Agriculture

సరైన కుండీతో మంచి ఫలితాలు ఉంటాయి

Your soil pot is the key to good yield at home

తొలకరి జల్లు మొదలైంది… నారు పోయాలన్నా, నాట్లు వేయాలన్నా, మొక్కలు నాటాలన్నా…ఇదే అనువైన కాలం. ఇంకెందుకాలస్యం! పని మొదలుపెట్టేయండి.
*పెంచాలనుకున్న మొక్క ఎంత ఎత్తులో పెరుగుతుంది… ఏ లోతులో వేళ్లూనుకుంటుంది… గుబురుగా ఎదుగుతుందా… తీగలా అల్లుకుపోతుందా…అన్ని విషయాలు ముందే తెలుసుకుని కావాల్సిన పరిమాణంలో కుండీని ఎంచుకోండి. వాడకుండా పక్కన పడేసిన బకెట్‌లు, ప్లాస్టిక్‌ టబ్‌లు వంటివన్నీ ఉపయోగపడేవే. వాటికి చక్కగా పెయింట్‌ వేసి మొక్కలు నాటేందుకు అనువుగా తీర్చిదిద్దండి.
*మొక్కలు నాటేందుకు ఎన్‌పీకే ఉండే సమగ్ర ఎరువు, కోకోపీట్‌ని మట్టిలో కలిపి సిద్ధం చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కుండీల్లో నింపి పెట్టుకోవాలి. నీటి అవసరం తక్కువగా ఉండే మొక్కల కోసం కాస్త ఇసుకనూ చేర్చుకుంటే మంచిది. చీడపీడలు ఎదురుకాకుండా కొద్దిగా వేప పిండినీ అందులో అప్పుడప్పుడూ కలపండి.
*చిన్న చిన్న డబ్బాల్లో లోతైన వేళ్లు లేని మొక్కలు అంటే గడ్డిగులాబీ(పోర్ట్యులాకా), మరువం, డయాంథŸస్‌ లాంటి పూల మొక్కలు, కొత్తిమీర, మెంతి లాంటి ఆకుకూరల్ని పెంచుకోవచ్చు. వీటిని బాల్కనీ గ్రిల్‌, ఏదైనా స్టాండ్‌కు వేలాడదీయడం వల్ల స్థలం వృథా కాదు. పెద్ద పెద్ద కుండీల్లో గార్డేనియా, గులాబీ, మందార లాంటివి ఎంచుకోవచ్చు. ఈ కుండీలను అందంగా అమర్చుకుని ఆ ప్రదేశంలో పాత కుర్చీలు, చిన్న టేబుల్‌, కొవ్వొత్తులు వంటివి ఏర్పాటుచేస్తే చూడ్డానికి బాగుంటుంది.