DailyDose

జులై15 కల్లా కొత్తజిల్లాలు-తాజావార్తలు–06/25

New Districts To Be Setup In Andhra By July-June 25 2019 - Daily Breaking News

* ఆంద్రప్రదేశ్ లో కొత్త జిల్లాలు జూలై 15 కల్లా ప్రకటన25 జిల్లాలుగా పెంచబోతున్న ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ 15కల్లా పూర్తి చేయాలనిప్రభుత్వనిర్ణయం.
* తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్‌ ఈ నెల 28న హైదరాబాద్‌లోని ప్రగతిభవన్ లో సమావేశం కానున్ నారు. కృష్ణా, గోదావరి జలాల పూర్తి స్థా యి వినియోగం, పంపిణీ, విభజన చట్టం లోని వివాదాలు–పరిష్కార మార్గాలపై ఆ భేటీలో చర్చించనున్ నారు. సీఎంల సమావేశానికి ముందే.. ఈ నెల 26, 27 తేదీల్లో ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, నీటి పారుదల,ఇతర శాఖల ఉన్నతాధికారులు భేటీ కానున్ నారు. వారు పలు అంశాలపై చర్చించి ముఖ్యమంత్రులకు నివేదిక ఇస్తారు. విద్యుత్‌ ఉద్యోగుల విభజన, ఏపీలో పనిచేస్తు న్న తెలంగాణ ఉద్యోగులను స్వరాష్ట్రానికి తీసుకురావడంపైనా సీఎంలు చర్చిస్తారని తెలుస్తోంది.
* విశాఖ జిల్లాలో ఏసీబీకి భారీ అవినీతి తిమింగలం చిక్కింది. రూ.2కోట్ల లంచం తీసుకుంటూ సహకార శాఖ రిజిస్ట్రార్‌ మల్లికార్జునరావు అవినీతి నిరోధక శాఖ అధికారుల వలకు చిక్కాడు. లబ్ధిదారుడి వద్ద రూ.2కోట్ల లంచం డిమాండ్‌ చేసి అడ్డంగా దొరికిపోయాడు. లంచాల్లోనే ఇదో కొత్త అవతారమనే చెప్పాలి.
* రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాద తీర్మానంపై డీఎంకే ఎంపీ ద‌యానిధి మార‌న్ ఇవాళ మాట్లాడారు. ఇటీవ‌ల జ‌రిగిన లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన బీజేపీ పార్టీకి ఆయ‌న కంగ్రాట్స్ చెప్పారు. అయిదేళ్ల విరామం త‌ర్వాత మ‌ళ్లీ డీఎంకే పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశించింద‌ని ఆయ‌న లోక్‌స‌భ‌లో అన్నారు. మా నేత అడుగుజాడ‌ల‌ను భార‌త్ అనుస‌రిస్తే.. ప‌రిస్థితులు మ‌రోలా ఉండేవ‌ని మార‌న్ అన్నారు. బీజేపీ శ‌క్తి ఆ పార్టీలో లేదు అని, అది ప్ర‌తిప‌క్షం బ‌ల‌హీన‌త‌లో ఉన్న‌ద‌ని డీఎంకే ఎంపీ చెప్పారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న అన్నాదురై నినాదాల‌ను గుర్తు చేశారు. చెన్నైలో తీవ్ర నీటి క‌రువు ఉన్న‌ట్లు మార‌న్ తెలిపారు.
