Business

అల్ల్ ఫ్రీ

PayTM Says All Its Transactions Are Free Without Any Additional Fee

డిజిటల్‌ లావాదేవీలపై పేటీఎం అదనపు ఛార్జీలు వసూలు చేయనుందంటూ వచ్చిన వార్తలను ఆ కంపెనీ ఖండించింది. తాము ఎటువంటి ఛార్జీలనూ వసూలు చేయబోమని స్పష్టంచేసింది. పేటీఎం గేట్‌వే, పేటీఎం యాప్‌ ద్వారా కార్డులు, యూపీఐ, నెట్‌బ్యాంకింగ్‌, వ్యాలెట్‌లో ఏ రూపంలో వినియోగదారులు లావాదేవీలూ జరిపినా ఎలాంటి ఛార్జీలు వసూలు చేయబోమని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. క్రెడిట్‌ కార్డు లావాదేవీలపై 1 శాతం, డెబిట్‌ కార్డులపై 0.9 శాతం, నెట్‌బ్యాంకింగ్‌, యూపీఐ లావాదేవీలపై రూ.12 నుంచి 15 వసూలు చేసేందుకు పేటీఎం సిద్ధమవుతోందంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో పేటీఎం ఈ విధంగా స్పందించింది. భవిష్యత్‌లోనూ ఎలాంటి ఛార్జీలూ వసూలు చేసే యోచన లేదని స్పష్టంచేసింది.