొన్నారు. ఈ దాడులకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. శుక్రవారం విజయవాడలో జరిగిన తెదేపా రాష్ట్ర స్థాయి సమావేశంలో చంద్రబాబు ‘ఎన్నికల తరువాత కార్యకర్తలపై దాడులు- దౌర్జన్యాలు’ అంశంపై చర్చించారు.
*ఐదుకోట్ల జీవితాల్లో ఆనందాల వెలుగు
ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు చేసిన అన్ని వాగ్దానాలూ నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించిందని రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌.నరసింహన్‌ అన్నారు. నిరాశానిస్పృహలతో మార్పు కోసం ఎదురుచూస్తున్న ప్రజల జీవితాల్లో తన ప్రభుత్వం ఆనందాన్ని నింపుతుందని వ్యాఖ్యానించారు.
*రాష్ట్ర పర్యటనకు అడ్వాణీ, సుష్మా ఆసక్తి
తెలంగాణలో పర్యటించేందుకు భాజపా సీˆనియర్‌ నేతలు అడ్వాణీ, సుష్మాస్వరాజ్‌ ఆసక్తి చూపారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ తెలిపారు. శుక్రవారం పార్టీ సీనియర్‌ నేత వెదిరె శ్రీరాంతో కలిసి ఆయన వారితో వారివారి నివాసాల్లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీˆనియర్‌ నేతలిద్దరూ రాష్ట్రంలో భాజపా ఒంటరిగా నాలుగు లోక్‌సభ స్థానాలు గెలవడంపై హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పార్టీ ఎదుగుదలపట్ల అడ్వాణీ సంతోషం వ్యక్తం చేశారు. అడ్వాణీ రథయాత్రతో పార్టీ ఎంతో బలపడిందని.. ఆ సమయంలో తాను ప్రముఖ్‌గా వ్యవహరించానని లక్ష్మణ్‌ గుర్తు చేశారు. సీˆనియర్‌ నేత సుష్మాస్వరాజ్‌ తెలంగాణ బిల్లు సమయంలో పార్లమెంటులో పార్టీ తరఫున పోరాడిన తీరును, బిల్లుకు మద్దతుగా నిలిచిన వైనాన్ని గుర్తు చేశారు. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత తెలంగాణలో పర్యటిస్తానని ఆమె వారికి హామీ ఇచ్చారు.
*బెంగాల్‌లో ఉండేవారు బెంగాలీ నేర్చుకోవాల్సిందే: మమత
పశ్చిమ బెంగాల్‌లో నివసించేవారు బెంగాలీ మాట్లాడాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ‘గుజరాత్‌ నమూనా’ అనుకరించి, అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి బెంగాలీలు, మైనార్టీలను భాజపా లక్ష్యంగా చేసుకుంటోందని దుయ్యబట్టారు. బెంగాలీలు సొంత రాష్ట్రంలోనే నిరాశ్రయులు కావడాన్నీ తాను సమ్మతించబోనన్నారు. ‘‘మనం దిల్లీ వెళ్లినప్పుడు హిందీ మాట్లాడతాం. పంజాబ్‌ వెళ్లినప్పుడు పంజాబీ మాట్లాడతాం.
*రాజ్యసభలో మెజార్టీకి ఇంకా దూరమే..
మోదీ ప్రభుత్వానికి లోక్‌సభలో పూర్తి ఆధిక్యత ఉన్నా, రాజ్యసభలో మాత్రం బిల్లుల ఆమోదంలో ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. లోక్‌సభలో భాజపా నాయకత్వంలోని ఎన్‌డీఏకు 353 సీట్లు ఉన్నాయి. అదే రాజ్యసభలో ఉన్న సీట్లు 98 మాత్రమే. రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 250 కాగా, కీలక సమయాల్లో సగంకన్నా ఎక్కువ సీట్లు ఉండాల్సిన అవసరం పడుతుంది. ఎగువసభలో మెజార్టీ లేక గతంలోనూ మోదీ ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంది.
*రాష్ట్ర పర్యటనకు అడ్వాణీ, సుష్మా ఆసక్తి
తెలంగాణలో పర్యటించేందుకు భాజపా సీˆనియర్‌ నేతలు అడ్వాణీ, సుష్మాస్వరాజ్‌ ఆసక్తి చూపారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ తెలిపారు. శుక్రవారం పార్టీ సీనియర్‌ నేత వెదిరె శ్రీరాంతో కలిసి ఆయన వారితో వారివారి నివాసాల్లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీˆనియర్‌ నేతలిద్దరూ రాష్ట్రంలో భాజపా ఒంటరిగా నాలుగు లోక్‌సభ స్థానాలు గెలవడంపై హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పార్టీ ఎదుగుదలపట్ల అడ్వాణీ సంతోషం వ్యక్తం చేశారు.
