DailyDose

తలను రాయితో కొట్టుకున్న ఎమ్మెల్యే-రాజకీయ-06/20

Goshamahal hits head with stone-June 20 2019-Daily Political News

* హైదరాబాద్‌ నగరంలోని జుమ్మేరాత్ బజార్ లో గత రాత్రి జరిగిన ఘటనకు సంబంధించిన సంచలన వీడియోను పోలీసులు విడుదల చేశారు. తనను పోలీసులు తీవ్రంగా కొట్టారని, తలకు గాయమైందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన ఆరోపణలు అవాస్తవమని, ఆయన తన తలను తానే రాయితో కొట్టుకున్నారని పోలీసులు అంటున్నారు. అందుకు సంబంధించిన వీడియో క్లిప్ ను విడుదల చేశారు. నిన్న రాత్రి స్వాతంత్ర్య సమరయోధురాలు రాణి అవంతిభాయ్‌ విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ఓ వర్గం వారు ప్రయత్నించగా, మరో వర్గం వారు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో అక్కడికి చేరుకున్న రాజాసింగ్, తన మద్దతుదారులతో కలిసి నిరసన తెలిపారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్‌ చేయగా, రాజాసింగ్‌ తలకు గాయాలయ్యాయని తొలుత వార్తలు వచ్చాయి. ఆయనకు ఉస్మానియాలో చికిత్స చేయగా, ఇప్పుడీ వీడియో బయటకు రావడం గమనార్హం.
*మొదటి సమావేశాలు అవే తనిఖీలు
జడ్పీలు, ఏమ్పీపీల అపాయింట్ టెడ్ డేలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఖరారు చేసింది. జులై నాలుగున ఎంపీపీలు, జులై ఐదు నుంచి జిల్లా పరిషత్ మనుగాదలోకి రాబోతున్నాయి. ఈమేరకు బుధవారం ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి నోటిఫికేషన్ జారీ చేశారు. మొదటి సమావేశాలూ అవే తేదీలు ఉంటాయని అందులో పేర్కొన్నారు. ఆయా తేదీల నుంచి ఐదేళ్ళ పాటు సభ్యులు పదవిలో ఉంటారు. పదవీ కాలం పూర్తీ కాని ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాల జడ్పీ అపాయింటే ద్ డేను ఆగస్టు ఏడున ఈసీ ఫిక్స్ చేసింది. ఫిక్స్ చేసారు. ఆగస్టు ఆరున ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలోని అన్ని ఎంపీపీలు, ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురం, మంగపేట, మహబూబాబాద్ జిల్లాలోని గార్ల, బయ్యారం, నగర్ కర్నూల్, జడ్చర్ల ఎంపీపీల సమావేశం జరగనుంది.
* లోక్‌స‌భ‌కు 78 మంది మ‌హిళ‌లు ఎన్నిక‌య్యారు: రాష్‌్రమప‌తి రామ్‌నాథ్‌ పార్ల‌మెంట్ ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి ఇవాళ‌ రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ప్ర‌సంగించారు. ఉద‌యం ఆయ‌న రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ నుంచి మోట‌ర్ కాన్వాయ్ మ‌ధ్య పార్ల‌మెంట్‌కు చేరుకున్నారు. 17వ లోక్‌స‌భ‌కు ఎంపికైన అభ్య‌ర్థుల‌ను ఆయ‌న అభినందించారు. యువ‌త పెద్ద సంఖ్య‌లో ఓటింగ్‌లో పాల్గొన్నార‌ని అన్నారు. ప్ర‌స్తుత లోక్‌స‌భ‌కు ఎన్నిక‌ అయిన వారిలో స‌గం క‌న్నా ఎక్కువ మంది మొద‌టిసారి ఎన్నికైన‌ట్లు ఆయ‌న తెలిపారు. మ‌హిళా ఎంపీలు కూడా కావాల్సినంత సంఖ్య‌లో ఉన్న‌ట్లు చెప్పారు. మొత్తం 78 మంది మ‌హిళ‌లు ఎన్నిక‌య్యార‌ని, ఇది అసాధార‌ణ విష‌య‌మ‌న్నారు. ఇది న‌వ భార‌త్‌కు సంకేతంగా నిలుస్తుంద‌న్నారు. తాజా ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు స్ప‌ష్ట‌మైన మెజారిటీని ఇచ్చార‌న్నారు. సుమారు 61 కోట్ల మంది పౌరులు ఓటింగ్‌లో పాల్గొన్న‌ట్లు చెప్పారు. ఇదో స‌రికొత్త రికార్డు అన్నారు. స‌బ‌క్ సాత్‌, స‌బ్‌కా వికాస్ కోసం ప్ర‌భుత్వం ప‌నిచేస్తోంద‌న్నారు. ఎన్నిక‌ల‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించిన ఎన్నిక‌ల సంఘాన్ని ఆయ‌న కొనియాడారు.
