Agriculture

రైతులు 100 ఇస్తే ప్రభుత్వం 3000 ఇస్తుంది

Indian Government Announces New Farmer Pension Scheme

రైతులకు నెలకు రూ 3000 పించన్ కల్పించే కొత్త పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది.

రాజ్యసభలో శుక్రవారం ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు.

60 ఏండ్లు పైబడ్డ రైతులకు సామాజిక భద్రతను కల్పించే పెన్షన్‌ను కల్పించేందుకు ఈ పథకం తీసుకువస్తున్నట్లు తెలిపారు.

నెలవారిగా రైతులకు ఈ పథకం పరిధిలో పింఛన్ సొమ్ము అందిస్తారు.

కొన్ని మినహాయింపుల నిబంధనలతో దాదాపుగా అందరు చిన్న, మధ్యతరహా రైతులకు (ఎస్‌ఎంఎఫ్) ఈ పథకం వర్తిస్తుంది.

సమగ్రమైన ఈ పథకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని,

దీని వల్ల వృద్ధాప్యం పైబడ్డ రైతాంగానికి సరైన సామాజిక భద్రతా ఏర్పాటు ఉంటుందని మంత్రి వెల్లడించారు.

జీవనక్రమంలో సరైన ఉపాధి లేక, గిట్టుబాటు దక్కక తపించే రైతులకు ఈ పథకం మేలు చేస్తుందన్నారు.

రాజ్యసభలో లిఖిత పూర్వక సమాధానంలో మంత్రి ఈ పథకం వివరాలను తెలియచేశారు.