*కేసీఆర్‌ కుటుంబానికే కాళేశ్వరం అద్భుత ప్రాజెక్ట్‌
కాళేశ్వరం ప్రాజెక్టు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబానికి అద్భుతమైన ప్రాజెక్టు తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాత్రం కాదని కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. కేవలం రూ.28 వేల కోట్ల వ్యయంతో పూర్తయ్యే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్‌ను రీడిజైనింగ్‌ పేరుతో లక్ష కోట్ల ప్రాజెక్టు చేశారని అన్నారు. ఇప్పటికే రూ.50వేల కోట్ల వ్యయం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరాకూ నీరు అందడంలేదన్నారు.
*కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ
కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం శుక్రవారం మంత్రివర్గాన్ని విస్తరించింది. జనతాదళ్‌ రెండు, కాంగ్రెస్‌ తరఫున ఒకరు మంత్రివర్గంలో స్థానం దక్కించుకునే అవకాశం ఉన్నా- రెండు పార్టీలూ చెరో స్థానాన్ని మాత్రమే భర్తీచేశాయి. మంత్రివర్గంలో చేరిన ఇద్దరూ స్వతంత్ర సభ్యులు కావడం ఆశ్చర్యకరం. దళ్‌ కోటాలో ముళబాగిలు ఎమ్మెల్యే హెచ్‌.నాగేశ్‌, కాంగ్రెస్‌ కోటాలో రాణిబెన్నూరు ఎమ్మెల్యే ఆర్‌.శంకర్‌ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మిగిలిన స్థానాన్ని ఎప్పుడు భర్తీ చేస్తారో వెల్లడించలేదు. శుక్రవారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో మొదలైన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం పది నిమిషాల్లోనే ముగిసింది. ముఖ్యమంత్రి కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రి జి.పరమేశ్వర్‌, సమన్వయ సమితి అధ్యక్షుడు సిద్ధరామయ్యతో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు.
*వారి సమస్యలపై సీఎంతో చర్చిస్తా: కన్నబాబు
సహకార సంఘాల ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి జగన్‌తో చర్చించి న్యాయం జరిగేలా చూస్తామని వ్యవసాయ, సహకార శాఖ మంత్రి కురసాల కన్నబాబు హామీ ఇచ్చారు. రాష్ట్ర సహకార సంఘాల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పీవీఎస్‌ఎన్‌ రాజు, ప్రధాన కార్యదర్శి పి.సత్యనారాయణ, కోశాధికారి వెంకట్రామయ్య తదితరులు సచివాలయంలో మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. జీతాలు, గ్రాట్యుటీ సమస్యలను వివరించారు. త్వరలోనే సహకార సంఘాల ముఖ్య కార్య నిర్వహణాధికారులతో సమావేశం నిర్వహిస్తామని మంత్రి వారికి చెప్పారు.
**తెదేపాలోనే కొనసాగుతా: ఆదినారాయణరెడ్డి
తాను భాజపాలో చేరుతానని వస్తున్న వార్తలు పూర్తి అవాస్తమని, తెదేపాలోనే కొనసాగుతానని మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి స్పష్టం చేశారు. వైకాపా మైండ్‌గేమ్‌ అడుతోందని మండిపడ్డారు. శుక్రవారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రామసుబ్బారెడ్డి, తాను ఓటమి పాలవడం వెనుక బలమైన కారణాలున్నాయని, ఇద్దరం ఏకం అయితే ఇబ్బందని కొందరు భావిస్తున్నట్లున్నారని చెప్పారు.
*ఎన్డీయే, యూపీయేలకు సమానదూరం
పార్లమెంటు సమావేశాల సందర్భంగా అటు అధికార కూటమి ఎన్డీయేకు, ఇటు ప్రతిపక్ష కూటమి యూపీయేకు సమానదూరం పాటించాలని తెదేపా నిర్ణయించింది. ఈ నెల 17 నుంచి లోక్‌సభ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నేతృత్వంలో శుక్రవారం తెదేపా పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు.
*చంద్రబాబు నిర్వాకం వల్లే ఇబ్బందులు
గవర్నర్‌ ప్రసంగం సీఎం జగన్‌ పాలనలోని కచ్చితత్వాన్ని స్పష్టం చేస్తోంది. అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వం లేనిది ఉన్నట్లు చెప్పడం వల్ల కేంద్రానికి రాష్ట్రంపై భిన్నాభిప్రాయం ఏర్పడింది. పూర్తిగా అభివృద్ధి చెందిన రాష్ట్రానికి రాయితీలు, హోదా ఎందుకివ్వాలనే భావనలోకి కేంద్రం వెళ్లింది. చంద్రబాబు నిర్వాకం వల్లే రాష్ట్రానికి ఇబ్బందులు ఎదురయ్యాయి.