Fashion

ట్రెండీ లుక్స్‌కి జీన్స్ వేయనక్కర్లేదు

Jeans Is Not The Only Option For Trendy Looks

మీ స్నేహితులు చెబుతున్నట్లు… జీన్స్‌ వేసుకుంటేనే అప్‌డేటెడ్‌గా కనిపిస్తామని అనుకోవడంలో వాస్తవం లేదు. మన శరీరానికి అసౌకర్యం కలగకుండా హుందాగా కనిపించగలిగేది ఏది ఎంచుకున్నా ఆత్మవిశ్వాసంతో మరింత అందంగా కనిపించొచ్చు. అధిక బరువు కారణంగా జీన్స్‌ వేసుకోవడం లేదని రాశారు. ఓ పని చేయండి. జీన్స్‌ – షార్ట్‌ టాప్‌లు/టీషర్ట్‌లు వేసుకునే బదులు ఏలైన్‌ కుర్తీలు, ఎసెమిట్రికల్‌ టాప్‌లు ఎంచుకుని చూడండి. మీకు ఎలాంటి అసౌకర్యం ఉండదు. స్టైలిష్‌గా నిపించాలంటే జీన్స్‌ను మించిన బాటమ్‌ రకాలెన్నో ఉన్నాయి. సిగరెట్‌ ప్యాంట్లు, పలాజోలు, మ్యాక్సీ స్కర్ట్‌లు, జెగ్గింగ్స్‌, షరారాలు… వంటివన్నీ జీన్స్‌కి ప్రత్యామ్నాయంగా ఎంచుకోవచ్చు. వీటిల్లో ఎప్పటికప్పుడు వస్తోన్న కొత్త ప్యాటర్న్స్‌ వయసుకు తగినట్లుగా ఎంచుకునేలా ఉంటున్నాయి. సల్వార్‌ ప్యాంట్‌ వేసుకోవడానికి బదులు… అంచుల్లో కఫ్‌ ఉన్న కాఫ్‌లెంగ్త్‌ సిగరెట్‌ ప్యాంట్‌ని ఎంచుకోవచ్చు. లెగ్గింగ్స్‌, జీన్స్‌లకు బదులు జెగ్గింగ్‌, పలాజోలను వేసుకోవచ్చు. మరీ ఫ్రిల్స్‌, బాక్స్‌ ప్లీటెడ్‌ ఉన్న స్కర్ట్‌లు, ప్యాంట్లను ఎంచుకోకండి. స్కిన్‌టైట్‌ ఉన్నవీ అంతగా నప్పవు. పార్టీవేర్‌గా కుర్తీలను వేసుకోవాలనుకున్నప్పుడు ఎంబ్రాయిడరీ డిజైన్‌ ఉన్న బాటమ్స్‌ ప్రయత్నించొచ్చు. ఇవన్నీ మీ లుక్‌ని మార్చేస్తాయి. నలుగురిలో ప్రత్యేకంగానూ కనిపిస్తారు.
Jeans Is Not The Only Option For Trendy Looks-Telugu Fashion News