Sports

పెద్ద చిక్కొచ్చి పడిందే

Cannot Hold Two Positions - Says BCCI To Sachin Ganguly Laxman

సచిన్‌ తెందుల్కర్‌, సౌరవ్‌ గంగూలీ, వీవీఎస్‌ లక్ష్మణ్‌, సునిల్‌ గావస్కర్‌ సహా చాలా మంది మాజీ క్రికెటర్లకు పెద్ద చిక్కొచ్చి పడింది. క్రికెట్‌కు సంబంధించి ఏదో ఒక అవకాశాన్ని మాత్రమే ఎంచుకోవాల్సిన సంకట స్థితి నెలకొంది. బీసీసీఐ అంబుడ్స్‌మన్‌, నైతిక నియమావళి అధికారి జస్టిస్‌ డీకే జైన్‌ బోర్డు రాజ్యంగం ప్రకారం ఏదో ఒక పదవికే పరిమితం కావాలని ఆదేశించడమే ఇందుకు కారణం. గంగూలీ, లక్ష్మణ్‌, సచిన్‌తో కూడిన క్రికెట్‌ సలహా కమిటీ పరస్పర విరుద్ధ ప్రయోజనాల కేసులో ఆయన పై విధంగా తీర్పునిచ్చారు. ఈ నేపథ్యంతో వారిని ఏదో ఒక పదవి మాత్రమే ఎంచుకోవాలని బీసీసీఐ కోరిందని సమాచారం. క్రికెట్‌ సలహా కమిటీ సభ్యులై ఈ ముగ్గురూ ప్రస్తుతం ప్రపంచకప్‌లో వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్నారు. సునిల్‌ గావస్కర్‌, హర్భజన్‌ సింగ్‌, అనిల్‌ కుంబ్లే, సంజయ్‌ మంజ్రేకర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, గౌతమ్‌ గంభీర్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌ తదితరులు ప్రపంచకప్‌లో కామెంటరీ చేస్తున్నారు. వీరిలో చాలామంది ఐపీఎల్‌ జట్లు, క్రికెట్‌ పాలన, కోచింగ్‌, కామెంటరీ విభాగాల్లో వేర్వేరు పాత్రలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఏదో ఒకదానికే పరిమితం కావాల్సి ఉంటుంది.