DailyDose

బాబుపై వర్మ సెటైర్లు-రాజకీయ-06/21

Ram Gopal Varma Makes Comedy On Chandrababu-June 21 2019-Daily Politics News

* తెలుగు దేశం పార్టీ ఎంపీలు బీజేపీలో చేరడం, తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై ట్వీట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. ఏపీ అసెంబ్లీలో బాబు గారు బ్రహ్మానందం అయిపోయారంటూ సెటైర్లు వేశారు.ఎన్టీఆర్ విదేశాల్లో వున్నప్పుడు నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు పొడిస్తే.. ఇప్పుడు చంద్రబాబు విదేశాల్లో ఉండగా టీడీపీ నేతలు ఆయనకు వెన్నుపోటు పొడిచారని వర్మ ఎద్దేవా చేశారు.దీనిని బట్టి చరిత్ర ఎప్పుడూ పునరావృతం అవుతుందని వ్యాఖ్యానించారు. ఏపీ అసెంబ్లీలో బాబు మాట్లాడినప్పుడల్లా జగన్ నవ్వు ఆపుకోలేకపోతున్నారు. దీని అర్ధం చంద్రబాబు.. అసెంబ్లీలో బ్రహ్మానందంగా మారిపోయారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
* రాజకీయాల్లో నిలకడ ఉండాలి: ఆశోక్ గజపతి రాజు
రాజకీయాల్లో నిలకడ ఉండాలని మాజీ కేంద్ర మంత్రి ఆశోక్ గజపతి రాజు అభిప్రాయపడ్డారు. టీడీపీకి చెందిన నలుగురు ఎంపీలు బీజేపీలో చేరడంపై ఆయన శెర్రవారం నాడు స్పందించారు. టీడీపీకి కార్యకర్తల బలం ఉందని ఆశోక్ గజపతి రాజు చెప్పారు. కార్యకర్తల నుండి నాయకులు తయారు కావాల్సిన అవసరం ఉందన్నారు. కొత్త నాయకత్వం రావాల్సి ఉందని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏపీలో జగన్ నెల రోజుల పాలనపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని ఆశోక్ గజపతి రాజు చెప్పారు.విజయనగరం ఎంపీ స్థానం నుండి రెండో దఫా పోటీ చేసి ఆశోక్ గజపతి రాజు ఓటమి పాలయ్యాడు. ఆశోక్ గజపతి రాజు కూతురు అదితి గజపతి రాజు విజయనగరం అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
* చంద్రబాబు మీద వ్యతిరేకత నా కొంప ముంచింది- నాగబాబు
2019 ఎన్నికలలో జనసేన పార్టీ కేవలం ఒకే సీటు సాధించింది. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయాడు. మిగతా పార్టీలతో పోలిస్తే డబ్బు , మద్యం తో కూడిన రాజకీయాలు చేయకపోవడం, రాజకీయ పలుకుబడి లేని సామాన్యులకు టికెట్లు ఇవ్వడం వంటి ప్రయోగాలు ఫలితాలను ఇవ్వక పోవడంతోనే జనసేన కేవలం ఒక సీటు తోనే సరిపెట్టుకోవలసి వచ్చింది అని జనసేన అభిమానులు చెబుతూ వస్తున్నారు. అయితే జనసేన ఫలితాలపై స్పందించారు మెగా బ్రదర్ నాగబాబు. నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేసిన నాగబాబు కూడా వైఎస్ఆర్సిపి అభ్యర్థి రఘురామ కృష్ణం రాజు చేతిలో ఓడిపోయారు. అయితే నాగబాబు జనసేన ఎన్నికల్లో విఫలం కావడాన్ని విశ్లేషించారు. తమ పార్టీ నిజాయితీతో కూడిన రాజకీయాలు చేసినప్పటికీ, ఆ కారణం చేత ప్రజల్లో తమ పార్టీ మీద మంచి అభిప్రాయమే ఉన్నప్పటికీ, చంద్రబాబు మీద వ్యతిరేకత తమ పార్టీని దెబ్బ తీసిందని నాగ బాబు వ్యాఖ్యానించారు. తమ పార్టీకి చెప్పుకోదగిన సీట్లు వస్తే తాము చంద్రబాబుకు మద్దతు ఇచ్చి ఆయనని మళ్లీ ముఖ్యమంత్రి చేస్తామని ప్రజలు భావించారని నాగ బాబు వ్యాఖ్యానించారు. ఐదేళ్ల చంద్రబాబు పాలన మీద ఎంతగానో విసిగి పోయిన ప్రజలు, చంద్రబాబు కి ఓటు వేయకూడదని నిర్ణయించుకోవడమే కాకుండా జనసేనకు