ScienceAndTech

భారతీయులు బ్రిటన్ అంటే ఇష్టపడుతున్నారు

Indian techies applying for British visas on large scale

టెక్నాలజీ రంగంలో బ్రిటన్‌ వీసాల కోసం దరఖాస్తు చేసుకునే దేశాల్లో అమెరికాతో పాటు భారత్‌ అగ్రస్థానంలో నిలిచింది. టెక్‌నేషన్‌ అనే సంస్థ బ్రిటన్‌లో టెక్నాలజీ వీసా దరఖాస్తులను పరిశీలిస్తుంది. భారతదేశం నుంచి వచ్చే దరఖాస్తులు 2017-18లో 450 ఉంటే, 2018-19లో అవి 650కి పెరిగాయని ఆ సంస్థ తెలిపింది. భారతదేశంతో పాటు అమెరికా నుంచే ఎక్కువ సంఖ్యలో వీసా దరఖాస్తులు వచ్చాయని చెప్పింది. సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి, ఏఐ, మెషీన్‌ లెర్నింగ్‌, ఫిన్‌టెక్‌, ఎంటర్‌ప్రైజ్‌/క్లౌడ్‌ రంగాల్లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు, బిజినెస్‌ డెవలపర్లు ఎక్కువగా వీసాల కోసం దరఖాస్తు చేశారని టెక్‌నేషన్‌ నివేదిక తెలిపింది. ఈ రెండు దేశాల తర్వాత.. నైజీరియా, రష్యా, కెనడా, ఆస్ట్రేలియా, చైనా, దక్షిణాఫ్రికా ఉన్నాయని వివరించింది. డిజిటల్‌ టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, వైద్యం, శాస్త్రవిజ్ఞానం, కళలు, మీడియా రంగాల్లో టైర్‌ 1 ఎక్సెప్షనల్‌ టాలెంట్‌ వీసా దరఖాస్తుల పరిశీలనకు టెక్‌నేషన్‌ సహా ఐదు సంస్థలను యూకే నియమించింది.