DailyDose

రూ.20 కోసం తుపాకీతో కాల్చి చంపాడు-నేరవార్తలు–06/21

Uttar Pradesh Security Guard Shoots Driver For 20Rupees-June 21 2019-Daily Crime News

* సూర్యాపేట జిల్లామండలం మిట్స్ కళాశాల వద్ద కోదాడ-మిర్యాలగూడ రోడ్ పై ఘోర రోడ్డు ప్రమాదం..లారీ, ఆటో ఢీ. ఐదుగురు మృతి.మృతులు మహబూబాద్ జిల్లా కొరవి మండలం చింతపల్లి కి చెందిన వారీగా గుర్తింపు. జాన్ పహాడ్ దర్గా ను దర్శించుకొని వెళ్తుండగా ప్రమాదం.
* టిక్‌టాక్.. మరో చిన్నారి ప్రాణాన్ని బలితీసుకుంది. రాజస్థాన్‌లో కొటా ప్రాంతానికి చెందిన ఆరో తరగతి విద్యార్థి బుధవారం ఒక టిక్‌టాక్ వీడియో చేద్దామనుకున్నాడు. తల్లినడిగి తీసుకున్న మంగళసూత్రం మెడలో వేసుకున్నాడు. చేతికి గాజులు తొడుక్కున్నాడు. ఆ తరువాత విడియో తీయటానికి బాత్రుమ్‌లోకి వెళ్లి తలుపేసుకున్నాడు. అయితే విడియో తీసే క్రమంలో మెడలో ఉన్న మంగళసూత్రం బాత్‌రూమ్ తలుపు సందులో ఇరుక్కుపోయింది. మెడ చుట్టూ మంగళసూత్రం బిగుసుకుపోవడంతో అతడికి ఊపిరాడలేదు. విడిపించుకునేందుకు ఎంత ప్రయత్నించినా కుదరకపోవడంతో ఆ చిన్నారి.. ప్రాణాలు కోల్పోయాడు. బాత్‌రూమ్‌లోంచి ఎంతసేపటికీ బయటకి రాకపోవడంతో తల్లితండ్రులు కంగారు పడ్డారు. తలుపు తట్టినా ఎటువంటి ప్రతిస్పందనా లేకపోవడంతో వారు బాత్‌రూమ్ తలుపులు బద్దలు కొట్టి లోపిలికెళ్ళారు. అక్కడ..విగతజీవిగా పడివున్న కొడుకును చూసి వారు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్న మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అనంతరం…మృతుడిని తల్లితండ్రులకు అప్పగించారు
* రొంపిచర్ల మండలం మాచవరం ఎస్సీ కాలనీకి చెందిన సుమారు 8 సం॥పాప కొండా వర్ష కు జ్వరం రావడంతోనిన్న రాత్రిస్థానిక ఆర్ ఎం పీ వైద్యునిచే వైద్యం చేయించగా వైద్యం వికటించి ఒంటిపై కాలిన బొబ్బలు రావడంతో ఉదయం నరసరావుపేటలోని ప్రైవేటు హాస్పటల్ కు తరలించగా వైద్య చికిత్సపొందుతూ మృతి చెందింది.ఘటనకు కారకుడైన ఆర్ ఎం పీ వైద్యునిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసేందుకు రొంపిచర్ల స్టేషన్ లో ఫిర్యాదు చేయనున్న తల్లిదండ్రులు.
* యాదాద్రి భువనగిరి జిల్లాలోని గుండాల మండలం బండకొత్తపల్లిలో విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి మృతిచెందాడు. స్తంభంపై మరమ్మతు పనులు చేస్తుండగా షాక్‌ తగిలి కొమురయ్య(41) అనే వ్యక్తి మృతిచెందాడు. అదేవిధంగా సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ఓ యువకుడు విద్యుత్‌ షాక్‌ గురై చనిపోయాడు. స్విచ్‌ వేస్తుండగా షాక్‌ తగిలి వడ్డె నవీన్‌(16) అనే యువకుడు మృతిచెందాడు.
* రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో నడిరోడ్డుపై యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కొందరు దుండగులు యువకుడిని వెంబడించి కత్తులతో నరికి చంపారు. మృతుడిని వేములవాడకు చెందిన రవి(30)గా గుర్తించారు. హత్యకు గల కారణం తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
* విజయనగరం జిల్లా పార్వతీపురంలోని సాహు అనంత్ కుమార్తె సువర్ణ (16) భాస్కరా జూనియర్ కళాశాలలో చేరింది. ఈసందర్భంగా తన మిత్రులను కలిసి వస్తానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లింది. బెలగామ్ రైల్వే స్టేషన్ సమీపంలో సువర్ణ ట్రాక్ దాటుతోంది, అప్పటికే స్థానికులు వద్దని వారించిన వినకుండా ట్రాక్ దాటుతోంది. అప్పటికే కుడి కాలు ముందుకు పడినప్పటికి ఎడమ కాలు ట్రాక్ పై ఉండడంతో గూడ్స్ రైలు దూసుకెళ్లింది. ఆమె నిలువుగా రెండు భాగాలుగా విడిపోయింది. రైలు పోయిన అనంతరం ఆమె గిలగిల కొట్టుకోవడం చూసి స్థానికులు ఆ షాక్‌ను తట్టుకోలేకపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..
