Devotional

అనంత పద్మనాభుని అద్భుతాలు

The wondering facts of anantha padmanabha swamy

1. అనంత పద్మనాభుని అంతులేని నిజాలు – ఆద్యాత్మిక వార్తలు
తాళపత్ర గ్రంథాల ఆధారంగా కలియుగం ఆరంభమైన 950వ రోజు తుళువంశ బ్రాహ్మణ ఋషి దివాకరముని సారథ్యంలో విగ్రహ ప్రతిష్ఠ, ఆలయ నిర్మాణం జరిగినట్లు తెలుస్తుంది. విష్ణుభక్తుడైన దివాకరముని తపస్సు ఆచరించగా శ్రీ మహావిష్ణువు రెండు సంవత్సరాల బాలుని రూపంలో ప్రత్యక్ష్మమయ్యాడు. ఆ బాలుని ముఖవర్చస్సుకు తన్మయుడైన ముని తన వద్ద ఉండిపోవాలని కోరాడు. అందుకు ఆ బాలుడు అంగీకరించి తనను వాత్సల్యంతో చూడాలని అలా జరగని నాడు వెళ్ళిపోగలనని ఆంక్ష విధించాడు. అందుకు అంగీకరించిన ముని ఆ బాలుని అమిత వాత్సల్యంతో చూస్తూ, బాల్యపు చేష్టలను ఓర్చుకుంటూ ఆనందంతో జీవిస్తున్నారు. ఒక రోజు దివాకరముని పూజా సమయంలో సాలగ్రామాన్ని ఆ బాలుడు నోటిలో ఉంచుకొని పరుగెత్తాడు. అందులకు ముని బాలునిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనకు ఇచ్చిన మాటను ముని తప్పినాడని భావించి ఆ బాలుడు నన్ను చూడాలని పిస్తే అరణ్యంలో కనిపిస్తానని చెప్పి అదృశ్యమైనాడు. ఈ సంఘటనతో దివాకరమునికి ఆ బాలుడు ఎవరైనది అర్థమై తీవ్ర మనోవ్యధకు గురైనాడు. ఎలాగైనా ఆ బాలుని తిరిగి దర్శించుకోవాలన్న తలంపుతో ముని అరణ్యబాట పట్టగా, క్షణకాలం పాటు కనిపించిన ఆ బాలుడు, అనంతరం ఒక మహా వృక్షరూపంలో నేలకొరిగి శ్రీమహావిష్ణువు శేషశాయనుడిగా ఉన్న రూపంలో కనిపించాడు. ఆ మహిమాన్విత రూపం దాదాపు 5 కి.మీ. దూరం వ్యాపించి, శిరస్సు ‘తిరువళ్ళం’ అన్న గ్రామం వద్ద, పాదములు ‘త్రిప్పాపూర్’ వద్ద కన్పించాయి. అంతటి భారీ విగ్రహన్ని మానవమాతృలు దర్శించడం కష్టమని, కనువిందు చేసే రూపంలో అవరతించాలని ముని వేడుకున్నాడు. ముని విన్నపాన్ని మన్నించిన స్వామి ప్రస్తుత రూపంలో కన్పించగా, ఆ విగ్రహాన్ని తెచ్చి ‘తిరువనంతపురం’లో ప్రతిష్ఠించినట్లు కథాంశం.
**ఆలయ నిర్మాణం
ఆలయ నిర్మాణం అంచెలంచెలుగా జరిగినట్లు తెలుస్తున్నది. సుమారు 5వ శతాబ్దకాలంలో ‘చేరమాన్ పెరుమాళ్’ అనే రాజు ఈ ఆలయానికి మొదటి పునాది వేసినట్లు చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి. ఈ రాజు హయాంలో ఆలయంలోని పూజారులు, పాలనా ఉద్యోగులను నియమించినట్లు తెలుస్తుంది. అనంతరం క్రీ.శ.1050 వ సంవత్సరంలో స్థానిక పాలకులు ఆలయ ప్రాకారం నిర్మించారని తెలుస్తున్నది. తరువాత క్రీ.శ.1335-1384 సంవత్సర మధ్యకాలంలో ఈ ప్రాంతాన్ని పాలించిన ‘వీరమార్తాండ వర్మ’ అనే రాజు ఆలయ పాలన, వ్యవహారాలను స్వాధీనం చేసుకున్నాడు. ఈయన హయాంలో క్రీ.శ.1375 సంవత్సరంలో అల్పిసి ఉత్సవాన్ని ప్రవేశపెట్టాడు. ప్రతి ఆరు మాసాలకొకసారి ఈ ఉత్సవం జరుగుతుంది. పదిరోజులపాటు సాగే ఈ ఉత్సవం నేటికి కొనసాగుతూ ఉంది. క్రీ.శ.1459-60 సంవత్సరాల మధ్యకాలంలో ఆలయ గర్భగుడి పునరుద్ధరణ జరిగింది. క్రీ.శ.1461లో ఒక రాతిపై ‘ఓట్టకల్ మండపం’ నిర్మాణం జరిగింది. అనంతరం క్రీ.శ.1729 సంవత్సరంలో తిరువాన్కూర్ రాజు ‘రాజా మార్తాండ వర్మ’ కాలం నుంచి నేటి వరకు ఆలయ నిర్వహణతో పాటు పలు మండపాలు, ముఖద్వారాలు, ప్రాంగణాలు, ఆలయ నిర్మాణాలు జరిగాయి.
**ఆలయ సౌందర్యం
ప్రధానాలయం మలయాళ సంప్రదాయ పద్ధతిలో నిర్మాణం జరిగింది. దాదాపు 7 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయ గాలిగోపురం ఆనుకొని చుట్టూ ప్రహారి నాలుగు ముఖద్వారాలతో నిర్మించబడింది. ఆలయంలో స్వామి ఊరేగింపుకై ప్రాంగణం నిర్మించబడింది. నాలుగు మూలల నాలుగు ఉయ్యాల మండపాలతో, అద్భుత శిల్పకళా నైపుణ్యంతో ఈ ప్రాంగణం నిర్మించారు. ఆలయ తూర్పు ముఖద్వారం వద్ద 3 ఎకరాల విస్తీర్ణంలో ‘పుష్కరిణి’ చాలా విశాలంగా అందమైన మెట్లతో నిర్మాణం జరిగింది. ఆలయంలో శ్రీ నారసింహ, శాస్త (అయ్యప్ప), పార్థసారథి ఆలయాలు ఉన్నాయి. ఆలయ ధ్వజస్తంభం వద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది.
**ప్రధాన ఉత్సవాలు
ప్రతి సంవత్సరం ఆరు మాసాలకు ఒకసారి తులా మాసం (సెప్టెంబరు / అక్టోబరు) లో, ఫాల్గుణ మాసం (మార్చి / ఏప్రిల్) లో ‘అల్పిసి ఉత్సవాలు’ జరుగుతాయి. తులా మాసంలో జరిగే ఉత్సవాలాలో ‘ఆరాట్టు’ ఊరేగింపు ప్రధానమైనది. శ్రీ పద్మనాభ, శ్రీనారసింహ, శ్రీకృష్ణ దేవతా విగ్రహాలను గరుడవాహనంపై ఊరేగించి సముద్ర స్నానాలకు తీసుకొని వెళతారు. ఈ ఊరేగింపు అధికార లాంఛనాలతో రాజు కరవాళం చేతబట్టి ముందు నడవాల్సి ఉంది.
**దివ్యదేశాలు
జ్యోతిర్లింగాలు 12 ఉన్నట్టుగానే విష్ణుమూర్తికి సంబంధించిన 108 దివ్యదేశాలున్నాయి. అందులో ఒకటి తిరువనంతపురంలోని ఈ అనంతపద్మనాభస్వామి దేవాలయం. అనంతపద్మనాభుడు హిందువులకు అతి పవిత్రమైన దేవుడు. ఈ దేవాలయ గోపుర నిర్మాణం 16 వ శతాబ్దంలోజరిగింది. 18 వ శతాబ్దంలో చిట్టచివరి మెరుగులు దిద్దారు. అతి పెద్ద చెరువు పక్కన ఉండటం వలన ఆలయ సౌందర్యం రెట్టింపయ్యింది. ఈ చెరువును పద్మతీర్థం (తామరల కొలను) అంటారు. ఈ దేవాలయం పేరుమీదే కేరళ రాజధానికి తిరువనంతపురం అనే పేరు వచ్చింది. ‘తిరు’ ‘అనంత’ ‘పురం’ అంటే ‘అనంతపద్మనాభునికి నెలవైన ప్రదేశం’ అని అర్థం. అనంత పద్మనాభుడు అనంతశయన ముద్రలో (యోగనిద్ర ఆకృతిలో అనంతుడనే సర్పం మీద శయనించి) దర్శనమిస్తాడు. ఈ విగ్రహాన్ని కటుశర్కర యోగం అనే ఆయుర్వేద ఔషధాల మిశ్రమంతో తయారుచేశారు. అనంతుడనే సర్పం మీద శయనించి, తలను దక్షిణ దిక్కుగా పెట్టుకుని ముఖాన్ని తూర్పుముఖంగా ఉంచి శయనిస్తున్న ముద్రలో ఉంటాడు. అనంతుడు లేదా ఆదిశేషువు మీద శయనించిన భంగిమలో విష్ణువు దర్శనమిస్తాడు. నేపాల్‌లోని గండకీ నదీ తీరం నుంచి ఏనుగుల సహాయంతో తీసుకొచ్చిన 12000 సాలగ్రామాలతో ఈ విగ్రహం తయారయ్యింది. ఈ విగ్రహానికి అభిషేకం చేయరు. కేవలం పూలతో మాత్రమే పూజిస్తారు. ఇక్కడ భగవంతుడు మూడు ద్వారాల గుండా దర్శనమిస్తాడు. మొదటి ద్వారం నుంచి విష్ణువు చేతికిందుగా ఉన్న శివుని ముఖం, రెండవ ద్వారం గుండా నాభి నుంచి వెలువడిన కమలం మీద ఆసీనుడైన బ్రహ్మ, ఉత్సవమూర్తులు, శ్రీదేవిభూదేవులు, మూడవ ద్వారం నుంచి విష్ణుమూర్తి పాదపద్మాలు దర్శనమిస్తాయి. ఎవరైనా ఆయనకు ముడుపులు చెల్లిస్తే, అది నేరుగా భగవంతునికే చెందుతుంది. విష్ణువు… శయనించి, కూర్చుని, నిలబడి… మూడు భంగిమలలో దర్శనమిస్తాడు. పద్మనాభుని విగ్రహంలో ముఖభాగం, వక్షస్థలం మినహా… కిరీటం, కుండలాలు, మెడలో ధరించిన సాలగ్రామహారం, కంకణం, కమలం, కాళ్లు… అన్నీ బంగారంతో తయారైనవే. కటుశర్కర రక్షణ కారణంగా శత్రువుల కన్ను ఈయన మీద పడలేదని మహారాజు భావించేవారు.ఈ దేవాలయానికి ఆరు నేలమాడిగలు ఉన్నాయి. భక్తులు, రాజులు చెల్లించిన ముడుపులు ఇందులోనే దాచేవారంటారు. వాటికి ఎ, బి, సి, డి, ఇ, ఎఫ్ అని పేర్లు పెట్టారు. ఎ, బి మాడిగలను 130 సంవత్సరాలుగా ఏనాడూ తెరవలేదు. సి నుంచి ఎఫ్ వరకు లెక్క ప్రకారం తెరిచేవారు.
**భగవంతుని రాజ్యం
కేరళ రుతి దిశలో మలబార్ తీరాన ఉన్న రాష్ట్రము. కేరళ సరిహద్దులలో తూర్పు మరియు ఈశాన్య దిక్కులలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు, పడమర దిక్కున అరేబియా సముద్రం, దక్షిణాన హిందూ మహాసముద్రం ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరికి చెందిన మాహె పూర్తిగా కేరళలోనే ఉంది. దక్షిణ భారతంగా పరిగణించబడే నాలుగు రాష్ట్రాలలో కేరళ ఒకటి.క్రీ.పూ.10 వ శతాబ్దంలో ద్రావిడ భాషలు మాట్లాడే వారు ఇక్కడ స్థిరపడ్డారు. మౌర్య సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. తరువాతి కాలంలో చేర సామ్రాజ్యంలోను, భూస్వామ్య నంబూదిరిల పాలనలోను ఉంటూ వచ్చింది. విదేశాలతో ఏర్పరచుకుంటున్న సంబంధాలు చివరకు స్థానికులకు, ఆక్రమణదారులకు మధ్య ఘర్షణలకు దారితీసాయి. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అనుసరించి 1956 నవంబర్ 1 న కేరళ పూర్తి స్థాయి రాష్ట్రంగా అవతరించింది. 19వ శతాబ్దంలో కొచ్చిన్, తిరువాన్కూరు సంస్థానాలు చేపట్టిన సామాజిక సంస్కరణలు స్వాతంత్ర్యం తరువాత వచ్చిన ప్రభుత్వాలు కొనసాగించారు. అందువలన మూడో ప్రపంచ దేశాల్లోనే అత్యధిక అక్షరాస్యత ఉన్న, అత్యంత ఆరోగ్యకరమైన ప్రాంతంగా కేరళ నిలిచింది. అయితే, ఆత్మహత్యలు,నిరుద్యోగం, నేరాలు భారత్‌లో కెల్లా అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో కేరళ ఒకటి.కేరళకు ఆ పేరెలా వచ్చిందనే విషయంలో వివాదం ఉంది. కేర అంటే కొబ్బరి చెట్టు, ఆళం అంటే భూమి – ఈరెంటి నుండి కొబ్బరిచెట్ల భూమిగా కేరళం అయింది అనేది ఒక వాదన. ఈ విధంగా కేరళీయులు తమ భూమిని కేరళంగా పిలుచుకుంటారు. చేర, ఆళం అనగా చేరుల భూమి అనే మాట నుండి కేరళం వచ్చిందనేది మరో వాదన.ట్రావన్కోర్ (తిరువాన్కూరు) రాజు రాజా మార్తాండ వర్మ తన రాజ్యాన్ని తిరువనంతపురం లోని పద్మ నాభ స్వామికి అంకితం చేసి ఆయన దాసునిగా రాజ్యాన్ని పరిపాలించాడు. అతని తర్వాత ఆయన వారసులైన రాజులు కూడా ఆ విధంగా నే చేసారు. రాజ ముద్రలు దేవుని పేరునే ఉండేవి. అందు కనే కేరళను “God’s own country” భగవంతుని రాజ్యంగా అంటారు.అనంతపద్మనాభుడు అనగా నాభి (బొడ్డు) యందు పద్మమును కలిగి అంతము లేనివాడు అని అర్ధం. శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం శ్రీమహావిష్ణువు ఆలయం. ఈ ఆలయం భారతదేశంలోని కేరళా రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఉంది. ఈ ఆలయం ప్రస్తుతం త్రివాంకోర్ రాజకుటుంబం అధ్యతలో నడుస్తున్న ధర్మకర్తల నిర్వహణలో నడుస్తుంది.ఈ మధ్యనే ఈ దేవాలయం లోని నేలమాళిగలలో లక్షన్నర కోట్లకు పైగా విలువ చేసే అపార సంపద బయటపడడంతో ఈ దేవాలయం ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కటం విశేషం. అందులో దురుద్దేశముందో, లేదో ఆ పరమాత్ముడికే ఎరుక.
2. అన్నదాన పథకానికి విరాళం
ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ వారి అన్నదాన పథకానికి నగరానికి చెందిన కొడాలి శ్రీనివాస్, చంద్రశేఖర్ రూ.1,00,116, లబ్బీపేటకు చెందిన డి.కేశవరావు, నాగేశ్వరమ్మ దంపతులు రూ.లక్ష వేర్వేరుగా మొత్తం రూ.2,00,116లను గురువారం ఆలయ అధికారులకు అందజేశారు. వారికి అధికారులు అమ్మవారి దర్శనం చేయించి అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు.
3. రెండు రోజుల్లో తిరుమల యాత్ర
పర్యాటకులకు పసందైన వినోదాన్ని అందించడానికి ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ టూరిజం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఆర్‌సీటీసీ) కొత్త కొత్త ప్యాకేజీలు ప్రకటిస్తూనే ఉంటుంది. హైదరాబాద్‌ నుంచి తిరుమలకు విమాన ప్యాకేజీ నిర్వహిస్తోంది.
ఎప్పుడు: జులై 12, 19, 26, ఆగస్టు 9, 16, 23, సెప్టెంబరు 6, 13, 20
ఎన్ని రోజులు: ఒకరాత్రి-రెండు పగళ్లు
ఏమేం చూపిస్తారు: తిరుపతి, కాణిపాకం, శ్రీనివాస మంగాపురం, శ్రీకాళహస్తి, తిరుచానూరు, తిరుమల
ప్యాకేజీలో.. విమాన టికెట్లు, వసతి, భోజన సదుపాయం, రోడ్డు ప్రయాణ సౌకర్యం (ఏసీ వాహనం), బస, ప్రయాణ బీమా, గైడు సర్వీసు
ప్యాకేజీ ధర: రూ. 9,970 నుంచి రూ.11,250 (పెద్దలకు)
రూ.9,520 నుంచి రూ.9,390 (2-11 సం।।లోపు పిల్లలకు)
మరిన్ని వివరాలకు www.irctctourism. వెబ్‌సైట్‌ని చూడండి.
4. చరిత్రలో ఈ రోజు/జూన్ 28 – పాములపర్తి వెంకట నరసింహారావు
1914 : ఆస్ట్రియా రాజు ఆర్చ్ డ్యూక్ ఫెర్డినాండ్ ను సెర్బియా దేశస్థుడు హత్యచేశాడు. ఈ సంఘటనే మొదటి ప్రపంచ యుద్ధం కి రితీసింది.
1921 : భారత ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మొదటి దాక్షిణాత్యుడు, ఒకేఒక్క తెలుగువాడు, పాములపర్తి వెంకట నరసింహారావు జననం (మ.2004).
1931: ప్రముఖ తెలుగు చిత్ర రచయిత మరియు నిర్మాత ముళ్ళపూడి వెంకటరమణ జననం (మ. 2011).
1969 : తెలుగులో ప్రచురించబడుతున్న వ్యవసాయదారుల సచిత్ర మాసపత్రిక అన్నదాత ప్రారంభం.
1972 : భారత ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసిన పి.సి.మహలనోబిస్ మరణం (జ.1893).
1976 : భారతదేశానికి చెందిన ప్రముఖ షూటింగ్ క్రీడాకారుడు జస్పాల్ రాణా జననం.
2005 : భారతీయ పౌరసత్వ చట్టము అమలులోకి వచ్చింది.
