DailyDose

నైజీరియాలో ఆత్మాహుతి దాడి–ప్రధాన వార్తలు-06/17

Suicide Bombing In Nigeria-June 17 2019-Daily Top News

* ఏపీ సీఎం జగన్‌తో కేసీఆర్‌ భేటీ
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డితో తెలంగాణ సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. ఈ రోజు విజయవాడ చేరుకున్న కేసీఆర్‌ తొలుత దుర్గమ్మను దర్శించుకున్న అనంతరం నేరుగా తాడేపల్లిలోని జగన్‌ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌, కేటీఆర్‌, ఇతర నేతలకు జగన్‌ సాదర స్వాగతం పలికారు. ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలని ఈ సందర్భంగా కేసీఆర్‌ జగన్‌ను ఆహ్వానించారు.
* లోక్‌సభలో ఏపీ ఎంపీల ప్రమాణం..
17వ లోక్‌సభ కొలువుదీరింది. సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన ఎంపీలతో ప్రొటెం స్పీకర్‌ వీరేంద్ర కుమార్‌ ప్రమాణం చేయించారు. తొలుత ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణం చేశారు. ఆ తర్వాత విపక్ష నేత, కేంద్ర మంత్రులు ప్రమాణం చేశారు. అనంతరం ఆంగ్ల అక్షర క్రమంలో రాష్ట్రాలవారీగా ఎంపీల ప్రమాణాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌ నుంచి వైకాపా, తెదేపా సభ్యులు ప్రమాణం చేశారు. లోక్‌సభలో ఇవాళ, రేపు ఎంపీల ప్రమాణస్వీకారాలు జరుగుతాయి.
* వైద్యుల సమ్మె.. దిగొచ్చిన దీదీ
పశ్చిమబెంగాల్‌లో వైద్యుల సమ్మె ఉద్రిక్తంగా మారుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. వైద్యుల డిమాండ్‌ మేరకు సీఎం మమతాబెనర్జీతో జరిగే సమావేశం మొత్తాన్ని రికార్డు చేసేందుకు అంగీకరించింది. ఈ మేరకు బెంగాల్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టరేట్‌ సమ్మె చేస్తున్న జూనియర్‌ వైద్యులకు రాసిన ఓ లేఖలో వెల్లడించింది. సోమవారం మధ్యాహ్నం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మెడికల్‌ కాలేజీల నుంచి ఇద్దరు చొప్పున ప్రతినిధులతో సమావేశమయ్యేందుకు సీఎం అంగీకరించారని ఆ లేఖలో పేర్కొంది.
* నైజీరియాలో ఆత్మాహుతి దాడి:30మంది మృతి
జీరియాలో బొకొహరం ఉగ్రవాదులు మరో దురాగతానికి పాల్పడ్డారు. నైజీరియా ఈశాన్య ప్రాంతంలోని కొండుగలో ఆత్మాహుతి దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 30మంది మృత్యువాత పడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ఫుట్‌బాల్‌ అభిమానులందరూ గుంపుగా టీవీలో మ్యాచ్‌ను వీక్షింస్తుండగా ముగ్గురు మిలిటెంట్లు తమను తాము పేల్చుసుకున్నారు. పదుల సంఖ్యలో గాయపడినట్లు ఆ దేశ అత్యవసర విభాగం వెల్లడించింది.
* ‘ప్రాణహిత-చేవెళ్ల పేరుతో రూ.కోట్లు దోచుకున్నారు’
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు చరిత్రలో నిలిచిపోతుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. ఇంత వేగంగా పూర్తయిన ప్రాజెక్టు మరొకటి లేదని చెప్పారు. హైదరాబాద్‌లో తలసాని మీడియాతో మాట్లాడారు. రైతులకు సాగునీరు అందించాలని త్వరితగతిన పూర్తి చేస్తే కాంగ్రెస్‌ నేతలు అనవసర విమర్శలు చేయడం తగదన్నారు. కాళేశ్వరం పనులు కేవలం 15 శాతం మాత్రమే పూర్తయ్యాయంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలను తలసాని తప్పుబట్టారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రాణహిత-చేవెళ్ల పేరుతో కాంగ్రెస్‌ నేతలు రూ.కోట్లు దోచుకున్నారని దుయ్యబట్టారు.
