Devotional

వర్షాల కోసం స్వ‌రూపానందేంద్ర‌ దీక్ష

Sarada Swaroopanandendra Prays For Rains In Andhra

తెలుగు రాష్ట్రాల్లో సమృద్ధిగా వర్షాలు పడాలని ఆకాంక్షిస్తూ విశాఖ శ్రీ శార‌దా పీఠాధిప‌తి స్వ‌రూపానందేంద్ర‌ స్వామీజీ స‌న్యాసికారి దీక్ష‌ను చేయ‌నున్నారు.. అమ‌రావ‌తిలో ఈ దీక్ష 15వ (రేపటి నుంచి) తేది నుంచి 17వ తేది వ‌ర‌కూ కొన‌సాగనుంది. ఇవాళ విజ‌య‌వాడ వ‌చ్చిన ఆయ‌న దుర్గమ్మను దర్శించుకున్నారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ నెల 15, 16, 17న లోక కల్యాణార్థం సన్యాసికారి దీక్ష చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌,తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ తో పాటు ఒడిశా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ హాజ‌ర‌వుతున్నారు.
1. శ్రీవారికి రూ.2.25 కోట్ల విరాళాన్ని అందజేసిన భక్తుడు
ఐదున్నర కిలోల స్వర్ణ హస్తాలు ….కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలు, విరాళాలకు కొదువేలేదు. తమ కోర్కెలు నేరవేరాలని హుండీలో తోచినంత వేసి మొక్కు చెల్లించుకుంటారు. స్వామికి భక్తులు ఇచ్చే కానుకులను మాత్రం లెక్కగట్టేందుకు కొన్ని శాసనాలు రికార్డులు ఉన్నాయి. ఒకప్పుడు దాతలు ఇచ్చిన కానుకలే స్వామి సేవలకు వినియోగించేవారు. కైంకర్యాలు మొదలుకుని, ఆభరణాల వరకూ చాలా సామాగ్రి దాతలు ఇచ్చినవే కావడం విశేషం. ఈ కానుకలకు చరిత్ర ఉంది. లా తొలికానుక ఇచ్చిన వారు పల్లవరాణి సమువాయిగా చెబుతున్నారు. సమువాయి స్వామికి పరమభక్తురాలు. ఆమె తరచూ శ్రీవారిని దర్శించుకునేవారు. అలా అక్కడ స్వామి సేవకు కావలసిన వస్తువులను అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగానే ఆమె కీ.శ.614లో భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని తయారు చేయించి ఆలయానికి బహుకరించారు. నాటి పల్లవుల నుంచి రాయల వరకు ఎన్నో కానుకలను ఇచ్చారు.అయితే శ్రీవారికి చెన్నైకి చెందిన ఓ భక్తుడు విరాళాన్ని అందజేశాడు. రూ.2.25 కోట్ల విలువైన 6 కేజీల కటిక, అభయ హస్తం విరాళంగా ఇచ్చాడు.
2. సింహ వాహనంపై యోగ నరసింహుని అవతారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి
అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన శ‌నివారం ఉదయం అనంతతేజోమూర్తి అయిన శ్రీనివాసుడు యోగ నరసింహుని అవతారంలో సింహ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు మూడో రోజు ఉదయం దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహంపై కూర్చొని ఊరేగుతారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో ‘సింహదర్శనం’ అతి ముఖ్యమయింది. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంతాలవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి సర్వత్రా విజయులమై ఆధిపత్యంతో రాణించే స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు నిరూపిస్తున్నారు. ముత్య‌పుపందిరి వాహనంపై బ‌కాసుర‌వ‌ధ‌ అవతారంలో శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారు కాగా శ‌నివారం రాత్రి 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు ముత్యపుపందిరి వాహనంపై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారు బ‌కాసుర‌వ‌ధ అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ముత్యాల నిర్మలకాంతులు వ్యాపించడానికి, ఆ కాంతులు దర్శించి భక్తులు ముక్తులు కావడానికి రాత్రి వేళయే అనుకూలం. అందుకే కల్యాణ శ్రీనివాసునికి మూడో రోజు రాత్రి మొదటియామంలో ముత్యాల పందిరిలో కూర్చొని విహరించే కైంకర్యాన్ని పెద్దలు నిర్ణయించారు. ముత్యం స్వచ్ఛతకు సంకేతం. మనిషి ఆత్మ ఎన్నో జన్మల అనంతరం విశ్వలోకాల నుండి రాలి, దుర్లభమైన మానవజన్మను సంతరించుకుంటుంది. మాంసమయమైన ఈ శరీరాన్ని ఆధ్యాత్మిక సంపదతో శుద్ధి చేసుకుంటే బుద్ధి