* పరిగి రోడ్డులో ఘోరం..! లారి కింద పడి బాలిక దుర్మరణం షాద్ నగర్ పరిగి రోడ్డులో ఘోరం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ఓ బాలిక లారీ కింద పడి నుజ్జునుజ్జు అయ్యింది. ఈ సంఘటన పరిగి రోడ్డులోని సిఎస్కేవెంచర్ కు వెళ్లే రహదారిలో రోడ్డుపై సంఘటన జరిగింది. ప్యారడైజ్ కాలనీలో నివాసముంటున్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న సలీం కూతురిగా స్థానికులు చెబుతున్నారు.
* ఓ ట్రక్‌ డ్రైవర్‌ను ఓ సెక్యూరిటీ గార్డ్‌ రూ.20 కోసం తుపాకీతో కాల్చి చంపిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. సిసోలర్‌లోని పోలీసు అధికారి రాకేశ్‌ కుమార్‌ పాండే ఈ విషయంపై మీడియాకు వివరాలు వెల్లడించారు. గురువారం తెల్లవారు జామున ట్రక్కు డ్రైవర్‌ అరుణ్‌ కుమార్‌ (22).. భల్సీ ఇసుక మైన్‌ నుంచి ఇసుకను తీసుకెళ్తున్నాడు. ఈ సమయంలో ఈ విషయాన్ని గుర్తించిన సెక్యూరిటీ గార్డ్‌ ఆ ట్రక్కుని ఆపి, తనకు రూ.50 ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అయితే, అతడికి అరుణ్ కుమార్‌ రూ.30 మాత్రమే ఇచ్చాడు.
*యాదాద్రి భువనగిరి జిల్లాలోని గుండాల మండలం బండకొత్తపల్లిలో విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి మృతిచెందాడు. స్తంభంపై మరమ్మతు పనులు చేస్తుండగా షాక్‌ తగిలి కొమురయ్య(41) అనే వ్యక్తి మృతిచెందాడు. అదేవిధంగా సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ఓ యువకుడు విద్యుత్‌ షాక్‌ గురై చనిపోయాడు. స్విచ్‌ వేస్తుండగా షాక్‌ తగిలి వడ్డె నవీన్‌(16) అనే యువకుడు మృతిచెందాడు.
* దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఒకవైపు అంతర్జాతీయ యోగా దినోత్సవాలు ఘనంగా నిర్వహిస్తుండగా మరోవైపు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కలిందికుంజ్ మెట్రో స్టేషన్ సమీపంలో ఫర్నిచర్ మార్కెట్లో శుక్రవారం ఉదయం మంటలంటుకున్నాయి. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతుండటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
* గుంటూరు జిల్లా మాచర్లలో ఉద్రిక్తత నెలకొంది. తహసీల్దార్ కార్యాలయం వద్ద టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంజిరెడ్డి కారుపై వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వర్గం రాళ్ల దాడి చేసింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.
* టిక్‌టాక్.. మరో చిన్నారి ప్రాణాన్ని బలితీసుకుంది. రాజస్థాన్‌లో కొటా ప్రాంతానికి చెందిన ఆరో తరగతి విద్యార్థి బుధవారం ఒక టిక్‌టాక్ వీడియో చేద్దామనుకున్నాడు. తల్లినడిగి తీసుకున్న మంగళసూత్రం మెడలో వేసుకున్నాడు. చేతికి గాజులు తొడుక్కున్నాడు. ఆ తరువాత విడియో తీయటానికి బాత్రుమ్‌లోకి వెళ్లి తలుపేసుకున్నాడు. అయితే విడియో తీసే క్రమంలో మెడలో ఉన్న మంగళసూత్రం బాత్‌రూమ్ తలుపు సందులో ఇరుక్కుపోయింది. మెడ చుట్టూ మంగళసూత్రం బిగుసుకుపోవడంతో అతడికి ఊపిరాడలేదు. విడిపించుకునేందుకు ఎంత ప్రయత్నించినా కుదరకపోవడంతో ఆ చిన్నారి.. ప్రాణాలు కోల్పోయాడు. బాత్‌రూమ్‌లోంచి ఎంతసేపటికీ బయటకి రాకపోవడంతో తల్లితండ్రులు కంగారు పడ్డారు. తలుపు తట్టినా ఎటువంటి ప్రతిస్పందనా లేకపోవడంతో వారు బాత్‌రూమ్ తలుపులు బద్దలు కొట్టి లోపిలికెళ్ళారు. అక్కడ..విగతజీవిగా పడివున్న కొడుకును చూసి వారు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్న మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అనంతరం…మృతుడిని తల్లితండ్రులకు అప్పగించారు
* గుజరాత్‌లోని బనస్కంతా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తీసుకున్న అప్పు తీర్చలేదని ఓ కుటుంబాన్ని అతి కిరాతకంగా చంపేశాడో వ్యక్తి. పైగా హత్యకు గల కారణాన్ని గోడ మీద రాసి వెళ్లిపోయాడు.
* సూర్యాపేట జిల్లా చిల్కూరు మండలం జాన్ పహాడ్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. జాన్ పహాడ్ దర్గాను దర్శించుకుని ఆటోలో తిరిగి వస్తున్న సమయంలో చిల్కూరు మిట్స్ ఇంజినీరింగ్ కాలేజీ వద్ద ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు మహబూబాబాద్ జిల్లా కొరివి మండలం చింతపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు…
* కృష్ణా జిల్లా నాగాయలంక మండలం కమ్మనమోలులో గురువారం సంభవించిన అగ్నిప్రమాదంలో ఓ వ్యక్తి సజీవ దహనం కాగా.. తొమ్మిది ఇళ్లు పూర్తిగా, మరో నాలుగు పాక్షికంగా దగ్ధమయ్యాయి.
* శ్రీకాకుళం జిల్లాలో రెండు శిలాఫలకాలతో పాటు, విశ్రాంతి భవనం గోడను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చి వేశారు. గార పంచాయతీ ఆరంగిపేట వద్ద గత ప్రభుత్వ హయాంలో రూ.54 లక్షల హుద్హుద్ నిధులతో నిర్మించిన రహదారికి సంబంధించిన శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు.
*అక్రమంగా తరలిస్తున్న రూ.45.06 లక్షలు విలువచేసే 1.29 కిలోల బంగారాన్ని విశాఖ విమానాశ్రయంలో గురువారం కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ ప్రిన్సిపల్ కమిషనర్ డి.కె.శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.
*మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమార్తె డాక్టర్ పి.విజయలక్ష్మిపై ఈనెల 12న నమోదుచేసిన కేసులో ఆమెను అరెస్ట్ చేయవద్దని గుంటూరు జిల్లా నరసరావుపేట గ్రామీణ పోలీసులను హైకోర్టు ఆదేశించింది.
*కస్టడీలో చోటుచేసుకున్న మరణానికి సంబంధించిన కేసులో మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్కు గుజరాత్లోని ఒక కోర్టు జీవిత ఖైదు విధించింది. 2015లో కేంద్ర హోంశాఖ ఆయనను ఉద్యోగం నుంచి తొలగించింది.
*మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులిద్దరికి బెయిలు మంజూరు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. వ్యాజ్యాన్ని కొట్టేసేందుకు న్యాయమూర్తి సిద్ధమవుతున్న తరుణంలో వ్యాజ్యం ఉపసంహరణకు అనుమతినివ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోరారు. అందుకు న్యాయమూర్తి అనుమతించారు.
*పశ్చిమబెంగాల్లో రెండు గ్రూపుల మధ్య గురువారం చోటు చేసుకున్న ఘర్షణలు హింసకు దారితీశాయి. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని భాట్పారా, జగత్దల్ ప్రాంతాల్లో ఇరు వర్గాలు బాంబులు విసురుకోవడం, కాల్పులకు దిగడంతో ఇద్దరు మృతి చెందారు.
*పసిగుడ్డుపై పైశాచికానికి పాల్పడిన నేరగాడు ప్రవీణ్పై కేసు నమోదుచేసిన పోలీసులు..గురువారం అతడిని కోర్టులో హాజరుపరిచి రిమాండుకు తరలించారు.
*ఓ ట్రక్ డ్రైవర్ను ఓ సెక్యూరిటీ గార్డ్ రూ.20 కోసం తుపాకీతో కాల్చి చంపిన ఘటన ఉత్తర్ప్రదేశ్లోని హమీర్పూర్ జిల్లాలో చోటు చేసుకుంది.
*హిమాచల్ప్రదేశ్లో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. సుమారు 60 మంది ప్రయాణికులతో వెళుతున్న ఓ ప్రైవేటు బస్సు గురువారం సాయంత్రం లోయలో పడింది. ఈ ఘటనలో 33 మంది దుర్మరణం పాలయ్యారు.
*ఇద్దరు యువకులు మత్తులో కారును వేగంగా నడిపి ఇద్దరిని గాయపరిచిన సంఘటన నగర శివారులో చోటుచేసుకుంది.