DailyDose

15 మంది అధికారులపై కేంద్రం వేటు-నేరవార్తలు–06/18

Indian central government fires 15 officials over corruption-June 18 2019- Daily crime news in telugu

* అవినీతికి పాల్పడిన 15 మంది అధికారులపై కేం‍ద్ర ప్రభుత్వం మరోసారి వేటు వేసింది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు, కస్టమ్స్‌లో కమిషనర్‌, ప్రిన్సిపల్‌ కమిషనర్‌, డిప్యూటీ కమిషనర్‌ స్ధాయి అధికారులను నిర్బంధ పదవీ విరమణతో సాగనంపింది. వీరిపై లంచాలు స్వీకరించడంతో పాటు పలు అవినీతి ఆరోపణలు నమోదయ్యాయి.
*పాడేరు సబ్ ట్రెజరీలో ఏసీబీ దాడులు93,200రూ లంచం తీసుకుంటూ పట్టుబడ్డ incharge ATO కొండలరావు…కొనసాగుతున్న ఏసీబీ సోదాలు.
*జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురం వద్ద చెట్టు ను డి కొన్న అక్రమంగా పశువులు తరలిస్తున్న వ్యాన్ మూడు పశువులు మృతి మరో 25 పశువులకు త్రివ గాయాలుతూర్పుగోదావరి జిల్లా తుని నుంచి తెలంగాణ సూర్యాపేట తరలిస్తుండగా ఘటన
ఘటన స్థలానికి చేరుకున్న నకిలీ గోశాల బృందం
*గుంటూరు జిల్లా సత్తెనపల్లి రూరల్ పోలీసు స్టేషన్ లో కోడెల శివరాం పై ఫిర్యాదు.మధ్యవర్తి ద్వారా తన దగ్గర15లక్షలు డబ్బులు వసూలు చేసాడని ఫిర్యాదు చేసిన కాంట్రాక్టర్ కోర్లకుంట వెంకటేశ్వర్లు.
*గుంటూరు జిల్లారాజుపాలెం మండలం రెడ్డిగూడెంలో పచ్చలస్పిన్నింగ్ మిల్లులోప్రమాదంప్రమాదవశాత్తు మిషన్ మీదపడి వలస కార్మికుడు మృతి మృతుడు ఒడిశా రాష్టానికిచెందిన వలస కూలి సూర్య బెహేరా(35)
*పన్ను ఎగవేత దారులకు మరింత కటినమైన నిబంధనలు వచేహ్శాయి. ఆదాయపు పన్ను శాఖ సోమవారం నుంచి కొత్త ఇన్ కం టాక్స్ నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ జరీ చేసిన రివైజ్ గైడ్ లైన్స్ లో ఇకపై కేవలం పెనల్టీ ట్యాక్స్ డిమాండ్, వడ్డీలు, మాత్రమే కట్టేసి పన్ను ఎగవేత కేసుల నుంచి వ్యక్తులు లేదా సంస్థలు తప్పించుకోవడానికి వీలులేదు.
* కొవ్వూరు మండలం మద్దూరులో ఎస్సై నాగరాజు ఇంట్లో చోరీ జరిగింది. నాలుగున్నర కాసుల బంగారంరూ.వేలు ఎత్తుకెళ్లారు.
* మ్యాజిక్ తీవ్ర విషాదాన్ని నింపింది. గతంలో సంకెళ్లతో బంధించుకుని నీటిలో దూకి సక్సెస్‌ఫుల్‌గా మ్యాజిక్ చేసిన ప్రముఖ మెజీషియన్ జాదూగర్ మంద్‌రాకే రెండో సారి మాత్రం అదృశ్యమై అనంతరం మృతి చెందారు. నిన్న సంకెళ్లతో బంధించుకుని హౌరాబ్రిడ్జి పై నుంచి.. జాదూగర్‌ మంద్‌రాకే గంగానదిలో దూకి అదృశ్యమయ్యారు. 24 గంటల తరువాత నేడు ఆయన మృతదేహాన్ని గుర్తించి పోలీసులు వెలికి తీశారు. ప్రముఖ స్టంట్ మాన్ చంచల్ లాహిరి. జాదుగర్ మంద్‌రాకేగా ఫేమస్ అయ్యారు.
* షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బూర్గుల చౌరస్తా సమీపంలో, గుర్తు తెలియని వ్యక్తి రాయల్ ఎన్ఫీల్డ్ బులెట్ బండి పై వచ్చి. తనకు తాను పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య కు పాల్పడ్డాడు. బైక్ పై విష్ణు వర్ధన్ రెడ్డి, మేడ్చల్ అని ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…
* కెన‌డాలోని టొరంటోలో కాల్ప‌ల ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. బాస్కెట్‌బాల్ టోర్నీలో టొరంటో రాప్ట‌ర్స్ విజేతగా నిలిచింది. అయితే ఆ జ‌ట్టు నిర్వ‌హించిన విక్‌నరీ ప‌రేడ్‌లో కాల్పుల ఘ‌ట‌న జ‌రిగింది. నాథ‌న్ పిలిప్స్ స్క్వేర్ వ‌ద్ద జ‌రిగిన ప‌రేడ్‌లో పాల్గొనేందుకు వేల సంఖ్య‌లో క్రీడాభిమానులు వ‌చ్చారు. అయితే అక్క‌డ కాల్పులు శ‌బ్ధాలు వినప‌డ‌డంతో జ‌నం ప‌రుగులు తీశారు. ఆ ఘ‌ట‌న‌లో న‌లుగురు గాయ‌ప‌డ్డారు. వారికి ప్రాణాపాయం లేద‌ని తెలిసింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి ముగ్గుర్ని అరెస్టు చేశారు. సంఘ‌ట‌నా స్థలం నుంచి రెండు పిస్తోళ్ల‌ను సీజ్ చేశారు.
* బుల్లితెర నటుడు చలాకీ చంటికి గాయాలయ్యాయి. సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన స్వల్పంగా గాయపడ్డారు. మంగళవారం ఉదయం చంటి కారులో హైదరాబాద్‌ నుంచి విజయవాడ బయల్దేరారు. సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో రాగానే చంటి ప్రయాణిస్తున్న కారు వెనుక నుంచి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చంటికి స్వల్పగాయాలవ్వగా, కారు ముందు భాగం ధ్వంసమైంది. కోదాడ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న చంటి అనంతరం హైదరాబాద్‌కు బయల్దేరారు. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్‌ కామెడీ షోలో చలాకీ చంటి మంచి కమెడియన్‌గా గుర్తింపు పొందారు.
*జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం పెద్దపోతులపాడు శివారులోని, రైల్వే ట్రాక్ పై, ప్రేమికుల ఆత్మహత్య.
ఉండవెల్లి మండలం ఇటిక్యాల పాడు గ్రామానికి చెందిన వారీగా గుర్తింపు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
*కోదాడ కొమరబండ వద్ద లారీని ఢీకొన్న కారు. జబర్దస్త్ లో యాక్టర్ గా పనిచేస్తున్న చలాకి చంటి. విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్తున్న చలాకి చంటి. ఉదయం ఆరున్నర గంటలకు, లారీని వెనక నుండి డీ కొట్టడంతో, స్వల్ప గాయాలు. కోదాడ ఆసుపత్రికి తరలింపు.
*కృష్ణ పట్నం పోర్ట్ నుండి ఒంగోలు కు వచ్చే లారీ ఉదయం డ్రైవర్ నిద్ర మత్తులో ఉండగా శానంపూడి రోడ్డు నందు జాతీయ రహదారిపై డివైడరు వెక్కిగా, ఎటువంటి ప్రాణ పాయం లేదు.చైనాలో రెండు భారీ భూకంపాలు.. 11 మంది మృతి.. 122 మందికి గాయాలు
*కృష్ణాజిల్లా మచిలీపట్నం ద్విచక్ర వాహనంపై వెళుతున్న భార్యభర్తలను ఢీకొట్టిన టిప్పర్ భార్య ధనలక్ష్మి అక్కడిక్కడే మృతి
భర్త సుబ్బారావు పరిస్థితి విషమం మెరుగైన చికిత్సకై విజయవాడ తరలింపు మచిలీపట్నం-పెడన రహదారిలో హుస్సేన్ పాలెం దగ్గర ఘటన భార్య భర్తలు పెడనకు చెందిన వారుగా గుర్తింపు మచిలీపట్నం నుండి పెడన వెళుతుండగా ఘటన.
తృటిలో తప్పిన ప్రమాదం
* జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్-రఘునాథపల్లి రైల్వే స్టేషన్ల మధ్యలో సాయంత్రం ఢిల్లీ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న తెలంగాణ ఎక్స్ప్రెస్ రైలు నుంచి ఓ గుర్తు తెలియని యువతి ప్రమాదవశాత్తు జారిపడింది.
*ఒంగోలు లాయర్ పేటలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఏఎంసీ మాజీ చైర్మన్ హరనాథ్ నివాసంలో దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. 120 సవర్ల బంగారం, 7 కిలోలు వెండి, రూ. 3 లక్షలు నగదు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు.. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. క్లూస్ టీమ్ ఆధారాలను సేకరించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
*తెలుగుదేశం పార్టీకి ఓటు వేశామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు తమపై దాడి చేశారని పలువురు బాధితులు సోమవారం గుంటూరులోని పోలీసు కార్యాలయంలో జరిగిన ప్రజావిజ్ఞప్తుల దినంలో అధికారులకు ఫిర్యాదు చేశారు.
