Politics

నేను పోటీకి వస్తున్నా

trump for 2020

అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌.. 2020లో జ‌ర‌గ‌నున్న దేశాధ్‌్క్ష ఎన్నిక‌ల కోసం ప్ర‌చారం ప్రారంభించారు. రెండ‌వ‌సారి ఆయ‌న దేశాధ్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌నుకుంటున్నారు. ఫ్లోరిడాలో జ‌రిగిన ఓ ర్యాలీలో ఆయ‌న పాల్గొన్నారు. కిక్కిరిసిన మ‌ద్ద‌తుదారుల‌ను ఉద్దేశించి ఆయ‌న మాట్లాడారు. అమెరికాను గొప్ప‌గా తీర్చిదిద్దేందుకు మ‌రో నాలుగేళ్ల పాటు ఇదే టీమ్‌ను ఎంపిక చేయాలంటూ ఆయ‌న అభ్య‌ర్థించారు. 2017లో 45వ అమెరికా అధ్య‌క్షుడిగా ట్రంప్ బాధ్య‌త‌లు స్వీక‌రించిన విష‌యం తెలిసిందే. 73 ఏళ్లు ఉన్న ట్రంప్ ఓ రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి. అక‌స్మాత్తుగా రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయ‌న‌.. దేశాధ్య‌క్షుడిగా ఎన్నిక‌య్యారు. మూడేళ్ల క్రితం అమెరికా చ‌రిత్ర‌లో ఓ కొత్త అధ్యాయం మొద‌లైంద‌ని, అమెరికా ఫ‌స్ట్ అన్న విధానాన్ని అవ‌లంబించామ‌ని ట్రంప్ తెలిపారు. తాను అధ్య‌క్షుడిగా ప‌నిచేసిన‌ కాలంలో దేశం పురోగ‌మించింద‌ని, వ‌చ్చే ఏడాది జ‌రిగే అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో త‌న‌ను గెలిపించాల‌ని, లేదంటే ప‌రిస్థితి ప్ర‌మాద‌క‌రంగా మారుతుంద‌న్నారు. కీప్ అమెరికా గ్రేట్ అన్న‌ థీమ్‌తో ట్రంప్ ప్ర‌చారం చేప‌ట్టారు. 2016లో మేక్ అమెరికా గ్రేట్ అగేన్ అన్న నినాదంతో ట్రంప్ ప్ర‌చారం చేసిన విష‌యం తెలిసిందే. న‌వంబ‌ర్ 2020లో అధ్య‌క్ష ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.