DailyDose

ఈ ఏడాది ఖైరతాబాద్ గణపతి రూపం ఇదే

2019 Khairatabad Ganesh Takes This Form This Year

గణపతి పండుగ వస్తుందంటే చాలు..అందరి చూపు ఖైరాతాబాద్ గణపతి వైపే. ప్రతి ఏడాది ఒక ప్రత్యేకమైన రూపంలో దర్శనమిస్తుంటాడు విఘ్నేశ్వరుడు. ఈసారి సైతం శ్రీ ద్వాదశదిత్య మహా గణపతి రూపంలో దర్శనమివ్వబోతున్నాడు. గణపతి నవరాత్రులు అనగానే అందరి మదిలో టక్కున మెదిలేది ఖైరతాబాద్ మహాగణేశుడే. వినాయకుని పండుగ దగ్గరపడిందంటే చాలు… ఖైరతాబాద్ గణేశుని ఎత్తు, రూపంపై జోరుగా చర్చ జరుగుతుంటుంది. ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకమైన రూపంలో ఇక్కడి వినాయకుడు దర్శనమిస్తుంటాడు. అలాగే ఈఏడాది సైతం శ్రీ ద్వాదశదిత్య ఆకృతిలో అందిరి ముందుకు రాబోతున్నాడు ఖైరతాబాద్ గణేశుడు. గణపతికి కుడివైపున విష్ణు, ఏకాదశి దేవి… అలాగే ఎడమ వైపు బ్రహ్మా, విష్ణు మహేశ్వరులు , దుర్గాదేవి కొలువుతీరనున్నారు.

1. జూలై 4 నుండి 6వ తేదీ వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం
టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో జూలై 4 నుండి 6వ తేదీ వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం జరుగనుంది. మెట్లోత్సవ సంబరాలు తిరుపతిలోని రైల్వేస్టేషన్‌ వెనుక గల టిటిడి శ్రీగోవిందరాజస్వామి మూడో సత్ర ప్రాంగణంలో ప్రారంభమవుతాయి.జూలై 4, 5వ తేదీల్లో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలకు భజన మండళ్ల సభ్యులు ఉదయం 5.00 నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన కార్యక్రమాలు, ఇతర సాంస్క తిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. జూలై 4న సాయంత్రం 4 గంటలకు శ్రీ గోవిందరాజస్వామి ఆలయం నుండి మూడవ సత్రం ప్రాంగణం వరకు శోభాయాత్ర నిర్వహిస్తారు. సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు అధికార ప్రముఖులు సందేశమిస్తారు. జూలై 6న ఉదయం 4.30 గంటలకు అలిపిరి పాదాల మండపం వద్ద మెట్లపూజ నిర్వహిస్తారు. అనంతరం వేల సంఖ్యలో వచ్చే భజన మండళ్ల సభ్యులు సాంప్రదాయ భజనలు చేస్తూ సప్తగిరీశుని చేరుకుంటారు.పూర్వకాలంలో మహర్షులు, రాజర్షులు, శ్రీ పురందరదాసులు, శ్రీ వ్యాసరాజయతీశ్వరులు, శ్రీమాన్‌ అన్నమాచార్యులు, శ్రీక ష్ణదేవరాయలు లాంటి మహనీయులు భక్తిప్రపత్తులతో వేంకటాద్రి పర్వతాన్ని ఎక్కి మరింత పవిత్రమయం చేశారు. అలాంటివారి అడుగుజాడలలో నడిచి ఆ దేవదేవుని క పకు అందరూ పాత్రులు కావాలనే తలంపుతో మెట్లోత్సవ కార్యక్రమాన్ని దాస సాహిత్య ప్రాజెక్టు చేపడుతోంది. ఇలా కాలినడకన వెళ్లి సప్తగిరీశుని దర్శిస్తే వారికి సకల అరిష్టాలు తొలగిపోయి సర్వాభీష్టాలు సిద్ధిస్తాయి.