ఓటు వేస్తే ఎక్కడ పొరపాటున చంద్రబాబుకు లాభం చేకూరుతుందో అన్న భయంతో జనసేనకి ఓటు వెయ్యలేదని చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా తాము తెలుగుదేశం పార్టీకి అనుబంధ పార్టీ అన్న విమర్శలను తిప్పి కొట్టాలేకపోవడం జనసేన కు నష్టం చేసింది అని అర్థం అవుతోంది. అయితే పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వెళ్ళడు అని రాజకీయాలలోనే కొనసాగుతాడని నాగబాబు వ్యాఖ్యానించారు. అలాగే ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగి ఉండవచ్చు అనే అభిప్రాయాలు కొంత మంది ప్రజలలో ఉన్నప్పటికీ, తాను దానిపై ఇప్పుడే వ్యాఖ్యానించలేను అని చెప్పారు. మరో వైపు చంద్రబాబు కూడా ఆ మధ్య , జనసేన పార్టీ వల్లే తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగిందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
*తీపా నేర్పిన విద్యే
కర్నూల్ పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కామెంట్స్ పార్టీ మరే వారు రాజీనామా చేసి వెళ్ళాలి టీడీపీ నేర్పించిన విద్యనే ఆ పార్టీ నాయకులు ఇవాళ అనుసరిస్తున్నారు వైస్సార్సీపీ ఎమ్మెల్యేలను, ఎంపీలను పశువుల్లా చంద్రబాబు కొన్నారు రాజ్యసభ సభ్యులు స్వచ్చందగా బీజేపీలో చేరుతున్నారు.
*రాజ్యసభలో తీదేపాకు ఇద్దరే
టీడీపీ రాజ్యసభా పక్షం బీజేపీలో విలీనానికి ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు ఆమోద ముద్ర వేశారు. దీంతో రాజ్యసభ వెబ్‌సైట్‌లో బీజేపీ సభ్యుల జాబితాలో టీడీపీ ఎంపీల పేర్లు అధికారికంగా నమోదు అయ్యాయి. దీంతో టీడీపీ రాజ్యసభ సభ్యులుగా తోట సీతా రామలక్ష్మి, కనకమేడల రవీంద్రకుమార్‌ పేర్లను మాత్రమే చూపుతోంది. మరోవైపు విలీనం చెల్లదంటూ టీడీపీ నేతలు ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నారు. కాగా టీడీపీ రాజ్యసభా పక్షాన్ని విలీనం చేస్తూ తీర్మానించిన లేఖను ఆ పార్టీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్‌, టీజీ వెంకటేశ్‌ నిన్న వెంకయ్య నాయుడు నివాసానికి వెళ్లి అందచేసిన విషయం తెలిసిందే.
* గరికపాటితో తెలంగాణ బీజేపీ నేతల భేటీ………
తెలుగుదేశం పార్టీని వీడి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్ రావుతో తెలంగాణ బీజేపీ నేతలు భేటీ అయ్యారు. శుక్రవారం గరికపాటితో వీరు సమావేశమయ్యారు. దేశరాజధాని ఢిల్లీలోని గరికపాటి నివాసానికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజాసింగ్, ఎమ్మెల్సీ రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యేలు ఇంద్రసేనా రెడ్డి, చింతల రామ చంద్రారెడ్డి తదితర నాయకులు వెళ్లారు.
గురువారం రాజ్యసభ ఛైర్మన్ ఛాంబర్ కి వెళ్తూ.. గరికపాటి అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. బీపీ సడెన్ గా పడిపోవడంతో.. ఆయన ఒక్కసారిగా కుప్పకూలారు. పక్కనే ఉన్న సీఎం రమేష్, టీజీ వెంకటేష్ లు ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.చికిత్స అనంతరం ఆయన ఇంటికి చేరారు.ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ నేతలు గరికపాటి ఇంటికి వెళ్లి మరీ పరామర్శించారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిస్థితులపైనా చర్చించినట్లు సమాచారం.
