Politics

నేటి అసెంబ్లీలో సవాళ్లు-ప్రతిసవాళ్లు:TNI కథనాలు

Andhra assembly special coverage today-June 17 2019-Daily Andhra Political News

1. పట్టిసీమలో రూ.400కోట్ల అవినీతి జరిగింది
పట్టిసీమ ప్రాజెక్టులో రూ. 400 కోట్లు అవినీతి జరిగినట్లు కాగ్‌ నివేదికలో వెల్లడైందని ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి తెలిపారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలవరంను పక్కన పెట్టి తాత్కాలిక ప్రాజెక్టు పట్టిసీమ కట్టారని తెలిపారు. పోలవరం కట్టే బాధ్యత కేంద్రానికి ఉన్నా కూడా ప్యాకేజీల కోసం టీడీపీ తెచ్చుకుందని అన్నారు. పట్టిసీమ బదులు పోలవరం పనులు వేగవంతం చేస్తే ఇప్పటికే పూర్తయ్యేదని అభిప్రాయపడ్డారు. టీడీపీ ‍ప్రభుత్వ హయాంలో గత ఐదేళ్లలో 150 లక్షల కోట్ల రూపాయల అప్పు చేశారని అన్నారు. విద్యుత్‌ సంస్థలకు రూ. 10 వేల కోట్లు బకాయిలు ఉన్నాయని వెల్లడించారు.
2. మీకు అవినీతిలోనూ అవార్డులొచ్చాయ్‌’-ఏపీ అసెంబ్లీలో తెదేపాపై మంత్రి బుగ్గన ఎద్దేవా
పోలవరం ప్రాజెక్టుకు విత్తనం వేసి.. మొక్క దశ వరకు చేసింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే అని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ఏపీ అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై తెదేపా సభ్యుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్రాజెక్టుల ప్రస్తావన తీసుకురావడంతో బుగ్గన మధ్యలో కల్పించుకున్నారు. ప్రభుత్వ ప్రసంగాన్నే గవర్నర్‌ చదువుతారని చెప్పారు. తెదేపా ప్రభుత్వ హయాంలో 58 పేజీలతో గవర్నర్‌ సందేశాన్ని తయారు చేస్తే.. తమ ప్రభుత్వం 15 పేజీలతోనే రూపొందించిందని గుర్తు చేశారు. పోలవరం భూసేకరణ ఇంత వరకు పూర్తి చేయలేదని.. అలాంటిది ప్రాజెక్టు ఆరు నెలల్లో పూర్తిచేయాలని అచ్చెన్నాయుడు పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. గత ప్రభుత్వానికి అనేక అవార్డులు వచ్చాయని చెబుతున్నారని.. అవినీతిలోనూ అవార్డులు వచ్చిన సంగతి మర్చిపోయారా అంటూ బుగ్గన ఎద్దేవా చేశారు.
3. స్మృతిఇరానీ ప్రమాణం వేళ సభలో ఏం జరిగిందంటే?
పదిహేడో లోక్‌సభ ప్రారంభమైన తొలిరోజు ఎంపీలు ప్రమాణం స్వీకారం చేశారు. ఈ సందర్భంగా లోక్‌సభలో జరిగిన ఓ ఘటన అటు సభలో ఉన్నవారితో పాటు ఇటు టీవీల ముందు కూర్చున్న వారి దృష్టిని ఆకర్షించింది. ఇంతకీ అదేంటంటే.. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా సభ్యుల కరతాళ ధ్వనులతో సభ మార్మోగింది. ఆమె వేదిక వద్దకు వచ్చిన దగ్గరి నుంచి భాజపా సభ్యులతో పాటు ప్రధాని మోదీ సైతం హర్షాతిరేకాల మధ్య బల్లలు చరుస్తూ ఆమెను అభినందించారు. ఆమె ప్రమాణం పూర్తయ్యే వరకు బల్లల శబ్దంతో సభ దద్దరిల్లింది. హిందీలో ప్రమాణం చేసిన స్మృతి అనంతరం ఇటు యూపీయే ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీతో పాటు కాంగ్రెస్‌, భాజపా నాయకులకు నమస్కరిస్తూ తన స్థానానికి చేరుకున్నారు. ఈ సమయంలో తన చేతిలో ఓటమి పాలైన కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సభలో లేకపోవడం గమనార్హం.
4. ఉపసభాపతి ఎన్నికకు కోన నామినేషన్‌
ఏపీ అసెంబ్లీ ఉప సభాపతి పదవికి వైకాపాకు చెందిన బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి నామినేషన్‌ దాఖలు చేశారు. ఉపసభాపతి ఎన్నికకు స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఈ రోజు నోటిఫికేషన్‌ జారీ చేశారు. నోటిఫికేషన్‌ జారీ చేసిన అనంతరం కోన రఘుపతి నామినేషన్‌ పత్రాలను అసెంబ్లీ అధికారులకు అందజేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ పది మంది వైకాపా ఎమ్మెల్యేలు నామ పత్రాలపై సంతకాలు చేశారు. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు విధించారు. వైకాపాకు సభలో బలం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కోన రఘుపతి మినహా మరెవరూ నామినేషన్‌ దాఖలు చేసే అవకాశం కనబడటం లేదు. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. మంగళవారం ఉప సభాపతితో ప్రమాణస్వీకారం చేయించనున్నారు.
5. ఎంపీగా ప్ర‌మాణం చేసిన రాహుల్ గాంధీ
కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ఇవాళ లోక్‌స‌భ‌లో ఎంపీగా ప్ర‌మాణం చేశారు. 17వ లోక్‌స‌భ స‌భ్యులు ఇవాళ ప్ర‌మాణం చేస్తున్న విష‌యం తెలిసిందే. కాంగ్రెస్ నేత రాహుల్‌.. కేర‌ళ‌లోని వ‌య‌నాడ్ నుంచి ఎంపిక‌య్యారు. లోక్‌స‌భ స‌భ్యుడిగా వ‌రుస‌గా నాలుగ‌వ సారి బాధ్య‌త‌లు స్వీక‌రించిన‌ట్లు రాహుల్ త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు. ఇంగ్లీష్ భాష‌లో రాహుల్ ప్ర‌మాణం చేశారు. చాలా వ‌ర‌కు ఎంపీలు త‌మ‌త‌మ ప్రాంతీయ భాష‌ల్లో ప్ర‌మాణం చేశారు. ప్ర‌మాణ స్వీకారంతో పార్ల‌మెంట్‌తో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభ‌మైంద‌న్నారు. భార‌త రాజ్యాంగం ప‌ట్ల నిజ‌మైన విశ్వాసాన్ని ప్ర‌ద‌ర్శించ‌నున్న‌ట్లు రాహుల్ చెప్పారు. మొత్తం రెండు రోజుల పాటు 542 మంది ఎంపీలుగా ప్ర‌మాణం చేయ‌నున్నారు. అయితే ఇవాళ ఉద‌యం మోదీ ప్ర‌మాణ స్వీకారం చేస్తున్న స‌మ‌యంలో స‌భ‌లో స‌భ్యుల నినాదాల‌తో హోరెత్తింది. అయితే రిప‌బ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎంపీ రాందాస్ అత్వాలే మ‌రోవిధ‌మైన నినాదం చేశారు. స‌భ‌లో నిల‌బ‌డి.. రాహుల్ ఎక్క‌డ ఉన్నా
6. వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డి
తాను ప్రతిపక్షంలో ఉన్నానన్న విషయాన్ని చంద్రబాబునాయుడు గుర్తుంచుకుని ఉంటే మంచిదిఅసెంబ్లీలో మాట్లాడుతూ చంద్రబాబును ఎయిర్ పోర్టులో తనిఖీ విషయాన్ని ప్రస్తావించారు. తనిఖీలు చేయకుండా ఉండడానికి చంద్రబాబు ఏమన్నా చట్టానికి అతీతులా..? దైవాంశ సంభూతులా..? అని ప్రశ్నించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వంటి వారే తనిఖీలు చేయించుకున్నారని గుర్తు చేశారు. అక్రమ సంబంధాల వల్ల హత్య జరిగితే.. వైసీపీ దాడులు చేసిందంటారా..? అని అసహనం వ్యక్తం టీడీపీ ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందిప్రకృతి సంపదను టీడీపీ ప్రభుత్వం నాశనం చేసిందిరైతుల గురించి చంద్రబాబు ఏనాడైనా ఆలోచించారా అని ప్రశ్ని తన స్వార్ధం కోసం ఏపీ ప్రయోజనాలను బాబు తాకట్టు పెట్టారు
7. లోక్సభ స్పీకర్ ఎన్నిక 19న ….
లోక్‌స‌భ స్పీక‌ర్ ఎన్నిక‌ను ఈనెల 19వ తేదీన నిర్ణ‌యించ‌నున్నారు. ఇవాళ ప్ర‌ధాని మోదీతో పాటు మ‌రికొంత మంది కేంద్ర మంత్రులు లోక్‌స‌భ స‌భ్యులుగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. మొద‌టి రెండు రోజులు స‌భ్యుల ప్ర‌మాణం ఉంటుంది. అయితే బుధ‌వారం రోజున స్పీక‌ర్ ఎన్నిక‌ల ఉంటుంది. ఆ త‌ర్వాత రోజున రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌.. ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగిస్తారు. కేంద్ర బ‌డ్జెట్‌ను జూలై 5వ తేదీన ప్ర‌వేశ‌పెడుతారు. జూ 17 నుంచి జూలై 26 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న పార్ల‌మెంట్‌ స‌మావేశాల్లో.. లోక్‌స‌భ‌లో 30, రాజ్య‌స‌భ‌లో 27 సిట్టింగ్స్ ఉండ‌నున్నాయి.ప్రొటెం స్పీకర్ గా ప్రమాణం చేసిన వీరేంద్ర కుమార్.
8. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలుగు భాషలో ప్రమాణ స్వీకారం చేశారు. 17వ లోక్‌సభ తొలి సమావేశంలో మొదట ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం చేయగా, అనంతరం కేబినెట్ మంత్రులు ప్రమాణం చేశారు. లోక్‌సభలో మొత్తం 22 భాషల్లో మాణస్వీకారం చేయొచ్చు. అందుకు లోక్‌సభ అనుమతి ఉంది.
9. ఉపసభాపతికి కోన రఘుపతి నామినేషన్‌.
ఏపీ అసెంబ్లీ ఉప సభాపతి పదవికి వైకాపాకు చెందిన బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి నామినేషన్‌ దాఖలు చేశారు. ఉపసభాపతి ఎన్నికకు స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఈ రోజు నోటిఫికేషన్‌ జారీ చేశారు. నోటిఫికేషన్‌ జారీ చేసిన అనంతరం కోన రఘుపతి నామినేషన్‌ పత్రాలను అసెంబ్లీ అధికారులకు అందజేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ పది మంది వైకాపా ఎమ్మెల్యేలు నామ పత్రాలపై సంతకాలు చేశారు. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు విధించారు. వైకాపాకు సభలో బలం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కోన రఘుపతి మినహా మరెవరూ నామినేషన్‌ దాఖలు చేసే అవకాశం కనబడటం లేదు. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. మంగళవారం ఉప సభాపతితో ప్రమాణస్వీకారం చేయించనున్నారు