DailyDose

రెండు రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు-తాజావార్తలు–07/02

Daily Breaking News - Supreme Court Issues Notice To Two Telugu States - July 2 2019

* ప్రభుత్వ పథకాల పేరుతో నగదు పంపిణీని సవాల్‌ చేస్తూ.. దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగింది. సమాధానం ఇవ్వాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం, ఏపీ, తెలంగాణ, బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, కర్ణాటక ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ముందు ప్రభుత్వ పథకాల పేరుతో నగదు పంపిణీ చేయడం.. రాజ్యాంగ విరుద్ధమని జనసేన నేత పెంటపాటి పుల్లారావు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.ఐటీ సలహాదారులుగా ముగ్గురు నిపుణులు …. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ.
* రాష్ట్ర ప్రభుత్వానికి ఐటీ సలహాదారులుగా ముగ్గురు నిపుణుల్ని నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ జె. విద్యా సాగర్ రెడ్డి, శ్రీనాథ్ దేవిరెడ్డిలను ఐటీ సాంకేతిక సలహాదారులుగానూ, కె.రాజశేఖర్ రెడ్డిని ఐటీ పెట్టుబడులు, పాలసీ సలహాదారులుగా నియమిస్తూ ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి అనూప్ సింగ్.చంద్రబాబు పిటిషన్‌పై విచారణ వాయిదా
* వికారాబా జిల్లా కేంద్రంలోని ప్రొహిబిషన్‌ మరియు ఎక్సైజ్‌ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ వ్యక్తి వద్ద లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు జూనియర్‌ అసిస్టెంట్‌ సురేశ్‌. అయితే ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్న షేక్‌ ఖాజా హుస్సేన్‌ కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ఖాజా హుస్సేన్‌ మృతికి సంబంధించిన రిపోర్టును పెన్షన్‌ డబ్బుల కోసం హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయానికి పంపేందుకు జూనియర్‌ అసిస్టెంట్‌ సురేశ్‌ లంచం డిమాండ్‌ చేశాడు. మృతుడి అన్న వద్ద రూ. 12,000 తీసుకుంటుండగా సురేశ్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
* పార్లమెంట్ లైబ్రరీ హాల్లో జరిగిన భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోదీ ఎంపీలను ఉద్దేశించి ప్రసంగించారు. నేతలు గానీ, వారి పిల్లలు గానీ అహంకారంతో అధికార దుర్వినియోగానికి పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జులై 6న ప్రారంభించనున్నట్లు నేతలకు తెలిపారు మోదీ.
* సత్తెనపల్లి కి చెందిన ఏలినేడి శ్రీనివాసరావు అనే వ్యక్తి మాజీ స్పీకర్ కు చెందిన హీరో షోరూం ముందు ధర్నా 2017 లో నరసరావుపేట పేటలో కేలో ఇండియా పోగ్రామ్ కి భోజనం క్యాటరింగ్ సప్లై చేసిన శ్రీనివాసరావు11 లక్షల రూపాయలు నాకు కోడెల శివరాం ఇవ్వాలంటూ షోరూం ముందు బైఠాయించిన శ్రీనివాసరావు
* ప్రభుత్వ పథకాల పేరుతో నగదు పంపిణీని సవాల్‌ చేస్తూ.. దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో నేడు విచారణ సమాధానం ఇవ్వాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం, ఏపీ, తెలంగాణ, బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, కర్ణాటక ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ ఎన్నికల ముందు ప్రభుత్వ పథకాల పేరుతో నగదు పంపిణీ చేయడం.. రాజ్యాంగ విరుద్ధమని జనసేన నేత పెంటపాటి పుల్లారావు సుప్రీంకోర్టులో పిటిషన్
* నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా జోరువాన కురుస్తుంది. నిజామాబాద్ నగరంలో గంటపాటు ఎడతెగకుండా వాన కురిసింది. వరద నీటితో వీధులన్ని జలమయమయ్యాయి. కోటగల్లిలో వర్షపునీరు ఇళ్లలోకి చేరింది. దోమకొండ, వేల్పూర్, జక్రాన్‌పల్లి, ఇందల్వాయి, ధర్పల్లి, వర్ని, మెండోరా, కోటగిరి, ఎడపల్లి, నవీపేట్, రుద్రూర్, బోధన్ మండలాల్లో వర్షం పడింది. ఈదురు గాలులకు భీంగల్‌లో బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ కూలింది.