2. సుబ్బారాయుని హుండీ ఆదాయం రూ.10.08 లక్షలు
సింగరాయపాలెం- చేవూరుపాలెంలో వేంచేసిన శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయ హుండీ ఆదాయాన్ని సోమవారం స్థానిక ఆలయంలో గుడివాడ ప్రాంతీయ తనిఖీ అధికారి కె.సురేశ్బాబు, వీఎన్కే.శేఖర్ ఆధ్వర్యంలో లెక్కించారు. ఇందులో హుండీ ద్వారా రూ.10,08,535లు నగదు, బంగారం 39 గ్రాములు, వెండి 860 గ్రాములు ఆదాయంగా వచ్చిందని ఆలయ సహాయ కమిషనర్ వీవీ.పల్లంరాజు తెలిపారు. ఇందులో గుడివాడ డివిజన్ వివిధ దేవాలయాల అధికారులు, దుర్గాశివసాయి సేవా సమితి సభ్యులు ఉమామహేశ్వరరావు, బాబురావు, ధార వసంతకుమార్, వీఆర్వో శ్రీరాములు, సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు.

3. జూలై 16న శ్రీవారి దర్శనం బంద్
చంద్రగ్రహణం కారణంగా జూలై 16న శ్రీవారి దర్శనానికి 16 గంటలపాటు విరామం ఏర్పడింది. దాదాపు 10 గంటలపాటు ఆలయంలో అన్ని కార్యక్రమాలు నిలిచిపోనున్నాయి. వాస్తవానికి చంద్రగ్రహణం….16వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత 1.31 గంటల నుంచి 17వ తేదీ తెల్లవారు జామున 4.29 గంటల వరకు కొనసాగుతుంది. అయితే, గ్రహణం ప్రారంభమయ్యే సమయానికి 6 గంటల ముందుగానే శ్రీవారి ఆలయాన్ని మూసివేయడం సంప్రదాయం. ఆ ప్రకారం 16న రాత్రి 7 గంటలకు ఆలయం మూసివేస్తారు.ఈ సందర్భంగా వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను రద్దుచేశారు. 17వ తేదీ ఉదయం 5 గంటలకు ఆలయం తెరిచి సుప్రభాతం, శుద్ధి, పుణ్యాహవచనం చేస్తారు. ఇలా అన్ని కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఉదయం 11 గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభమవుతుంది. దీంతో శ్రీవారి దర్శనం 16 గంటలపాటు నిలిచిపోనుంది. కాగా, 17వ తేదీ జరిగే ఆణివార ఆస్థానం పురస్కరించుకుని 16వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జూలై 16, 17 తేదీల్లో చోటుచేసుకున్న మార్పులను భక్తులు గమనించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

4. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారిని దర్శించుకునే భక్తులతో కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయాయి. దీంతో భక్తులు కంపార్ట్మెంట్ల వెలుపల వరకు క్యూ కట్టారు. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 22 గంటల సమయం పడుతోంది. నడకదారి గుండా వచ్చే భక్తులకు, టైం స్లాట్ టోకెన్ దర్శనానికి, అలాగే స్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ఐదు గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ కారణంగా అన్ని రకాల క్యూలైన్లు, ప్రసాదం కౌంటర్లతో పాటు ఆలయ ప్రాంగణమంతా కిటకిటలాడుతోంది.