* కోడెల కుమార్తెకు హైకోర్టులో ఊరట – కోడెల కుమార్తె లక్ష్మికి హైకోర్టులో ఊరట లభించింది. ఎస్సీ, ఎస్టీ కేసును కొట్టివేయాలని సీనియర్‌ న్యాయవాది శ్రీనివాస్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. 2018 జనవరిలో జరిగిన సంఘటనపై 2019 జూన్‌లో ఫిర్యాదు చేయడం పట్ల శ్రీనివాస్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. శ్రీనివాస్ పిటిషన్‌పై విచారణ నిర్వహించిన హైకోర్టు.. లక్ష్మీని అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
* ఏ కారణాలతో వెళ్తున్నారో నాతో చెప్పారు:ఉత్తమ్‌ – మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి దిల్లీలో స్పందించారు. రాజకీయ కారణాలతో పార్టీని నుంచి వెళ్లేవారికైతే ఏదైనా చెప్పొచ్చు గానీ.. ఆర్థికపరమైన కారణాలతో వెళ్లేవారికి ఏం చెప్పగలం అని ఆయన వ్యాఖ్యానించినట్టు సమాచారం. రాజగోపాల్‌రెడ్డి ఏ కారణాలతో వెళ్తున్నారో తనకు చెప్పారని, వెళ్లాలని నిర్ణయించుకున్నారు గనక ఇప్పుడు ఏదైనా చెబుతూ ఉండొచ్చని ఉత్తమ్‌ అన్నట్టు తెలుస్తోంది. ఏఐసీసీ ముఖ్య నేతలతో కాసేపట్లో సమావేశం తర్వాత చర్చించి ఈ వ్యవహారంపై మరోసారి మీడియాతో మాట్లాడనున్నట్టు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి స్పష్టంచేశారు.
* కాకినాడలో తెదేపా నేతల రహస్య భేటీ – తెదేపాకు చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు, నేతలు రహస్యంగా భేటీ అయ్యారు. కాకినాడ రైల్వేస్టేషన్‌ సమీపంలోని ఓ హోటల్‌లో సమావేశమైనట్లు తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు నేతృత్వంలో ఈ భేటీ కొనసాగుతోంది. ఈ సమావేశానికి కాపు సామాజిక వర్గానికి చెందిన 14 మంది తెదేపా నేతలు హాజరయ్యారు. భవిష్యత్‌ కార్యాచరణపై ఈ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశముంది. తెదేపాను వీడి భాజపా లేదా వైకాపాలో చేరే విషయమై వీరంతా సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యేలు బూరగడ్డ వేదవ్యాస్‌, బొండా ఉమ, బడేటి బుజ్జి, కదిరి బాబూరావు, చెంగళ్రాయుడు, బండారు మాధవనాయుడు, జ్యోతుల నెహ్రూ, వరుపుల రాజా, మీసాల గీత, కేఏ నాయుడు, పంచకర్ల రమేశ్‌బాబు ఈ సమావేశానికి హాజరయ్యారు. తెదేపాకు చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలు భాజపాలో చేరనున్నారనే వార్తలపైనా ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం. మరోవైపు తాము తెదేపాను వీడేది లేదని తోట త్రిమూర్తులు, జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓటమికి గల కారణాలపైనే తామంతా విశ్లేషించామని చెప్పారు.
* జమిలి ఎన్నికలకు మద్దతు తెలుపుతూనే ఆ అంశాన్ని లేవనెత్తిన జగన్
వన్‌ నేషన్‌.. వన్‌ ఎలక్షన్‌ నిర్వహణకు అడుగులు వేగంగా పడుతున్నాయి. ఈ సార్వత్రిక ఎన్నికలకు ముందే జమిలి ఎన్నికలు నిర్వహించాలని మోదీ సర్కార్‌ భావించినా కుదరలేదు. దీంతో మళ్లీ రెండోసారి అధికారంలోకి రాగానే ఈ అంశంపై సీరియస్‌గా దృష్టి పెట్టారు ప్రధాని మోదీ. ఓ వైపు పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే అఖిపక్ష సమావేశం ఏర్పాటు చేసి.. అందరి అభిప్రాయాలు తీసుకుంది అధికార బీజేపీ. ఈ సమావేశానికి 21 పార్టీలకు చెందిన అధ్యక్షులు హాజరైతే.. సీపీఐ, సీపీఎం, ఎంఐఎంలు మినహా మిగిలిన పార్టీలన్నీ.. తమ వాధనలు వినిపించినా.. ప్రధానికి నిర్ణయానికి సరే అన్నాయి. మూడు పార్టీల అధ్యక్షులు లిఖితపూర్వకంగా తమ అభిప్రాయాలను పంచుకుంటునే జమిలి ఎన్నికలకు ఒకే అని సంకేతాలు ఇచ్చారు.తెలుగు రాష్ట్రాలు సైతం తమ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పాయి. తెలంగాణ నుంచి సమావేశానికి హాజరైన టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిఎంట్‌.. జమిలి ఎన్నికల ప్రతిపాదనను ఆహ్వానించామన్నారు. రాష్ట్రాలు బలోపేతం అయితేనే దేశం బలపడుతుందనే విషయాన్ని ప్రధాని మోదీ, కేబినెట్‌ మంత్రుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. జమిలి ఎన్నికల నిర్వహణలో సాధక బాధకాలు ఏమున్నా.. టిఆర్‌ఎస్‌ తరఫున దాన్ని ఆహ్వానిస్తున్నట్లు కేటీఆర్‌ చెప్పారు. పరిమిత కాల వ్యవధిలో దీన్ని పూర్తి చేయాలని సూచించామన్నారు. ఒకేసారి ఎన్నికలతో ప్రజలు కూడా ప్రభుత్వ ఫలాలను అనుభవించే వీలుంటుందని కేటీఆర్‌ చెప్పారు.
* కర్ణాటక రాష్ట్రంపై సంచలన నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ
కర్ణాటకలో ఇటీవల లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఘోర వైఫల్యం, పార్టీలో పెరుగుతున్న అసంతృప్తులతో అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏఐసీసీ రద్దు చేసింది.గత కొంతకాలంగా రాష్ట్ర నాయకుల తీరుపై ఆగ్రహంతో ఉన్న కాంగ్రెస్‌ అధిష్ఠానం.. పార్టీలో శస్త్రచికిత్స ప్రారంభించింది. పీసీసీ కమిటీలన్నింటినీ రద్దు చేయాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కేసీ వేణుగోపాల్‌ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు సహా మొత్తం 170 మందికిపైగా ఉన్న కార్యవర్గం రద్దయింది. కేపీసీసీ అధ్యక్షుడు దినేశ్‌ గుండూరావు, కార్యాధ్యక్షుడు ఈశ్వర్‌ ఖండ్రే పదవులు మాత్రం యథాతథంగా ఉంటాయి.
