DailyDose

నలుగురు అక్కల ఆత్మహత్యాయత్నం-నేరవార్తలు–06/28

Daily Crime News - Four Sisters Attempt Suicide - June 28 2019

* చెల్లి లేచిపోయిందని… నలుగురు అక్కలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో చోటుచేసుకుంది. కాగా… ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నలుగురు యువతులకు స్థానికులు కాపాడారు.పూర్తి వివరాల్లోకి వెళితే… జడ్చర్ల మండలానికి చెందిన ఓ వ్యక్తికి భార్య, ఆరుగురు కుమార్తెలు ఉన్నారు. ఆరుగురిలో ఒక్కరికి కూడా వివాహం కాలేదు. పెళ్లి చేసే స్థోమత కూడా వాళ్ల తల్లిదండ్రులకు లేదు. ఈ క్రమంలో ఆ ఆరుగురు అక్కా చెల్లెళ్లల్లో ఐదో అమ్మాయి… వేరే ఒక అబ్బాయితో లేచిపోయింది.తమకన్నా చిన్నది ఇంటి నుంచి వెళ్లిందని, కుటుంబం పరువు పోయిందని మనస్తాపానికి గురైన ఆమె అక్కలు నలుగురు క్రిమి సంహారక మందు తాగారు. ఈ సమయంలో వారిని అడ్డుకోకుండా అందరిలో చిన్నదైన అమ్మాయిని, తల్లిని గదిలో ఉంచి గడియపెట్టారు. తల్లి, చిన్న అమ్మాయి తప్పించుకుని బయటకు వచ్చి కేకలు వేయటంతో గ్రామస్థులు నలుగురిని స్థానిక బాదేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
* కన్నబిడ్డలను అతి దారుణంగా చంపిన ఓ తల్లికి కఠిన శిక్ష విధించింది అమెరికాలోని ఓ న్యాయస్థానం. ఇద్దరు పిల్లలను హత్య చేసినందుకు గానూ 60ఏళ్ల చొప్పున 120ఏళ్ల పెరోల్‌కు సాధ్యం కాని జైలు శిక్ష విధించింది.
* అతివేగంగా వస్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొని బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన గంగవరం మండలంలో గురువారం జరిగింది.
*ఛత్తీస్‌గఢ్ జిల్లాలోని బీజాపూర్ జిల్లా రాజనంద్‌గావ్ జిల్లాలో సీఆర్‌పీఎఫ్ జవాన్లకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
* జై శ్రీరాం అని నినదించాలంటూ ఓ ముస్లిం క్యాబ్‌ డ్రైవర్‌పై ముగ్గురు వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటన థానేలో జరిగింది. మద్యం సేవించిన ముగ్గురు వ్యక్తులు థానేలోని దివా ప్రాంతంలో క్యాబ్‌ డ్రైవర్‌ ఫైజల్‌ ఉస్మాన్‌ ఖాన్‌ను అటకాయించి జై శ్రీరాం అనాలని బెదిరించారు. జై శ్రీరాం అనకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని భౌతిక దాడికి పాల్పడ్డారు. రోడ్డు మధ్యలో కారును ఎందుకు ఆపావంటూ బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు తనపై దౌర్జన్యానికి దిగారని డ్రైవర్‌ చెప్పారు.
*రూ.2వేల నోట్లు రెట్టింపు చేస్తామంటూ సినీ ఫక్కీలో మోసానికి పాల్పడిన వ్యక్తిని యాదాద్రి భువనగిరి పోలీసులు అరెస్టు చేశారు. రెండు రోజుల్లో రూ.2వేల నోట్లు రెట్టింపు చేస్తానని నమ్మించి.. రూ.12లక్షలతో చెక్కేసిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
*కృష్ణాజిల్లా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఎయిర్ ఫోర్స్ జవాను లావణ్య ప్రకాష్ పార్ధీవదేహం.మచిలీపట్నంకు చెందిన పి.లావణ్య ప్రకాష్ (23) భారత ఎయిర్ ఫోర్స్ జవాను ప్రమాద వశాత్తు గన్ మిస్ ఫైర్ అయి మృతి.సోకసముద్రంలో తల్లిదండ్రులు, బంధువులు,స్నేహితులు.4 ఏళ్ల క్రితం ఎయిర్ ఫోర్స్ లో మెకానికల్ ఇంజనీరుగా ఎంపికైన లావణ్య ప్రకాష్.
