Business

లిబ్రా- ఫేస్‌బుక్ నుండి సరికొత్త కరెన్సీ

Here is what you should know about facebooks new cryptocurrency - Libra

చాటింగ్లు, ఫొటోలు-వీడియోలు తిలకించేందుకు.. ఇతరులకు పంపేందుకు వినియోగిస్తోన్న ఫేస్బుక్లో, కొనుగోళ్లు, గేమింగ్కూ వీలు కలుగనుంది. ఇందుకోసం సరికొత్త క్రిప్టోకరెన్సీని సంస్థ ఆవిష్కరించనుంది. వచ్చే ఏడాది ఇది అందుబాటులోకి రానుంది. ఈ సరికొత్త క్రిప్టోకరెన్సీ చెల్లింపులను అధికారికంగా నిర్వహించేందుకు ఫేస్బుక్ సన్నద్ధమవుతోంది. ప్రభుత్వాలు, ఆర్థిక దిగ్గజ సంస్థల ఆమోదంతోనే, వచ్చే ఏడాదిలో క్రిప్టోకరెన్సీని విడుదల చేయాలన్నది ఫేస్బుక్ ప్రణాళిక. బ్లాక్చెయిన్ ఆధారిత బిట్కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీల విలువల్లో ఇటీవల అధిక హెచ్చుతగ్గులు చోటుచేసుకున్న నేపథ్యంలో, ఇలాంటివి దరిచేరకుండా చూడాలన్నది ఫేస్బుక్ ఉద్దేశమని వాల్స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. వీసా, మాస్టర్కార్డ్, పేపాల్, ఉబర్ వంటి దాదాపు 12 దిగ్గజ కంపెనీల బృందం ‘లిబ్రా’ను ఫేస్బుక్ ఏర్పాటు చేస్తోంది. మరికొన్ని వెంచర్ క్యాపిటల్ సంస్థలు, టెలికాం సంస్థలు కూడా ఇందులో భాగమవుతాయి. ప్రతి సంస్థా 10 మిలియన్ డాలర్ల (సుమారు రూ.70 కోట్లు) చొప్పున పెట్టుబడి పెడుతుంది. ఈ బృందాన్ని మరో ఇతర సంస్థ మాత్రమే నిర్వహిస్తుంది. వినియోగదార్లలో నమ్మకం కలిగించేందుకు డాలర్, యూరో వంటి కరెన్సీల ఆధారంగా విలువ నిర్ణయించాలన్నది ప్రణాళికగా చెబుతున్నారు. ఇప్పటికే అమెరికా ఆర్థిక శాఖ, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, బీబీసీ ఆశీస్సులు ఫేస్బుక్కు లభించాయన్నది సమాచారం. క్రిప్టోకరెన్సీలను నియంత్రణ సంస్థలు వ్యతిరేకించడానికి ప్రధాన కారణం.. వాటిని నేరస్తులు దుర్వినియోగించే అవకాశం అధికంగా ఉండటం, విలువల్లో తీవ్ర హెచ్చుతగ్గుల వల్ల వినియోగదారులకు నష్టం జరగడమే. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి యాప్ల ద్వారా 200 కోట్ల మందికి పైగా వినియోగదారులను కలిగిన ఫేస్బుక్, ఇలాంటి అవలక్షణాల నుంచి తమ కరెన్సీని దూరంగా ఉంచే వీలుంది. దీంతోపాటు చైనాలో వుయ్చాట్ వ్యవహరిస్తున్న తరహాలో లావాదేవీలు సాగించగలదు. వినియోగదారులు తమ ప్లాట్ఫామ్ను వీడకుండానే చాట్ చేసేందుకు, కొనుగోళ్లకు, గేమ్లు ఆడేందుకు వుచ్చాట్ వీలు కల్పిస్తోంది. ఇందువల్ల సంస్థకు భారీగా ఆదాయం లభిస్తోంది. ఇదే తరహాలో ఫేస్బుక్ కూడా వ్యవహరించనుందని భావిస్తున్నారు.