5. శ్రీవారి సేవలో మఠ, పీఠాధిపతులు
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని సోమవారం ఇద్దరు మఠ, పీఠాధిపతులు దర్శించుకున్నారు. ఉడుపిలోని కుక్కె సుబ్రహ్మణ్య మఠాధిపతి విద్యాప్రసన్న తీర్థస్వామి సంప్రదాయం ప్రకారం ఆలయ ముఖద్వారం వద్దకు చేరుకోగా.. జేఈవో శ్రీనివాసరాజు, అర్చకులు ఇఫ్తికపాల్ స్వాగతం పలికారు. అనంతరం ఆయన మూలవర్లను దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆయన మంగళవాయిద్యాల నడుమ మాడవీధుల ప్రదక్షిణగా రింగురోడ్డులో ఉన్న ఉడుపి మఠానికి చేరుకున్నారు. వ్యాసరాజమఠం పీఠాధిపతి విద్యాశ్రీషతీర్థస్వామి కూడా సోమవారం ఉదయం ప్రారంభ సమయంలో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలు లేకుండానే మహద్వారం గుండా ప్రవేశంచి స్వామి సేవలో పాల్గొన్నారు.

6. రాముడు నడయాడిన ‘రామతీర్థం’
త్రేతాయుగంలో శ్రీరాముడు సీతాన్వేషణ చేస్తూ తూర్పు తీరాన వెళుతుండగా శివ పూజకు వేళ కావడంతో ఓ ప్రాంతానికి చేరుకుని అక్కడే శివ సైకత లింగాన్ని ప్రతిష్టించి కొలిచారని, అదే నేడు రామతీర్థంగా విరాజిల్లుతోందని పురాణ ప్రతీతి. శ్రీరాముడు నడయాడిన తీరంగా.. రామతీర్థం ప్రసిద్ధికెక్కింది. రాముడు నడయాడిన తీరంలో బ్రహ్మోత్సవాల వేళ సముద్ర స్నానాలు ఆచరిస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అందుకే దీనిని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు. ఇక్కడ ప్రతిష్టించిన స్పటిక లింగాన్ని గుర్తించిన పల్లవరాజులు 14వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి ఇక్కడ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు.
*కామాక్షిదేవి సమేత రామలింగేశ్వరస్వామి వారి ఆలయం. ఈ ఆలయం రామతీర్థం గ్రామంలో సముద్రతీరాన ఉన్నది. సముద్ర తీరాన సూర్యోదయ సమయంలో శ్రీరామచంద్రుడు, సైకతం (ఇసుక)తో శివలింగాన్ని చేసి, శివార్చన చేసిన పవిత్రస్థలి ఇది. ఆంధ్రరాష్ట్ర రామేశ్వరంగా, దక్షిణ కాశీగా విలసిల్లుతున్న పవిత్ర శివక్షేత్రం. రాముడు శివార్చన చేసిన ఈ ప్రదేశంలో భక్తులు సముద్రస్నానం ఆచరించి, స్వామి వారికి మొక్కుకుంటే, కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.యుగాలు మారినా తరగని భక్తితో స్వామివారి దర్శనానికి భారీగా తరలి రావడం విశేషం. రాముడు సేవించిన తీర్థం కావడంతో ‘రామతీర్థం’గా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ దర్శనం చేసుకుంటే, శివకేశవులను ఒకేసారి దర్శనం చేసుకున్నంత పుణ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం. ప్రాచీనకాలం నుంచి దివ్యక్షేత్రంగా వెలుగొందుచూ ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ అమావాస్య నాడు సముద్ర స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయనేది భక్తుల నమ్మకం. 14వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన పల్లవరాజులు స్వామి వారికి దేవాలయం నిర్మించారని ఇక్కడ చారిత్రిక ఆధారాలు ఉన్నవి. 18వ శతాబ్దంలో స్థానికుడైన కోటంరెడ్డి శేషాద్రిరెడ్డికి స్వామివారు స్వప్న దర్శనంతో ప్రేరణ పొంది ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేశారు.
**10 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు
జిల్లాలో ప్రసిద్ధ శైవ క్షేత్రంగా విరాజిల్లుతోన్న కామాక్షి సమేత రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం ప్రారంభమై సుమారు 10 రోజుల పాటు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో జరిగే స్వామి వారి వివిధ అలంకరణలకు రామతీర్థం పరిసర ప్రాంతాల భక్తులు ఉభయకర్తలుగా వ్యవహరించడం ఆనవాయితీ. నేటికి ఇదే ఆచారంగా కోనసాగడం విశేషం. బ్రహ్మోత్సవాలు సందర్భంగా వరవడిన భక్తులకు సంతానం కలుగుతుందని భక్తులకు అపార నమ్మకం. ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు పలు ఆకట్టుకునే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
**బ్రహ్మోత్సవ వివరాలు
అతి పురాతనమైన శైవక్షేత్రం రామతీర్థంలోని కామాక్షిదేవి సమేత రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు 23వ తేదీ ఆదివారం అంకురార్పణతో ప్రారంభమవుతాయి, 24వ తేదీ ధ్వజారోహణ, 25న చిలక వాహనం, 26న హంస వాహనం, 27న పులి వాహనం, 28న రావణసేవ, 29న నందిసేవ, 30న రథోత్సవం, జూలై 1న స్వామి వారికి కల్యాణం, 2న ముఖ్య ఘట్టం తీర్థవాది (సముద్రస్నానం), అదే రోజు రాత్రికి తెప్పోత్సవం, అశ్వ వాహనం, 3వ తేదీన ధ్వజావరోహణ, ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ ఉత్సవాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే రథోత్సవం, స్వామి వారి కల్యాణం, తీర్థవాది ఘట్టాలకు స్వామి వారిని తరించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు. తీర్థవాదికి సుమారు 2 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా. ఆలయ అధికారు మౌలిక వసతులను కల్పించేందుకు సిద్ధమవుతున్నారు.
**ఎలా చేరుకోవాలంటే..
ఉత్సవాలు సందర్భంగా జిల్లా కేంద్రం నెల్లూరు నుంచి విడవలూరు మండలం రామతీర్థం గ్రామానికి ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక బస్సు సౌకర్యాలను ఏర్పాటు చేస్తోంది. నెల్లూరు నుంచి దాదాపు 30 కిలో మీటర్లు ఉంటుంది. అల్లూరు, పద్మనాభసత్రం నుంచి కూడా ప్రైవేట్ వాహనాలు నిత్యం రామతీర్థం వరకు నడుస్తుంటాయి. కావలి నుంచి కూడా నేరుగా రామతీర్థానికి బస్సు సౌకర్యం ఉంది.

