DailyDose

కేసులు బనాయిస్తున్నారు: కోడెల-నేరవార్తలు–06/17

Kodela claims he is being trapped with fake cases-June 17 2019-Daily Crime News

* ప్రాధేయపడితే బందిపోట్లన్నా కొన్ని వస్తువులు వదిలి పోతారు. కోడెల కుటుంబం మాత్రం లారీలు నడుపుకుని కుటుంబాలను పోషించుకునే వారిని, రంజీ క్రికెట్ క్రీడాకారుడిని కూడా వదల్లేదు. రూ.15 లక్షల కంటే తక్కువ ఇస్తామంటే ముట్టనే ముట్టరంట. ముంబై దావూద్ గ్యాంగ్ వీళ్లకంటే చాలా నయం అంటున్నారు.
* తమ కుటుంబపై అక్రమంగా కేసులు పెడుతూ వేధిస్తున్నారని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆరోపించారు. సిట్ విచారణ జరిపిస్తామన ప్రభుత్వం అంటోంది.. ఇందుకు తాము సిద్దంగా ఉన్నామన్నారు. ప్రతిపక్షాలపై వేధింపులపై దృష్టిపెట్టకుండా.. రాష్ట్రంలో కరువు, ప్రత్యేక హోదా, పోలవరం అంశాలపై చర్చిస్తే భాగుంటుందన్నారు. విజయసాయిరెడ్డి ప్రోత్సాహంతో కేసులు బనాయిస్తున్నారు. ప్రశాంత వాతావారణంలో పాలన చేయాల్సిన వైపీపీ ప్రభుత్వం… ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తుందన్నారు.
*తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులకు న్యాయస్థానం రిమాండ్‌ పొడిగించింది. ఈనెల 28 వరకు రిమాండ్‌ పొడిగిస్తూ పులివెందుల కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ముగ్గురు నిందితులు ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాశ్‌ను పోలీసులు పులివెందుల సబ్‌జైలుకు తరలించారు.
* తెలంగాణ సీఎం క్యాంపు కార్యాలయం ప్రగతిభవన్ ఎదుట దంపతులు ఆత్మహత్యకు యత్నించారు. వెంటనే అక్కడున్న భద్రతా సిబ్బంది దీన్ని గమనించి వారిని అడ్డుకున్నారు. అనంతరం దంపతులను పంజాగుట్ట పోలీసు స్టేషన్‌కు తరలించారు.
* ఒడిసాలోని బాలాసోర్‌ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో మహాత్మ గాంధీ విగ్రహం నేలమట్టమైంది. గాంధీ జ్ఞాపకార్ధం స్కూలులో కేటాయించిన ఓ గదిని సైతం దుండగులు ధ్వంసం చేశారు. గది పరిసరాల్లో సిగరెట్‌ ప్యాకెట్లు, తాగిపడేసిన మద్యం బాటిళ్లను చిందరవందరగా పడేశారు. స్కూల్‌లోకి ప్రవేశించిన దుండగులు గాంధీ విగ్రహాన్ని నేలకూల్చి, తల భాగాన్ని కిందపడవేశారు.
* గుంటూరు జిల్లా తెనాలిలోని అమరావతి కాలనీలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన నిలిపివున్న ఓ ట్రాక్టర్‌ను చిన్నారులు స్టార్ట్‌ చేశారు. దాన్ని అదుపుచేసేందుకు ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో రోడ్డుపక్కనే ఆడుకుంటున్న పవన్‌ అనే రెండేళ్ల బాలుడిని ట్రాక్టర్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
* హైదరాబాద్ జూబ్లీహిల్స్ అమ్నేసియా లాంజ్ పబ్ లో బౌన్సర్లు రెచ్చిపోయారు. ఫ్రెండ్ బర్త్ డే వేడుకలకు వచ్చిన యువకులపై బౌన్సర్లు దాడి చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. పబ్ కు వచ్చిన యువకులు.. వాష్ రూమ్ లో నాప్కిన్స్ కిందపడేశారని..బౌన్సర్లు రెచ్చిపోయి యువకులను ఇష్టమోచ్చినట్లు బూతులు తిట్టారు. యువకులు అడ్డుచెప్పటంతో బౌన్సర్లు దాడి చేశారు. తొమ్మిది మంది యువకులపై బౌన్సర్లు ఎటాక్ చేశారు. గాయపడిన యువకులు…కార్తీక్ రెడ్డి, చంద్రకిరణ్ రెడ్డి, నవీన్ శరత్ చంద్ర జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
* తెనాలి అమరావతి ప్లాట్ లలో ఇరువురు చిన్నారులు ఆడుకుంటూ ఆగి ఉన్న ట్రాక్టర్ కు తాళం ఉండటంతో కదిలించారు. దీంతో ముందుకు కదిలిన ట్రాక్టర్ 2 సంవత్సరాల బాలుడి పైకి ఎక్కడం తో ఆ బాలుడు అక్కడికక్కడే మరణించాడు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి విచారణ చేపట్టారు.