*విద్యుత్తు తీగ తెగిపడ్డ ఘటనలో ఇద్దరు స్నేహితులు అక్కడికక్కడే మృతి చెందారు. కడప జిల్లా పులివెందులలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
*శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలంలో ఓ ఏనుగు దాడి చేసిన ఘటనలో ఇద్దరు గిరిజన మహిళలు మృతి చెందారు.
*పాకిస్థాన్ సైన్యంపైన, ఆ దేశ గూఢచార సంస్థ ఐఎస్ఐపైన విమర్శలు గుప్పించే బ్లాగర్, పాత్రికేయుడు మహ్మద్ బిలాల్ ఖాన్ (22)ను గుర్తు తెలియని వ్యక్తి నరికి చంపాడు.
*క్రికెట్ సంబరాలలో మొదలైన గొడవ దళిత యువకుడి హత్య.. ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్లోని ప్రతాప్గఢ్ జిల్లా పట్టి ప్రాంతంలో చోటుచేసుకుంది.
*మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారన్న అభియోగంపై ముగ్గురు నిందితులను స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో సోమవారం హాజరుపరిచారు.
*గురుకుల విద్యాలయాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి ఓ మహిళ కోట్లాది రూపాయలు వసూలుచేసిన ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది.
*వైద్యుల సమ్మె కారణంగా సకాలంలో వైద్యసేవలు అందక ఓ వ్యక్తి మృతిచెందిన ఘటనిది. నల్గొండ జిల్లా కనగల్ మండలం గౌరారం గ్రామానికి చెందిన అన్నబీమోజు నర్సింహాచారికి సోమవారం ఛాతీలో నొప్పిరావడంతో కుటుంబ సభ్యులు ముందుగా జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆసుపత్రులను సంప్రదించారు.
*ఓ ఇంట్లో దాచి ఉంచిన రూ.కోటి విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని నాగపట్నం పబ్లిక్ ఆఫీస్ రోడ్డులోని ఓ ఇంట్లో గంజాయి విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆదివారం సాయంత్రం వారు పేచ్చియమ్మాల్ అనే మహిళ ఇంట్లో సోదాలు చేశారు. అక్కడ 20 పార్శిళ్లలో సుమారు రూ.కోటి విలువైన గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
*ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ఖమ్మం జిల్లా ఏన్కూరు వద్ద నాగార్జునసాగర్ ప్రధాన కాల్వ వంతెన గోడను మణుగూరు డిపో బస్సు సోమవారం ఢీకొంది.
*స్టేషన్ బెయిల్కు లంచం తీసుకున్న ఓ ఎస్సై, కానిస్టేబుల్ను అనిశా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనిశా నగర విభాగం డీఎస్పీ అచ్చేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. బొల్లారంలోని ఆదర్శనగర్కు చెందిన జనగామ నర్సింగ్రావు తన వద్ద పనిచేసే గోపీ అనే వ్యక్తిని డబ్బుల వ్యవహారంలో ఈ నెల 3వ తేదీన కొట్టాడు.
*ఆగి ఉన్న ట్రాక్టర్పైకి నాలుగు సంవత్సరాల వయసున్న పిల్లాడు ఎక్కి దానికున్న తాళాన్ని తిప్పడంతో అది ముందుకు ఉరికింది. అక్కడే ఆడుకుంటున్న మరో చిన్నారి పైనుంచి అది దూసుకెళ్లడంతో ఆ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా తెనాలి పట్టణం..అమరావతి ప్లాట్స్ వద్ద సోమవారం చోటుచేసుకుంది.
*తాము తెచ్చిన పెళ్లి సంబంధాన్ని తిరస్కరించిందని ఓ 15 ఏళ్ల బాలికపై సొంత కుటుంబ సభ్యులే పాశవికంగా దాడి చేశారు. కత్తితో పొడిచి.. కాల్వలో తోసేశారు. అతి దారుణమైన ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లో జరిగింది.
*జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి దాడులకు తెగబడ్డారు. పుల్వామా సమీపంలో ఆర్మీ వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపారు.
*తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులకు న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది. ఈనెల 28 వరకు రిమాండ్ పొడిగిస్తూ పులివెందుల కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ముగ్గురు నిందితులు ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాశ్ను పోలీసులు పులివెందుల సబ్జైలుకు తరలించారు.
*ఆగి ఉన్న ట్రాక్టర్పైకి నాలుగు సంవత్సరాల వయసున్న పిల్లాడు ఎక్కి దానికున్న తాళాన్ని తిప్పడంతో అది ముందుకు ఉరికింది. అక్కడే ఆడుకుంటున్న మరో చిన్నారి పైనుంచి అది దూసుకెళ్లడంతో ఆ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
*నందికొట్కూరు మండలం టెన్ బొల్లవరం వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శీతలగిడ్డంగిలో మంటలు చెలరేగాయి. దీంతో ధాన్యం నిల్వలు తగలబడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని రెండు ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూటే అగ్నిప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.