* వైసీపీ నేత లక్ష్మీ పార్వతిపై ఆరోపణలు చేసిన కోటి బీజేపీలో చేరడంపై వివరణ బీజేపీ అధిష్టానం.లక్ష్మి పార్వతిపై ఆరోపణలు చేసిన కోటి బీజేపీలో చేరడంపై నెటిజన్లు సెటైర్లు.చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి బీజేపీలో చేరాలని నెటిజన్లు చలోక్తులు.నెట్టింట్లో బీజేపీపై సెటైర్లు వేయడంతో వెనక్కి తగ్గిన ఏపీ బీజేపీ.సోషల్ మీడియాలో కోటి బీజేపీలో చేరిన ఫోటోను వైరల్ చేస్తున్న నెటిజన్లుకోటి బీజేపీలో చేరడం అకస్మాత్తుగా జరిగింది.
* శాంసంగ్ కంపెనీ తన నూతన నోట్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ నోట్ 10 ను ఆగస్టు 7వ తేదీన విడుదల చేయనుంది. ఈ మేరకు ఆ సంస్థ ఇవాళ ఒక ప్రకటనలో తెలిపింది. ఆగస్టు 7వ తేదీన న్యూయార్క్‌లో నిర్వహించనున్న శాంసంగ్ ఈవెంట్‌లో ఈ ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు. కాగా ఈ నోట్ 10కు గాను పలు భిన్నమైన వేరియెంట్లను కూడా లాంచ్ చేయనున్నట్లు తెలిసింది.
* తనకు భద్రత కుదించడంపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ ఇవాళ విచారణకు వచ్చింది. దీనిపై ఏజీ సమయం కోరడంతో విచారణను మధ్యాహ్నం 2.15 గంటలకు న్యాయస్థానం వాయిదా వేసింది. భద్రత కుదింపుపై పునఃసమీక్షించాలని చంద్రబాబు తన పిటిషన్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇద్దరు ప్రధాన భద్రతాధికారులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. గతంలో ఒక అదనపు ఎస్పీ, ఒక డీఎస్పీ, ముగ్గురు ఆర్‌ఐ బృందాలతో చంద్రబాబుకు భద్రత కల్పించేవారు. ప్రస్తుతం అందరినీ తొలగించి ఇద్దరు కానిస్టేబుళ్ల చొప్పున 3 బృందాలను కేటాయించారు. దీనిపై తెదేపా శ్రేణులు మండిపడుతున్నాయి.
* 2007 సంవత్సరం నుంచి బీమా మిత్రులుగా కొనసాగుతున్నాం.ఇప్పటివరకు వరకు మాకు ఎటువంటి జీతభత్యాలు లేవు..దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆమ్ ఆద్మీ, అభయహస్తం, జనశ్రీ బీమా పథకాలు ప్రవేశపెట్టి వేల కుటుంబాలలో వెలుగులు నింపారు.
* ఇంటెలిజెన్స్ విభాగంలో ఓఎస్డీగా రాజీనామా చేసిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి యోగానంద్ యోగానంద్ రాజీనామాను ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం.
* సబ్సిడీ వేరుశనగ విత్తనాల పంపిణీలో అధికారుల నిర్లక్ష్యంనెలరోజులగా వ్యవసాయ శాఖ కార్యాలయం చుట్టూ రైతుల ప్రదక్షిణలువిత్తనాలు లేవంటూ నో స్టాక్ బోర్డ్ పెట్టడంపై రైతుల ఆగ్రహంకర్నూల్ – బళ్లారి రోడ్డుపై భైఠాయించిన రైతన్నలు, స్తంభించిన ట్రాఫిక్.
* సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా బడ్జెట్‌ను ఈనెల 12న అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను ఈనెల 11వ తేదీ నుంచి ప్రారంభించాలని నిర్ణయించింది. దీనికి సీఎం జగన్ సోమవారం ఆమోదం తెలిపారు. దీంతో సంబంధిత ఫైలు అసెంబ్లీ సెక్రటరీకి చేరింది. ఆ తర్వాత గవర్నర్‌ నరసింహన్‌కు ఫైలు చేరనుంది. ఆయన ఆమోదం తెలిపిన తర్వాత అసెంబ్లీ సమావేశాల నోటిఫికేషన్‌ జారీ చేస్తారు.ఈనెల 11న ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు నెలాఖరు వరకు కొనసాగనున్నాయి.
* ఏపీలో టీడీపీ నేతలపై దాడుల పరంపర కొనసాగుతోంది. రాష్ట్రంలో తమ కార్యకర్తలకు రక్షణ లేదని నిన్న డీజీపీ గౌతం సవాంగ్‌ కు తెలుగుదేశం సీనియర్ నేతలు ఫిర్యాదు చేశారు. ఇది జరిగి 24 గంటలు కూడా గడవక ముందే గుంటూరు జిల్లాలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. చిలకలూరిపేట టీడీపీ నేత బుచ్చిబాబు ఇంటిపై దాడికి తెగబడ్డారు. ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఇంట్లో ఉన్న మహిళలను దుర్భాషలాడారు. బెదిరించారు. వైసీపీ నేతల దాడి గురించి తెలుసుకున్న మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు బుచ్చిబాబు ఇంటికి వచ్చారు. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
* ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ యూజర్లకు అదిరిపోయే తీపి కబురు అందించింది. జులై 1 నుంచి గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా రూ.100.50 తగ్గనుంది. నాన్‌-సబ్సిడైజ్డ్ ఎల్‌పీజీ సిలిండర్ ఇక నుంచి రూ.637కు లభ్యం కానుంది. ఇంతకు ముందు ధర రూ.737.50 ఉండేది. ఈ మేరకు ఐఓసీ కంపెనీ ప్రకటనను జారీ చేసి ధరల తగ్గుదలను ధ్రువీకరించింది. అంతర్జాతీయ మార్కెట్లో ఎల్‌పీజీ రేట్లు దిగిరావడం, అమెరికా డాలర్-ఇండియన్ రూపాయి మారకపు విలువ సానుకూలంగా ఉండడం వంటి అంశాల నేపథ్యంలో ధర తగ్గిస్తున్నట్లు పేర్కొంది. సబ్సిడీ ఎల్‌పీజీ రేటు కూడా రూ.494.35కు దిగిరానుంది. మిగిలిన కూ.142.35లను కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరిస్తుంది. ఈ సబ్సిడీ మొత్తం బ్యాంక్ అకౌంట్‌లో జమవుతుంది.
* గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన సోషల్ వర్కర్‌, సినీ నటుడు కోటి యాదవ్ బీజేపీలో చేరారు. రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. వినుకొండ ప్రాంతంలో వివిధ పార్టీల్లో ఉన్న తన అభిమానులు, అనుచరులతో కలిసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రధానమంత్రి మోదీ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితుడినై ఆ పార్టీలో చేరినట్టు కోటి యాదవ్‌ తెలిపారు.
* జాతీయ సెయిలింగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. నగరంలోని హుస్సేన్ సాగర్‌లో ప్రతీ ఏడాది జులై మొదటివారంలో సెయిలింగ్ పోటీల నిర్వహణ జరిగే విషయం తెలిసిందే. బోట్స్ క్లబ్‌లో 34వ జాతీయస్థాయి సెయిలింగ్ పోటీల ప్రారంభ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రారంభించారు. జులై 2 నుంచి 7 వరకు సెయిలింగ్ ఛాంపియన్‌షిప్ జరగనుంది.
* రాష్ట్రాభివృద్ధిని వదిలి ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తెలంగాణ చుట్టూ తిరుగుతున్నారని తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. విత్తనాల కోసం రైతులు రోడ్డెక్కుతున్నా..వారి సమస్యలను పట్టించుకోకుండా ప్రతిపక్షంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.
* కర్నూలు కృష్ణగిరి, ఆలూరులో విత్తనాల కోసం రైతులు రోడ్డెక్కారు. కృష్ణగిరి వ్యవసాయ అధికారి కార్యాలయం ఎదుట రైతులు ధర్నాకు దిగగా ఆలూరులో రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వర్షాలు ప్రారంభమైనా విత్తల పంపిణీపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదని, వేరుశనగ విత్తనాల కోసం గత వారం రోజులుగా వ్యవసాయ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకున్న నాధుడే లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
* సీబీఐ వరుస సోదాలతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సీబీఐకి చెందిన అవినీతి నిరోధక శాఖ దేశవ్యాప్తంగా రెండో రోజూ సోదాలు కొనసాగిస్తోంది. తాజాగా 14 కేసులకు సంబంధించి 12 రాష్ట్రాల్లోని 18 నగరాల్లో ఏకకాలంలో సోదాలు ప్రారంభించింది. సుమారు 50 ప్రాంతాల్లో ఈ సోదాలు జరుపుతున్నట్టు సమాచారం.
* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఐటీ సలహాదారులుగా ముగ్గురిని నియమిస్తూ జగన్ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి అనూప్ సింగ్ పేరిట ఆదేశాలు వెలువడ్డాయి. దేవిరెడ్డి శ్రీనాథ్, జే విద్యాసాగర్ రెడ్డిలను ఐటీ సాంకేతిక సలహాదారులుగా, కే రాజశేఖర్ రెడ్డిని ఐటీ పెట్టుబడుల విభాగానికి విధాన సలహాదారుగా నియామకం ఖరారైంది. వీరంతా త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు. రాష్ట్రంలో ఐటీ రంగాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
* గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ జయ లక్ష్మీ గారు 5 మంది పోలీసులను సస్పెండ్ చేశారు.నరసరావుపేట టౌన్ లో రాత్రి పూట బీట్ నిర్వహించున్న పోలీసులు ఇష్టానుసారంగా కొందరుపై దాడి చేసిన టౌన్ పోలీసులు సంఘటనపై విచారణలో నిర్ధారణ కావడం తో ఐదు మంది సిబ్బంది ను సస్పెండ్ చేశారు.
* ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నేడు 14 శాఖలపై విడివిడిగా చర్చలు జరపనున్నారు. వ్యవసాయం, ఇరిగేషన్, విద్య, విద్యుత్, రెవెన్యూ, మున్సిపల్, ఇండస్ట్రీస్, హోమ్, పంచాయితీరాజ్, ఎక్సైజ్, మైనార్టీ శాఖలపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మంత్రులు కన్నబాబు, సరేష్, సుచరిత, పిల్లి సుభాష్, అనిల్ కుమార్‌ యాదవ్, బాలినేని శ్రీనివాసరెడ్డి, మేకపాటి గౌతంరెడ్డి, పెద్దిరెడ్డి, అంజాద్ బాషా హాజరుకానున్నారు.కాగా.. ఈ సమావేశంలో సుమారు మూడు గంటలకు పైగా జరగనున్నట్లు తెలుస్తోంది.
* యువత వ్యవసాయం, పరిసరాల పరిశుభ్రతపై దృష్టిపెట్టాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సెల్ ఫోన్లకు బానిసలు కాకుండా…తల్లిదండ్రులకు వ్యవసాయంలో సాయంగా ఉండాలన్నారు. సెల్ ఫోన్ ను టైమ్ పాస్ కోసం కాకుండా వ్యవసాయానికి అనుసంధానం చేసి…మంచి దిగుబడులు సాధించేలా కృషి జరగాలని చెప్పారు. వ్యవసాయానికి రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉందన్న హరీష్… కాళేశ్వరం నీళ్లతో రెండు పంటలు పండే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. సిద్దిపేట రూరల్ మండలం బుస్సాపూర్, తోర్నాల గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు.
*రాష్ట్రంలోని 96 పురపాలక సంఘాల్లో పాలకవర్గాల పదవీకాలం నేటితో ముగియనుంది. వీటిలో ప్రత్యేక అధికారుల నియామకానికి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు నేడు జీవో విడుదలయ్యే అవకాశాలున్నాయి. వీటిలో 94 చోట్ల ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు రూపొందించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళల వివరాల సేకరణ ప్రక్రియను పూర్తి చేశారు. ప్రభుత్వ తదుపరి ఆదేశాలపై వార్డుల వారీగా పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించనున్నారు. సంయుక్త కలెక్టర్లు, ఉప కలెక్టర్లు, ఐటీడీఏ పథక బాధ్యులు, రెవెన్యూ డివిజన్‌ అధికారులు (ఆర్డీవో)లను అత్యధిక చోట్ల పురపాలక ప్రత్యేకాధికారులుగా నియమించడానికి ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రతిపాదనలు పంపుతున్నారు.
*వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. బెంగాల్‌ఒడిశా తీరాలను ఆనుకుని అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వాయుగుండం ప్రభావంతో ఏపీరాయలసీమలో వర్షాలు పడే అవకాశం ఉంది. కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలుపలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. తీరం వెంబడి గంటకు కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచనున్నాయి.
*వికారాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రొహిబిషన్‌ మరియు ఎక్సైజ్‌ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ వ్యక్తి వద్ద లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు జూనియర్‌ అసిస్టెంట్‌ సురేశ్‌. అయితే ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్న షేక్‌ ఖాజా హుస్సేన్‌ కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ఖాజా హుస్సేన్‌ మృతికి సంబంధించిన రిపోర్టును పెన్షన్‌ డబ్బుల కోసం హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయానికి పంపేందుకు జూనియర్‌ అసిస్టెంట్‌ సురేశ్‌ లంచం డిమాండ్‌ చేశాడు. మృతుడి అన్న వద్ద రూ. 12,000 తీసుకుంటుండగా సురేశ్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
*కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో ఏసీబీ దాడులు స్థానిక అధికారుల్లో కలకలం రేపాయి.ఏసీబీ డీఎస్పీ నాగభూషణం తెలిపిన వివరాల ప్రకారం..పట్టణంలోని బుడ్డాయిపల్లెలో నివాసముంటున్న మైలవరం పంచాయతీరాజ్ ఏఈఈ పల్లా సుబ్బయ్య ఇంటిపై మంగళవారం ఉదయం దాడులు నిర్వహించారు.
*తెలుగు రాష్ట్రాలకు వేర్వేరు గవర్నర్లు వచ్చే అవకాశం ఉన్నట్లు హోంశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. పార్లమెంటు సమావేశాల తర్వాత రెండు రాష్ట్రాలకు ఇద్దరు గవర్నర్ల నియమాకం జరిగే అవకాశం ఉన్నట్లు వెల్లడించాయి.
* వయసు పెరుగుతున్న కొద్దీ చాలామందిని మోకాళ్లు, తుంటి, కీళ్ల సమస్యలు తీవ్రంగా వేధిస్తుంటాయి. ఇలాంటి వారికి వైద్యులు కృత్రిమ ఉపకరణాలు అమర్చి ఊరట కలిగిస్తున్నారు. వీటిని అల్యూమినియం, జిర్కోనియం లోహాలతో తయారు చేస్తున్నారు.
* రాష్ట్రంలోని పురపాలక సంఘాలు, మూడు నగర పాలక సంస్థల్లో 2014 జులైలో కొలువుదీరిన పాలక వర్గాల గడువు మంగళవారంతో ముగియనుంది. సిద్దిపేట, అచ్చంపేట పురపాలక సంఘాలు, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం నగరపాలక సంస్థలు మినహా రాష్ట్రంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థల్లో బుధవారం నుంచి ప్రత్యేకాధికారుల పాలనను ప్రారంభించేలా ఉన్నతాధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కొత్త పాలక వర్గాలు బాధ్యతలు స్వీకరించేవరకూ ప్రత్యేకాధికారుల పాలన కొనసాగనుంది.
*సామర్థ్యానికి మించిన సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించుకుని వెళుతున్న చిన్న బస్సు (మినీ బస్సు) లోయలోకి దూసుకెళ్లడంతో 35 మంది ప్రయాణికులు మరణించారు.
*రాష్ట్రంలో బీటెక్ సీట్ల సంఖ్య కొలిక్కివస్తోంది. మొత్తం 94 వేల వరకు ఉండనున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలికి సోమవారం వరకు అందిన సమాచారం ప్రకారం 183 ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో 91,988 ఇంజినీరింగ్ సీట్లు అందుబాటులో ఉండనున్నాయి. ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లోని మొత్తం సీట్లలో 70 శాతం సీట్లను మాత్రమే కన్వీనర్ కోటా కింద కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు.
