Business

టోల్‌ట్యాగ్ కష్టాలకు చెల్లు

Indian Govt To Issue Fast Tags To All Four Wheelers To Reduce TollTag Congestion

ఫోర్‌‌‌‌‌‌‌‌ వీలర్లకూ ఫాస్ట్‌‌‌‌‌‌‌‌ ట్యాగ్‌‌‌‌‌‌‌‌!.. టోల్ ఫ్లాజాల మనీ కట్టక్కర్లేదు……

హైవేలపై టోల్‌‌‌‌‌‌‌‌ ప్లాజాల వద్ద చార్జీలు కట్టేందుకు గంటల తరబడి క్యూలో ఉండడం.. చిల్లర చికాకులకు చెక్​ పెట్టేందుకు ఫాస్ట్‌‌‌‌‌‌‌‌ ట్యాగ్‌‌‌‌‌‌‌‌ విధానాన్ని విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నేషనల్‌‌‌‌‌‌‌‌ పర్మిట్‌‌‌‌‌‌‌‌ గూడ్స్‌‌‌‌‌‌‌‌ వాహనాలకు ఇప్పటికే ఫాస్ట్‌‌‌‌‌‌‌‌ ట్యాగ్‌‌‌‌‌‌‌‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇకపై ఫోర్‌‌‌‌‌‌‌‌ వీలర్లకూ ఫాస్ట్​ ట్యాగ్​ను తప్పనిసరి చేస్తూ కేంద్రం తాజాగా నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ ఇచ్చింది. ఇప్పటి దాకా నేషనల్‌‌‌‌‌‌‌‌ పర్మిట్‌‌‌‌‌‌‌‌ గూడ్స్‌‌‌‌‌‌‌‌ వాహనాలతోపాటు నాలుగు కంటే ఎక్కువ టైర్లు ఉన్న వాహనాలకే దీనిని వర్తింపజేశారు. ఇకపై 2017 డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 1 తర్వాత కొనుగోలు చేసిన ఫోర్‌‌‌‌‌‌‌‌ వీలర్‌‌‌‌‌‌‌‌ ప్యాసింజర్‌‌‌‌‌‌‌‌, గూడ్స్‌‌‌‌‌‌‌‌ వాహనాలకూ ఫాస్ట్‌‌‌‌‌‌‌‌ ట్యాగ్‌‌‌‌‌‌‌‌ తప్పనిసరి చేశారు.

ఫాస్ట్‌‌‌‌‌‌‌‌ ట్యాగ్‌‌‌‌‌‌‌‌ అంటే..

ఫాస్ట్‌‌‌‌‌‌‌‌ ట్యాగ్‌‌‌‌‌‌‌‌ అనేది ఏటీఎం కార్డు మాదిరి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ కలిగి ఉంటుంది. దీన్ని వాహనానికి ముందు భాగంలో అద్దానికి పై భాగంలో అంటిస్తారు. దీనిపై ప్రత్యేక బార్‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌ ఉంటుంది. ఫాస్ట్​ ట్రాక్​ ఉన్న వాహనాల కోసం టోల్‌‌‌‌‌‌‌‌ ప్లాజాల వద్ద ఓ డివైస్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేస్తారు. వాహనం టోల్‌‌‌‌‌‌‌‌ ప్లాజాకు రాగానే బార్​ కోడ్ స్కాన్​ అయి గ్రీన్‌‌‌‌‌‌‌‌ లైట్‌‌‌‌‌‌‌‌ పడి, గేట్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌ అవుతుంది. బార్‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌ స్కాన్‌‌‌‌‌‌‌‌ కావడంతో ఆటోమెటిక్‌‌‌‌‌‌‌‌గా డబ్బులు కట్‌‌‌‌‌‌‌‌ అవుతాయి. మనీ కట్​ కాగానే లింక్‌‌‌‌‌‌‌‌ చేసిన మొబైల్‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌కు ఎస్‌‌‌‌‌‌‌‌ఎంఎస్‌‌‌‌‌‌‌‌ వస్తుంది.

ఎక్కడ.. ఎట్ల తీసుకోవాలి?

ప్రస్తుతం 22 బ్యాంకుల్లో ఫాస్ట్ ట్యాగ్‌‌‌‌‌‌‌‌లు దొరుకుతున్నాయి. పేటీఎం, పెట్రోల్‌‌‌‌‌‌‌‌ పంపులు, అమెజాన్‌‌‌‌‌‌‌‌, టోల్‌‌‌‌‌‌‌‌ ప్లాజాతోపాటు కామన్‌‌‌‌‌‌‌‌ సర్వీస్‌‌‌‌‌‌‌‌ సెంటర్లలోనూ లభిస్తున్నాయి. ఫాస్ట్‌‌‌‌‌‌‌‌ ట్యాగ్‌‌‌‌‌‌‌‌ పొందాలంటే వెహికల్‌‌‌‌‌‌‌‌ ఆర్సీ, బండి యజమాని పాస్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ సైజు ఫొటో, కేవైసీ డాక్యుమెంట్లు తప్పనిసరి. ఫాస్ట్‌‌‌‌‌‌‌‌ ట్యాగ్‌‌‌‌‌‌‌‌ను ముందే ప్రీపెయిడ్‌‌‌‌‌‌‌‌ అకౌంట్‌‌‌‌‌‌‌‌కు లింక్‌‌‌‌‌‌‌‌ చేస్తారు. ఈ అకౌంట్‌‌‌‌‌‌‌‌ను రీచార్జ్‌‌‌‌‌‌‌‌ చేసుకోవాలి.

మరి ఏర్పాట్లేవీ..

దేశ వ్యాప్తంగా ఫాస్ట్‌‌‌‌‌‌‌‌ ట్యాగ్‌‌‌‌‌‌‌‌ అమలవుతుండగా.. తెలంగాణ, ఏపీల్లో 50 వరకు టోల్‌‌‌‌‌‌‌‌ గేట్లు ఉన్నాయి. కానీ రాష్ట్రంలో ఫాస్ట్‌‌‌‌‌‌‌‌ ట్యాగ్‌‌‌‌‌‌‌‌కు సంబంధించి సరైన ఏర్పాట్లు లేవు. సుమారు 70% టోల్‌‌‌‌‌‌‌‌ గేట్లలో డివైస్‌‌‌‌‌‌‌‌లు ఏర్పాటు చేయలేదు. దీంతో ఫాస్ట్‌‌‌‌‌‌‌‌ ట్యాగ్‌‌‌‌‌‌‌‌ ఉన్నా.. ఫ్రీక్వెన్సీ డివైస్‌‌‌‌‌‌‌‌లు లేక వాహనదారులు డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. టోల్​ గేట్ల వద్ద త్వరలోనే అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆర్టీఏ ఉన్నతాధికారులు చెబుతున్నారు.