5. శుభమస్తు
తేది : 28, జూన్ 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : జ్యేష్ఠమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
కాలము : వేసవికాలం
వారము : శుక్రవారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : దశమి
(నిన్న తెల్లవారుజాము 5 గం॥ 45 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 6 గం॥ 35 ని॥ వరకు)
నక్షత్రం : అశ్విని
(నిన్న ఉదయం 7 గం॥ 43 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 9 గం॥ 9 ని॥ వరకు)
యోగము : సుకర్మము
కరణం : భద్ర(విష్టి)
వర్జ్యం : (ఈరోజు తెల్లవారుజాము 4 గం॥ 54 ని॥ నుంచి ఈరోజు ఉదయం 6 గం॥ 35 ని॥ వరకు)(ఈరోజు రాత్రి 7 గం॥ 4 ని॥ నుంచి ఈరోజు రాత్రి 8 గం॥ 43 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు తెల్లవారుజాము 1 గం॥ 31 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 3 గం॥ 12 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 21 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 13 ని॥ వరకు)(ఈరోజు ఉదయం 12 గం॥ 44 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 36 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 10 గం॥ 39 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 17 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 7 గం॥ 22 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 0 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 35 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 5 గం॥ 13 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 44 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 53 ని॥ లకు
సూర్యరాశి : మిథునము
చంద్రరాశి : మేషము
6. ప్రహ్లద సమేత యంగా వేలశి యున్నక్షేత్రము శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానము*
కదిరి పట్టణము – 515591, అనంతపురము జిల్లా., ఆంధ్రప్రదేశ్
ఫోన్ నెం : 08494 – 221066, 221366
28.06.2019 వతేది, *శుక్రవారము ఆలయ సమాచారం
*శ్రీస్వామి వారి దర్శన వేళలు
ఉదయము 5.30 గంటలకై అలయము శుద్ది, మొదటి మహాగంట, నివేదన, బాలబోగ్యం త్రికల నైవేద్యాములు సమర్పణ. పరివారదేవతలకు (చుట్టువున్నఆలయములకు) నివేదనసమర్పణ..స్వామి వారి దర్శనము ఉదయము 6.00 గంటల నుండి 7.30 గంటలకు వుండుఅనంతరము ఉదయం 7.30 గం|| నుండి స్వామివారికి అర్జిత అభిషేక సేవ ప్రారంభమగును.
స్వామి వారికి *_ఆర్జిత అభిషేకము_* సేవా, సహస్రనామర్చన, పుష్ప అలంకరణ, మహా మంగళ హారతితో పాటు నివేదిన, ప్రసాదము నైవేధ్యము సమర్పణ కార్యకమమును ( ఉదయము 7.30 గంటలనుండి 9.30 గంటల వరకు ) నిర్వహించెదరు..
*_అమృత వళ్ళీ అమ్మవారికి (లక్ష్మీదేవి) శుక్రవారము సందర్భముగా ప్రత్యేక అభిషేకము ఉదయము 7.30 గంటలనుండి నిర్వహించబడును_* తిరిగి సర్వ దర్శనము ఉదయము 10.00 గంటల నుండి మ. 12.00 వరకు వుండును.. రెండవ మహాగంట నివేదనమ.12.00 నుండి 12.30 లోపు, బాలబోగ్యం త్రికల నైవేద్యాము సమర్పణ..మ. 12.40 నుండి 1.30 వరకు సర్వదర్శనము.. అనంతరము ఆలయము తలుపులు మూయబడును..తిరిగి సాయంత్రము శ్రీస్వామి వారి దర్శనార్థము 4.30 గంటలనుండి రా.6.00 వరకు వుండును.. మూడవ మహా గంట ఆలయ శుద్ది, నివేదన రా.6.00 నుండి 6.30 లోపు, బాల బోగ్యం త్రికల నైవేద్యాదులు సమర్పణ. మహ మంగళ హారతి, పరివారదేవతలకు (చుట్టువున్నఆలయములకు) నైవేద్యాములు సమర్పణ.. తిరిగి శ్రీస్వామి వారి దర్శనార్థము రాత్రి 6.30 గంటల నుండి రా.8.30 వరకు వుండును..
రాత్రి 8.30 గంటల పైన ఆలయ శుద్ది అనంతరము, స్వామి వారికి ఏకాంత సేవాతో స్వామి వారి దర్శనము పరిసమప్తం అగును, తదుపరి ఆలయము తలుపులు ముయాబడును..*ఆర్జిత సేవాల వివరములు**_28.06.2019 తేదికి (ఈ రోజు సా.7.00 వరకు) ఆర్జిత అభిషేకము సేవా టిక్కెట్లు బుకింగ్: 33_**_28.06.2019 తేదికి (ఈ రోజు సా.7.00 వరకు) అర్జిత స్వర్ణకవచ సేవా టిక్కెట్లు బుకింగ్: 6
7. తిరుమల సమాచారంఓం నమో వేంకటేశాయ
ఈరోజు శుక్రవారం *28-06-2019* ఉదయం *5* గంటల సమయానికి.
తిరుమలో పెరిగిన భక్తుల రద్దీ…… శ్రీవారి దర్శనానికి *అన్ని* కంపార్ట్ మెంట్ లు నిండి బయట క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు… శ్రీ వారి సర్వ దర్శనానికి *24* గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వ దర్శనానికి *6* గంటల సమయం పడుతోంది.. నిన్న జూన్ *27* న *70,021* మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది. నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు *₹:* కోట్లు.
8. అమర్‌నాథ్‌ యాత్రపై ఉగ్ర నీడలు
అమర్‌నాథ్‌ యాత్రలో యాత్రికులను టార్గెట్‌ చేస్తూ అదును చూసి విరుచుకుపడాలని ఉగ్రవాదులు సన్నద్ధంగా ఉన్నారని నిఘా సంస్థలు హెచ్చరించాయి. నిఘా సంస్థల సమాచారం ప్రకారం జమ్ము కశ్మీర్‌లోని గందేర్బల్‌, కంగన్‌ పర్వత ప్రాంతాల్లో ఉగ్రవాదులు తలదాచుకున్నట్టు సమాచారం. పాకిస్తాన్‌కు చెందిన జైషే మహ్మద్‌ ఉగ్రవాదులు బల్తాల్‌ రూట్‌ ద్వారా వెళ్లే అమర్‌నాథ్‌ యాత్రికులను లక్ష్యంగా చేసుకున్నట్టు నిఘా సంస్థలు పసిగట్టాయి.జులై 1 నుంచి ప్రారంభమయ్యే అమర్‌నాథ్‌ యాత్రపై ఉగ్రదాడి ముప్పు పొంచి ఉందని తాజా హెచ్చరికలతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. యాత్ర సాగే మార్గం వెంబడి పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేపట్టేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. అమర్‌నాథ్‌ యాత్రలో పాల్గొనే యాత్రికుల భద్రత దృష్ట్యా వారి కదలికలను తెలుసుకునేందుకు ఉపకరించే బార్‌కోడ్‌ ఆధారిత స్లిప్‌లు జారీ చేయనున్నారు. యాత్రికుల భద్రతను పెంచేందుకు మరింత అప్రమత్తంగా ఉండాలని పారామిలటరీ బలగాలు, సీఆర్‌పీఎఫ్‌లకు ఆదేశాలు జారీ అయ్యాయి. మరోవైపు జమ్ము కశ్మీర్‌లో భద్రతా అధికారులతో ఉన్నతస్ధాయి సమావేశం నిర్వహించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా యాత్రికుల భద్రతకు మరిన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
9. నేటి నుంచి శుభకార్యాలు బంద్‌
వివాహాది శుభకార్యాలకు మూఢమి కారణంగా అంతరాయం కలగనుందని రాష్ట్ర అర్చక పురోహిత విభాగం అధ్యక్షుడు శ్రీరామదుర్గ కుమారాచార్యులు తెలిపారు. గురువారం కామవరపుకోటలోని లలితా పీఠంలో ఆయన మాట్లాడుతూ మూఢమి ప్రవేశంతో పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, ఇతర శుభకార్యాలు దాదాపు మూడు నెలలపాటు ఆగుతాయన్నారు. ఏటా వివాహాది శుభకార్యాలకు శ్రావణ మాసంలో చక్కటి ముహూర్తాలు ఉండేవని, జూలై ఆషాఢ మాసం కావడంతో శూన్యమాసం అయ్యిందని, కారణంగా శుభకార్యాలు జరగబోవని తెలిపారు. ఈ ఏడాది శ్రావణ మాసంలో కూడా మూఢమి వచ్చింది. సెప్టెంబర్‌ భాద్రపద మాసం కావడంతో శూన్యమాసమయ్యింది. మూడు నెలలు శుభకార్యాలకు ఆటంకం ఏర్పడింది. అక్టోబర్‌ 2 నుంచి ముహూర్తాలు మొదలవుతాయి.