Business

అమెరికాతో ఇండియా వెపన్స్ డీల్

India to sign weapons and arms deal with USA

అగ్రరాజ్యం అమెరికాతో ఇండియా మరో డిఫెన్స్‌‌ డీల్‌‌ కుదుర్చుకోడానికి సిద్ధమైంది. ఆ దేశం నుంచి 30 వెపనైజ్డ్‌‌ సీ గార్డియన్స్‌‌ (ప్రిడేటర్‌‌–బీ) డ్రోన్లు కొనేందుకు త్వరలో ఒప్పందం కుదుర్చుకోబోతోంది. రిమోట్‌‌తో నడిచే (యూఏవీ) ఈ డ్రోన్లను ఆర్మీ, నేవీ, ఎయిర్‌‌ఫోర్స్‌‌కు 10 చొప్పున అందించనున్నారు. రక్షణ ఆయుధాల కొనుగోలు వ్యవహారాలు చూసే రక్షణ కొనుగోళ్ల మండలి (డీఏసీ)కి ఈ డీల్‌‌ వివరాలు ఇంకా అందలేదు. డీఏసీ ఓకే చేసి వెంటనే అమెరికాకు ఇండియా ‘లెటర్‌‌ ఆఫ్‌‌ రిక్వెస్ట్‌‌’ పంపుతుంది. డీల్‌‌కు సంబంధించి ఇప్పటికే కొన్ని చర్చలు జరిగాయని, కాంట్రాక్టు ఓకే అయి పని మొదలయ్యేసరికి ఏడాది పట్టొచ్చని ఓ అధికారి వెల్లడించారు.
**ఆర్మ్‌‌డ్‌‌ ఫోర్సెస్‌‌కు కొండంత బలం…
ఈ హంటర్‌‌ కిల్లర్‌‌ సీ గార్డియన్స్‌‌తో మన సాయుధ బలగాలకు కొండంత బలం రానుంది. ఆకాశం నుంచి భూమిపైకి మిసైళ్లతో దాడే చేసే రకానివీ గార్డియన్స్‌‌. స్మార్ట్‌‌ బాంబుల్నీ వీటితో ప్రయోగించవచ్చు. ఫైటర్‌‌ జెట్లలానే ఇవి కూడా మిసైళ్లను, గైడెడ్‌‌ వెపన్స్‌‌ను శత్రువులపై సంధిస్తాయి. చప్పుడు కాకుండా వెళ్లి ఎనిమీ టార్గెట్స్‌‌ను ధ్వంసం చేస్తాయి. మళ్లీ తమ సొంత ప్రదేశానికి వచ్చి తర్వాతి ఆపరేషన్‌‌కు సిద్ధమవుతాయి. బాంబులు, మిసైళ్లను తీసుకెళ్లడానికి తొమ్మిది హార్డ్‌‌ పాయింట్స్‌‌ వీటిల్లో ఉన్నాయి. 12 కిలోమీటర్ల ఎత్తు వరకు ఎగరగలవు. ఒక్కసారి రెడీ అయితే 35 గంటలు ఆకాశంలో తిరగగలవు. గ్రౌండ్‌‌ స్టేషన్‌‌ నుంచి కంట్రోల్‌‌ చేస్తారు. వీటి రేంజ్‌‌ 10 వేల కిలోమీటర్లు. ఇండియన్‌‌ ఓషన్‌‌ రీజియన్‌‌లో పర్షియన్‌‌ గల్ఫ్‌‌ నుంచి మలక్కా జలసంధి వరకు ఓ కన్నేసి ఉంచేందుకు వాడుకోవచ్చు.
**ఎంహెచ్‌‌ 60లు, ఎస్‌‌ఏఎంఎస్‌‌లు..
2018 సెప్టెంబర్‌‌లో అమెరికాతో ఇండియా కామ్‌‌కాసా(కమ్యునికేషన్స్‌‌, కంపాటబిలిటీ, సెక్యూరిటీ అరెంజ్‌‌మెంట్స్‌‌) ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా అమెరికా అడ్వాన్స్డ్‌‌ మిలిటరీ టెక్నాలజీ, డేటా లింక్స్‌‌ను ఇండియా పొందగలదు. అడ్వాన్స్డ్‌‌ జీపీఎస్‌‌ టెక్నాలజీతో తయారైన సీ గార్డియన్స్‌‌ కూడా కామ్‌‌కాసాలో భాగమే. సీ గార్డియన్స్‌‌తో పాటు అమెరికా నుంచి మల్టీరోల్‌‌ నేవీ హెలికాప్టర్ ఎంహెచ్‌‌ 60 ‘రోమియో’లు కొనుగోలు చర్చలు చివరి దశలో ఉన్నాయి. 