WorldWonders

అమెరికాలో నిజాం నగల వేలం-భారీగా పలికిన ధర

Nizam and Indian kings jewellery auctioned in India-Receives highest price

భారతదేశాన్ని పాలించిన పలువురు మహారాజులు, మొఘల్ పాలకులు వినియోగించిన నగలను అమెరికాకు చెందిన క్రిస్టీ సంస్థ వేలం వేసింది. ఇందులో హైదరాబాద్‌ను పాలించిన నిజాం నవాబులు ధరించిన ఆభరణాలు కూడా ఉన్నాయి. వేలంలో ఈ నగలు ఊహించిన దాని కంటే ఎక్కువ ధర పలికినట్లు క్రిస్టీ సంస్థ వెల్లడించింది. నిజాం నవాబులకు చెందిన రివిరీ డైమండ్‌ నక్లెస్‌ వేలంలో 24,15,000 డాలర్లు పలికింది. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 17కోట్లు. 33 వజ్రాలు కలిగిన ఈ నగ 15,00,000 డాలర్లు(రూ. 10.5కోట్లు) పలుకుతుందని నిర్వాహకులు అంచనా వేశారు. ఇక ఆర్కట్‌ నవాబులకు చెందిన 17 క్యారెట్ల గోల్కొండ వజ్రం ‘ఆర్కట్‌ 2’ రికార్డు స్థాయిలో 33,75,000 డాలర్లు(రూ. 23.5కోట్లు) పలికింది. నిజాం కాలం నాటి కత్తి 19,35,000 డాలర్లు(రూ. 13కోట్లు)పలికింది. జైపూర్‌ రాజమాత ధరించిన వజ్రపు ఉంగరం రూ. 4.45కోట్లు పలికింది. సహజ ముత్యాలతో తయారుచేసిన ఐదువరుస నక్లెస్‌ రూ. 11.8కోట్లు పలికింది. ‘మహారాజాస్‌ అండ్‌ మొఘల్‌ మాగ్నిఫికెన్స్‌’ పేరుతో దాదాపు 400 నగలను క్రిస్టీ సంస్థ వేలానికి పెట్టింది. వజ్రాల ఆభరణాలు, ముత్యాల నక్లెస్‌లు, కత్తులు, ఉంగరాలు తదితర వస్తువులను వేలం వేసింది. వేలంలో ఈ వస్తువులకు మొత్తంగా 10,92,71,875 డాలర్లు వచ్చినట్లు సంస్థ వెల్లడించింది. భారత సంస్కృతికి చెందిన ఆభరణాలు, వస్తువులు ఇంత ఎక్కువ ధర పలకడం ఇదే తొలిసారి అని పేర్కొంది.