Kids

బీర్బల్ తెలివిని ప్రశంసించిన రాజు-గుడ్డి గుఱ్ఱం కథ

Telugu kids story-King praises Birbals Smartness

అసలు యజమాని ఎవరు?

ఒక సారి ఒక సామంతరాజు బీర్బల్ తెలివితేటల గురించి విని ఆయనని చూడాలని ఒక రైతు వేషం ధరించి గుర్రం మీది రాజధాని వైపు బయలుదేరాడు.

దారిలో ఒక కుంటి వ్యక్తి రహదారులను సహాయమడుగుతూ కనిపించాడు. సామంతరాజు జాలి పడి ఆ వ్యక్తికి సహాయం చేయాలని నిశ్చయించుకున్నాడు. ఆగి ఆ కుంటి వ్యక్తిని పలకరించాడు. అతను రాజధాని వెళ్ళాలని చెప్పాడు. సామంతరాజు వెంటనే కుంటి వ్యక్తిని గుర్రం యెక్కించి తను నడవ సాగాడు. రాజధాని చేరాక ఆ కుంటి వాడు దిగడానకి ఇష్టపడలేదు. కేకలూ అరుపులూ మొదలపెట్టాడు. సామంతరాజు నిర్ఘాంతపోయి చూస్తుండగా చుట్టూర పది మంది చేరారు. కింటివాడు చేరిన జనానికి తనదే గుర్రమని, ఆ రైతు వేశం లో వున్న సామంతరాజును కేవలం అతని పనివాడని చెప్పాడు. సామంతరాజు, కాదు, గుర్రం అతనిదని, సహాయం చేస్తే ఇలా ఇరుక్కున్నట్టు చెప్పాడు. ఇద్దరు కలిసి అక్బర్ చక్రవర్తి దర్బారుకి న్యాయంకోసం వచ్చారు. అక్బర్ బీర్బల్ను న్యాయం చెప్పమన్నాడు. బీర్బల్ గుర్రాన్ని గుర్రపుశాలలో కట్టేయమని ఆదేశించి, వీళ్ళిద్దరిని మరునడు మళ్ళి దర్బారుకి రమ్మన్నాడు.

తెల్లవారింది.
ఇద్దరు దర్బారులో హాజరయ్యారు. బీర్బల్ ఇద్దరిని గుర్రపుశాలకి తీసుకువెళ్ళి, కుంటాడిని, “నీ గుర్రం తీసుకో”, అన్నాడు.
అక్కడ అన్ని గుర్రల మధ్య తనదని వాదించిన గుర్రం తెలుసుకోలేక, బిక్క మొహం వేశాడు.
అదే సామంతరాజు వెంటనే తన గుర్రాన్ని గుర్తుపట్టేడు. గుర్రం కూడ యజమానిని చూసి సంతోశంగా సెకిలించింది.
వెంటనే బీర్బల్ కుంటాడిని శిక్షించమని, గుర్రానికి అసలు యజమాని సామంతరాజు అని, అక్బర్ కి నివేదించాడు.
సామంతరాజు ఎంతో సంతోశంతో తనెవరో చెప్పి బీర్బల్ని ప్రశంసించి మళ్ళి తన రాజ్యానికి బయలుదేరాడు.