* వరంగల్ ను దేశంలోనే ఆదర్శంగా నిలుపుతాం: ఎర్రబెల్లి
వరంగల్ ను టూరిస్ట్ హబ్ గా తీర్చిదిద్ది, దేశంలోనే ఆదర్శంగా నిలిచేలా చేస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఈ రోజు వరంగల్ జిల్లాలో పర్యటన సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఎర్రబెల్లి.. వరంగల్ లో ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్డులు ఏర్పాటు చేసి నగరాన్ని తీర్చిదిద్దుతామన్నారు. వేయి స్తంబాల దేవాలయానికి పూర్వ వైభవం తీసుకు వస్తామన్నారు. భద్రకాళి ట్యాంక్ బండ్ ను సుందరంగా చేస్తామన్నారు.
* తెదేపాను వీడిన నలుగురు ఎంపీలు
తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తెదేపా నుంచి వీడిపోతున్నట్లు రాజ్యసభ చైర్మన్ కు తెలిపిన నలుగురు ఎంపీలు ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడుకు నలుగురు ఎంపీలు లేఖ తమను ఒక గ్రూప్‌గా పరిగణించాలని లేఖలో పేర్కొన్నారు ఎంపీలు ప్రస్తుతం తెదేపాకు ఎంపీలుగా సీఎం రమేశ్, గరికపాటి మోహనరావు, సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్
* రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసు జారీ
రాష్ట్రంలో కాంగ్రెస్ కు భవిష్యత్ లేదని, టీఆర్ ఎస్ కు బీజేపీయే ప్రత్యామ్నాయమని వ్యాఖ్యలు చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పీసీసీ క్రమశిక్షణా సంఘం షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీనిపై 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పార్టీ అధిష్టానం నిర్ణయాలను తప్పుపడుతూ ఐదు రోజుల కింద రాజగోపాల్రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలోనూ, బయటా తీవ్రంగా చర్చనీయాంశమయ్యాయి. దీనిపై పీసీసీ క్రమశిక్షణ కమిటీ మూడు రోజుల కింద భేటీ అయి.. రాజగోపాల్రెడ్డి వ్యాఖ్యలపై చర్చించి, అది క్రమశిక్షణ ఉల్లంఘనేని అభిప్రాయానికి వచ్చింది.
*కోమటిరెడ్డి పార్టీ మారడం లేదు – ఉత్తమ
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎ కారణాలతో పార్టీ వీడుతున్నారో తనకు చెప్పారన్నారు. పీసీసీ చీఫ్ ఉత్తమ కుమార్ రెడ్డి. ఏ ఐ సీసీ సమావేశం నిమిత్తం గురువారం డిల్లి వెళ్ళిన ఉత్తమ.. మీడియాతో మాట్లాడారు. రాజకీయ కారణాలతో పార్టీ మారే వారికి ఏదైనా చెప్పోచ్చాన్నారు. కానీ ఆర్ధికపరమైన కారణాలతో వెళ్ళే వారికి ఏం చెప్పగలమని ఆయన ప్రశ్నించారు. రాజగోపాల్ రెడ్డి ఎ కారణాలతో పార్టీ వీడుతున్నారో తనకు చెప్పారని తెలిపారు. వెళ్లాలని నిర్ణయించున్నారు. కవతితి ఇప్పుడు ఏదైనా చెబుతారన్నారు. సమావేశం అనంతరం అన్ని విషయాలు వెల్లడిస్తానని అన్నారు ఉత్తమ్.