* పులివెందుల- కదిరి రోడ్డు లోని హరిజనవాడ వద్ద విద్యుత్ హై టెన్షన్ లైన్లు తగులుకొని ఇద్దరు వాహనదారులు సజీవదహనం. వీరిద్దరూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు గా గుర్తింపు
* ఖమ్మం జిల్లాలోని ఏన్కూరు వద్ద ఎన్‌ఎస్పీ కాలువపై నిర్మించిన బ్రిడ్జిని మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. అయితే ప్రయాణికులకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ బస్సు ఖమ్మం నుంచి మణుగూరు వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.
* జమ్మూకశ్మీర్‌లో సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆర్మీ మేజర్‌ అమరుడయ్యారు. మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు.
* మంచిర్యాలలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఓ మహిళ 132 మందిని నమ్మించి మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
* శ్రీకాకుళం జిల్లాసీతంపేట మండలం ఈతమానుగూడ గ్రామంలో ఏనుగుల దాడిలో మృతి
* ఏ-కొండూరు మండల ఆంధ్రభూమి విలేకరి అసదుల్లా పై నేటి ఉదయం మట్టి మాఫియా దాడి..ఇందులో ప్రధాన సూత్రధారులుగా బాధితుడు పలువురు పేర్లను ప్రస్తావిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు..దీనితో విలేకరిపై దాడి చేసిన ఐదు గురు వ్యక్తులను ఎస్సై ప్రవీణ్ కుమార్ రెడ్డి అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.వారిని కోర్టుకు తరలిస్తామని ఎస్సై తెలిపారు.వార్తలు ప్రచురించడమనేది జర్నలిజంలో ఒక భాగమని తమకు వ్యతిరేకంగా వార్తలు రాశాడని చట్టాన్ని చేతుల్లో తీసుకుంటే సహించే ప్రసక్తే లేదని ఎస్సై హెచ్చరించారు
* ఖమ్మం జిల్లా మణుగూరు నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న మణుగూరు డిపోకు చెందిన బస్సు ఏన్కూరు బ్రిడ్జి వద్ద అదుపుతప్పడంతో బ్రిడ్జి అంచుల్లో ఉన్న డివైడర్ను ఢీ కొట్టింది. ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు
* కడప జిల్లా పులివెందుల- కదిరి రోడ్డు లోని హరిజనవాడ వద్ద విద్యుత్ హై టెన్షన్ లైన్లు తగులుకొని ఇద్దరు వాహనదారులు సజీవదహనం.
* నైజీరియాలో బొకొహరం ఉగ్రవాదులు మరో దురాగతానికి పాల్పడ్డారు. నైజీరియా ఈశాన్య ప్రాంతంలోని కొండుగలో ఆత్మాహుతి దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 30మంది మృత్యువాత పడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.
* కత్తి దూసిన టెంపో డ్రైవర్‌ను పోలీసులు చితకబాదిన ఘటన నార్త్ వెస్ట్ ఢిల్లీలోని ముఖర్జీ నగర్‌లో చోటు చేసుకుంది. లాఠీతో కొట్టడమే కాకుండా.. కిందపడేసి బూటు కాళ్లతో తన్నుతూ.. నానా హంగామా చేశారు. అత్యంత రద్దీ రోడ్డుపై ఈ ఘటన జరగడంతో.. గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. డ్రైవర్‌పై పోలీసుల దాడి ఘటనపై ఢిల్లీ సర్కార్ సీరియస్ అయ్యింది. సమగ్ర విచారణ జరపాలంటూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదేశించారు.
* కర్నూలు జిల్లాలోని ఆదోనిలో దారుణ హత్య జరిగింది. సోమవారం ఉదయం ఆదోనిలో రియల్టర్‌ బసవరాజును గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. శివారు ఆస్పరి రోడ్డులో బాట మారెమ్మ అవ్వ దేవాలయం వద్ద బసవరాజును హత్య చేసి కొనప్రాణాలతో ఉండగానే సజీవంగా దహనం చేశారు
* బొల్లారం ఎస్సై బ్రహ్మచారి, కానిస్టేబుల్ నగేశ్‌లు ఏసీబీ వలలో చిక్కారు. ఓ కేసు విషయంలో అరెస్టు చేయకుండా ఉండేందుకు లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. రూ.20వేలు లంచం తీసుకుంటూ ఎస్సై, కానిస్టేబుల్ ఏసీబీకి రెడ్ హైండెడ్‌గా పట్టుబడ్డారు. నిందితులపై కేసు నమోదు చేసుకున్న ఏసీబీ అధికారులు లంచం ఇవ్వడం, లంచం తీసుకోవడం నేరమని ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తమను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.