* జగన్‌కు కొత్త కాన్వాయ్‌ -ఏపీ ముఖ్యమంత్రి జగన్‌
కాన్వాయ్‌లోని వాహనాల్లో మార్పు చోటుచేసుకుంది. కాన్వాయ్‌లోకి కొత్తగా 6 నలుపు రంగు ఫార్చ్యునర్‌ వాహనాలు చేరాయి. AP39PA2345 నంబర్‌తో ఈ కొత్త వాహనశ్రేణి ఉండనుంది. పాత కాన్వాయ్‌ను హైదరాబాద్‌ పంపడంతో కొత్త వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది.
* 28 ఏళ్ల కనిష్ఠానికి రిలయన్స్‌ ఇన్‌ఫ్రా షేర్లు
ప్రముఖ వ్యాపారవేత్త అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇన్‌ఫ్రా షేర్ల విలువ మరింత పడిపోయింది. ఉదయం సెషన్లో ఒకానొక దశలో షేర్ల విలువ 10% తగ్గి రెండు దశాబ్దాల కనిష్ఠానికి చేరుకుంది. గత 28 ఏళ్లలో షేరు విలువ రూ.52.70లకు చేరడం ఇదే తొలిసారి. రిలయన్స్‌ ఇన్ఫ్రా వార్షిక ఫలితాలపై తాము అభిప్రాయం వెల్లడించలేమన్న ఆడిటర్లు అసలు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కంపెనీ, అనుబంధ సంస్థల నిర్వహణపై ప్రశ్నలు లేవనెత్తారు. దీంతో ఆ ప్రభావం షేర్ల మీద పడింది.
* ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్ము-కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ ప్రాంతంలో జవాన్లు, ఉగ్రవాదులు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుపెట్టాయి. ఎదురుకాల్పులు జరుగుతున్న సమయంలో ముగ్గురు భారత జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. దక్షిణ కశ్మీర్‌లో ఉగ్రవాద కదలికలపై సమాచారం అందుకున్న భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. ఈ విషయాన్ని పసిగట్టిన ఉగ్రమూకలు దళాలపై కాల్పులు జరిపాయి. జవాన్లు అప్రమత్తంగా ఉండటంతో వాటిని తిప్పికొట్టారు.
* అమెజాన్‌ ఎంఐ డేస్‌ సేల్‌: ఈ ఫోన్లపై డిస్కౌంట్‌
ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ఇండియాలో ఎంఐ డేస్‌ పేరుతో షామీ, రెడ్‌మి ఫోన్లపై రాయితీ ఇస్తోంది. సోమవారం ప్రారంభమైన ఈ సేల్‌ జూన్‌ 21 వరకూ కొనసాగనుంది. వివిధ షామీ ఫోన్లపై రూ.6,500 వరకూ డిస్కౌంట్‌ ఇస్తున్నట్లు తెలిపింది. దీంతో పాటు మొబైల్స్‌ ఎక్సేంఛ్‌పై రూ.4000 వరకూ తగ్గింపు లభించనుంది. ఇక యాక్సిస్‌ బ్యాంకు క్రెడిట్‌, డెబిట్‌ కార్డు వినియోగదారులు అదనంగా మరో 5శాతం డిస్కౌంట్‌ను కూడా పొందవచ్చు.
* ఫెడ్‌ భయాలు.. మార్కెట్లు బెంబేలు
అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, వాణిజ్య యుద్ధ భయాలతో దేశీయ మార్కెట్లు సోమవారం బెంబేలెత్తిపోయాయి. అమెరికా ఫెడ్‌ వడ్డీరేట్లపై దృష్టిపెట్టిన మదుపర్లు ట్రేడింగ్‌ ఆద్యంతం జాగ్రత్త పాటించారు. దీనికి తోడు కీలక రంగ షేర్లు కుదేలవడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఫలితంగా నేటి మార్కెట్లో సూచీలు కుప్పకూలాయి. నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 491 పాయింట్లు దిగజారి 38,961 వద్ద, నిఫ్టీ 151 పాయింట్లు పతనమై 11,672 వద్ద స్థిరపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 69.88గా కొనసాగుతోంది.
* పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు భూ నిర్వాసితుల క్యాంప్ ఆఫీస్ ముట్టడి ఉద్రిక్తత రేపింది. ఈ ఉదయం నాగర్ కర్నూలు జిల్లా పట్టెం గ్రామం నుంచి ప్రాజెక్టు భూ నిర్వాసితులు పాదయాత్ర ప్రారంభించి పోరుబాట పట్టారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో దారుణం జరిగింది. సీఎం కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ దగ్గర్లో ఓ తల్లి, తండ్రి.. వారి ముగ్గురు బిడ్డలతో కలిసి ఆత్మహత్యాయత్నం చేశారు. అక్కడున్న పోలీసులు వెంటనే అలర్టయ్యారు. భార్యాభర్తలను, ముగ్గురు పిల్లలను కాపాడారు. వీరిని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు పోలీసులు తీసుకెళ్లి వివరాలు సేకరించి .. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.
* నెల్లూరు లోక్సభ సభ్యునిగా ఎన్నికైన ఆదాల ప్రభాకర్ రెడ్డి సోమవారం లోక్సభలో తన పదవి స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ వీరేంద్ర కుమార్ ఆయనతో ప్రమాణ పత్రాన్ని చదివించారు .ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలుగులో తన ప్రమాణ స్వీకారాన్ని చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నెల్లూరులో అభిమానులు ఆయన ఇంటి వద్ద ఆనందోత్సాహాలను ప్రకటించారు .
* ఏపీ అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ కు నామినేషన్ దాఖలు చేసిన బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతికోన రఘుపతి నీ బలపరిచిన 10 వైసీపీ ఎమ్మెల్యేలు.
*ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారిని క‌లిసి ఆశీర్వ‌చ‌నాలు అంద‌జేసిన అన్న‌వ‌రం దేవ‌స్థాన అర్చ‌కులు.
* ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ కాన్వాయ్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. కొత్తగా కన్వాయ్‌లోకి 6 నలుపు రంగు ఫార్చ్యునర్ వాహనాలు వచ్చి చేరాయి. AP39 PA 2345 నెంబర్‌తో ముఖ్యమంత్రికి కొత్త వాహన శ్రేణి సిద్ధమైంది. పాత కాన్వాయ్‌ని హైదరాబాద్‌కు పంపడంతో కొత్త కాన్వాయ్‌ను కొనుగోలు చేసింది ఏపీ ప్రభుత్వం.
* తెలంగాణ రాష్ట్రంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానించేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు ఏపీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభిస్తున్నట్లు, ఈ కార్యక్రమానికి రావాలని కేసీఆర్‌ వైయస్‌ జగన్‌ను ఆహ్వానించారు. విభజన సమస్యలపై వైయస్‌ జగన్‌తో కేసీఆర్‌ చర్చించే అవకాశం ఉంది. వైయస్‌ జగన్‌ నివాసంలో కేసీఆర్‌ బృందం లంచ్‌ చేయనుంది. కేసీఆర్‌ వెంట కేటీఆర్, టీఆర్‌ఎస్‌ నేతలు ఉన్నారు.
