Movies

అందం ఆరోగ్యం ఆలియా

Alia Bhatt Starts Her Own New Youtube Channel

సినిమా తారలు ప్రేక్షకుల్ని అలరించడానికి తెర వెనుక వాళ్లు చాలా కష్టపడాల్సి వస్తుంది. ఒక్కోసారి చిన్న సీన్ అయినా భారీ కసరత్తు చేయాల్సి ఉంటుంది. వాటి గురించి బయటకు తెలిసే అవకాశాలు తక్కువ. కానీ తన సినిమాలకు సంబంధించిన తెరవెనుక ముచ్చట్లను పంచుకోవడానికి ఆలియాభట్ ఓ యూట్యూబ్ ఛానెల్ను మొదలెట్టనుంది. ‘‘ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో నా సందడి ఎలా ఉంటుందో చూసేశారు. ఇక యూట్యూబ్లో ఆస్వాదించండంటోంది ఆలియా. ‘‘ఆలియా సినిమాలకు సంబంధించి తెరవెనుక జరిగే విషయాలను ఈ ఛానెల్లో చూడొచ్చు. సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా జరిగే సరదా విషయాలతో సహా ఇందులో ఉంటాయి. అందం, ఆరోగ్యం కోసం ఆలియా పాటించే సూత్రాలు లాంటి విషయాలూ ఈ ఛానెల్లో చూడొచ్చు’’ అని ఆలియా సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.