* ఇక సచివాలయమంతా తెలంగాణదే
సచివాలయంలోని భవనాలన్నీ తెలంగాణ ప్రభుత్వ అధీనంలోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌ అధీనంలో ఉన్న భవనాలను తెలంగాణకు అప్పగించే ప్రక్రియ పూర్తయింది. బుధవారం కే, హెచ్‌-నార్త్‌ బ్లాకులను, గురువారం జే, ఎల్‌ బ్లాకులను అప్పగించారు. ఈ మేరకు ఏపీ సాధారణ పరిపాలనా శాఖ (ఎస్‌ఆర్‌) అసిస్టెంట్‌ సెక్రటరీ డి.రవిబాబు, తెలంగాణ సాధారణ పరిపాలనా శాఖ డిప్యూటీ సెక్రటరీ చిట్టిరాణి ఈ రెండు బ్లాకుల అప్పగింత పత్రాలు మార్చుకున్నారు. ఏపీ ఆధీనంలో ఉన్న శాసనసభ భవనాల అప్పగింత ప్రక్రియను కూడా గురువారం ప్రారంభించారు. ఏపీ శాసనసభ ఇన్‌చార్జి కార్యదర్శి విజయరాజ్‌ బృందం హైదరాబాద్‌ వచ్చి తెలంగాణ శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులుతో భేటీ అయింది. ఏపీ అధీనంలో ఉన్న సగం చాంబర్లతో పాటు మూడు కమిటీ హాళ్లను తెలంగాణకు అప్పగించారు. ఈ మేరకు పత్రాలపై ఇరు రాష్ట్రాల అధికారులు సంతకాలు చేశారు. అసెంబ్లీ ప్రధాన భవనంతో పాటు శాసనమండలి ఇతర భవనాల అప్పగింత ప్రక్రియ శుక్ర, శనివారాల్లో పూర్తి చేస్తామని నర్సింహాచార్యులు చెప్పారు.
*మోడీతో ఫిరాయింపు ఎంపీల భేటి.
టీడీపీని వీడి బీజేపీలో చేరిన నలుగురు ఎంపీలు శుక్రవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు.రాజ్యసభలో టీడీపీపీని బీజేపీలో విలీనం చేయాలని కోరుతూ రాజ్యసభ చైర్మెన్ వెంకయ్యనాయుడుకు ఈ నలుగురు ఎంపీలు గురువారం సాయంత్రం లేఖ ఇచ్చారు.అనంతరం ఈ నలుగురు ఎంపీలు బీజేపీలో చేరారు.బీజేపీలో చేరిన నలుగురు ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావులు శుక్రవారం నాడు ప్రధానమంత్రి మోడీతో భేటీ అయ్యారు.గత టర్మ్‌లో టీడీపీ, బీజేపీలు మిత్రపక్షాలుగా ఉన్నాయి. ఈ సమయంలో మోడీ కేబినెట్‌లో సుజనా చౌదరి మంత్రిగా కొనసాగారు. మోడీ కేబినెట్ నుండి టీడీపీ వైదొలిగింది. ఈ సమయంలో కేబినెట్ నుండి వైదొలగడాన్ని సుజనా చౌదరి వ్యతిరేకించారు. మంత్రివర్గం నుండి వైదొలిగినా…. కనీసం ఎన్డీఏలో కొనసాగాలని సుజనా చౌదరి చంద్రబాబుకు సూచించారు. కానీ,టీడీపీ ఎన్డీఏ నుండి కూడ బయటకు వచ్చింది.ఈ ఏడాది ఏప్రిల్ 11వ తేదీన ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. టీడీపీ 23 స్థానాలకే పరిమితమైంది. 3 ఎంపీ స్థానాలను మాత్రమే ఆ పార్టీకి దక్కాయి. వైసీపీ 151 ఎమ్మెల్యేలు, 22 ఎంపీ స్థానాలను కైవసం చేసుకొంది. ఎన్నికల ఫలితాలతో టీడీపీ ఎంపీలు నిరాశకు లోనయ్యారు. సుజనా చౌదరి నేతృత్వంలో నలుగురు ఎంపీలు బీజేపీలో చేరారు.
*పవన్ పై ఆకుల షాకింగ్ కామెంట్స్
సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఆ పార్టీ నేత ఆకుల సత్యానారయణ షాకింగ్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ వచ్చే ఐదేళ్లలో రాజకీయాల్లో ఉంటారో లేదో చెప్పడం కష్టమని ఆయన అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలుపొందారు. కనీసం పార్టీ అధినేత పవన్ కూడా గెలుపొందలేదు. దీంతో.. చాలా మంది నేతలు అధికార పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.ఈ క్రమంలో జనసేన పార్టీ నేత ఆకుల సత్యనారాయణ చేసిన కామెంట్స్ షాకింగ్ కి గురి చేశాయి. కులసమీకరణాలతో రాజకీయం చేస్తే భంగపాటు తప్పదని ఆయన అభిప్రాయపడ్డారు. పవన్ ని ఉద్దేశించే ఆయన ఆ కామెంట్స్ చేయడం గమనార్హం. వచ్చే ఐదేళ్లలో పవన్‌ ప్రజల్లో ఉంటారో లేదో కాలమే నిర్ణయిస్తుందన్నారు. పవన్‌కళ్యాణ్ ఆలోచనలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమైనట్లు తెలిపారు. అయితే.. తాను మాత్రం పార్టీ మారడం లేదని.. జనసేనలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.