ముత్యంలాగా మారి, జనన, మరణ చక్రం నుండి విడుదలై మోక్షాన్ని పొందుతుంది. ఇలా స్వామివారికి మిక్కిలి ప్రీతిపాత్రమైన ముత్యాలహారాలు – రత్నాల వల్ల కలిగే వేడిమినీ, పుష్పాల వల్ల కలిగే సుగంధాన్ని తమలో ఇముడ్చుకుని, స్వామివారి వక్షఃస్థలానికి, అక్కడి లక్ష్మీదేవికి సమశీతోష్ణస్థితిని చేకూరుస్తూ, తాపగుణాన్ని హరిస్తూ, ఉత్సాహాన్ని, ప్రశాంతతను చేకూరుస్తున్నాయి. జూన్ 16న శ్రీ పసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం జూన్ 16వ తేదీ ఆదివారం సాయంత్రం 5.00 నుండి 7.30 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డు, ఒక అప్పం, అన్నప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు.ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమ‌తి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీ గోపాలకృష్ణా, కంకణభట్టార్‌ శ్రీసూర్యకుమార్‌ ఆచార్యులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ శ్రీనివాసులు, ఇతర ఆధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
3.ప్రధాన ఆలయాల్లో ఆన్‌లైన్‌ సేవలు
రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాల్లో ఆర్జిత పూజలు, అద్దె గదుల సౌకర్యం పొందేందుకు ఆన్‌లైన్‌ సేవలను ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వెల్లడించారు. భక్తుల కోరిక మేరకు యాదాద్రిలో బెల్లం లడ్డూలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. త్వరలో రాష్ట్రంలోని ఇతర ప్రధాన ఆలయాల్లోనూ బెల్లం లడ్డూల విక్రయాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌ బర్కత్‌పుర చమన్‌ సమీపంలో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో రూ.8.12 కోట్ల వ్యయంతో నిర్మించిన యాదాద్రి భవనం, సమాచార కేంద్రాన్ని, ఆన్‌లైన్‌ సేవలను, లోగోను శుక్రవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. తొలివిడతలో యాదగిరిగుట్ట, వేములవాడ, భద్రాచలం, బాసర, మహంకాళి, బల్కంపేట, కర్మన్‌ఘాట్‌ ఆలయాల్లో ఆన్‌లైన్‌ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. వచ్చే నెల నుంచి రెండో దశలో మరో ఆరు ప్రధాన ఆలయాల్లో ఆన్‌లైన్‌ సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. ఆలయాలకు వెళ్లలేని వారు ఆన్‌లైన్‌లోనే పూజ జరిపించుకొనే అవకాశం త్వరలో కల్పిస్తామని, అందుకోసం అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారని వివరించారు. “TAAPFOLIO” మొబైల్‌ యాప్‌ ద్వారా ఆర్జిత పూజలు, దర్శనం, గదుల బుకింగ్‌, ఇతర సేవలను పొందవచ్చని వివరించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని బెల్లం లడ్డూ ప్రసాదాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టినట్లు చెప్పారు. 80 గ్రాముల లడ్డూను రూ.25కు అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ నేతి విద్యాసాగర్‌రావు, మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, జగదీశ్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌, రాష్ట్ర బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ బీఎస్‌ రాములు, సభ్యులు వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.యాదాద్రి భవనం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని నూతన భవనంలోని కల్యాణ మండపంలో లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం కనుల పండువగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులను దేవస్థానం అధికారులు సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. 1600 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మించిన యాదాద్రి భవనంలో సెల్లార్‌లో పార్కింగ్‌, గ్రౌండ్‌ ఫ్లోర్‌లో సమాచార కేంద్రం, మొదటి అంతస్తులో కల్యాణ మండపం, రెండో అంతస్తులో భోజనశాలను ఏర్పాటు చేశారు.