రెండున్నరేళ్లుగా శిక్షణ అనంతరం రాజస్తాన్ లో ఉద్యోగ భాద్యతలు చేపట్టిన లావణ్య ప్రకాష్.ఉద్యోగ విధులలో భాగంగా గన్ శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలిన గన్.శరీరంలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి.గన్నవరం విమానాశ్రయం నుండి మచిలీపట్నం పంపులచెరువు లోని స్వగృహానికి తీసుకువెళ్లనున్న బంధువులు,ఎయిర్ ఫోర్స్ అధికారులు.
*గుంటూరు జిల్లాపెదనందిపాడు మండలం వరగాని గ్రామంలో ఉన్న శ్రీనివాస ఆయిల్ మిల్లు లో బాయలర్ పేలి అగ్నిప్రమాదం జరిగింది ఇద్దరికి తీవ్రగాయాలు గుంటూరు లలితా హోస్పేటల్ కి తరలింపు ఆయిల్ మిల్లు లో పని చేసే ప్రతి మనిషికి మాస్కు ధరించాలి మాస్క్ ఉండి ఉంటే ఈ ప్రమాదం జరిగిఉండది కాదు అని పలువురు భావిస్తున్నారు…
*ఛత్తీస్ ఘడ్ లో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు.కాంకర్-గడ్చిరోలి జిల్లాలో ఘటన.తప్పించుకున్న మావోయిస్టులు.ఒక 303 రైఫిల్స్, 12 బోర్ వెపన్స్, ఒక ఎల్బి బఫర్, 3 ఎయిర్ గన్స్, వైర్‌లెస్ సెట్లు, 03 గుడారాలు రోజువారీ వినియోగ వస్తువులు భారీ మొత్తంలో ఉన్నాయి.రాజ్‌నందగావ్-కాంకర్-గాడ్చిరోలి జిల్లా సరిహద్దులోని కోహ్కటోలా కొండ గ్రామం సంఘటన..మావోయిస్టుల ఆచూకికోసం కుంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులు.
*శ్రీకాకుళం జిల్లాకంచిలి మండలం జలాంత్రకోట గ్రామ 16 వ నెంబర్ జాతీయ రహదారిపై పోలీసులు తనికీలు ట్రావెలర్ లారీలో పట్టుబడ్డ కోట్లాది రూపాయిలు విలువ చేసే 300 కిలోల గంజాయి స్వాదీనండ్రైవర్ పరారీ, లారీను అదుపులోకు తీసుకుని, దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
*ఒకే కుటుంబంలోని నలుగురు యువతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలంలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. జడ్చర్ల మండలం పరిధిలోని గ్రామానికి చెందిన ఓ కుటుంబంలో ఆరుగురూ ఆడపిల్లలే ఉన్నారు. ఎవరికీ వివాహం కాలేదు. ఆరుగురిలో అయిదో అమ్మాయి బుధవారం నుంచి కనిపించకుండా పోయింది. ఆమె గురించి వెతకగా ఓ యువకుడితో వెళ్లినట్లు తెలిసింది. తమకన్నా చిన్నది ఇంటి నుంచి వెళ్లిందని, కుటుంబం పరువు పోయిందని మనస్తాపానికి గురైన ఆమె అక్కలు నలుగురు క్రిమి సంహారక మందు తాగారు. ఈ సమయంలో వారిని అడ్డుకోకుండా అందరిలో చిన్నదైన అమ్మాయిని, తల్లిని గదిలో ఉంచి గడియపెట్టారు. తల్లి, చిన్న అమ్మాయి తప్పించుకుని బయటకు వచ్చి కేకలు వేయటంతో గ్రామస్థులు నలుగురిని స్థానిక బాదేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
*రోజూలాగే కుమారుడు ఆడుకుంటున్నాడని తల్లిదండ్రులు వారి పనుల్లో నిమగ్నమయ్యారు. ఇంతలోనే మురుగుకాలువలో ప్రమాదవశాత్తూ పడి ఊపిరాడక 18 నెలల చిన్నారి మృతి చెందాడు. ఈ విషాద సంఘటన తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణం రమణయ్యపేట పంచాయతీలో జరిగింది.