*ఏం త్యాగం చేశారని ఆయనను ఆహ్వానించారు- భట్టి
కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర, దేశ ప్రజలను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. గురువారం డిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రాజెక్టు డీపీఆర్ కు ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరితే ఇంతవరకు బయట పెట్టలేదన్నారు. ప్రాజెక్టు సమగ్ర సమాచారం వెబ్ సైట్ లో పెట్టాలని ఆయన డిమాండ్ చేహ్సారు. కలేస్వరంలో జరిగిన అవినీతిని ఆధారాలతో సహా బయట పెట్టామన్నారు. పదిహేను శాతం నిర్మాణానికి రో. యాభై వేల కోట్లు ఖర్చయితే మొత్తం ప్రాజెక్టు పూర్తీ కావడానికి ఎన్ని లక్షల కోట్లు కావాలని భట్టి ప్రశ్నించారు.
* బీజేపీ ఎంపీ సన్నీ డియోల్ కు చిక్కులు
బీజేపీ ఎంపీ సన్నీ డియోల్ చిక్కుల్లో పడ్డారు. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో గురుదాస్ పూర్ నుంచి డియోల్ ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే, ప్రచార ఖర్చులపై ఎలక్షన్ కమిషన్ విధించిన రూ.70 లక్షల పరిమితిని మించి డియోల్ ఖర్చు చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రచారం కోసం ఆయన రూ.86 లక్షలు ఖర్చు పెట్టారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. దీనిపై ఈసీ బుధవారం ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ప్రచార వ్యయం పరిమితిని దాటిన నేతలపట్ల ఈసీ కఠినంగా వ్యవహరిస్తోంది. ఎన్నికైన అభ్యర్థి ప్రచార వ్యయం లిమిట్దాటిందని తేలితే.. సదరు అభ్యర్థిని అనర్హుడిగా, సమీప అభ్యర్థిని విజేతగా ప్రకటించే అధికారం ఈసీకి ఉంది. పంజాబ్లోని గురుదాస్పూర్ లోక్సభ స్థానానికి చివరి క్షణంలో సన్నీడియోల్ టికెట్ దక్కించుకున్నారు. కాంగ్రెస్‌ పంజాబ్ చీఫ్‌ జక్కర్‌పై 80 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు.
* నలుగురు కొత్త ఎమ్మెల్సీల ప్రమాణం
ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తామని, తమ తమ జిల్లాలతో పాటు రాష్ట్ర అభివృద్ధికి కృషిచేస్తామని నలుగురు కొత్త శాసనమండలి సభ్యులు పేర్కొన్నారు. పట్నం మహేందర్రెడ్డి(రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం), పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి(వరంగల్ జిల్లా స్థానిక సంస్థలు), కుర్మయ్యగారి నవీన్కుమార్ (శాసనసభ్యుల కోటా), తేరా చిన్నపరెడ్డి (నల్గొండ స్థానిక సంస్థల నియోజకవర్గం) బుధవారం ఉదయం శాసనమండలిలోని డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్ సమక్షంలో ఆయన కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు.
* భాజపాలో కీలక పదవి రానుంది
నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కాంగ్రెస్ను వీడి భాజపాలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. బుధవారం రాత్రి హైదరాబాదులోని తన నివాసంలో మునుగోడుకు చెందిన ముఖ్య నాయకులతో ఆయన భేటీ అయ్యారు. తాను ఎమ్మెల్యేగానే కొనసాగుతానని.. భాజపాలో కీలక పదవి వస్తుందని వారికి భరోసా ఇచ్చారు. మండలానికి అయిదారుగురు ముఖ్య నాయకులను పిలిపించుకొని మాట్లాడిన ఆయన కాంగ్రెస్ను వీడటంపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. పార్టీ మార్పిడిపై బహిరంగ ప్రకటన చేయాలనే నిర్ణయానికి వచ్చారు. అంబర్పేటలోని తన క్యాంపు కార్యాలయంలో మండల స్థాయి నాయకులతో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
* కాంగ్రెస్, భాజపాలది దుర్బుద్ధి
కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు ద్రోహచింతనతో తెలంగాణకు అన్యాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని తెరాస ఎమ్మెల్యే బాల్కసుమన్, ఎమ్మెల్సీ వీజీగౌడ్లు ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆ పార్టీల నేతలు అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నారన్నారు. తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో బుధవారం వారు విలేకరులతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, భాజపా నేత లక్ష్మణ్ సీఎం కేసీఆర్పై ఇష్టారీతిన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని స్వాగతించాల్సిందిపోయి విమర్శలు చేయడం వారి దుర్బుద్ధికి నిదర్శనం.