* టీడీపీ హాయంలో ఏపీలో అవినీతి భారీ స్థాయిలో జరిగింది మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ నీరు-చెట్టు ప్రాజెక్టులో, ధర్మపోరాట దీక్ష పేరుతో, పోలవరం నిర్మాణంలో భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయి..అందుకే ఆ పార్టీ నుంచి కేవలం 23 మందే గెలిచారు వీరందరినీ ‘ఆలీ బాబు.. 23 దొంగలు’ అని సంబోధించారు
* టీడీపీ హాయంలో ఏపీలో అవినీతి భారీ స్థాయిలో జరిగింది మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ నీరు-చెట్టు ప్రాజెక్టులో, ధర్మపోరాట దీక్ష పేరుతో, పోలవరం నిర్మాణంలో భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయి.. అందుకే ఆ పార్టీ నుంచి కేవలం 23 మందే గెలిచారు వీరందరినీ ‘ఆలీ బాబు.. 23 దొంగలు’ అని సంబోధించారు
* గవర్నరు,ముఖ్యమంత్రులు ఆశ్రమాలు చుట్టూ తిరగటం రాజ్యాంగ విరుద్ధం.అమరావతి లో ప్రభుత్వ భూములు కజేసెందుకు స్వరూపానంద యాగాలు.లౌకిక విధానాన్ని కాపాడుకునే విధంగా హేతువాద సంఘం పోరాటం చేస్తుంది.గతంలో కూడా ప్రభుత్వ భూములు స్వామీజీల కి దారాదత్తం చేశారు.ఎండిపోయిన కడ్డీ పరకని పచ్చగా చేస్తే స్వామీజీల కి మహిమలు వున్నాయి అని నమ్ముతాను.
* వ‌ర‌ల్డ్‌ క‌ప్ మ్యాచ్‌లో దాయాది దేశం పాకిస్థాన్‌పై భార‌త్ సునాయాస విజ‌యం న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే.
డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ధ‌తి ప్ర‌కారం కోహ్లీ సేన 89 ర‌న్స్ తేడాతో పాక్‌పై నెగ్గింది. ఈ విక్ట‌రీపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు. పాకిస్థాన్‌పై ఇది మ‌రో దాడి అని, దాని ఫ‌లితం కూడా అలాగే ఉంద‌ని ఆయ‌న త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు. పాక్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన టీమిండియా ఆట‌గాళ్ల‌కు షా కంగ్రాట్స్ చెప్పారు. ప్ర‌తి భార‌తీయుడు ఈ విక్ట‌రీ ప‌ట్ల గ‌ర్వంగా ఫీల‌వుతున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఈ విజ‌యాన్ని ప్ర‌తి ఒక్క‌రూ సెల‌బ్రేట్ చేసుకుంటున్నార‌న్నారు.
* యశ్‌ బిర్లా గ్రూప్‌ ఛైర్మన్‌ యశోవర్ధన్‌ బిర్లాకు యూకో బ్యాంక్‌ షాకిచ్చింది. బ్యాంకు రుణాలు చెల్లించకపోవడంతో ఆయనను ఉద్దేశపూర్వక ఎగవేతదారుడిగా ప్రకటించింది. ఈ మేరకు బ్యాంకు నేడు అధికారిక ప్రకటన విడుదల చేసింది.
* తెలంగాణలో బిసి గురు కులాలు ప్రారంభమయ్యాయి. ఒకే రోజున 119 బిసి గురు కులాలను ప్రభుత్వం ప్రారంభించింది. నియోజకవర్గానికో బిసి గురు కులాలను ఏర్పాటు చేసింది. సోమవారం ఉదయం ఎంఎల్‌ఎ కొత్త క్వార్టర్స్‌ను తెలంగాణ సిఎం కెసిఆర్‌ ప్రారంభించనున్నారు.
* వరల్డ్‌ కప్ మ్యాచ్‌లలో ఏడవసారి భారత్ చేతిలో పాకిస్తాన్ ఓటమి పాలయిన నేపధ్యంలో మన దేశంలో ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది. ఈ నేపధ్యంలో విజయం సొంతం చేసుకున్న టీమ్ ఇండియాకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
* జమ్ముకశ్మీర్లోని అవంతిపొరలో ఉగ్రదాడికి అవకాశం ఉందని పాకిస్థాన్ నిఘా వర్గాలు భారత్ను అప్రమత్తం చేశాయి. స్పందించిన ప్రభుత్వం కశ్మీర్వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించింది. బిష్కెక్లో షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సుకు ముందు ఈ నిఘా సమాచారాన్ని పాక్ అందించినట్లు సమాచారం. ఈ విషయాన్ని అమెరికాకూ తెలిపింది పాకిస్థాన్ పుల్వామాలో పాక్ ప్రేరేపిత జైషే మహమ్మద్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 40 మంది భారత సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు.అదే రీతిలో అవంతిపొరలో దాడికి యత్నించవచ్చని పాక్ హెచ్చరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.*
*నేటి నుంచి ప‌దో త‌ర‌గ‌తి అడ్వాన్స్డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు మెుదలు కానున్నాయి. ఈనెల 29 వ‌ర‌కు జరగనున్న పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ప్ర‌భుత్వ ప‌రీక్ష‌ల విభాగం డైర‌క్ట‌ర్ ఎ.సుబ్బారెడ్డి తెలిపారు. ఉద‌యం 9 గంటల 30 నిమిషాల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల వ‌ర‌కు ప‌రీక్ష‌లు జరగనున్నాయి. ఈ ప‌రీక్ష‌లకు మొత్తం 38 వేల 872 మంది విద్యార్థులు హాజ‌రు అవుతార‌ని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 201 ప‌రీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు 15 ఫ్ల‌యింగ్ స్క్వాడ్ లు ఏర్పాటు చేశామ‌న్నారు. స్పాట్ వాల్యుయేష‌న్ జూలై 4, 5 తేదీల‌లో జ‌రుగుతుంద‌ని… విశాఖ, కాకినాడ‌, గుంటూరు, క‌డ‌ప‌లో కేంద్రాలు ఏర్పాటు చేశామ‌ని స్ప‌ష్టం చేశారు.
* శ్రీకాకుళం జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. సీతంపేట మండలం మండ గ్రామంలోని పొలంలో పనిచేస్తున్న సవర బోడమ్మగిరిజన మహిళ పై ఏనుగులు దాడి చేశాయి. ఏనుగుల దాడిలో ఇద్దరి మహిళలకు తీవ్రగాయాలు కావడంతో దగ్గర్లో ఉన్న పాలకొండ ఏరియా ఆస్పత్రికి అక్కడ ఉన్న స్థానికులు తరలించారు.
* జమ్ము-కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ ప్రాంతంలో జవాన్లు, ఉగ్రవాదులు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుపెట్టాయి. ఎదురుకాల్పులు జరుగుతున్న సమయంలో ముగ్గురు భారత జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. దక్షిణ కశ్మీర్‌లో ఉగ్రవాద కదలికలపై సమాచారం అందుకున్న భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి.
*ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 80వ స్నాతకోత్సవం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్నాతకోత్సవానికి గవర్నర్ నరసింహన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
*కువైట్ రాజధాని కువైట్ సిటీలో ఈనెల 8న ఉష్ణోగ్రత.. 63 డిగ్రీల సెల్సియస్గా నమోదైందట! నేరుగా ఎండలో ఈ ఉష్ణోగ్రత ఉండగా.. నీడలో 52.2 డిగ్రీలు ఉందని ‘గల్ఫ్ న్యూస్’ ఇటీవల ప్రకటించింది. అదేరోజున సౌదీ అరేబియాలోని అల్ మజ్మా నగరంలో 55 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు కూడా తెలిపింది.
*అటవీ ప్రాంతం నుంచి తరలించిన కుమురం భీం జిల్లా కాగజ్నగర్ మండలం కొలంగొండి గ్రామానికి చెందిన ఆదివాసీలకు ఆరు నెలల్లో భూమి, ఏడాదిలో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదివారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
*ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో పెండింగ్లో ఉన్న పలు బిల్లులను ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. 16వ లోక్సభ రద్దు కారణంగా ఉభయ సభల్లో వివిధ దశల్లో ఉన్న 46 బిల్లులు మురిగిపోయాయి.
