ScienceAndTech

వాడి పారేసిన ప్లాస్టిక్ నీళ్ల సీసాతో…

Anand Mahindra Tweets A Brand New Out Of The Box Solution-Two Rupees Door Stopper

సాధారణంగా ఒక పది మంది నివసించే గదిలో తలుపులు మూయటం తెరవటం అనేది ఒక పెద్ద సమస్య. గదిలోని మిత్రులు క్షణక్షణానికి ఎవరో ఒకరు బయటికి వెళ్లడం తలుపు మూయకపోవటం ఇతరులకు చికాకు తెప్పిస్తుంది. అయితే ఈ సమస్యకు ఒక వ్యక్తి చాలా తక్కువ ఖర్చుతో కనిపెట్టిన పరిష్కారం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఎవరో వ్యక్తి తన తలుపు మూసేందుకు ఉపయోగించిన ప్లాస్టిక్‌ బాటిల్‌ ఆలోచనను చూసిన ప్రముఖ వ్యాపారవేత్త మహీంద్రా గ్రూపు సంస్థల ఛైర్మన్‌ దాన్ని తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేయడంతో అది వైరల్‌గా మారింది. సాధారణంగా తలుపు మూసేందుకు కావాల్సిన హైడ్రాలిక్‌ పరికరానికి రూ.1500 అవుతుండగా ఇతను కేవలం రూ.2తో పరిష్కారం కనిపెట్టాడని అతన్ని కొనియాడారు. నేను వాట్సాప్‌లో ఎన్నో విషయాలు చూస్తుంటా.. కానీ నిత్య జీవితంలో సమస్యల పరిష్కారానికి ఉపయోగపడే వాటిపైనే తాను ఆలోచిస్తానని పేర్కొన్నారు.