DailyDose

తల్లిని హత్య చేసి తనువు చాలించాడు-నేరవార్తలు–06/25

Bombay Youth Kills Mother And Suicides Himself-June 25 2019-Daily Crime News

* విశాఖలోని ఓ ప్రేమ జంట పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన విశాఖ జిల్లా కోటవురట్ల మండలం పాములవాక గ్రామంలో కలకలం రేపింది.
* తల్లిని హత్య చేసి కొడుకు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ముంబైలో చోటు చేసుకొంది. ఈ ఘటనకు సంబంధించి మృతుడు వెంకటేశ్వరన్ తన లాప్‌టాప్‌లో సూసైడ్ నోటు‌ను రాశాడు.
* జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్‌ మండలం ప్రయాణంపాడులో వీఆర్‌ఏ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు వీఆర్‌ఏపై కత్తులతో దాడి చేసి హత్య చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. హత్యకు పాత కక్షలే కారణమని పోలీసులు పేర్కొన్నారు.
* వెస్టిండీస్‌ మాజీ కెప్టెన్‌ బ్రియాన్‌ లారా స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ముంబైలో ఓ కార్యక్రమానికి హాజరైన లారా ఉన్నట్లుండి ఛాతి నొప్పితో బాధపడ్డారు. దాంతో ఆయనను ముంబై పరెల్‌లోని గ్లోబల్‌ ఆస్పత్రిలో చేర్పించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
* పశ్చిమ బెంగాల్‌లో 78 బాంబులను పోలీసులు సీజ్‌ చేశారు. నార్త్‌ 24 పరగణ జిల్లాలో 60 బాంబులను, పాశ్చిం బర్దామన్‌ జిల్లాలో 18 బాంబులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. నార్త్‌ 24 పరగణ జిల్లాలో లభ్యమైన బాంబుల కేసుకు సంబంధించి 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే పాశ్చిం బర్దామన్‌ జిల్లాలో లభ్యమైన 18 బాంబులను పోలీసులు నిర్వీర్యం చేశారు. నార్త్‌ 24 పరగణ జిల్లాలోని భాట్‌పారాలో గురువారం టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య చెలరేగిన ఘర్షణల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంగతి తెలిసిందే. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
* టంగుటూరు మండలంతూర్పునాయుడుపాలెం లో పేకాట శిభిరం పై టంగుటూరు పోలీసులు దాడి…11 మందిని అదుపులోకి తీసుకొని వారివద్ద రూ.8,61,230/నగదు 16 మొబైల్ ఫోన్లు,4బైకులు స్వాధీనం.
* గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలోని పెదకూరపాడు రైల్వే స్టేషన్ వద్ద గేదెను ఢీ కొని నిలిచిన జన్మభూమి ఎక్స్ ప్రెస్ లింగంపల్లినుండి విశాఖపట్నం వెళ్తున్న జన్మభూమి ఎక్స్ ప్రెస్ పెదకూరపాడు రైల్వేస్టేషన్ వద్ద గేదెను డీకొని ,పట్టాల నడుమా ఇరుక్కొని ,సుమారు అరగంట సేపు నిలిచినపోయింది. రైల్వే గ్యాంగ్ మెన్ లు సంఘటన స్థలికి చేరుకుని పట్టాల మధ్య ఇరుకున్న గేదె కలేబరాన్ని తోలగించి ఆగిపోయిన రైలుకు మార్గం సుఖవంతం చేశారు
* బోరు బావులు మృత్యు కుహరాలుగా మారుతున్నాయి. నిత్యం ఎక్కడో చోట బోరు బావిలో పడి అభం శుభం చిన్నారులు మరణిస్తూనే ఉన్నారు. ఎన్ని ఘటనలు జరిగన మార్పు రాదు. నోరు తెరిచిన బోరుబావులను మూసేయాలన్న ఇంగిత జ్ఞానం ఇసుమంతైన ఉండదు. వారి నిర్లక్ష్యం ఖరీదు ఓ నిండు ప్రాణం. తాజాగా నెల్లూరు జిల్లాలో బోరుబావిలో పడ్డ ఓ చిన్నారి మృతి చెందడం అందరిని కలచి వేస్తోంది.
* గుంటూరు జిల్లాలో పీటలపై ఓ పెళ్లి ఆగిపోయింది. వధువును కాదని పీటల మీద నుంచి లేచిపోయాడు పెళ్లి కొడుకు. అసలు పెళ్లెందుకు ఆగిపోయింది? కారణమేంటనే కదా మీ డౌట్‌. దానికి కారణం వధువు ఆధార్ కార్డ్‌లో పేరు చివర రెడ్డి లేక పోవడమే. పేరు చివర రెడ్డిలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన సదరు పెళ్లి కొడుకు, తల్లిదండ్రులు… పెళ్లిని మధ్యలోనే ఆపేశారు. ఈ ఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది.