*లోక్సభ సమావేశాల ప్రారంభం ముందు రోజున సంప్రదాయంగా జరగాల్సిన విపక్షాల సమావేశం ఈసారి చోటుచేసుకోలేదు. సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి ప్రతిపక్ష పార్టీలు తేరుకోకపోవడమే ఇందుకు కారణం.
* కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద ప్రారంభోత్సవ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. మేడిగడ్డ బ్యారేజి వద్ద హెలిప్యాడ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే రెండు సిద్ధంగా ఉండగా మరో నాలుగింటిని కొత్తగా సిద్ధం చేస్తున్నారు.
*దేశంలో గతేడాది మార్చి నుంచి ఈ ఏడాది మే వరకు రాజకీయపార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు దాతలు రూ.5,800 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసినట్లు సమాచార హక్కు చట్టం ఉద్యమకారుడికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తెలిపింది.
*ప్రపంచ అవసరాలకు తగినట్లు విద్యార్థులను తీర్చిదిద్దేలా విద్యావిధానంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరముందని ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య పేర్కొన్నారు. ప్రస్తుత విద్యా విధానంలోని లోపాలను సవరించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను బట్టి నూతన విద్యావిధానం అమలు చేయాలని సూచించారు.
*బంగాళాఖాతంలో నాలుగైదు రోజుల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు.
*ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఐటీలు సహా మొత్తం 107 విద్యాసంస్థల్లో ప్రవేశానికి ఆదివారం నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.
*రాష్ట్రంలో ఎంపికైన టీఆర్టీ అభ్యర్థులకు ప్రభుత్వం వెంటనే పోస్టింగులు ఇవ్వాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ యూనియన్ (టీపీటీయూ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.వేణుగోపాలస్వామి, మట్టపల్లి రాధాకృష్ణారావు డిమాండ్ చేశారు. ఉద్యోగుల సీపీఎస్ రద్దుకు వెంటనే చర్యలు తీసుకోవాలని, 43 శాతం ఫిట్మెంట్తో ఐఆర్ మంజూరు చేయాలని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
*యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామంలో వరుస హత్యలకు గురైన బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు విమర్శించారు.
*ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం కిసాన్) పథకం కింద రాష్ట్రంలోని రైతుల వివరాలన్నీ వచ్చే నెల 31లోగా పంపాలని కేంద్రం రాష్ట్ర వ్యవసాయశాఖను ఆదేశించింది.
*నీట్లో ఆలిండియా 7వ ర్యాంకు సాధించిన నారాయణ విద్యా సంస్థల విద్యార్థి గంగదాసు మాధురి రెడ్డికి ఆగస్టు 15న దిల్లీలో జరిగే స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఆహ్వనం లభించినట్లు ఆ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ సింధూర నారాయణ, డైరెక్టర్ శరణి నారాయణ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పునీత్ కొత్తప తెలియజేశారు.
*ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం కిసాన్) పథకం కింద రాష్ట్రంలోని రైతుల వివరాలన్నీ వచ్చే నెల 31లోగా పంపాలని కేంద్రం రాష్ట్ర వ్యవసాయశాఖను ఆదేశించింది.
*విజయవాడలోని కనకదుర్గ పైవంతెన పనులను డిసెంబరు 31 నాటికి పూర్తి చేయాలని నిర్మాణ సంస్థ సోమాను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఆదేశించారు.
*తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు, ఇతర అంశాలను పరిష్కరించుకునేందుకు రెండు ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి. నీటి వివాదాలపై చర్చించేందుకు గవర్నర్ నరసింహన్ ఈ నెల 24న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శులతో హైదరాబాద్లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
* ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ కాన్వాయ్‌లోని వాహనాల్లో మార్పు చోటుచేసుకుంది. కాన్వాయ్‌లోకి కొత్తగా 6 నలుపు రంగు ఫార్చ్యునర్‌ వాహనాలు చేరాయి. AP39PA2345 నంబర్‌తో ఈ కొత్త వాహనశ్రేణి ఉండనుంది. పాత కాన్వాయ్‌ను హైదరాబాద్‌ పంపడంతో కొత్త వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది.