DailyDose

ఫార్మా తప్ప అన్ని రంగాల్లో లాభాలు-వాణిజ్యం-06/19

Nifty seeing profits except pharma-June 19 2019-Daily Business News In Telugu

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడింగ్‌ ను ప్రారంభించాయి. సెన్సెక్స్‌ 355 పాయింట్లు పెరిగి 39,041 వద్ద నిఫ్టీ 101 పాయింట్లు పెరిగి 11,792 వద్ద ట్రేడవుతున్నాయి. టాటా స్టీల్‌, కోటక్‌ బ్యాంక్‌, ఎల్‌ అండ్‌ టి షేర్లు భారీ లాభాలతో మొదలయ్యాయి. ఫార్మా రంగం తప్పితే నిఫ్టీ లో అన్ని రంగాల షేర్లు లాభాల్లోనే ఉన్నాయి.
* సౌందర్య ఉత్పత్తులను ఆన్లైన్లో విక్రయించే నైకా.కామ్ హైదరాబాద్లో తన తొలి ఆఫ్లైన్ విక్రయ కేంద్రాన్ని ప్రారంభించింది.
* క్రిప్టోకరెన్సీ ప్రపంచంలోకి ఫేస్బుక్ కూడా అడుగుపెట్టింది. సొంత డిజిటల్ నగదు ‘లిబ్రా’ను తీసుకొచ్చింది. దీని ద్వారా ప్రజలు నగదును దాచుకోవడం, ఇతరులకు పంపడం లేదంటే ఖర్చుపెట్టడం వంటివి ఫేస్బుక్లో మెసేజ్లు పంపేంత సులువుగా చేసుకోవచ్చు.
* కాగ్నిజెంట్ తన ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ) సామర్థ్యాలను పెంచుకునే దిశగా అడుగులు వేసింది. జెనిత్ టెక్నాలజీస్ను బయటకు వెల్లడించని మొత్తానికి కొనుగోలు చేయనుంది.
* భారత్లో మాత్రమే వినియోగదార్ల సమాచార నిల్వను చేయాలన్న నిబంధనలపై వెల్లువెత్తుతున్న ఆందోళనలను ఆర్బీఐ పరిశీలించనుందని ప్రభుత్వం తెలిపింది.
* ఫేస్బుక్కు చెందిన సంక్షిప్త సందేశాల దిగ్గజ సంస్థ వాట్సాప్ భారత్లో అంకుర సంస్థలకు తోడ్పాటును మరింత విస్తృతం చేయడంపై దృష్టి పెట్టింది.
* ప్రభుత్వ రంగ రక్షణ సంస్థ మిశ్ర ధాతు నిగం లిమిటెడ్ (మిధాని) తన బయో ఇంప్లాంట్స్ (కృత్రిమ అవయవాలు, పరికరాలు) మార్కెటింగ్ కోసం హిందుస్థాన్ యాంటీబయోటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)తో చేతులు కలిపింది.
* పికప్ వ్యాన్ల విభాగంలో ఈ ఆర్థిక సంవత్సరంలో 10-12 శాతం వృద్ధి సాధించాలనే లక్ష్యంతో ఉన్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ విభాగం మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ విక్రమ్ గార్గా తెలిపారు.
* ఉద్దేశపూర్వక కార్పొరేట్ ఎగవేతదార్ల పేర్లు వెల్లడించేందుకు పలు బ్యాంకులు సమాయత్తమవుతున్నాయి.
* గత కొద్ది త్రైమాసికాలుగా రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) స్థూల రిఫైనింగ్ మార్జిన్లు ఒత్తిడిలో ఉంటున్నాయి. ప్రస్తుతం రిఫైనింగ్, పెట్రో రసాయనాలకున్న ప్రతికూలతల దృష్ట్యా ఆర్ఐఎల్ 2019-20 ఆదాయ అంచనాలు 15 శాతం మేర తగ్గే అవకాశాలున్నాయని జేపీ మోర్గాన్ తన నివేదికలో తెలిపింది.