*చంద్రబాబుకు మరో ముప్పు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడిని తిరుగులేని దెబ్బ తీయాలనే వ్యూహరచనలో బిజెపి ఉంది. తన వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి పూనుకుంది.వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష శాసనసభ్యులకు తలుపులు మూసేడయంతో బిజెపికి చక్కని అవకాశం లభించినట్లయింది. శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే తప్ప తమ పార్టీలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోబోమని జగన్ ప్రకటించారు. దీన్ని బిజెపి తనకు అనుకూలంగా మలుచుకుంటోంది.ప్రస్తుతం శాసనసభలో టీడీపికి చంద్రబాబుతో కలిపి 23 మంది శాసనసభ్యులున్నారు. ప్రతిపక్ష హోదాకు సభలోని పది శాతం సభ్యుల బలం అవసరం. అలా చూసినప్పుడు ప్రతిపక్ష హోదా గల్లంతు కాకూడదంటే టీడీపికి 18 శాసనసభ్యుల బలం ఉంటే సరిపోతుంది. ఆరుగురు శాసనసభ్యులు టీడీపిని వీడినా ఆ పార్టీ ప్రతిపక్ష హోదాకు వచ్చే నష్టమేమీ లేదు. కానీ బిజెపి 16 మంది ఎమ్మెల్యేలను తమ వైపు లాగే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. రాజ్యసభలోని నలుగురు టీడీపి సభ్యులను తమ వైపు లాగినట్లుగానే ఎపి శాసనసభలోని 16 మంది సభ్యులను తమ వైపు తిప్పుకోవడానికి బిజెపి ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. రాజ్యసభ సభ్యులు అడిగినట్లుగానే వీరు కూడా తమను ప్రత్యేకంగా గుర్తించాలని స్పీకర్ ను కోరే అవకాశం ఉంది. దానివల్ల ఫిరాయింపుల చట్టం నుంచి వారు తప్పించుకోవడానికి వీలవుతుందని అంటున్నారు.ఫిరాయింపులను నిరోధించే విషయంలో ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా కచ్చితంగా ఉన్నారు. పార్టీ ఫిరాయిస్తే వేటు వేస్తామని స్పీకర్ తమ్మినేని సీతారాం సభలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో కొద్ది శాసనసభ్యులు బిజెపిలో చేరితే ఎపిలో సమస్య తలెత్తవచ్చునని బిజెపి భావిస్తోంది. అదే సమయంలో జగన్ ను ఇప్పటికిప్పుడు ఇబ్బంది పెట్టే కార్యాచరణకు కూడా దిగకూడదని బిజెపి అనుకుంటోంది. అందువల్ల జగన్ కు చిక్కులు ఎదురు కాకుండా టీడీపీ ఎమ్మెల్యేలను గంపగుత్తగా తమ వైపు లాక్కునేందుకు ఆవసరమైన కార్యాచరణను బిజెపి నేతలు చేపట్టినట్లు తెలుస్తోంది.పలువురు శాసనసభ్యులు తమవైపు రావడానికి సిద్ధంగా ఉన్నారని బిజెపి ఆంధ్రప్రదేశ్ నేత విష్ణువర్దన్ రెడ్డి అన్నారు. అయితే, ఎంత మంది వస్తారనేది ఇప్పుడు చెప్పలేమని, చాలా మంది తమతో సంప్రదింపులు జరుపుతున్నారని అన్నారు. ఏమైనా, చంద్రబాబును దెబ్బ తీసి, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలనే వ్యూహాన్ని రచించి వేగంగా అమలు చేసే పనిలో బిజెపి ఉన్నట్లు అర్థమవుతోంది.
* తెదేపాకు కలిసిరాని రాజ్యసభ!
తెలుగుదేశం పార్టీకి రాజ్యసభ కలిసి రావడం లేదు. ఇప్పటివరకూ ఆ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యులుగా పని చేసిన వారిలో ఒక్క కంభంపాటి రామ్మోహనరావు, రావుల చంద్రశేఖర్రెడ్డి తప్ప ఎవరూ పార్టీలో మిగల్లేదు. అలాగే తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేతలుగా చేసిన వారంతా ఆ పార్టీని వదిలిపెట్టిపోయారు. సుజనా చౌదరి పార్టీ మార్పుతో ఆ సంప్రదాయం మరోసారి కొనసాగింది. తెదేపా తరఫున రాజ్యసభ సభ్యులుగా పని చేసిన పి.ఉపేంద్ర, జయప్రద, వంగా గీత, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, యలమంచిలి శివాజీ, మోహన్బాబు, తులసిరెడ్డి, మైసూరారెడ్డి, రామమునిరెడ్డి, సి.రామచంద్రయ్య, రేణుకా చౌదరి పార్టీని విడిచిపెట్టిపోయారు. తాజాగా సుజనా చౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహన్రావు అదే దారిలో నడిచారు. తెదేపా పార్లమెంటరీ పార్టీ నేతలుగా పని చేసిన పి.ఉపేంద్ర, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, రేణుకా చౌదరి, మందా జగన్నాథం, నామా నాగేశ్వరరావులు కూడా వేరే పార్టీల్లోకి వెళ్లిపోయారు. కె.ఎర్రన్నాయుడు చనిపోయారు. తాజాగా సుజనా చౌదరి పార్టీ మారారు. ప్రస్తుతం కనకమేడల రవీంద్ర కుమార్, తోట సీతారామలక్ష్మి మాత్రమే తెదేపా సభ్యులుగా మిగిలారు.
* కళ్లతో కాకుండా మనసుతో చూడాలి: మంత్రి జగదీశ్‌రెడ్డి
ముఖ్యమంత్రి కేసీఆర్‌ మదిలో పుట్టిన అద్భుత ఆవిష్కరణ కాళేశ్వరం ప్రాజెక్టనని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ తెలంగాణ బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్ నిరంతరం శ్రమించారని కొనియాడారు. ప్రతిపక్షాల విమర్శలకు సమాధానమే కాళేశ్వరం ప్రాజెక్టు అని అన్నారు. ప్రధాన ప్రతిపక్షం అర్ధంలేని విమర్శలు చేస్తోందని కాంగ్రెస్‌ను ఉద్దేశించి అన్నారు. కళ్లతో కాకుండా మనసుతో చూస్తే అర్థమయ్యే ప్రాజెక్టు కాళేశ్వరం అని జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
* కేసీఆర్‌ శ్రమతోనే మూడేళ్లలో పూర్తి: హరీశ్‌
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించడం సంతోషంగా ఉందని.. రానున్న రోజుల్లో రెండు పంటలను చూస్తామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్‌ హయాంలో ప్రాజెక్టుల పేర్లు మరిచిపోయామని, ఆ పార్టీ అధికారంలో ఉంటే 30 ఏళ్లు గడిచినా ప్రాజెక్టుల నిర్మాణం పూర్తికాదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ సంబురాల్లో భాగంగా చిన్నకోడూరు మండలం చందలాపూర్‌లోని రంగనాయక సాగర్‌ వద్ద నిర్వహించిన కార్యక్రమానికి హరీశ్‌రావు హాజరై కేక్‌ కట్‌ చేశారు.
* 13 జిల్లాలకు ఇంచార్జి మంత్రులను నియమించిన సీఎం జగన్
శ్రీకాకుళం – వెల్లంపల్లి శ్రీనివాస్, విజయనగరం – చేరుకువాడ శ్రీరంగనాధరాజు, విశాఖపట్నం – మోపిదేవి వెంకటరమణ, తూర్పుగోదావరి – ఆళ్ల నాని, పశ్చిమగోదావరి – పిల్లి సుభాష్ చంద్రబోస్, కృష్ణా – కన్నబాబు, గుంటూరు – పేర్ని నాని,
ప్రకాశం – అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు – సుచరిత, కర్నూలు – బొత్స సత్యనారాయణ, కడప – బుగ్గన రాజేంద్రనాధ్,
అనంతపురం – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , చిత్తూరు – మేకపాటి గౌతమ్ రెడ్డి.
*తెదేపాలో కుదుపు
తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశాల్లో ఉన్న తరుణంలో ఇక్కడ ఆ పార్టీలో గురువారం చోటుచేసుకున్న కొన్ని కీలక పరిణామాలు కుదిపేశాయి. ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు నలుగురు దిల్లీలో భాజపాలో చేరగా.. అదే సమయంలో పార్టీలో తమ ఉనికిని బలోపేతం చేసుకోవడం, తమ సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చేలా అధిష్ఠానంపై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా కాపు సామాజిక వర్గానికి చెందిన ముఖ్య నాయకులు కొందరు కాకినాడలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కాపు నేతల మాదిరిగానే… మరో బలమైన సామాజిక వర్గానికి చెందిన తెదేపా నాయకులు కొందరు నాలుగైదు రోజుల్లో సమావేశం కాబోతున్నారు.
*భాజపాలోకి తెదేపా రాజ్యసభాపక్షం
భాజపాలో తెదేపా రాజ్యసభాపక్షం విలీన ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం ఆరుగురు ఎంపీల్లో నలుగురు భాజపాతీర్థం పుచ్చుకోవడమే కాకుండా తెదేపా పక్షాన్ని విలీనం చేస్తున్నట్లుగా చేసిన తీర్మాన లేఖను రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి గురువారం అందజేశారు. ఆ వెంటనే తెదేపా పక్షాన్ని భాజపాలో విలీనం చేసుకుంటున్నామని పేర్కొంటూ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా రాసిన లేఖను భాజపా నేతలు ఉపరాష్ట్రపతికి ఇచ్చారు. ఈ రెండు లేఖలపై తదుపరి కార్యాచరణను రాజ్యసభ ఛైర్మన్ చేపడతారని భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా వెల్లడించారు.
*మాకు కోట్లాది తెలుగువారి అండ
నలుగురు నేతలు స్వార్థం కోసం తెదేపా జెండా వదిలేసినా.. భుజానికెత్తుకుని మోసే లక్షలాది మంది కార్యకర్తలతోపాటు కోట్లాది మంది తెలుగు ప్రజలు తమ వెనుక ఉన్నారని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పేర్కొన్నారు. నలుగురు రాజ్యసభ సభ్యులు పార్టీని వీడినంత మాత్రాన ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు. వారు భవిష్యత్తులో పశ్చాత్తాపపడాల్సి ఉంటుందని గురువారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలోనూ, ట్విటర్లోనూ పేర్కొన్నారు.
*తెదేపాకు కలిసిరాని రాజ్యసభ!
తెలుగుదేశం పార్టీకి రాజ్యసభ కలిసి రావడం లేదు. ఇప్పటివరకూ ఆ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యులుగా పని చేసిన వారిలో ఒక్క కంభంపాటి రామ్మోహనరావు, రావుల చంద్రశేఖర్రెడ్డి తప్ప ఎవరూ పార్టీలో మిగల్లేదు. అలాగే తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేతలుగా చేసిన వారంతా ఆ పార్టీని వదిలిపెట్టిపోయారు. సుజనా చౌదరి పార్టీ మార్పుతో ఆ సంప్రదాయం మరోసారి కొనసాగింది. తెదేపా తరఫున రాజ్యసభ సభ్యులుగా పని చేసిన పి.ఉపేంద్ర, జయప్రద, వంగా గీత, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, యలమంచిలి శివాజీ, మోహన్బాబు, తులసిరెడ్డి, మైసూరారెడ్డి, రామమునిరెడ్డి, సి.రామచంద్రయ్య, రేణుకా చౌదరి పార్టీని విడిచిపెట్టిపోయారు. తాజాగా సుజనా చౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహన్రావు అదే దారిలో నడిచారు.
*కాంగ్రెస్కు మరో దెబ్బ-పార్టీని వీడనున్న రాజగోపాల్రెడ్డి
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతోంది. శాసనసభ ఎన్నికల నుంచి వరుసగా ఎదురుదెబ్బలు తింటున్న ఆ పార్టీని తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వీడుతుండటం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని రాజగోపాల్రెడ్డి చేసిన వ్యాఖ్యలతో పాటు పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి ఆర్.సి.కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బుధవారం పీసీసీ క్రమశిక్షణాసంఘం ఆయనకు నోటీసు ఇచ్చింది.
*రైతు ఆత్మహత్యల అంశం ప్రస్తావనేది?
దేశంలో ఏటా 1.50 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆ అంశం ప్రస్తావనే రాష్ట్రపతి ప్రసంగంలో వినిపించలేదని టీపీసీసీ అధ్యక్షుడు, నల్గొండ లోక్సభ సభ్యుడు ఉత్తమ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగంపై గురువారం ఆయన స్పందించారు. రైతు ఆత్మహత్యలపై వాస్తవాలను దాచేందుకే కేంద్ర ప్రభుత్వం జాతీయ నేర నివేదికను ప్రచురించడం లేదని ఆరోపించారు. రైతుల ఆదాయం 2020 నాటికి రెట్టింపు చేస్తామని చెప్పారని.. ఎలా చేస్తారో స్పష్టత ఇవ్వలేదన్నారు. కీలకమైన సమస్యలకు రాష్ట్రపతి ప్రసంగంలో చోటుదక్కలేదని ఆయన విమర్శించారు.
*పూర్తికాని ప్రాజెక్టును ప్రారంభించే ఘనత కేసీఆర్దే: దత్తాత్రేయ
కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం స్వరూపంలో ఐదోవంతు పనులు మాత్రమే జరిగాయని.. పూర్తికాని ప్రాజెక్టుకు హంగు, ఆర్భాటాలతో ప్రారంభోత్సవం చేస్తున్న ఘనత ప్రపంచంలో ఒక్క కేసీఆర్కే దక్కుతుందని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ఓ ప్రకటనలో ఎద్దేవా చేశారు. ‘‘ఇప్పుడు పూర్తయిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల మూడు బ్యారేజీల నిర్మాణాలకే రూ.50 వేల కోట్లు ఖర్చయితే.. మిగతా పనులకు ఇంకెంత ఖర్చవుతుందో? 30శాతం పనులు నత్తనడకన సాగుతుండగా, మల్లన్నసాగర్తోపాటు 50శాతం పనులకు అసలు భూసేకరణే మొదలు కాలేదు.
*రైతు ఆత్మహత్యల అంశం ప్రస్తావనేది?
దేశంలో ఏటా 1.50 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆ అంశం ప్రస్తావనే రాష్ట్రపతి ప్రసంగంలో వినిపించలేదని టీపీసీసీ అధ్యక్షుడు, నల్గొండ లోక్సభ సభ్యుడు ఉత్తమ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగంపై గురువారం ఆయన స్పందించారు. రైతు ఆత్మహత్యలపై వాస్తవాలను దాచేందుకే కేంద్ర ప్రభుత్వం జాతీయ నేర నివేదికను ప్రచురించడం లేదని ఆరోపించారు.
*పూర్తికాని ప్రాజెక్టును ప్రారంభించే ఘనత కేసీఆర్దే: దత్తాత్రేయ
కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం స్వరూపంలో ఐదోవంతు పనులు మాత్రమే జరిగాయని.. పూర్తికాని ప్రాజెక్టుకు హంగు, ఆర్భాటాలతో ప్రారంభోత్సవం చేస్తున్న ఘనత ప్రపంచంలో ఒక్క కేసీఆర్కే దక్కుతుందని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ఓ ప్రకటనలో ఎద్దేవా చేశారు.
*కిషన్రెడ్డికి జమ్ముకశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల వ్యవహారాలు
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డికి కీలకమైన జమ్ముకశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, సైబర్ భద్రత వంటి విభాగాలు దక్కాయి. ఒకే సహాయ మంత్రికి అటు జమ్ముకశ్మీర్ ఇటు ఈశాన్య రాష్ట్రాల వ్యవహారాలను కేటాయించడం ఇదే మొదటిసారి. మునుపటి సర్కారులో కిరణ్ రిజిజుకు ఈశాన్య రాష్ట్రాల అంశాలను, హన్సరాజ్ అహిర్కు జమ్ముకశ్మీర్ వ్యవహారాలను కేటాయించారు. ప్రస్తుతం కేంద్ర హోంశాఖలో మరో సహాయ మంత్రిగా ఉన్న నిత్యానంద రాయ్కు కేంద్ర-రాష్ట్రాల విభజన, పోలీసు-ఐ (ఐపీఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్లను పర్యవేక్షించే విభాగం), విదేశీయులు, మహిళా భద్రత, వామపక్ష తీవ్రవాదం, విపత్తు నిర్వహణ, పోలీసు ఆధునికీకరణ వంటి విభాగాలు దక్కాయి. ఆయా విభాగాలపై ఎంపీలు పార్లమెంటులో అడిగే ప్రశ్నలకు వీరే సమాధానాలు చెబుతారు.
*గిరిజనులపై వ్యాఖ్యలు ప్రసంగ ఉరవడిలో చేసినవే: రాహుల్
‘గిరిజనుల్ని కాల్చి వేసేందుకు కొత్త చట్టం తెచ్చారు’ అంటూ గతంలో తాను చేసిన వ్యాఖ్యలు ఒక రాజకీయ ప్రసంగ ఉరవడిలో భాగంగా చేసినవేనని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ జాతీయ గిరిజనుల కమిషన్కు వివరణ ఇచ్చారు. మధ్యప్రదేశ్లోని షాడోల్లో ఏప్రిల్ 23న ఓ సభలో రాహుల్ మాట్లాడుతూ ‘‘మోదీ ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. అందులో గిరిజనుల్ని కాల్చివేయొచ్చని వాక్యం ఉంది. వాళ్లు మీ భూమిని లాక్కొంటారు. చివరికి గిరిజనుల్ని కాల్చివేయొచ్చని చెబుతారు.’’ అని పేర్కొన్నారు.
*మత్స్యకారులకు రూ.10వేల భృతి: మంత్రి మోపిదేవి
మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఇవ్వాల్సిన రూ.10వేల మొత్తాన్ని అందించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్, పశు సంవర్థక, మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ సూచించారు. తదుపరి జరిగే కేబినెట్ సమావేశం ముందుకు ఈ అంశాన్ని తీసుకురావాలని ఆదేశించారు. గురువారం సచివాలయంలో మత్స్య, పశుసంవర్థక, మార్కెటింగ్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. మంజూరైన మినీ గోకులాలను పూర్తి చేయాలని ఆదేశించారు. పాల రైతులకు లీటరుకు రూ.4 చొప్పున బోనస్ చెల్లించడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. మత్స్యకారులకు రూ.10లక్షల బీమా తదితర అంశాలపై పలు సూచనలు చేశారు.
*పోలవరం పూర్తవుతుంది: పురందేశ్వరి
పోలవరం ప్రాజెక్టును కచ్చితంగా పూర్తి చేస్తామని భాజపా జాతీయ మహిళా మోర్చా ఇన్ఛార్జి పురందేశ్వరి అన్నారు. గురువారం రాత్రి ఆమె ఓ కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలానికి వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. కేంద్రం పోలవరం ప్రాజెక్ట్కు మంజూరుచేసిన నిధులకు సంబంధించి గత తెదేపా ప్రభుత్వం వినియోగ ధ్రువపత్రాలు సకాలంలో పంపలేదన్నారు.
*ఏపీలో భాజపా బలపడుతోంది: జీవీఎల్
ఆంధ్రప్రదేశ్లో భాజపా బలపడుతోందని పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తెలిపారు. తెదేపా నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులు పార్టీలో చేరడంతో పాటు అనేక మంది నేతలు పార్టీ పట్ల ఆకర్షితులవడమే దీనికి నిదర్శనమని ఆయన తెలిపారు. గురువారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భాజపా బలోపేతానికి ఇతర పార్టీల నేతలను ఆహ్వానిస్తామే కానీ, ఆకర్షణ కార్యక్రమాలు చేయమని అన్నారు.
* టీడీపీ ఎంపీల విలీనానికి వెంకయ్య ఆమోదం…..
రాజ్యసభలో టీడీపీపీని బీజేపీలో విలీనానికి రాజ్యసభ చైర్మెన్ వెంకయ్యనాయుడు ఆమోదం తెలిపారు. ఈ విలీనాన్ని సవాల్ చేస్తూ టీడీపీ ఎంపీలు లేఖ ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.రాజ్యసభలో టీడీపీకి ఆరుగురు ఎంపీలు ఉన్నారు. ఆరుగురు ఎంపీల్లో సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, సీఎం రమేష్, గరికపాటి మోహన్ రావులు‌ టీడీపీపీని బీజేపీలో విలీనం చేయాలని గురువారం నాడు లేఖ ఇచ్చారు. ఈ లేఖ ఆధారంగా టీడీపీపీని బీజేపీలో విలీనం చేయడానికి ఆమోదం తెలిపారు.రాజ్యసభలో వెబ్‌సైట్‌లో టీడీపీకి ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉన్నారని అప్‌డేట్ చేశారు. టీడీపీ నుండి బీజేపీలో చేరిన నలుగురు ఎంపీలను బీజేపీ ఎంపీలుగా గుర్తించారు. ఈ విలీన ప్రక్రియ చెల్లదని శుక్రవారం నాడు సాయంత్రం నాలుగు తర్వాత రాజ్యసభ చైర్మెన్‌ను కలవాలని ఐదుగురు టీడీపీ ఎంపీలు అపాయింట్ మెంట్ తీసుకొన్నారు. ఈ లోపునే విలీన ప్రక్రియకు ఆమోదం తెలపడం చర్చనీయాంశంగా మారింది.