* జులై 5న నిర్వహించనున్న రాజ్యసభ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌ జయ్‌శంకర్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. గుజరాత్‌ నుంచి ఆయన పోటీచేస్తున్నారు. సోమవారం సాయంత్రం భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో అధికారికంగా ఆయన పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. దౌత్యవేత్త, విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ మాజీ కార్యదర్శి అయిన జయ్‌శంకర్‌.. గత నెల 30న కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆ తేదీ నుంచి ఆరు నెలల్లోగా ఆయన పార్లమెంటు సభ్యుడిగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో భాజపా అధ్యక్షుడు అమిత్‌ షా, ఆ పార్టీ నాయకురాలు స్మృతి ఇరానీ లోక్‌సభకు ఎన్నికవ్వగా తమ రాజ్యసభ సభ్యత్వాలకు వారు రాజీనామా చేశారు. ఆ రెండు స్థానాలకు ఇప్పుడు ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. గుజరాత్‌లోని మరో రాజ్యసభ స్థానానికి గుజరాత్‌ భాజపా ఓబీసీ సెల్‌ అధ్యక్షుడు జుగల్జీ మాథుర్జీ ఠాకూర్‌ కూడా ఇవాళ నామినేషన్‌ పత్రాలు సమర్పించారు
* ప్రపంచకప్‌లో భాగంగా నేడు డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌ జట్టు ట్యాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఎటువంటి మార్పులు లేకుండా ఇంగ్లండ్‌ జట్టు బరిలోకి దిగుతోంది. ఆస్ట్రేలియా టీమ్‌లో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. కూల్టర్‌ నైల్‌, జంపా స్థానంలో బెహ్రన్‌డార్ఫ్‌ నాథన్‌ లయన్‌ జట్టులోకి వచ్చారు
* “రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య గతేడాది గణనీయంగా తగ్గింది. ఈ ఏడాది వైట్ కాలర్ నేరాల సంఖ్య బాగా పెరిగింది. 2018లో రాష్ట్రంలో మొత్తం 1,22,268 కేసులు నమోదయ్యాయి. ఆస్తుల కేసుల్లో విజయవాడ, తూర్పుగోదావరి అగ్రస్థానం ఉంది. గుంటూరు రూరల్ ప్రాంతాల్లో దాడులు కేసులు ఎక్కువ. 880 మర్డర్ కేసులు గత ఏడాది నమోదయ్యాయి.
* ఈ నెల 27వ తేదీన కొత్త తెలంగాణ సచివాలయ భవన నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు వాస్తు నిపుణుల సూచన మేరకు భూమి పూజ కోసం స్థలాన్ని గుర్తించారు.ప్రస్తుతం తెలంగాణ సచివాలయంలోని ప్రధాన బ్లాక్‌గా ఉన్న సీ బ్లాక్‌కు ఈశాన్య ప్రాంతంలో భూమిపూజ చేయాలని వాస్తు నిపుణులు సూచించారు. ఈ మేరకు వాస్తు నిపుణులు మంగళవారం నాడు పరిశీలించారు. వాస్తు నిపుణుల సూచన మేరకు భూమి పూజ చేసే ప్రదేశాన్ని ఫైనల్ చేశారు.
* ఉండవల్లిలోని ప్రజావేదికలో రెండో రోజు కలెక్టర్ల సదస్సులో భాగంగా శాంతిభద్రతల అంశంపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగు నియంత్రించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ‘‘ స్థానిక గిరిజనులకు ఉపాధి కల్పించాలి. గంజాయి సాగును రెవెన్యూ, పోలీసు, అటవీ, ఎక్సైజ్‌, వ్యవసాయ శాఖలు సంయుక్తంగా అరికట్టే ప్రయత్నం చేయాలి’’అని అన్నారు.
* అక్టోబరు 1 నాటికి బెల్టుషాపులు పూర్తిగా ఎత్తివేయాల్సిందేఅన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్సీలకు సీఎం ఆదేశంసమాజానికి మంచే చేసే నిర్ణయాల అమల్లో అడుగులు ముందుకు పడాల్సిందేజాతీయ రహదారుల వెంబడి మద్యం షాపులు వద్దుదాబాల్లో లిక్కర్‌ అమ్మకుండా చూడాలని సీఎం ఆదేశం
* పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో ఆక్రమణల తొలగింపు ఉద్రిక్తతకు దారితీసింది. స్థానిక నరసింహారావుపేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన భూములలో కొందరు ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకున్నారు.దీంతో మంగళవారం దేవాదాయశాఖ అధికారులు.. పోలీసుల సాయంతో ఆక్రమణలను తొలగించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తమ ఇళ్లను కూల్చేస్తున్నారంటూ స్థానికులు-అధికారులతో వాగ్వాదానికి దిగారు.తమ ఇళ్లను తొలగిస్తున్న సమయంలో వాహనాలకు అడ్డుగా నిలబడి నిరసన తెలిపారు . చాలా చోట్ల ఆలయ భూముల్లో అక్రమంగా ఇల్లు కట్టుకున్నారని.. వాటిని వదిలేసి తమ ఇళ్లను మాత్రమే కూల్చివేయడం దారుణమని స్థానికులు అధికారులు వాగ్వాదానికి దిగారు.
* ఈ ఏడాది ప్రారంభం నుంచి జూన్‌ 16వ తేదీ వరకు జమ్మూకశ్మీర్‌లో 113 మంది ఉగ్రవాదులను భారత బలగాలు మట్టుబెట్టినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌ రెడ్డి ఇవాళ లోక్‌సభలో వెల్లడించారు. ఈ ఆర్నేళ్ల కాలంలో 18 మంది పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. 2016 నుంచి ఇప్పటి వరకు మొత్తం 733 మంది ఉగ్రవాదులు హతమయ్యారని చెప్పారు. టెర్రర్‌ దాడులు 2014 నుంచి ఇప్పటి వరకు మూడింతలు పెరిగాయన్నారు. 2014లో 222 ఉగ్రదాడులు చోటు చేసుకోగా, 2018లో ఆ సంఖ్య 614కు చేరిందని కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు. 2018లో 257 మంది టెర్రరిస్టులు, 2017లో 213 ది, 2016లో 150 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వెల్లడించారు.
* మెగాస్టార్ చిరంజీవి పార్టీ మారుతున్నార‌నే వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. త్వ‌ర‌లోనే ఆయ‌న భారతీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ)లో జాయిన్ కాబోతున్నారంటూ సోష‌ల్ మీడియాలో వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. రెండోసారి కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ ద‌క్షిణాదిన కూడా పాగా వేయాల‌ని చూస్తోంది. ఇప్ప‌టికే రెండు తెలుగు రాష్ట్రాల్లో కీల‌క నేత‌ల‌ను త‌మ పార్టీలోకి ర‌ప్పించుకునేలా పావులు క‌దుపుతోంది. ఇప్ప‌టికే తెలుగు దేశం నుండి న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యుల‌తో పాటు అంబికాకృష్ణ వంటి నాయ‌కులు బి.జె.పిలో జాయిన్ అయ్యారు.
* ఆప‌రేష‌న్ క‌మ‌లంలో భాగంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌పై బీజేపీ ప్ర‌త్యేక దృష్టి సారించింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ఎన్నిక‌ల గెలుపులో కీల‌కంగా ఉన్న కాపు సామాజిక వ‌ర్గాన్ని త‌మ పార్టీలోకి తీసుకురావ‌డానికి బీజేపీ అధిష్టానం గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అందులో భాగంగా కొంద‌రు బీజేపీ రాష్ట్ర నాయ‌కులు ఇప్ప‌టికే చిరంజీవితో మంత‌నాలు జ‌రుపుతున్నారని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. చిరంజీవి బీజేపీలో జాయిన్ అయితే ఆయ‌న‌కు రాష్ట్ర బీజేపీ అధ్య‌క్ష ప‌ద‌వితో పాటు రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం కూడా ఇవ్వడానికి అధిష్టానం సిద్ధంగా ఉన్న‌ట్టు స‌మాచారం.
* 2018లోనే చిరంజీవి రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం ఆయ‌న కాంగ్రెస్ పార్టీలో ఉన్న‌ప్ప‌టికీ గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పార్టీ త‌ర‌పున ప్ర‌చారంకూడా చేయ‌లేదు. కాంగ్రెస్‌తో అంటీ ముట్ట‌న‌ట్లుగా ఉంటున్నారు. ఈ నేప‌థ్యంలో చిరంజీవి ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని ఆయ‌న్నిచేర్చుకోవాలని బీజేపీ అగ్ర నాయ‌కులు ప్లాన్ చేస్తున్‌రట్లు టాక్‌. నేడో, రేపో కొంత మంది ముఖ్య కాపు నాయ‌కులు కూడా చిరుతో మంత‌నాలు చేయ‌బోతున్నార‌ని పలు వెబ్‌సైట్స్, యూట్యూబ్ ఛానెల్స్‌లో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. మ‌రి ఈ వార్త‌ల‌పై చిరంజీవి ఎలా స్పందిస్తారో చూడాల్సిందే.
* కాల్‌మనీ సెక్స్ రాకెట్ విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ సీరియస్ అయ్యారు. ఈ కేసులో ఏ పార్టీ వారున్నా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.మంగళవారం నాడు అమరావతిలో కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో ఏపీ సీఎం ఎస్పీలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. విజయవాడలో కాల్ మనీ సెక్స్ రాకెట్ చోటు చేసుకోవడం దారుణమన్నారు. ఈ తరహా ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.
*ఏపీ టూరిజం అధారిటీ ముఖ్య కార్యనిర్వహణాదికారి ప్రవీణ్ కుమార్ కు భవానీద్వీపం పర్యాటక సంస్థ సిఈవోగా పూర్తీ అదనపు బాద్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం జరీ చేసింది.
*సాధారణ బదీల్లోలోనే ఉపాద్యాయుల బదిలీలకు అవకాశం కల్పించాలని పలు ఉపాద్యాయ సంఘాలు వేర్వేరు ప్రకటనల్లో కోరాయి. విద్యా సంవత్సరం ప్రారంభమై కొద్ది రోజులే అయినందున బదిలీలు వర్తింప చేస్తూ ఉత్తర్వ్యులు విడుదల చేయాలనీ పేర్కొన్నాయి.
*విద్యార్థులు లేక మూతపడుతున్న ప్రభుత్వ బడులను సమష్టిగా కాపాడుకునేందుకు వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు గ్రామం ఒక అడుగు ముందుకేసింది. నూతన జడ్పీటీసీ సభ్యుడు వంగ రవీందర్, సర్పంచి మాడ్గుల కొమురయ్య ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులను పంపించని కుటుంబాలకు గ్రామ పంచాయతీ ధ్రువపత్రాలు, ప్రభుత్వ పథకాలు వర్తించవని సోమవారం పంచాయతీలో తీర్మానం చేశారు.
*నూతన సచివాలయం, శాసనసభ భవనాల నిర్మాణాలను ఆగస్టు చివర్లో లేదా సెప్టెంబరు నుంచి చేపట్టేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ నెల చివరివారం తరువాత మంచి ముహూర్తాలు లేకపోవడంతో గురువారం శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
*అంగన్ వాడీ కార్యకర్తలు సహాయకుల్ని ప్రభుత్వ ఉద్యోగార్డులుగా గుర్తించి కనీస వేతనం అమలు చేయాలని ఏపీ అంగన్ వాడీ కార్యకర్తలు సహాయకులు సంఘం విజ్ఞప్తి చేసింది. వయసుతో సంబంధం లేకుండా సీనియార్టీని ప్రాతిపదిక పై పదోన్నతి కల్పించాలని కోరింది. ముఖ్యమంత్రి జగన్ ను కలిసేందుకు సంఘం అద్యక్ష ప్రధాన కార్యదర్శులు లలితా మజుల సోమవారం తాడేపల్లి వచ్చారు.
*రాష్ట్రంలో పురపాలక ఎన్నికల నిర్వహణకు ఆ శాఖ సన్నద్ధమవుతోంది. జులై నెలాఖరునాటికి ఎన్నికలు నిర్వహిస్తామని ఇటీవల సీఎం ప్రకటించిన నేపథ్యంలో ఏర్పాట్లపై పురపాలక శాఖ దృష్టిసారించింది. కీలకమైన ముందస్తు ఘట్టాలను మొదలుపెట్టింది.
*కృష్ణానది కరకట్టపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉంటున్న నివాసానికి ఆనుకుని నిర్మించిన ప్రజావేదిక భవనాన్ని కలెక్టర్ల సదస్సు ముగిసిన వెంటనే కూల్చేయాలని అధికారులను ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సోమవారం ఆదేశించారు.
*స్వచ్ఛ మహోత్సవ్-2019 పోటీల్లో అయిదు అవార్డులతో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. మరుగుదొడ్ల వినియోగం, ఆకర్షణీయ రీతిలో మరుగుదొడ్ల నిర్మాణం, పరిశుభ్రత తదితర అంశాల ప్రాతిపదికన ఈ అవార్డులకు ఎంపిక చేశారు.
*దేశంలోను, విదేశాల్లోను ఉగ్రవాద కేసులను దర్యాప్తు చేయడం కోసం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు మరింత వెసులుబాటు కల్పించేలా రెండు చట్టాలను సవరించాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ సోమవారం ఆమోదం తెలిపింది. రానున్న రోజుల్లో పార్లమెంటులో రెండు వేరువేరు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
*ఉపాధి హామీ పథకం పనుల్లో ఇకపై గ్రామ ప్రజల అభిప్రాయాలకు పెద్ద పీట లభించబోతోంది. గ్రామస్థులు అంగీకరించిన ‘లేబర్ బడ్జెట్’లోని పనులను మాత్రమే ఆయా గ్రామాల్లో చేపట్టాల్సి ఉంటుంది.
*రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ కాస్తా… సోమవారం లోక్సభలో ‘ఈవీఎం’లపైకి మళ్లింది! వీటి విశ్వసనీయతపై బీఎస్పీ, అన్నాడీఎంకే సభ్యులు సందేహం వ్యక్తం చేయగా, తిరిగి బ్యాలెట్ను ప్రవేశపెట్టాలని తృణమూల్ డిమాండ్ చేసింది.