* హైదరాబాద్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దిల్‌సుఖ్‌నగర్‌లోని రాజధాని థియేటర్‌ సమీపంలో ఓ ప్రేమజంట కూల్‌డ్రింక్‌లో గుళికలు కలుపుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో ప్రేమికుడు మృతి చెందగా యువతి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది. వీరు నల్గొండ జిల్లా రంగారెడ్డిగూడకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
* అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్‌ మండల పరిధిలోని మన్ననూరు అటవీ ప్రాంతంలో పెద్ద పులి బీభత్సం సృష్టించింది. అడవిలోకి మేతకు వెళ్లిన ఆవుపై పులి దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. దీంతో ఆవు అక్కడికక్కడే మృతి చెందింది.
* తెలుగుదేశం, వైకాపా శ్రేణుల మధ్య జరిగిన ఘర్షణ కారణంగా ఒకరు మృతి చెందారు. ప్రకాశంజిల్లా చినగంజాం మండలం రుద్రమాంబపురంలో ఈ రోజు తెల్లవారుజామున తెదేపా కార్యకర్త ఇంటిపై వైకాపా శ్రేణులు దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో తెదేపా కార్యకర్త పద్మ(28)కు గాయాలయ్యాయి. దాడి ఘటనతో తీవ్ర మనస్తాపం చెందిన పద్మ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
* శంషాబాద్‌ మండలం తొండుపల్లి వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. ఓ వృద్ధురాలు రోడ్డు దాటుతుండగా ఆమెను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వృద్ధురాలు మృతి చెందింది. వృద్ధురాలు పెన్షన్‌ కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. మృతురాలిని మల్లమ్మ(65)గా పోలీసులు గుర్తించారు.
* మెదక్ జిల్లారేగోడ్ మండలం కోత్వన్ పల్లిలో అంగన్వాడీ కేంద్రంలో చదువు తున్న 4 ఏళ్ళ బాలికపై,ప్రక్కనే ఉన్న ప్రాథమిక పాఠశాలలో స్వీపరుగా పనిచేస్తున్న జైపాల్(26)అనే వ్యక్తి ఈనెల 22 వ తేదీన అత్యాచారం.ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన. కేసు నమోదు, రిమాండ్ కు తరలించిన పోలీసులు
* తెలుగుదేశం, వైకాపా శ్రేణుల మధ్య జరిగిన ఘర్షణ కారణంగా ఒకరు మృతి చెందారు. ప్రకాశంజిల్లా చినగంజాం మండలం రుద్రమాంబపురంలో ఈ రోజు తెల్లవారుజామున తెదేపా కార్యకర్త ఇంటిపై వైకాపా శ్రేణులు దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో తెదేపా కార్యకర్త పద్మ(28)కు గాయాలయ్యాయి. దాడి ఘటనతో తీవ్ర మనస్తాపం చెందిన పద్మ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
* ఝార్ఖండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గర్హ్వా ప్రాంతంలో ఓ బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందగా.. మరో 39 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌ నుంచి గర్హ్వా పట్టణానికి వస్తున్న బస్సు మార్గం మధ్యలో అదుపు తప్పి లోయలో పడింది.
*హైదరాబాద్‌లో ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో ప్రియుడు మృతిచెందగా.. ప్రియురాలు చావు బతుకుల్లో ఉంది. వివరాల్లోకి వెళితే… నల్గొండ జిల్లా రాగన్నగూడకు చెందిన సందీప్‌రెడ్డి అతని మరదలు త్రివేణి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు,
*జార్ఖండ్ లోని గర్హ్వాలో బస్సు ప్రమాదం సంభవించింది. బస్సు లోయలో పడిపోవడంతో ఆరుగురు మరణించగా, 15 మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 39 మంది ఉన్నారు. మరో 12 మంది ఇంకా బస్సులోనే ఉన్నారు. మంగళవారం తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగింది.
*విజయనగరం జిల్లా బొండపల్లి మండలం నెల్లివాడ వంతెనపై ఆర్టీసీ బస్సును లారీ ఢీకొంది. ఈ ఘటనలో 20మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.
* కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ట్రక్ టెర్మినల్లో 12 లారీలు అగ్ని ప్రమాదానికి గురైన సంఘటన చోటుచేసుకొంది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత సౌత్ ఇండియా ప్రైవేట్ క్యారియర్స్, గ్యారేజీ ప్రాంగణం బయట నిలిపి ఉంచిన లారీల వద్ద మంటలు రావడాన్ని పర్యవేక్షకుడు సుబ్బారావు గమనించారు.
* పెళ్లి చేసుకుందామని కలలుగన్న ఓ ప్రేమజంట శీతల పానీయంలో గుళికల మందు కలుపుకొని తాగి సోమవారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రేమికుడు సందీప్రెడ్డి మృతిచెందగా, ప్రియురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
* ఒడిశాలో అధికార బిజూ జనతాదళ్ నేత, పాట్నాగఢ్ ఎమ్మెల్యే సరోజ్ మెహర్ను ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు.
* విజయనగరం జిల్లా గుర్ల మండలంలోని ఒక గ్రామంలో యువతిపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులకు సోమవారం ఆలస్యంగా ఫిర్యాదు అందింది.
* హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలోని కమలా నెహ్రూ సాంకేతిక కళాశాల వసతి గృహంలో వంద మందికిపైగా విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
* తప్పుడు దారిలో వస్తున్న ఎస్యూవీ వాహనాన్ని ఆపబోయిన మోను యాదవ్ అనే హోంగార్డు జవానును దాదాపు 200 మీటర్ల దూరం బోనెట్పై లాక్కెళ్లిపోయిన డ్రైవరు దాష్టీకమిది
* ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్లోని జాతీయ రహదారి ప్రాంతంలో సోమవారం మావోయిస్టులు అమర్చిన ఐఈడీ(ఇప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్) బాంబులను బీడీఎస్(బాంబు డిస్పోజల్ స్క్వాడ్) బృందం నిర్వీర్యం చేసింది.
* గ్యాంగ్స్టర్ నయీం భార్య, అతడి అనుచరులపై రాచకొండ పోలీసులు పీడీ చట్టాన్ని ప్రయోగించారు. నయీం చనిపోయిన తర్వాత అతని అనుచరులు, భార్య ఇటీవల అక్రమాస్తులు, భూమికి సంబంధించిన లావాదేవీలు జరుపుతున్నట్లు వెలుగులోకి రావడంతో మరోమారు వారిపై పీడీచట్టం కింద కేసులు నమోదు చేశారు.
* పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పశ్చిమ మిడ్నాపూర్ జిల్లా కేస్పూర్లో భాజపా కార్యకర్తల ర్యాలీపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో 15 మంది గాయపడ్డారు.
* బైకు దొంగతనం ఆరోపణలపై ఝార్ఖండ్లో మూకదాడికి గురైన యువకుడు ఆ తర్వాత ఆసుపత్రిలో మరణించిన ఘటనలో 11 మందిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.
* హన్మకొండలో ఇటీవల ఓ చిన్నారిపై జరిగిన ఘాతుకాన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ వరంగల్ అర్బన్ శాఖ సోమవారం చేపట్టిన నిరసన కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది.
* ఇతర రాష్ట్రాల నుంచి కొకైన్ తీసుకువచ్చి హైదరాబాద్లో సరఫరా చేసే నైజీరియన్ ముఠాను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 254 గ్రాముల కొకైన్, రూ.3.20 లక్షల నగదు, మూడు ద్విచక్ర వాహనాలు, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ డివిజన్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సి.వివేకానందరెడ్డి వివరాలు వెల్లడించారు.
* నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ఊటుకూరు పెదపాలెంలో ఇద్దరు చిన్నారులు పైపులైన్ కందకంలో పడిపోయారు.
* ఝార్ఖండ్లో జరిగిన మూకదాడిలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ద్విచక్రవాహనం అపహరించాడని ఆరోపిస్తూ 24 ఏళ్ల యువకుడ్ని స్తంభానికి కట్టేసి గ్రామస్థులంతా విచక్షణా రహితంగా కొట్టారు.
* ఉపాధి కోసం మస్కట్కు పంపిస్తానంటూ ఓ మహిళను నమ్మించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసిన ఘటన గోపాలపురం పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
* ప్రకాశం జిల్లా ఉలవపాడులోని స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచిలో మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో బ్యాంకులోని ఫర్నిచర్, కంప్యూటర్లు దగ్ధమయ్యాయి. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
* మధ్యప్రదేశ్లోని శివపురి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అక్రమంగా తవ్వకాలు చేపడుతున్న సమయంలో ఇసుక దిబ్బలు కూలిపోయి నలుగురు మృతి చెందారు.
* భారీ వర్షాలు, పిడుగులకు ఉత్తర్ప్రదేశ్లో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 19 మంది గాయపడ్డారు. వీరంతా రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరుచోట్ల చనిపోయారని యూపీ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.