DailyDose

చెట్టుకొమ్మ విరిగి విద్యార్ధి మృతి-నేరవార్తలు–06/19

June 19 2019 - Daily Crime News Today-చెట్టుకొమ్మ విరిగి విద్యార్ధి మృతి-నేరవార్తలు–06/19

* సనత్ నగర్ లో దారుణం అక్రమ‌ సంబంధం కారణంగా ప్రియుడు , అతని సోదరి పైన పెట్రోల్ తో నిప్పంటించిన ప్రియురాలు అక్క మృతి, తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న ప్రియుడు ఖలీల్ అన్న భార్య ముంతాజ్ తో అక్రమ సంబంధం పెట్టుకున్న ఖలీల. మూడు నెలల క్రితం మరో యువతితో ఖలీల్ కు వివాహం అప్పటి నుంచి ముంతాజ్ దగ్గరకు రానని చెప్పిన ఖలీల్ ఖలీల్, అతని భార్యను చంపేందుకు ముంతాజ్ పధక రచన ఉదయం పెట్రోల్ సీసాతో ఖలీల్ నివాసానికి వచ్చిన ముంతాజ్.. ఖలీల్ పైన, భార్య అనుకుని పడుకున్న సోదరి పైన పెట్రోల్ పోసి నిప్పంటించిన ముంతాజ్ ఖలీల్ సోదరి హజున్నీ మృతి మృతురాలు మానసిక వికలాంగురాలు
* పాఠశాలలోని చెట్టు కొమ్మ విరిగి విద్యార్థి పై పడటంతో విద్యార్థి మృతి చెందిన ఘటన బుధవారం తెనాలి లో చోటు చేసుకుంది. తెనాలి మారీసుపేట మఠం బజారులోని మున్సిపల్‌ ఎలిమెంటరీ పాఠశాలలో పెద్ద చెట్టు కొమ్మ విరిగి, అక్కడున్న విద్యార్ది వై.సందీప్‌ (6) పై పడటంతో విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో మరో బాలుడికి గాయాలయ్యాయి. గాయాలైన బాలుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు…
* రైల్వేకోడూరు పట్టణం రంగనాయకులపేటకు చెందిన అబ్దుల్‌ ఖాదర్‌ బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పని చేస్తున్నాడు. అతనికి ఈనెల 23న తన అత్త కూతురితో వివాహం జరగాల్సి ఉండింది. ఇంతలో ఈనెల 5న రంజాన్‌ పండుగ సందర్భంగా సొంత ఊరికి వచ్చి బస్సు దిగి ఇంటికి వెళ్తుండగా దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్యను పలు కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు మిస్టరీని ఛేదించారు.
* జరాత్‌లోని రాజ్‌కోట్‌లో నిన్న ఓ ఎద్దు బీభత్సం సృష్టించింది. మొదట సైకిల్‌పై వెళ్తున్న ఓ వృద్ధుడిపై ఎద్దు దాడి చేసింది. ఆ వ్యక్తి అక్కడే నిలబడి ఎద్దు వైపే చూడడంతో దానికి మళ్లీ కోపం వచ్చినట్లుంది. మళ్లీ ఆ వృద్ధుడిపై దాడి చేసింది అక్కడున్న ఓ యువకుడు వృద్ధుడిని లాక్కొని వెళ్లిపోయాడు. క్షణాల వ్యవధిలోనే మరో యువకుడిపై ఎద్దు దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. బైక్‌పై వస్తున్న యువకుడిపై దాడి చేసింది ఆ ఎద్దు. విషయం తెలుసుకున్న పశుసంవర్ధక శాఖ అధికారులు.. రాజ్‌కోట్‌కు చేరుకుని ఎద్దును గోవుల షెడ్‌కు తరలించారు.
* మావోయిస్టులు మరోసారి పంజా విసిరారు. సమాజ్‌ వాదీ పార్టీ నేత సంతోష్‌ పూనెంను కాల్చి చంపారు. బీజాపూర్‌లో ఈ విషాదం చోటు చేసుకుంది. పోలీసులు బుధవారం అందించిన సమాచారం ప్రకారం కాంట్రాక్టర్‌ , మరిముల్లాకు చెందిన సంతోష్‌ పూనెంను మంగళవారం సాయంత్రం కిడ్నాప్‌ చేశారు.
* పశ్చిమ ఆఫ్రికాలోని సెంట్రల్‌ మాలీలో రక్తపుటేరులు పారాయి. గుర్తు తెలియని ఓ దుండగుడు బీభత్సం సృష్టించాడు. అక్కడున్న రెండు గ్రామాల మీద విరుచుకుపడ్డాడు. తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపి 41 మందిని చంపేశాడు.
* తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మెయిన్‌రోడ్‌లోని శర్వానీ సూపర్‌ మార్కెట్‌లో బుధవారం వేకువజామున 4గంటల సమయంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతం కారణంగా చెలరేగిన మంటలు భవనంలోని మూడు అంతస్తులకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో దాదాపు రూ.2 కోట్ల వరకూ ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది.
* హన్మకొండలోని కుమార్పల్లిలో దారుణం జరిగింది. తల్లిదండ్రులతో కలిసి డాబాపై నిద్రిస్తున్న తొమ్మిది నెలల పాపను ఎత్తుకెళ్లిన ఉన్మాది చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈఘటనలో చిన్నారి మృతి చెందడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
*తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మెయిన్రోడ్లోని సర్వాని సూపర్ మార్కెట్లో బుధవారం వేకువజామున 4గంటల సమయంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతం కారణంగా చెలరేగిన మంటలు భవనంలోని మూడు అంతస్తులకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో దాదాపు రూ.2 కోట్ల వరకూ ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది.
* మాజీ ముఖ్యమంత్రి వ్యక్తిగత సహాయకుడు మాట్లాడుతున్నట్లుగా నమ్మించి గతంలో ఎమ్మెల్యేలను మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ కేసులో ప్రధాన నిందితుడికి సన్నిహితంగా ఉండే వ్యక్తిని విశాఖపట్నం సైబర్క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
*కర్నూలు జిల్లా పాణ్యం మండలం గోరుకల్లు, సుగాలిమెట్ట గ్రామాల్లో మంగళవారం పిచ్చికుక్కలు స్వైరవిహారం చేసి ఎనిమిదిమందిని కరిచాయి.
*ఇటీవలి సార్వత్రిక ఎన్నికల సమయంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో రూ.3,800 కోట్లు స్వాధీనం చేసుకున్నారని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఉపాధ్యక్షుడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరజిత్ పసాయత్ తెలిపారు.
*కర్నూలు నగర పరిధి కల్లూరు ఎస్టేట్లోని నాలుగు విత్తన సంస్థల్లో విజిలెన్స్ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు.
*విశాఖ నగర పరిధి సాగర్నగర్ సమీప ఇస్కాన్ కేంద్రం గోదాములో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, పౌరసరఫరాల విభాగం అధికారులు సంయుక్తంగా మంగళవారం దాడులు నిర్వహించారు.
*విదేశీ విరాళాల వ్యవహారంలో నిబంధనల ఉల్లంఘనల ఆరోపణలపై ప్రముఖ న్యాయవాది ఆనంద్ గ్రోవర్, ఆయన అధ్యక్షుడిగా ఉన్న స్వచ్ఛంద సంస్థ ‘లాయర్స్ కలెక్టివ్’లపై సీబీఐ కేసు నమోదు చేసింది.
*మధ్యప్రదేశ్లోని నర్సింగ్పుర్ జిల్లాలో జరిగిన హత్యాయత్నం కేసులో కేంద్రమంత్రి ప్రహ్లాద్ పటేల్ కుమారుడు ప్రబల్ పటేల్ (26)ను పోలీసులు అరెస్టుచేశారు.
*అయోధ్యలో 2005లో ఉగ్రదాడికి పాల్పడిన కేసులో నలుగురికి అలహాబాద్ ప్రత్యేక కోర్టు మంగళవారం జీవిత ఖైదు విధించింది.
*అనుమానమే పెనుభూతమైంది. కట్టుకున్న భార్యను కిరాతకంగా హతమార్చి తలతో పోలీసుస్టేషన్కు వెళ్లి ఓ మానవ మృగం లొంగిపోయింది. ఏపీలోని చిత్తూరు జిల్లా కలకడ మండలం కలకడ- గుర్రంకొండ మార్గంలోని కదిరాయచెర్వు సమీపంలో మంగళవారం సాయంత్రం ఈ హత్య చోటు చేసుకుంది.
*ఓ యువకుడు ద్విచక్రవాహనంపై వచ్చాడు.. జాతీయ రహదారికి కొద్ది దూరంలో బండి నిలిపి లోపలికి వెళ్లాడు.. వెంటతెచ్చుకున్న పెట్రోల్ మీద పోసుకుని నిప్పంటించుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మంగళవారం రంగారెడ్డి జిల్లా షాద్నగర్ సమీపంలోని బూర్గుల గేట్ వద్ద జాతీయరహదారి పక్కన చోటుచేసుకుంది.
*పుల్వామా ఆత్మాహుతి దాడితో సంబంధం ఉందని భావిస్తున్న ఉగ్రవాది సహా ఇద్దరు జైష్ ఎ మహ్మద్ ఉగ్రవాదులను జమ్ముకశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎదురుకాల్పుల్లో భద్రతాదళాలు హతమార్చాయి.
*శీతల గిడ్డంగిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో అందులో నిల్వ ఉంచిన వ్యవసాయ ఉత్పత్తులకు భారీగా నష్టం వాటిల్లింది. కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలంలో మంగళవారం ఈ ప్రమాదం జరిగింది.
*ఐసిస్ ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురిని తమిళనాడు కోయంబత్తూరులో పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు మహ్మద్ హుస్సేన్, షాజహాన్, షేక్ సఫిల్లాపై పోతనూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
*మహారాష్ట్రలోని బండార జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చుల్బందు నది వంతెనపై టైరు పేలి కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
*తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని గ్లాస్హౌస్ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
*ఓ మహిళతో చనువుగా ఉంటూ ఆమె దాచిన సొత్తును దోచుకున్న ప్రబుద్ధుడిని అరెస్టుచేసిన సంఘటన సరూర్నగర్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.