*ప్రజావేదిక అక్రమ కట్టడమైతే అందులో ప్రభుత్వ సమావేశాన్ని ఎందుకు నిర్వహించారని ఏపీ తెదేపా నేతలు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబుకు కేటాయించాల్సి వస్తుందనే ప్రజావేదికను కూల్చాలన్న కక్షపూరిత నిర్ణయం తీసుకున్నారని ధ్వజమెత్తారు.
*ప్రభుత్వ ఆసుపత్రుల్లో మానసిక వైద్యం పొందిన రోగులకు చికిత్సానంతరం కోలుకున్న తర్వాత పునరావాసం కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
*రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భరత్గౌడ్ డిమాండ్ చేశారు. ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఏటా ఫీజులు పెరగడంతో పేద, మధ్య తరగతి కుటుంబాలకు విద్య దూరమయ్యే పరిస్థితి నెలకొంటోందన్నారు.
*ప్రభుత్వ ఆసుపత్రుల్లో మానసిక వైద్యం పొందిన రోగులకు చికిత్సానంతరం కోలుకున్న తర్వాత పునరావాసం కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
*రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సోమవారం గవర్నర్ నరసింహన్తో రాజ్భవన్లో భేటీ అయ్యారు. ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న అంతర్జాతీయ విత్తన సదస్సుకు ఆయనను ఆహ్వానించారు. 28న సదస్సు ముగింపు సమావేశానికి హాజరు అవుతానని గవర్నర్.. మంత్రికి తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వర్షపాతం, పంటల సాగు ఇతర అంశాలను నిరంజన్రెడ్డి గవర్నర్కు వివరించారు.
*మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతిని (జులై 8) రైతు దినోత్సవంగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
*ఆదివాసీల ఆరాధ్య దైవం కుమురం భీం వారసులకు ప్రభుత్వం ఉద్యోగాలను కల్పించింది. భీం మనుమడు సోనేరావు కుమార్తె వరలక్ష్మికి ఐటీడీఏ పరిధిలో దిగువ శ్రేణి సహాయకురాలిగా, కుమారుడు మాధవరావుకు సెకండరీ గ్రేడ్ టీచర్గా ఉద్యోగాలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో సోమవారం సోనేరావు.. కుటుంబ సభ్యులతో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
*రాష్ట్రంలో మంగళ, బుధవారాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. తూర్పు మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది.
*విజయ డెయిరీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఎండీ శ్రీనివాసరావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉదయం 11 గంటలు దాటినప్పటికీ 90 శాతం మంది ఫెడరేషన్ అధికారులు, ఉద్యోగులు, పొరుగుసేవల సిబ్బంది విధులకు రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
*ప్రజా పంపిణీ వ్యవస్థలో ఇకపై రేషన్ డీలర్లు ఉండబోరు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం కలెక్టర్ల సమావేశంలో వెల్లడించారు. వాలంటీర్లే సరకులను ఇంటింటికీ చేరవేస్తారనే అంశంపై చర్చ సందర్భంగా రేషన్ డీలర్ల ప్రస్తావన వచ్చినపుడు ముఖ్యమంత్రి పైవిధంగా స్పందించినట్లు తెలిసింది.
*పాస్పోర్టుల జారీ అంశంలో త్వరితగతిన పోలీసు పరిశీలన ప్రక్రియను పూర్తిచేసినందుకు ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగానికి పురస్కారం లభించింది. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే పోలీసు పరిశీలన ప్రక్రియను పూర్తి చేసిన ఏపీ నిఘా విభాగం 2018-19 సంవత్సరానికి దేశంలోనే అగ్రగామిగా నిలిచింది.
*డీసెట్ ప్రవేశ పరీక్షలో ఇంటర్ హాల్టికెట్ నంబర్లను తప్పుగా నమోదు చేసుకున్న అభ్యర్థులకు సరిచేసుకునేఅవకాశం కల్పిస్తున్నట్లు డీసెట్ కన్వీనర్ పి.పార్వతి తెలిపారు. మంగళవారంలోగా సరిచేసుకోవాలని పేర్కొన్నారు.
*భాషాపండిత అభ్యర్థులు జులై 4వ తేదీ లోగా పరీక్ష రుసుము చెల్లించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రూ.50 అపరాధ రుసుముతో జులై 11 వరకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు.