Politics

గ్రామ వాలంటీరు ఉద్యోగాలకు ఇవే అర్హతలు

Ap Goverment Volunteer Positions Application Deadlines And Eligibility Info

ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో మరింతగా తీసుకెళ్లేందుకు వీలుగా గ్రామ వాలంటీర్ల నియమించాలని తలపెట్టిన జగన్‌ ప్రభుత్వం అందుకు సంబంధించి దరఖాస్తులను ఆహ్వానిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 24 (జూన్‌ 22) నుంచి జులై 5 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. ప్రతి 50కుటుంబాలకు ఒక గ్రామ వాలంటీర్‌ చొప్పున నియామకానికి మార్గదర్శకాలను జారీ చేసింది. గ్రామం, వార్డు వాలంటీర్ల నియామకానికి సంబంధించిన విధివిధానాలను ఖరారు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పించనున్నారు. స్థానికులకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను రూపొందించింది.

ముఖ్యమైన తేదీలు
* దరఖాస్తుల స్వీకరణ- జూన్‌ 24 నుంచి జులై 5 వరకు
* దరఖాస్తుల పరిశీలన- జులై 10 నుంచి
* ముఖాముఖి- జులై 11 నుంచి 25 వరకు
* ఎంపికైన వారికి ఆగస్టు 1న నియామక పత్రాలు
* వాలంటీర్లకు శిక్షణ- ఆగస్టు 5 నుంచి 10 వరకు

అర్హతలు
* గిరిజన ప్రాంతాల్లో 10వ తరగతి
* గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్
* పట్టణ ప్రాంతాల్లో డిగ్రీ
* వయసు- 2019 జూన్‌ 30 నాటికి 18-35 ఏళ్లు ఉండాలి.
* దరఖాస్తుదారు అదే పంచాయతీలో నివాసి అయ్యి ఉండాలి
*ఓసీ కానివాళ్లు కుల ధ్రువీకరణ పత్రాన్ని అందజేయాల్సి ఉంటుంది.