4. వీక్షణలో వైకుంఠం
శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులను మంత్రముగ్ధుల్ని చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా త్వరలోనే రెండు త్రీడీ ప్రాజెక్టుల ద్వారా శ్రీనివాసుడి వైభవాన్ని కొంగొత్తగా ప్రదర్శించబోతోంది. ఇప్పటికే దీనిపై అన్నీ రకాల కసరత్తులు పూర్తి చేసిన తితిదే.. తదుపరి ధర్మకర్తల మండలి సమావేశంలో ఆమోదం పొంది అమలులోకి తీసుకురానుంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తిరుపతి రైల్వేస్టేషన్‌ నుంచి బయటకు రాగానే ఓ దివ్యానుభూతి పొందేలా సమీపంలోని గోవిందరాజస్వామి కోనేరులో శ్రీనివాసుడి మహాత్మ్యం, స్థల పురాణం తెలిపేలా త్రీడీ లేజర్‌ ప్రదర్శనను నిర్వహించాలనేది ప్రణాళిక. సాయంత్రం చీకటిపడిన తర్వాత 40 నిమిషాల పాటు ఈ ప్రదర్శన ఉంటుంది. అదేవిధంగా రెండో ప్రాజెక్టు శ్రీధామం. అలిపిరి టోల్‌గేటు సమీపంలోని 12 ఎకరాల స్థలంలో దీన్ని ఏర్పాటు చేయనుంది.
5. రిత్రలో ఈ రోజు/జూన్ 15 – అన్నా హజారే
1884 : బ్రిటీష్ వ్యతిరేక బెంగాలీ భారతీయ విప్లవాత్మక మరియు అంతర్జాతీయ విద్వాంసుడు తారక్‌నాథ్ దాస్ జననం (మ.1958).
1890 :భారత స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రసిద్ధ జాతీయవాది, బహుభాషా కోవిదుడు ఈడ్పుగంటి రాఘవేంద్రరావు జననం (మ.1942).
1916: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత హెర్బర్ట్ సైమన్ జననం (మ.2001)..
1924 : ప్రముఖ వయొలిన్ విద్వాంసుడు ద్వారం భావనారాయణ రావు జననం (మ.2000).
1937 : భారతీయ సామాజిక కార్యకర్త అన్నా హజారే జననం.
1958 : సుప్రసిద్ద దక్షిణాది సినిమా నటి జయమాలిని జననం.
1980 :తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు చక్రి జననం (మ.2014).
1983 : తెలుగు జాతి గర్వించే మహాకవి శ్రీశ్రీ మరణం (జ.1910).
6. తిరుమల సమాచారం ఓం నమో వేంకటేశాయ
ఈరోజు శనివారం 15-06-2019 ఉదయం 5 గంటల సమయానికి.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ……
శ్రీవారి దర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్ లు నిండి బయట క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులు…
శ్రీ వారి సర్వ దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.
ప్రత్యేక ప్రవేశ (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వ దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది..
నిన్న జూన్ 14 న 82,518 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.
నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు ₹:2.99 కోట్లు.
7. శుభమస్తు తేది : 15, జూన్ 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : జ్యేష్ఠమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
కాలము : వేసవికాలం
వారము : శనివారం
పక్షం : శుక్లపక్షం
తిథి : త్రయోదశి
(నిన్న సాయంత్రం 3 గం॥ 34 ని॥ నుంచి
ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 36 ని॥ వరకు)
నక్షత్రం : విశాఖ
(నిన్న ఉదయం 10 గం॥ 19 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 10 గం॥ 1 ని॥ వరకు)
యోగము : సిద్ధము
కరణం : తైతిల
వర్జ్యం : (ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 3 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 39 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు తెల్లవారుజాము 1 గం॥ 19 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 2 గం॥ 53 ని॥ వరకు)(ఈరోజు రాత్రి 11 గం॥ 41 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 1 గం॥ 17 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 7 గం॥ 26 ని॥ నుంచి ఈరోజు ఉదయం 8 గం॥ 18 ని॥ వరకు)
