Sports

అందరూ ఆమెనే తిడతారెందుకు?

Shoaib Akthar Presents Pity On Sania Mirza

భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌ ఎప్పుడు జరిగినా సానియా మీర్జా అభిమానుల ఆగ్రహం చవిచూస్తుందని షోయబ్‌ అక్తర్‌ అన్నాడు. ‘‘సానియా దురదృష్టవంతురాలు. ఎలాంటి కారణం లేకపోయినా భారత్‌ లేదా పాక్‌ నుంచి అనవసర వివాదాలు ఆమెను చుట్టుముడతాయి. ఆమె భర్తది పాకిస్థాన్‌ కావడమే ఇందుకు కారణం. భర్తతో కలిసి బయటకు వెళ్లి డిన్నర్‌ చేస్తే తప్పేంటి? బాగా ఆడొద్దని షోయబ్‌కు సానియా చెప్పిందా?’’ అని అక్తర్‌ అన్నాడు.