Movies

తమిళ రీమేక్‌ ‘గర్జనై’

Trisha to remake NH 10 as Garjanai

బాలీవుడ్‌లో అనుష్క శర్మ నటించిన ‘ఎన్‌హెచ్‌ 10’ చిత్రం తమిళ రీమేక్‌ ‘గర్జనై’. ఇందులో త్రిష ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. సుందర్‌బాలు దర్శకత్వం వహిస్తున్నారు.వంశీకృష్ణ, మధుమిత, శ్రీరంజిని, వడివుక్కరసిలు నటించారు. రెండేళ్ల క్రితమే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైనప్పటికీ ఇంకా విడుదలకు నోచుకోలేదు. వాస్తవానికి తమిళనాట జల్లికట్టుకు మద్దతుగా చెన్నై మెరీనా తీరంలో పెద్ద ఎత్తున ఆందోళన జరిగినప్పుడే ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుండేది. అప్పుడు ‘పెటా’కు మద్దతుగా త్రిష వ్యవహరించడంతో ఈ సినిమా చిత్రీకరణను ఆందోళనకారులు అడ్డుకున్నారు. కొన్నిరోజుల పాటు చిత్రీకరణ కూడా ఆగిపోయింది. చివరకు షూటింగ్‌ పూర్తయినప్పటికీ సినిమా మాత్రం విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదల హక్కులను ఎస్‌టీసీ ఫిక్చర్స్‌ సంస్థ కొనుగోలు చేసింది. వీలైనంత త్వరలోనే విడుదల చేయనున్నట్లు సంబంధిత వర్గాలు ప్రకటించాయి. త్రిష ఇమేజ్‌ను ‘గర్జనై’ మరింత పెంచుతుందని దర్శకుడు సుందర్‌బాలు చెబుతున్నారు. ఈ చిత్రానికి అమ్రీష్‌ సంగీతం సమకూర్చారు.