* అమ్మవారి ఆలయంలో దొంగలు బీభత్సం సృష్టించారు. బంగారం, వెండి నగలు అపహరించారు. అనంతపురం జిల్లాలోని కొత్తూరు అమ్మవారి ఆలయంలో అర్ధరాత్రి చోరీ దొంగలు చోరీకి తెగబడ్డారు. ఒకటిన్నర కిలోల వెండి, 15 గ్రాముల బంగారు నగలను అపహరించారు. అయితే ఆలయంలోని సీసీ కెమెరాలు పది రోజుల నుంచి పని చేయడం లేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
*గుడిలో మద్యం తాగొద్దన్నందుకు దుండగులు పూజారినే పొడిచి చంపిన ఘటన ఝార్ఖండ్‌లో చోటుచేసుకుంది.
*ఉక్కు సంకెళ్లు, తాడుతో బంధించుకుని, కోల్కతాలోని హౌరా బ్రిడ్జి మీదుగా గంగా నదిలోకి దిగి సురక్షితంగా బయటకు వచ్చే విన్యాసం చేయబోయిన వ్యక్తి కనిపించకుండా పోయిన విషాదమిది.
*గుట్కా విక్రయాలను అరికట్టే దిశగా కృష్ణా జిల్లా పోలీసులు చర్యలు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా శనివారం దుకాణాలు, గోదాంలు తనిఖీ చేసి 35 కేసులు నమోదు చేశారు.
*మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిని ఫోన్లో బెదిరించి నగదు డిమాండ్ చేసిన వ్యక్తిని జమ్మలమడుగు పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.
*తూర్పుగోదావరి జిల్లా మన్యం ప్రాంతంలోని మారేడుమిల్లి మండలంలో ఇద్దరు యువకులు వాగులో మునిగి మృతి చెందారు.
*తమిళనాడులోని కోయంబత్తూరులో ముగ్గురిని అరెస్టు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐయే) అధికారులు ఆదివారం మదురైలోనూ సోదాలు కొనసాగించారు.
*యూఏఈలోని పాఠశాల బస్సులో నిద్రపోయిన ఆరేళ్ల భారతీయ బాలుడిని కొన్ని గంటలపాటు ఎవ్వరూ గమనించకపోవడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయిన విషాదమిది.
*లోక్సభ ఎన్నికల్లో తాను చెప్పినదానికి భిన్నంగా ఫలితాలు రావడంతో జీవ సమాధి అవ్వాలనుకున్న మధ్యప్రదేశ్ సాధువు ప్రయత్నాన్ని అక్కడి పోలీసులు అడ్డుకున్నారు.
*తిరుమల రెండో కనుమ రహదారిలో ఆదివారం రాత్రి భక్తులపై చిరుతపులి దాడి చేసింది. తిరుపతి నుంచి తిరుమలకు వచ్చే రెండో కనుమ రహదారిలో హరిణి వద్ద రెండు ద్విచక్ర వాహనాలపై వెళుతున్న భక్తులపై చిరుత దూకింది.
*దక్కన్ క్రానికల్ ఛైర్మన్ టి.వెంకట్రామిరెడ్డి ఇంట్లోకి శనివారం ఇద్దరు ఆగంతకులు చొరబడ్డారు. అతని భార్యను దూషించి, అడ్డొచ్చిన సెక్యూరిటీని బెదిరించారు.
*ఉక్కు సంకెళ్లు, తాడుతో బంధించుకుని, కోల్కతాలోని హౌరా బ్రిడ్జి మీదుగా గంగా నదిలోకి దిగి సురక్షితంగా బయటకు వచ్చే విన్యాసం చేయబోయిన వ్యక్తి కనిపించకుండా పోయిన విషాదమిది.
*విద్యుదాఘాతంతో కామారెడ్డి జిల్లాలో యువ రైతు దుర్మరణం చెందాడు.
* కత్తి దూసిన టెంపో డ్రైవర్‌ను పోలీసులు చితకబాదిన ఘటన నార్త్ వెస్ట్ ఢిల్లీలోని ముఖర్జీ నగర్‌లో చోటు చేసుకుంది. లాఠీతో కొట్టడమే కాకుండా.. కిందపడేసి బూటు కాళ్లతో తన్నుతూ.. నానా హంగామా చేశారు.