హుకాలం : (ఈరోజు ఉదయం 8 గం॥ 58 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 36 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు తెల్లవారుజాము 5 గం॥ 41 ని॥ నుంచి ఈరోజు ఉదయం 7 గం॥ 19 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 54 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 32 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 41 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 51 ని॥ లకు
సూర్యరాశి : వృషభము
చంద్రరాశి : వృచ్చికము
విశేషం
15. వైభవంగా శ్రీ భూ సమేత ప్ర‌స‌న్న‌ వేంకటేశ్వరుస్వామివారి స్నపన తిరుమంజనం
శ్రీవారి అనుగ్రహంతో పులకిస్తున్న భక్తులుశ్రీ ప్ర‌స‌న్న‌ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి, అమ్మవార్లకు నిర్వహిస్తున్న స్నపనతిరుమంజనం(పవిత్రస్నానం) మూడో రోజైన శ‌నివారం శోభాయమానంగా జరిగింది. ఇందులో భాగంగా శ‌నివారం ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు ఆలయంలో ఈ వేడుక వైభవంగా జరిగింది. ప్రధాన కంకణభట్టర్‌ శ్రీ సూర్యకుమార్‌ ఆచార్యులు ఆధ్వర్యంలో ఈ విశేష ఉత్సవం నిర్వహించారు. ఇందులో ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, రాజోపచారం నిర్వహించారు. అనంతరం ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం చేపట్టారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా క్షీర(పాలు), దధి(పెరుగు), మది(తేనె), నారికేళం(కొబ్బరినీళ్లు), హరిత్రోదకం(పసుపు), గంధోధకం(గంధం)తో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖధార, చక్రధార, సహస్రధార, మహాకుంభాభిషేకాలను వైఖనస ఆగమయుక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, పంచశాంతి మంత్రములు, దివ్యప్రభందములోని అభిషేక సమయంలో అనుసంధానము చేసే పాశురాలను అర్చకులు పఠించారు. ఈ వేడుకలో ఒకో క్రతువులో ఒక మాల వంతున మొత్తం ఏడు రకాల మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. ఇందులో ఐదు రకాల సాంప్ర‌దాయ‌ పూలు రోజా పూలు, సంపంగి, చామంతి, తులసి, గులాబి మాలలు స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమ‌తి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీ గోపాలకృష్ణా, ఇతర ఆధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
9. చరిత్రలో ఈ రోజు జూన్, 16
** సంఘటనలు
1977: ‘ఒరాకిల్ కార్పొరేషన్’ ని కాలిఫోర్నియా (రెడ్ వుడ్ షోర్స్)లో, లారీ ఎల్లిసన్, బాబ్ మైనర్, ఎడ్ ఓట్స్ స్థాపించారు (సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ లేబరేటరీస్ (ఎస్.డి.ఎల్) కొరకు)
1976: ఆంధ్రప్రదేశ్ 8వ గవర్నర్ గా ఆర్.డి. భండారి ప్రమాణ స్వీకారం చేసాడు (1976 జూన్ 16 నుంచి 1977 ఫిబ్రవరి 16 వరకు)
1963: లెఫ్టినెంట్ వాలెంటీనా తెరెష్కోవా తన 26వ ఏట, మొట్టమొదటి మహిళా రోదసీ యాత్రికురాలుగా (రోదసీలోనికి వెళ్ళిన 5వ వ్యక్తి),వోస్తోక్-6 (రోదసీ నౌక పేరు) లో, రోదసీలోనికి ప్రయాణించింది. ఆమె 2 రోజుల్ 22 గంటల 50 నిమిషములలో, భూమి ఛుట్టూ 49 సార్లు తిరిగి 12,50,000 మైళ్ళూ ప్రయాణించింది.
1960: ఆల్ ఫ్రెడ్ హిచ్ కాక్ దర్శకత్వంలో నిర్మించిన త్రిల్లర్ / హారర్ (భయానకమైన) సైకో సినిమా విడుదల అయ్యింది. రాబర్ట్ బ్లాచ్ రాసిన ‘సైకో’ నవల ఈ సినిమాకి ఆధారం.
1903: ప్రపంచ ప్రసిద్ధి పొందిన ‘ఫోర్డ్ కార్లు’ తయారు చేసే ‘ఫోర్డ్ మోటారు కంపెనీ ని’ అమెరికాలో స్థాపించారు.
1903: అంటార్కిటికా లోని దక్షిణ ధ్రువాన్ని చేరటానికి, ‘రోల్డ్ అముండ్ సెన్’ నార్వే లోని ‘ఓస్లో’ రేవుని వదిలి ప్రయాణ మయ్యాడు.
1897: ‘రిపబ్లిక్ ఆఫ్ హవాయి’ ని అమెరికాలో కలుపు కొనే ఒప్పందం పై సంతకం జరిగింది. 1898 వరకూ ‘రిపబ్లిక్ ఒఫ్ హవాయి’ రద్దు కాదని కూడా ఆ ఒప్పందంలో ఉంది.
1891: జాన్ అబ్బాట్, కెనడ 3వ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం.
1890: ‘లారెల్ అండ్ హార్డీ’ గా పేరు పొందిన హాలీవుడ్ హాస్య జంటలోని ‘లారెల్ (స్టాన్ లారెల్) (సన్నగా ఉండే నటుడు) పుట్టిన రోజు.