*మతి స్థితిమితంలేని గిరిజన బాలిక(16)పై ఓ యువకుడు అత్యాచారం చేసిన ఘటన 9 నెలల అనంతరం వెలుగులోకి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం ఎస్సై నాగ దుర్గాప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. దేవీపట్నం మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై పి.శివసత్యనారాయణ గతంలో అత్యాచారం చేశాడు.
*మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారన్న అభియోగంపై రిమాండ్లో ఉన్న ముగ్గురు నిందితులకు గురువారం బెయిల్ మంజూరైంది.
*చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండల పరిధిలో తెదేపా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను తెలియజేసే శిలాఫలకాలను బుధవారం రాత్రి దుండగులు ధ్వంసం చేశారు.
*ప్రముఖ హేతువాది నరేంద్ర దభోల్కర్ను తాను తల వెనుక ఒకసారి, కంటిపైన మరోసారి కాల్చానని ఆయన హత్యకేసులో ప్రధాన నిందితుడు శరద్ కలాస్కర్ కర్ణాటక పోలీసుల వద్ద ఒప్పుకొన్నాడు.
*పంజాబ్లోని లుధియానా కేంద్ర కారాగారంలో రెండు గ్యాంగ్స్టర్ గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందారు.
*ఓ ఇంట్లో రిఫ్రిజిరేటర్ పేలిన దుర్ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులోని తాంబరం సమీపంలో సేలయూరు ప్రాంతానికి చెందిన ప్రసన్న ఓ ప్రైవేటు టెలివిజన్ ఛానల్లో ఉద్యోగం చేస్తున్నారు.
*వాళ్లంతా కంప్యూటర్ కోర్సులో శిక్షణ తీసుకుని ఇళ్లకు తిరిగి వస్తున్నారు. మరికాసేపు ఉంటే గమ్యస్థానాలకు చేరుకునేవారే. అంతలో వారు ప్రయాణిస్తున్న మినీబస్సు లోయలో పడిపోయింది.
*ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లాలోని మారాయిగూడెం-లింగంపల్లి అటవీ ప్రాంతాల మార్గ మధ్యలో మావోయిస్టులు గురువారం సీఆర్పీఎఫ్ శిబిరానికి నిత్యావసర సరకులు తీసుకెళ్తున్న ఆటోకు నిప్పంటించి తగలబెట్టారు.
*బిట్కాయిన్(క్రిప్టో కరెన్సీ)లో మదుపు చేస్తే రూ.లక్షల్లో లాభాలొస్తాయంటూ అంతర్జాలం ద్వారా ప్రచారం సాగించి, పలు రాష్ట్రాల వాసుల నుంచి రూ.52 కోట్లు కొల్లగొట్టిన అంతర్ రాష్ట్ర ముఠా సభ్యుడు ఆశిష్ మాలిక్ను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు దిల్లీలో అరెస్టుచేశారు.
*యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండ మండలం గోకారం వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆర్టీసీ బస్సు ఢీకొని బైక్పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడిని గోకారం గ్రామానికి చెందిన సత్యనారాయణగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు.