DailyDose

రిలయన్స్ ఇన్‌ఫ్రా షేర్లు పడిపోయాయి-వాణిజ్య-06/17

Reliance infra shares collapse-June 17 2019-Daily business news

* ప్రముఖ వ్యాపారవేత్త అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇన్‌ఫ్రా షేర్ల విలువ మరింత పడిపోయింది. ఉదయం సెషన్లో ఒకానొక దశలో షేర్ల విలువ 10% తగ్గి రెండు దశాబ్దాల కనిష్ఠానికి చేరుకుంది. గత 28 ఏళ్లలో షేరు విలువ రూ.52.70లకు చేరడం ఇదే తొలిసారి. రిలయన్స్‌ ఇన్ఫ్రా వార్షిక ఫలితాలపై తాము అభిప్రాయం వెల్లడించలేమన్న ఆడిటర్లు అసలు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కంపెనీ, అనుబంధ సంస్థల నిర్వహణపై ప్రశ్నలు లేవనెత్తారు. దీంతో ఆ ప్రభావం షేర్ల మీద పడింది. 1991 ఫిబ్రవరి 1న ఈ కంపెనీ షేరు ఆ ధర వద్ద ట్రేడైంది. అంతకు ముందు 1990 ఏప్రిల్‌ 12న కంపెనీ చరిత్రలోనే తొలిసారి షేరు విలువ రూ.35కు చేరింది.
*దేశంలో ఉన్నది ఉద్యోగాల సమస్య కాదని, వేతన సమస్యే అని ఇన్ఫోసిస్ మాజీ ముఖ్య ఆర్థిక అధికారి (సీఎఫ్ఓ) టీవీ మోహన్దాస్ పాయ్ అభిప్రాయపడ్డారు.
*వచ్చే నెల నుంచి కార్ల ధరలను 1.2 శాతం వరకు పెంచేందుకు హోండా కార్స్ ఇండియా సన్నాహాలు చేస్తోంది.
*మొబైల్ నెట్వర్క్ను మరింత విస్తృతం చేయడం కోసం, బీటీఎస్ (బేస్ ట్రాన్స్-రిసీవర్ స్టేషన్)/యాంటెన్నా నెలకొల్పేందుకు టెలికాం కంపెనీలకు ప్రభుత్వ రంగ సంస్థ పవర్గ్రిడ్ టవర్లు అందించనుంది.
*ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్బీ)ల మూలధన అవసరాల కోసం మరో రూ.30,000 కోట్ల వరకు అవసరమని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కనీస మూలధన నిష్పత్తి ప్రమాణాలు చేరుకునేందుకు ఇంతమొత్తం అవసరమవుతుందని ఆర్థిక శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం.
*దేశంలో కుటుంబ వ్యాపారాలు మరింత వృద్ధి చెందనున్నాయని ఓ సర్వే తేల్చింది. వచ్చే రెండేళ్లలో ఈ విభాగానికి చెందిన సుమారు 89 శాతం వ్యాపారాలు మరింత విస్తరిస్తాయని ‘ఫ్యామిలీ బిజినెస్ సర్వే 2019’ పేరుతో పీడబ్ల్యూసీ సంస్థ రూపొందించిన అంతర్జాతీయ సర్వే నివేదిక అంచనా వేసింది.
*పాకిస్థాన్ ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు తోచిన చోటల్లా అప్పులు చేస్తోంది. తాజాగా ఆసియా అభివృద్ధి బ్యాంక్ వద్ద నుంచి 3.4 బిలియన్ డాలర్ల మేరకు అప్పు తీసుకొనేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ ఆర్థిక సలహాదారు వెల్లడించారు.
*జేపీ ఇన్ఫ్రాటెక్ రుణదాతలు జూన్20న భేటీ కానున్నారు. ఈ సందర్భంగా సంస్థ దివాల ప్రక్రియ అమలు తీరును సమీక్షించనున్నారు.
*అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 2.0 లక్ష్యంతో 2020 ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రచారానికి మరింత పదును పెట్టారు. తాను మళ్లీ ఎన్నిక కాకపోతే స్టాక్ మార్కెట్లు భారీగా పతనమవుతాయని తనదైన శైలిలో ట్విటర్ ద్వారా హెచ్చరించారు.