DailyDose

లండన్‌లో అర్ధాంతరంగా దిగిన ఎయిరిండియా విమానం-తాజావార్తలు–06/27

Daily Breaking News-Air India Flight Emergency Lands In London-June 27 2019

*ముంబాయి నుండి న్యూ జెర్సీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం లండన్ లో అర్దాంతరంగా దిగింది. ఫ్లైట్ నంబరు AI191 గురువారం నాడు ముంబాయి నుండి న్యూయార్క్ కు బయలుదేరింది. విమానంలో బాంబు పెట్టినట్లు విమానం బయలుదేరిన అనంతరం అధికారులకు సమాచారం అందటంతో ఆ విమానాన్ని అర్దాంతరంగా నిలిపివేశారు.
* వెస్టిండీస్‌ విధ్వంసక క్రికెటర్‌, యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. త్వరలో క్రికెట్ కు రిటైర్ అవుతున్నట్టు ప్రకటించాడు. ఈ ఏడాది ఆగస్టు–సెప్టెంబర్‌లో స్వదేశంలో భారత్‌తో జరిగే ద్వైపాక్షిక సిరీసే తనకు చివరిదని గేల్‌ స్పష్టం చేశాడు. 39 ఏళ్ల గేల్‌ వరల్డ్‌కప్‌ తర్వాత క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నట్లు గతంలోనే ప్రకటించాడు. కాగా గేల్‌ ఇప్పటివరకూ 103 టెస్ట్‌లు ఆడి 42.19 సగటుతో 7,215 పరుగులు చేశాడు. అలాగే 294 వన్డేల్లో 10,345, 58 టీ20ల్లో 1,627 పరుగులు చేశాడు.
* పార్లమెంట్‌లో స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు విగ్రహం పెట్టాలని వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు గురువారం స్పీకర్‌ ఓం బిర్లా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఈ విషయంపై విగ్రహ కమిటీ కూడా ఆమోదం తెలిపినందున ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు.
* బడ్జెట్‌ ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ దూకుడు మీద ఉంది. జాతీయంగా,అంతర్జాతీయంగా పలు విమాన సర్వీసులను కొత్తగా పరిచయం చేస్తూ ప్రస్తుత డిమాండ్‌ను క్యాష్‌ చేసుకుంటోంది.
* అవినీతికి పాల్పడుతూ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం సబ్‌రిజిస్ట్రార్ ఏసీబీ అధికారులకు చిక్కింది. సబ్‌రిజిస్ట్రార్ సంగీత ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం లంచం డిమాండ్ చేసింది. రూ. 5 వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధకశాఖ అధికారులు రైడ్ చేసి ప్రత్యక్షంగా పట్టుకున్నారు.
* వరల్డ్ కప్ లో సెమీస్ బెర్తుపై కన్నేసిన టీమిండియా మరికాసేపట్లో వెస్టిండీస్‌తో తలపడబోతోంది. గత మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై తృటిలో ఓటమి తప్పించుకున్న కోహ్లీసేన విండీస్‌పై అప్రమత్తంగా ఆడాల్సిందే. సెమీస్ రేసుకు దాదాపు దూరమైన కరేబియన్ జట్టుపై గెలిస్తే… మిగిలిన మ్యాచ్‌లలో ఒక్కటి నెగ్గినా భారత్‌ నాకౌట్‌ స్టేజ్‌కు చేరుతుంది.
* విద్యుత్‌ వినియోగదారుల్లో సంతృప్తి స్ధాయిని మరింత పెంచడం లక్ష్యంగా పనిచేస్తానని ఏపీ ట్రాన్స్‌కో నూతన జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (జేఎండీ) కేవీఎన్‌ చక్రధర బాబు పేర్కొన్నారు. ఈ పదవిలో కొత్తగా నియమితమైన ఆయన బుధవారం విజయవాడ గుణదలలోని విద్యుత్‌ సౌధలో బాధ్యతలు స్వీకరించారు.
* గుంటూరు జిల్లా రేవేంద్రపాడు – సీతానగరం రోడ్డు లో 7.4 కిలోమీటర్ నుండి 8.7 కిలోమీటర్ వరకు (1.3 కిలోమీటర్లు) 3.66 మీటర్లు ఉన్న ప్రస్తుత రోడ్డుని 10 మీటర్లకి వెడల్పు చేయడంతో తో పాటు పటిష్ట పరుస్తారు.
* సీఎం జగన్ గారి ఇంటికి వెళ్ళే రోడ్డు ఇరుకుగా ఉందని ప్రభుత్వం కేవలం 1.3 కిలోమీటర్లకు 5 కోట్లతో వెడల్పు చేయడానికి జోవో జారీ చేసింది.
* ఉత్తర బంగాళాఖాతంలో ఈ నెల 30న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ హెచ్చరికల కేంద్రం అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్‌ తీరానికి సమీపాన పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడటమే దీనికి కారణమని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో ఏపీ, తెలంగాణలో పలుచోట్ల ఓ మోస్తరుగా, ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అన్నారు.
* వేసవి సెలవుల అనంతరం జులై 1 నుంచి సుప్రీంకోర్టు తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి కొత్త రోస్టర్‌ విధానాన్ని ప్రకటించారు. ప్రజాప్రయోజన వ్యాజ్యాల(పిల్‌)ను ఇకపై సీనియర్‌ న్యాయమూర్తులతో కూడిన ఐదు ధర్మాసనాలు విచారించనున్నాయి. ఎన్నికల అంశాలను ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనంతోపాటు జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే ధర్మాసనం కూడా విచారించనుంది. కోర్టు ధిక్కార వ్యాజ్యాలను జస్టిస్‌ అరుణ్‌ మిశ్ర, జస్టిస్‌ యు.యు.లలిత్‌ ధర్మాసనాలు విచారిస్తాయి.
* వివిధ నాణేల చెల్లుబాటుపై రిజర్వుబ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) స్పష్టతనిచ్చింది. 50 పైసలు, 1 రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయల నాణేలన్నీ చెల్లుతాయని తెలిపింది.అన్నిరకాల నాణేలు చెల్లుబాటులో ఉన్నాయని ఆర్‌బీఐ బుధవారం స్పష్టంచేసింది.
* దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లో ప్రజలకు నీళ్లు దొరకడం లేదు. పలుచోట్ల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ నేపథ్యంలో జల సంరక్షణను ప్రజా ఉద్యమంలా చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దేశంలో తీవ్ర నీటిఎద్దడిని ఎదుర్కొంటున్న 255 జిల్లాలకు ఇన్‌ఛార్జులుగా సీనియర్‌ అధికారులను నియమించింది. కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ‘జల్‌శక్తి అభియాన్‌ (జేఎస్‌ఏ)’లో భాగంగా వీరంతా ఆయా జిల్లాల్లో జల సంరక్షణ, సమర్థ నీటిపారుదల కార్యక్రమాలకు ప్రణాళికలు రూపొందిస్తారు.
* రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యవహారాలు సలహాదారు గా సజ్జల రామకృష్ణ రెడ్డి గురువారం రెండవ బ్లాక్ లోని ఆయన ఛాంబర్ లో బాధ్యత లు స్వీకరించారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాకు కల్పించిన బాధ్యతను నిర్వరించేందుకు నా శక్తీ మేరకు కృషి చేస్తానని తెలిపారు.దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆలోచనల మేరకు , జగన్ మోహన్ రెడ్డి పాద యాత్ర లో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశలో నా వంతు సహకారం అందించండం జరుగుతుంది.గత ఐదు సంవత్సరాలు లో రాష్ట్రం కోల్పోయిన వాటిని కూడగట్టుకొని, రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు తీసుకుని రావడానికి నా వంతు చిన్న చేయూత ను అందించడానికి సిద్ధంగా ఉన్నాను.
* హాజరైన విద్యా శాఖ మంత్రి ఆదిముల సురేష్, విద్యా శాఖ అధికారులుప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు సత్వర చర్యలు2 సంవత్సలలోగా పాఠశాలల సమూల మార్పు రావాలిఇప్పటి పాఠశాలల పరిస్థితి ఆధునికీకరణ తరువాత పాఠశాల పరిస్థితి ఫోటోలు వెబ్సైట్ లో అప్ లోడ్ చేయాలిఅమ్మవాడి పథకం అమలు లబ్దిదారుల ఎంపిక వివరాల సేకరణఅగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్ల అమలు తీరుతెన్నులు…విద్యా శాఖ కు బడ్జెట్ లో నిధుల కేటాయింపు పై చర్చ.
* సెక్రటేరియట్ వద్ద నిరసన కార్యక్రమం బిజెపి నిర్వహించాలని నిర్ణయించింది. ముందస్తుగా శాసనమండలి నాయకులు హైదరాబాద్ నగర బిజెపి అధ్యక్షులు శ్రీ ఎన్ రాంచందర్ రావు తన ఇంటి వద్ద ఉంటే అరెస్టు చేస్తారని భావించి …. బయట హబ్సిగూడ లోని సుప్రభాత్ హోటల్ లో ఉన్నారు కానీ పోలీసులు విషయం తెలుసుకొని సుప్రభాత్ హోటల్ వద్ద భారీ ఎత్తున మోహరించారు.
*కేంద్ర ప్రభుత్వం బుధవారం కీలక నియామకాలు చేపట్టింది. భారత గూఢచర్య సంస్థ.. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా) అధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి సామంత్కుమార్ గోయల్ను నియమించింది. మరో కీలక పదవి అయిన ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) అధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి అర్వింద్కుమార్(59)ను నియమించింది.
*గుజరాత్కు చెందిన ఫార్మా సంస్థ.. స్టెర్లింగ్ బయోటెక్కు సంబంధించిన బ్యాంకు మోసం, మనీలాండరింగ్ కేసుల్లో రూ.9,778 కోట్ల విలువైన ఆస్తుల్ని ఈడీ జప్తు చేసింది.
*ఎంసెట్ కౌన్సెలింగ్లో కీలక ఘట్టమైన ఐచ్ఛికాల(ఆప్షన్ల) ప్రక్రియ ఊహించినట్లుగానే వాయిదా పడింది. ఈనెల 24 నుంచి కౌన్సెలింగ్ జరుగుతుండగా ఆప్షన్ల ఎంపిక నేడు (గురువారం) ప్రారంభమవ్వాలి. దానిని తాజాగా జులై 1కి మార్చారు. ఆప్షన్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టాలంటే కళాశాలలు, కోర్సులు, సీట్లు, రుసుముల వివరాలను వెబ్సైట్లో ఉంచాలి.
*దాదాపు కోటి మంది సభ్యులతో పార్టీని వార్డు నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం చేసే లక్ష్యంతో గురువారం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతోంది. తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 2.30 గంటలకు జరిగే తెరాస విస్తృతస్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిని ప్రారంభించనున్నారు.
*రాష్ట్రంలో కొత్తగా నెలకొల్పిన నల్గొండ, సూర్యాపేట వైద్య కళాశాలల్లో 1,036 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. 2019-20 వైద్య విద్య సంవత్సరం నుంచి అందుబాటులోకి రానున్న ఈ కళాశాలలకు మంజూరైన పోస్టుల్లో 132 సహాయ ఆచార్యుల పోస్టులు, 904 మంది నర్సులు, పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.
*రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని సంస్థాన్ నారాయణపురం ఠాణాకు అరుదైన గౌరవం దక్కింది. ఠాణా పరిధిలోని ప్రజలకు మెరుగైన సేవలందించినందుకు గానూ దేశంలోనే ఉత్తమ పోలీసు స్టేషన్గా 14వ ర్యాంకు సాధించింది.
* అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉంటే న్యాయస్థానంలో ఉన్న వ్యాజ్యం అడ్డంకి కాదని ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్రెడ్డి తెలిపారు.
*తెలంగాణ ప్రభుత్వ అంతర్ రాష్ట్ర సంబంధాల సలహాదారుగా సీనియర్ పాత్రికేయులు టంకశాల అశోక్ను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
*రోడ్డు ప్రమాదంలో దెబ్బతిన్న వాహనానికి సర్వేయర్ అంచనా వేసిన సొమ్ముతో సహా రూ.1.93 లక్షలు, పరిహారం కింద రూ.25 వేలు, ఖర్చుల కింద మరో రూ.7 వేలు యజమానికి చెల్లించాలంటూ ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీకి రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
*తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్కుమార్ నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
*తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును బుధవారం పలువురు విదేశీ ఆచార్యులు సందర్శించారు. వారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలానికి చేరుకొని ప్రాజెక్టు నిర్మాణాలను వీక్షించారు.
*ఇకనైనా టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని తెలంగాణకు చెందిన జాతీయ మజ్దూర్ యూనియన్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కె.హనుమంతు డిమాండ్ చేశారు.
*తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును బుధవారం పలువురు విదేశీ ఆచార్యులు సందర్శించారు. వారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలానికి చేరుకొని ప్రాజెక్టు నిర్మాణాలను వీక్షించారు.
*హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్ జనరల్ కేథరిన్ హడ్డా బుధవారం తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. అమెరికా.. భారత్, తెలంగాణలతో సంబంధాలు ఇతర అంశాలను చర్చించారు. అమెరికా కామిక్ పుస్తకాలను ఆమె కేటీఆర్కు బహూకరించారు.
*రాష్ట్రంలో కొన్నిచోట్ల గురు, శుక్రవారాల్లో ఒక మోస్తరు వర్షాలుపడే అవకాశాలున్నాయని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు. ఒకట్రెండు చోట్ల భారీవర్షాలు కురిసే సూచనలున్నట్లు చెప్పారు.
*తెలంగాణలో 45 లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందించే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్ కోరారు. జల వనరులపై రాజ్యసభలో బుధవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.
*అంగన్వాడీలకు ప్రభుత్వం తీపికబురు అందించింది. జులై నుంచి వేతనాన్ని రూ.1000 పెంచుతూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన అంగన్వాడీ కార్యకర్తలు 47,541 మంది, మినీ అంగన్వాడీ కార్యకర్తలు 6,378 మంది, సహాయకులు 45,608 మంది ఉన్నారు. ప్రస్తుతం ప్రధాన అంగన్వాడీ కార్యకర్తలకు నెలకు రూ.10,500లు, మినీ అంగన్వాడీ కార్యకర్తలకు, సహాయకులకు రూ.6 వేలు గౌరవ వేతనంగా ఇస్తోంది. తాజాగా రూ.1000 పెంపు నిర్ణయంతో జులై నుంచి మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలకు రూ.11,500లు, మినీ అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులకు రూ.7 వేలు అందనుంది.
* క్యాంపు కార్యాలయం ఖాళీ చేసే వ్యవహారంలో మాజీమంత్రి కొల్లు రవీంద్రకు హైకోర్టులో ఊరట లభించింది. రవీంద్ర క్యాంపు కార్యాలయంగా వినియోగించుకుంటున్న లబ్బీపేటలోని చీఫ్ ఇంజినీర్ క్వార్టర్ను ఖాళీ చేయించే విషయంలో యథాతథస్థితి కొనసాగించాలని విజయవాడ మున్సిపల్ కమిషనర్కు హైకోర్టు స్పష్టంచేసింది.