* మోదీ, కిషన్రెడ్డిలకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డిలపై ముఖ్యమంత్రి కేసీఆర్ అహంకారపూరిత మాటలు మానుకొని.. వారికి వెంటనే క్షమాపణలు చెప్పాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. దిల్లీలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రానికి కేటాయించిన నిధులపై లోక్సభ ఎన్నికలకు ముందు తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పూర్తి వివరాలు వెల్లడించినా నాడు ఒక్క ముక్క మాట్లాడని కేసీఆర్ ఇప్పుడు ఇష్టారీతిగా మాట్లాడడం తగదన్నారు.
* నాలుగు సీట్లకే ఇంత అసహనమా?
తెలంగాణలో భాజపా నాలుగు ఎంపీ సీట్లు గెలవడంతో ముఖ్యమంత్రి కేసీఆర్కు భయం పట్టుకుని అసహనానికి గురవుతున్నారని.. రాష్ట్రానికి కేంద్ర సాయంపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. కేంద్రంలో, మహారాష్ట్రలో భాజపా ప్రభుత్వాలు సహకరించకపోయి ఉంటే కాళేశ్వరం పూర్తయ్యేదా? అని ఆయన ప్రశ్నించారు.
* కాళేశ్వరం ప్రారంభోత్సవాన్ని స్వాగతిస్తున్నా
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని స్వాగతిస్తున్నానని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు జగన్మోహన్రెడ్డి, ఫడణవీస్లు వస్తే తప్పేంటని ప్రశ్నించారు. బుధవారం హైదరాబాద్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏ ముఖ్యమంత్రి ప్రాజెక్టులు నిర్మించినా ప్రజల కోసం, రైతుల కోసమేనని.. వ్యతిరేకించాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చినందుకే కేసీఆర్ సీఎం అయ్యారని, అందువల్ల కాళేశ్వరం ప్రాజెక్టులోనూ తమ పార్టీ భాగస్వామ్యం ఉన్నట్లేనని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
* కాంగ్రెస్ నేతలు తెలంగాణ ద్రోహులు: ఎర్రబెల్లి
కాంగ్రెస్ నేతలు తెలంగాణ ద్రోహులుగా మారారని, రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను, తెరాస ప్రభుత్వానికి ప్రజాదరణను చూసి ఓర్వలేకపోతున్నారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ ప్రజలు సంబురాల్లో ఉండగా భట్టి విక్రమార్క, ఇతర నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
* సభ్యులందరినీ సమానంగా చూడండి: నామా
చిన్న.. పెద్ద పార్టీ తేడా లేకుండా సభ్యులందరినీ సమానంగా చూడాలని లోక్సభ సభాపతి ఓం బిర్లాను తెరాస లోక్సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు కోరారు. బుధవారం లోక్సభ సభాపతిగా ఎన్నికైన ఓం బిర్లాకు అభినందనలు తెలిపే చర్చలో ఆయన ప్రసంగించారు. ‘‘సభాపతిగా ఎన్నికైన మీకు తెరాస సభ్యుల తరఫున, తెరాస అధ్యక్షుని తరఫున అభినందనలు. ప్రధానమంత్రి మీ గురించి చెప్పారు. మీరు సామాన్య ప్రజల నేత.. సామాజిక సేవకులు.. రైతు బిడ్డ అని తెలుసుకొని సంతోషిస్తున్నాం.