1883: ఇంగ్లాండ్ (సన్ డెర్ లేండ్) లోని విక్టోరియా హాల్ థియేటర్ లో జరిగిన ప్రమాదంలో 183మంది పిల్లలు ఛనిపోయారు.
1858: సిపాయిల యుద్ధం (మొదటి స్వాతంత్ర్య సమరం) లో భాగంగా, ‘మొరార్ యుద్ధం – బేటిల్ ఆఫ్ మొరార్) జరిగింది.
1858: అబ్రహాం లింకన్, ఇల్లినాయిస్ లోని ‘స్ప్రింగ్ ఫీల్డ్’ లో, తన ‘హౌస్ డివైడెడ్’ ఉపన్యాసాన్ని ఇచ్ఛాడు.
1815: నెపొలియోనిక్ యుధ్దాలు – నెపోలియన్ ఆధ్వర్యంలో ఫ్రెంచి సైన్యం ‘బ్లూఛెర్స్ ‘ అనబడే ప్రష్యన్ సైన్యాన్ని ‘బేటిల్ ఆఫ్ లిగ్నీ’ లో ఓడించాయి. (మరో 2 రోజుల్లో వాటర్లూ యుద్ధం జరిగి, నెపొలియన్ ఓడిపోయాడు).
1815: నెపొలియోనిక్ యుద్ధాలు – ‘బేటిల్ ఆప్ క్వాత్రె బ్రాస్’ ఫ్రెంచ్ మార్షల్ ‘మైకేల్ నీ’ ‘ఆంగ్లో-డచ్’ సైన్యంపై విజయం సాధంచాడు. (మరో 2 రోజుల్లో వాటర్లూ యుద్ధం జరిగి, నెపొలియన్ ఓడిపోయాడు).
1723: స్కాట్లాండ్ కి చెందిన ఆడమ్ స్మిత్ ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త పుట్టిన రోజు. ఇతను రాసిన ‘వెల్త్ ఆఫ్ నేషన్స్’ పుస్తకం, నేటి ‘ఆర్దిక శాస్త్రానికి’ పునాది వేసింది. (1790 జూలై 17 మరణం).ఈ రోజు డబ్లిన్, ఐర్లాండ్ లలో ‘బ్లూమ్స్ డే’ జరువుకుంటారు.ఈ రోజు దక్షిణ ఆఫ్రికాలో ‘యూత్ డే (యువకుల రోజు) జరుపుకుంటారు.1954: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు స్విట్జర్లాండ్ లో ప్రారంభమయ్యాయి.
2001: దేవాదుల ప్రాజెక్టు కు అప్పటి ఆంధ్ర ప్రదేశ్ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుశంకుస్థాపన చేశాడు.
*** జననాలు
1902: బార్బరా మెక్‌క్లింటక్, ప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (మ.2002).
1903: ఆచంట జానకిరాం, తొలి డైరక్టర్ జనరల్ లైవిల్ ఫీల్డెన్ నియమించిన తొలి తరం వారిలో ఒకరు. (మ.1994)
1915: మార్గా ఫాల్స్టిచ్, ప్రముఖ జర్మన్ శాస్త్రవేత్త (మ.1998)
1917: నముడూరు అప్పలనరసింహం, ప్రముఖ తెలుగు కవి, పండితుడు మరియు అష్టావధాని. (మ.1986)
1940: ఇచ్ఛాపురపు రామచంద్రం, ప్రముఖ కథారచయిత. బాలసాహిత్యరచయిత. (మ.2016)
1948: ఉత్పల హనుమంతరావు, కాంగ్రెస్ తరపున ఆంధ్రప్రదేశ్ నుండి భారత రాజ్యసభకు ప్రాతినిథ్యము వహిస్తున్నాడు.
1949: విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి, రాజమండ్రికి చెందిన సంస్కృత పండితుడు.
1951: పూసపాటి అశోక్ గజపతి రాజు, రాజకీయ నేత, విమానయాన కేంద్ర మంత్రి.
1959: వారియర్, అమెరికా ప్రొఫెషనల్ మల్లయోధుడు.
1977: జాన్ మేయర్, సుప్రసిద్ధ అమెరికా వాద్యకారుడు.
1971: టూపాక్ షకుర్, ప్రముఖ అమెరికన్ రాప్ కళాకారుడు. (మ.1996)
1994: ఆర్య అంబేద్కర్, మరాఠీ సినీ నేపథ్యగాయని.