7. వెండి రథంపై ఆదిదేవులు
ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో శివుడికి ప్రీతికరమైన సోమవారం స్వామిఅమ్మవార్లను వెండి రథంపై ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఆలయ ప్రాంగణంలోని సహస్ర దీపార్చన మండపంలో ఆదిదేవులైన స్వామిఅమ్మవార్ల ఉత్సవ మూర్తులకు విశేష పూజలు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ వేళల్లో మార్పులు చేశారు. కార్యక్రమంలో అధికారులు, భక్తులు, అర్చకులు, వేదపండితులు పాల్గొన్నారు.

8. ఆలయ అభివృద్ధికి రూ. 1,01,116 విరాళం
పాల్వంచ పట్టణ పరిధిలోని చింతలచెరువు సమీపంలోని పురాతన ఆత్మలింగేశ్వరాలయం అభివృద్ధికి రూ.1,01,116 విరాళంగా అందజేశారు. పాల్వంచకు చెందిన ఎల్లవుల కోటేశ్వరరావు సోమవారం కుటుంబ సమేతంగా ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ నిర్వాహకుడు మచ్చా శ్రీనివాసరావుకు విరాళం నగదును ఇచ్చారు. దాతలకు కమిటీ సభ్యులు ఆలయ మర్వాదలతో స్వాగతం పలికి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కృష్ణ, సాంబమూర్తి, సాదత్‌, అలీ, రమణ, వేణు తదితరులు పాల్గొన్నారు.

9. వారి సేవలో ప్రముఖులు
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌లు స్వామి వారి సేవలో పాల్గొన్నారు. వీరికి తితిదే అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ… వైకాపా ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొచ్చేందుకు కృషి చేస్తోందని తెలిపారు. వైసీపీ ఎంపీలందరూ కలిసి ప్రత్యేక హోదా వచ్చేవరకూ కేంద్రంపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

10. మానస సరోవర్ యాత్ర.. నేపాల్ చేరిన తెలుగువారు…..
మానస సరోవర్ యాత్రకు వెళ్లి అక్కడ చిక్కుకున్న తెలుగువారు ఎట్టకేలకు నేపాల్ చేరుకున్నారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం సహా చెన్నై, ఢిల్లీకి చెందిన 44 మంది యాత్రికులు జూన్ 13 మానససరోవర్ యాత్రకు బయలుదేరారు. వీరంతా సదరన్ ట్రావెల్స్ ద్వారా వెళ్లారు. అయితే, వాతావరణం అనుకూలించక వారిని తీసుకెళ్లిన సదరన్‌ ట్రావెల్స్‌ హెలికాప్టర్‌ తిరిగి రాకపోవడంతో మంచు కొండల్లో చిక్కుకుపోయారు. దీంతో.. తమకు సహాయం చేయాలంటూ వారు ప్రభుత్వాన్ని కోరుకున్నారు. నాలుగు రోజుల పాటు అవస్థలు పడిన వారు ఎట్టకేలకు సోమవారం సాయంత్రం సురక్షితంగా నేపాల్ చేరుకున్నారు. 44మంది ప్రయాణికుల్లో హైదరాబాద్ కి చెందినవారే 35మంది వరకు ఉన్నారని అధికారులు చెబుతున్నారు. వారు అక్కడ చిక్కుకుపోవడంతో వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. వారు ఇప్పుడు సురక్షితంగా ఉన్నారన్న వార్త వినగానే.. ఊపిరి పీల్చుకున్నారు.

11. చరిత్రలో ఈ రోజు/జూన్ 25
253 : సెయింట్ లూసియస్ I క్యాథలిక్ పోప్‌ గా తన పాలన ప్రారంభించిన రోజు.
1903 : ప్రసిద్ధి చెందిన ఆంగ్ల రచయిత మరియు పాత్రికేయుడు జార్జ్ ఆర్వెల్ జననం(మ.1950).
1932 : భారత క్రికెట్ జట్టు మొట్టమొదటి ఆధికారిక క్రికెట్ టెస్టును లార్డ్స్ మైదానం లో ఆడింది.
1941 : సోవియట్ యూనియన్‌ పై ఫిన్‌లాండ్ యుద్ధం ప్రకటించిన రోజు.
1945 : ప్రముఖ తెలుగు సినిమా నటి శారద జననం.
1946 : ప్రపంచ బ్యాంకు ఏర్పాటై, కార్యకలాపాలు మొదలు పెట్టింది.
1950 : కొరియా యుద్ధం మొదలైనది.
1975 : భారతదేశంలో ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితి ని ప్రకటించింది.
1983 : భారత్ తొలిసారిగా క్రికెట్ లో ప్రపంచ కప్ (ప్రుడెన్షియల్ వరల్డ్ కప్) ను గెలుచుకుంది.
1991 : వింబుల్డన్‌లో మార్టినా నవ్రతిలోవా 100 వ సింగిల్స్ మ్యాచ్ విజయాన్ని సాధించి రికార్డు సృష్టించిన రోజు.
2009 : అమెరికాకు చెందిన ప్రముఖ సంగీత కళాకారుడు మైకల్ జాక్సన్ మరణం (జ.1958).