* వై.ఎస్.విగ్రహాన్ని కూల్చుతాననలేదు: వీహెచ్
పంజాగుట్ట సెంటర్లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్రెడ్డి విగ్రహాన్ని కూల్చుతానని తాను అనలేదని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు వివరణ ఇచ్చారు. రాజశేఖర్రెడ్డి విగ్రహం ఉన్నప్పుడు..అంబేడ్కర్ విగ్రహం ఎందుకు ఉండకూడదు అని మాత్రమే తాను ప్రశ్నించానని స్పష్టం చేశారు. వై.ఎస్.ను పీసీసీ అధ్యక్షుడు చేసింది తానేనన్నారు. పీసీసీ అధ్యక్షుడు అయినందుకే రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారని పేర్కొన్నారు.
* రుణమాఫీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి: జీవన్రెడ్డి
ప్రభుత్వం రుణమాఫీపై స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్రెడ్డి కోరారు. లక్ష రూపాయలలోపు రుణాలపై 4 శాతం రాష్ట్ర ప్రభుత్వం, 3 శాతం కేంద్ర ప్రభుత్వం బ్యాంకులకు వడ్డీని చెల్లిస్తున్నాయని.. అయితే తెరాస రెండోసారి అధికారంలోకి వచ్చి ఆరు నెలలవుతున్నా ఇంత వరకు దీనిపైనా స్పష్టత ఇవ్వలేదన్నారు.
* ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి: దాసోజు
తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల అపరిష్కృత సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొత్త పీఆర్సీ, ఐఆర్, ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు తదితర సమస్యలపై ఆయన బుధవారం సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు. ఉద్యోగుల సమస్యలపై మంత్రిమండలి సమావేశంలో చర్చించకపోవడం దారుణమన్నారు. ఉద్యోగుల సమస్యలు, సర్వీస్ రూల్స్ వివాదాలను పరిష్కరించేందుకు అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ను తిరిగి ఏర్పాటు చేయాలన్నారు.
* 10 నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు!
శాసనసభ బడ్జెట్ సమావేశాలు జులై 10 నుంచి ప్రారంభమయ్యే అవకాశముంది. సుమారు 25 పనిదినాల పాటు సమావేశాలు నిర్వహించాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది. ఎన్నికల నేపథ్యంలో గత ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. నూతన ప్రభుత్వం 2019-20 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్ను జులై 12న ప్రవేశపెట్టే అవకాశముంది. శని, ఆదివారాల్లోను, ఇతర సెలవు దినాల్లోను సమావేశాలకు విరామం ఉంటుంది.
* అరాచకాలకు అడ్డాగా వైకాపా
వైకాపా అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నాయకుల అరాచకాలు పెచ్చుమీరాయని, ప్రజలందరికీ ఉపయోగపడే సామాజిక ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారని తెదేపా నేత, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ ధ్వజమెత్తారు. సిమెంట్ రోడ్లు, అంగన్వాడీ భవనాలు, అన్న క్యాంటీన్లను ధ్వంసం చేస్తూ, తెదేపా కార్యకర్తలపై దాడులు చేస్తూ… అక్రమాలకు, అరాచకాలకు అడ్డా తమ పార్టీ అని రుజువు చేసుకుంటున్నారని ఆయన బుధవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. నరసరావుపేటలో శ్రీ కార్తీక వైద్యశాలపై వైకాపా నాయకులు దాడిచేసి, వైద్య దంపతులపై దౌర్జన్యం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
* పోలవరం ప్రాజెక్టును సందర్శించిన జగన్‌
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా జగన్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. అమరావతి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో పోలవరం చేరుకున్న సీఎం .. మూడు సార్లు విహంగ వీక్షణం ద్వారా ప్రాజెక్టు ప్రాంతాన్ని, ఎగువ, దిగువ కాఫర్‌డ్యామ్‌ నిర్మాణాలను పరిశీలించారు. హెలికాప్టర్‌ దిగిన తర్వాత జగన్‌కు ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం వ్యూ పాయింట్‌కు చేరుకుని ప్రాజెక్టును పరిశీలించారు. అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.