Food

నూడుల్స్ కట్‌లెట్

Noodles Cutlet - Telugu Easy Short Fast Recipes

కావల్సినవి: నూడుల్స్‌ ప్యాకెట్‌ – ఒకటి, బంగాళాదుంపలు – (ఉడికించినవి)రెండు, బఠాణీలు, మొక్కజొన్న గింజలు – (ఉడికించినవి) మూడు పెద్ద చెంచాల చొప్పున, కొత్తిమీర – రెండు పెద్ద చెంచాలు, కారం – అరచెంచా, ఆమ్‌చూర్‌ పొడి – అరచెంచా, ఉప్పు – తగినంత, నూడుల్స్‌ మసాలా – కొద్దిగా, మైదా, మొక్కజొన్నపిండి- రెండు పెద్ద చెంచాల చొప్పున, మిరియాలు- పావు చెంచా (కచ్చాపచ్చాగా పొడి చేసుకోవాలి), ఉప్పు, నీళ్లు -తగినంత,
బ్రెడ్‌పొడి – అరకప్పు.
తయారీ: పొయ్యి వెలిగించి సరిపడా నీళ్లు పోసి అవి మరిగాక నూడుల్స్‌ వేయాలి. మూడు నిమిషాలయ్యాక నీటిని ఒంపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో బంగాళాదుంప ముక్కలు, బఠాణీలు, మొక్కజొన్న గింజలు, కొత్తిమీర వేయాలి. కారం, ఆమ్‌చూర్‌, ఉప్పు, నూడుల్స్‌ మసాలా వేసి బాగా కలపాలి. వాటిలో ఉడికించి పెట్టుకున్న నూడుల్స్‌ వేసి నెమ్మదిగా కలపాలి. మరోగిన్నెలో మైదా, మొక్కజొన్నపిండి, మిరియాలపొడి, ఉప్పు, అరకప్పు నీళ్లు తీసుకుని కలపాలి. చేతికి కొద్దిగా నూనె రాసుకుని నూడుల్స్‌ మిశ్రమాన్ని టిక్కీ మాదిరి చేసుకుని మైదా మిశ్రమంలో ముంచి, తరువాత బ్రెడ్‌పొడి అద్దాలి. ఇలా చేసుకున్న వాటిని వేడినూనెలో వేసి, ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.