12. శుభమస్తు తేది : 25, జూన్ 2019 సంవత్సరం : వికారినామ సంవత్సరం యనం : ఉత్తరాయణం మాసం : జ్యేష్ఠమాసం ఋతువు : గ్రీష్మ ఋతువు కాల : వేసవికాలం వారము : మంగళవారం పక్షం : కృష్ణ (బహుళ) పక్షం తిథి : అష్టమి (ఈరోజు తెల్లవారుజాము 2 గం॥ 13 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 4 గం॥ 13 ని॥ వరకు) నక్షత్రం : ఉత్తరాభద్ర (ఈరోజు తెల్లవారుజాము 3 గం॥ 2 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 5 గం॥ 38 ని॥ వరకు) యోగము : సౌభాగ్యము కరణం : బాలవ వర్జ్యం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 40 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 26 ని॥ వరకు)(ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 41 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 27 ని॥ వరకు) అమ్రుతఘడియలు : ఈరోజు అమృతఘడియలు లేవు. దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 21 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 13 ని॥ వరకు)(ఈరోజు ఉదయం 10 గం॥ 2 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 54 ని॥ వరకు) రాహుకాలం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 35 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 5 గం॥ 13 ని॥ వరకు) గుళికకాలం : (ఈరోజు ఉదయం 12 గం॥ 17 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 55 ని॥ వరకు) యమగండం : (ఈరోజు ఉదయం 9 గం॥ 0 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 38 ని॥ వరకు) సూర్యోదయం : ఉదయం 5 గం॥ 43 ని॥ లకు సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 53 ని॥ లకు సూర్యరాశి : మిథునము చంద్రరాశి : మీనము

13. తిరుమల -సమాచారం ఓం నమో వేంకటేశాయ! ఈ రోజు మంగళవారం. 25.06.2019 ఉదయం 5 గంటల సమయానికి, తిరుమల: 22C° – 29℃° నిన్న 82,528 మంది భక్తుల కు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కల్గినది, స్వామివారి సర్వదర్శనం కోసం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో గదులన్నీ భక్తులతో నిండినది, భక్తులు బైట చేచియున్నారు, ఈ సమయం శ్రీవారి సర్వదర్శనాని కి సుమారు 22 గంటలు పట్టవచ్చును నిన్న 27,902 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹: 3.57 కోట్లు, శీఘ్రసర్వదర్శనం(SSD), ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్ ₹:300/-), దివ్యదర్శనం (కాలినడక) వారికి శ్రీవారి దర్శనానికి సుమారుగా నాలుగు గంటల సమయం పట్టవచ్చును, వయోవృద్దులు మరియు దివ్యాంగుల ప్రత్యేయకం ఏర్పాటు చేసిన కౌంటర్ ద్వారా ఉ: 10 గంటలకి (750) మ: 2 గంటలకి (750) ఇస్తారు, చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారై ప్రత్యేక దర్శనాలు సుపథం మార్గం గుండా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు ఉ: 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు, శ్రీవేంకటేశ్వర సుప్రభాతం!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!తా: కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నదికావున లెమ్ము స్వామి ttd Toll free #18004254141

14. గరుడ వాహనంపై శ్రీ సుందరరాజస్వామివారి కటాక్షం ముగిసిన అవతార మహోత్సవాలు తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందర రాజస్వామివారి అవతార మహోత్సవాలు మంగళవారం ఘనంగా ముగిశాయి. చివరిరోజు సాయంత్రం స్వామివారు గరుడవాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 2.00 నుండి 3.30 గంటల వరకు ముఖమండపంలో శ్రీ సుందరరాజ స్వామివారికి స్నపనతిరుమంజనం వైభవంగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరి నీళ్ళతో స్వామి, అమ్మవారి ఉత్సవర్లకు అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 5.30 నుండి 6.15 గంటల వరకు స్వామివారికి ఊంజల్‌ సేవ వైభవంగా జరుగనుంది.అనంతరం ఆలయం బయట గల వాహనమండపంలో శ్రీసుందరరాజస్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి గరుడ వాహనంపై వేంచేపు చేస్తారు. రాత్రి 7 గంటల నుండి స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించనున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ఉపకార్యనిర్వహణాధికారి శ్రీమతి ఝాన్సీరాణి, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీ గోపాలకృష్ణా, అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.