24 హెలికాప్టర్ల కోసం రూ.18 వేల కోట్లు ఇండియా ఖర్చు చేస్తోంది. నేషనల్‌‌ అడ్వాన్స్డ్‌‌ సర్ఫేస్‌‌ టు ఎయిర్‌‌ మిసైల్‌‌ సిస్టమ్‌‌–2 కోసం మరో రూ.7 వేల కోట్లు వెచ్చిస్తోంది. ఆరు అపాచీ హెలికాప్టర్ల (రూ.6 వేల కోట్లు) కొనుగోలు ఒప్పందం కూడా చివరి దశలో ఉంది. అమెరికాతో ఇండియా 2007 నుంచి ఇప్పటివరకు రూ. లక్షా 18 వేల కోట్ల డిఫెన్స్‌‌ కాంట్రాక్టులు కుదుర్చుకుంది.
**రష్యా నుంచి కొని తీరుతాం: ఇండియా
2018 అక్టోబర్‌‌లో రష్యాతో ఇండియా కుదుర్చుకున్న రూ.37 వేల కోట్ల డీల్‌‌పై అమెరికా అభ్యంతరం వ్యక్తం చేసింది. రష్యన్‌‌ ఎస్‌‌-400 ట్రయంఫ్‌‌ మిసైల్‌‌ కొనొద్దని ట్రంప్‌‌ సర్కారు వారించింది. కానీ ఇండియా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఎట్టిపరిస్థితుల్లో ఆ ‘ఎస్‌‌–400’ డీల్‌‌ను వదులుకునేది లేదని స్పష్టం చేసింది.
**అణ్వాయుధాలు పెరుగుతున్నయ్‌…
న్యూక్లియర్‌ ఆయుధాల తయారీ గతేడాదితో పోలిస్తే తగ్గిందని స్టాక్‌హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎస్‌ఐపీఆర్‌ఐ) వెల్లడించింది. 2019 తొలిదశలో అమెరికా, రష్యా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, చైనా, ఇండియా, పాకిస్థాన్‌, ఇజ్రాయెల్‌, ఉత్తర కొరియా దగ్గర మొత్తంగా 13,865 న్యూక్లియర్‌ వెపన్స్‌ ఉన్నాయంది. 2018తో పోలిస్తే 600 వరకు ఆయుధాలు తగ్గినట్టు దీని ద్వారా తెలుస్తోందని వివరించింది. అమెరికా, రష్యాలు వాటి ఆయుధాల ఉత్పత్తిని తగ్గించుకోవడం వల్లే సంఖ్య తగ్గిందని రిపోర్టు పేర్కొంది. న్యూ స్టార్ట్‌ ఒప్పందం వల్లే ఇది సాధ్యమైందని చెప్పింది. 1980ల్లో ప్రపంచంలో 70 వేల అణ్వాయుధాలున్నాయని వివరించింది. మరోవైపు వెపన్స్‌ ఉన్న దేశాలు వాటిని ఆధునీకరిస్తున్నాయని.. చైనా, ఇండియా, పాక్‌ లాంటి దేశాలైతే వాటి ఆయుధాల సంఖ్యనూ పెంచుకుంటున్నాయని వెల్లడించింది. 2021తో ఈ ఒప్పందం ముగిసిపోనుందని, దీన్ని పొడిగింపు చర్చలు అంత వేగంగా జరగడం లేదని చెప్పింది.