*దాదాపు మూడు వారాలుగా ఆందోళనలతో అట్టుడుకుతున్న హాంకాంగ్లో సోమవారం హింస చెలరేగింది. అనుమానిత నేరగాళ్లను చైనాకు అప్పగించేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లును వ్యతిరేకిస్తూ నిరసనకారులు ముసుగులు వేసుకొని, హెల్మెట్లు ధరించి పార్లమెంటులోకి దూసుకెళ్లారు. నేతల చిత్రపటాలను చింపేశారు.
*రాష్ట్రంలోని కొత్త జిల్లా పరిషత్లు అన్నింటికీ సీఈవో (ముఖ్య కార్యనిర్వహణ అధికారి), అకౌంట్స్ అధికారి (ఏవో) పోస్టులు ఉండనున్నాయి. పాతవాటిలో మాదిరిగా డిప్యూటీ సీఈవో పోస్టు ఉండదు. మిగతా సిబ్బందికి సంబంధించిన పోస్టులు పూర్వపు జడ్పీల నుంచి విభజన ద్వారా తాత్కాలికంగా పంపిణీ అవుతాయి.
*రాష్ట్రంలో మంగళవారం అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణాధికారి రాజారావు తెలిపారు. బంగాళాఖాతంలో ఒడిశా తీరం వద్ద ఏర్పడిన అల్పపీడనం మంగళవారం వాయుగుండంగా మారే అవకాశముంది.
* రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యకళాశాలల్లో కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఈనెల 5వ తేదీతో తొలివిడత ప్రవేశాల్లో ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ పూర్తవుతుంది.
*దేశవ్యాప్తంగా 2021లో నిర్వహించే జనగణనకు సంబంధించి పూర్వపరీక్ష జనాభా లెక్కింపును ఈ ఏడాది ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 30 వరకు నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్ వివేక్ జోషి ప్రకటించారు.
*అటవీ భూముల రక్షణకు తాము ముందుంటామని.. అదే సమయంలో తగిన రక్షణ కల్పించడంతోపాటు పోలీసు, రెవెన్యూ శాఖల సమన్వయాన్ని మరింత పటిష్ఠం చేసుకునేందుకు ప్రభుత్వం సహకరించాలని అటవీ అధికారుల సంఘాల ప్రతినిధులు కోరారు.
*మళ్లీ విధుల్లో చేరిన తర్వాత తన ప్రాణాలకు రక్షణ ఉండదని.. ప్రభుత్వం రక్షణ కల్పించాలని దాడికి గురైన అటవీ అధికారిణి అనిత కోరారు. దాడికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రాజధానిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె సోమవారం విలేకరులతో మాట్లాడారు.
*ఇంటర్మీడియట్ మూల్యాంకనం, ఫలితాల విడుదలలో ఇకనుంచి తప్పులు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని గవర్నర్ నరసింహన్ ఇంటర్బోర్డు అధికారులను ఆదేశించారు. తప్పులకు బాధ్యులైన వారిని గుర్తించారా? ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించినట్లు తెలిసింది. ఇంటర్బోర్డు విశ్వసనీయత దెబ్బతినే పరిస్థితి తీసుకురావొద్దని వ్యాఖ్యానించినట్లు సమాచారం. విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఆయన సోమవారం దాదాపు గంటపాటు సమావేశమై సమీక్షించారు. పదో తరగతి ఉత్తీర్ణులైన వారికి ఇంటర్లో ఎందుకు వేలాది మందికి సున్నా మార్కులు వస్తున్నాయని ప్రశ్నించారు.
*రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కుమురం భీం జిల్లా కొత్తసార్సాలలో అటవీ అధికారిణిపై దాడిని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం, పోలీసు, అటవీ అధికారులు సోమవారం కంపార్ట్మెంట్ 133, 136లలోని పోడు భూముల్లో పెద్దఎత్తున మొక్కలు నాటారు.
*తెలంగాణకు కేటాయించిన 2018 బ్యాచ్ ఐఏఎస్లు ఎనిమిది మంది సోమవారం రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ బీపీ ఆచార్య ఆధ్వర్యంలో వారు రాజ్భవన్కు వచ్చారు. ఈ సందర్భంగా వారిని గవర్నర్ అభినందించారు.
*సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర వీడియోలు, సందేశాలకు ప్రచారం కల్పిస్తే చర్యలు తప్పవని రాచకొండ, సైబరాబాద్ సీపీలు మహేశ్ భగవత్, సజ్జనార్ హెచ్చరించారు. పోలీసులను తక్కువచేసి చూపించే వీడియోలు ఉండటంపైనా స్పందించారు. ఈ మేరకు సోమవారం వారు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
*రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో నియామకాల ప్రక్రియ ప్రారంభించేందుకు మార్గం సుగమం అయింది. రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని నూతన జోన్ల ప్రకారం పోస్టులు, కేడర్ ఖరారు ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
*దేశంలోనే మొదటిసారిగా ఓ జిల్లా వెబ్సైట్ను మూడు భాషల్లో రూపొందించారు. మహబూబ్నగర్ జిల్లా వెబ్సైట్ ఇప్పటివరకు తెలుగు, ఆంగ్లంలోనే అందుబాటులో ఉండగా సోమవారం ఉర్దూలోనూ ప్రారంభించారు. మహబూబ్నగర్ కలెక్టరేట్ రెవెన్యూ సమావేశ మందిరంలో https://mahabubnagar.telangana.gov.in వెబ్సైట్ను కలెక్టర్ రొనాల్డ్రోస్ ఆవిష్కరించి మాట్లాడారు. జాతీయ సమాచార కేంద్రం (ఎన్ఐసీ) అంతర్జాల వెబ్సైట్ ఆయా ప్రాంతాలవారీగా కేవలం రెండు భాషల్లో మాత్రమే ఉంటుందన్నారు. ముస్లింలకు జిల్లా అభివృద్ధి సంక్షేమ పథకాల వివరాలు తెలియజేయడానికి మహబూబ్నగర్ వెబ్సైట్ను ఉర్దూలో కూడా చూసేలా తీర్చిదిద్దినట్లు తెలిపారు.
*రాష్ట్రంలో మిషన్ భగీరథకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.990 కోట్ల రుణం ఇవ్వాలని నాబార్డ్ నిర్ణయించింది. 2019-20 సంవత్సరానికి గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమం (ఆర్ఐడీఎఫ్) ద్వారా రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో సదుపాయాల కల్పనకు వివిధ శాఖలకు తోడ్పాటును అందించేందుకు నాబార్డ్ సోమవారం ప్రత్యేకంగా సమావేశమైంది.
*టీఎస్సెట్ పరీక్షలను ఈ నెల 5, 6 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎస్.రామచంద్రం తెలిపారు. ఓయూలో సోమవారం విలేకరుల సమావేశంలో టీఎస్ సెట్ వివరాలను ఆయన వెల్లడించారు.
*మాంసం ఉత్పత్తుల పరిశుభ్ర నిర్వహణకు, శుద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని మాంస పరిశోధన కేంద్రం డైరెక్టర్ వైద్యనాథన్ కోరారు. హైదరాబాద్లో మాంసం, మాంస ఉత్పత్తుల పరిశుభ్రమైన నిర్వహణ, శుద్ధికి సంబంధించి మూడు రోజుల నైపుణ్యాభివృద్ధి శిక్షణను సోమవారం ఇక్కడ మాంస పరిశోధన కేంద్రంలో ప్రారంభించారు.
*కృష్ణా ట్రైబ్యునల్లో ఆంధ్రప్రదేశ్ క్రాస్ ఎగ్జామినేషన్ వాయిదా పడింది. జస్టిస్ బ్రిజేష్కుమార్, జస్టిస్ బీపీ దాస్, జస్టిస్ రామ్మోహన్రెడ్డిలతో కూడిన ధర్మాసనం ముందు సోమవారం తెలంగాణ నీటిపారుదల సాక్షి ఝాను ఏపీ న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేయాల్సి ఉంది.
*కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని తెలంగాణ ప్రభుత్వం నుంచి నిర్దేశిత నమూనాలో ఎలాంటి వినతి అందలేదని కేంద్ర జల్ శక్తి శాఖ సహాయ మంత్రి రతన్లాల్ కటారియా తెలిపారు.
*ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి త్రైమాసికం(ఏప్రిల్-జూన్)లో బొగ్గు ఉత్పత్తికి సంబంధించి 17.3 శాతం వృద్ధి సాధించినట్లు సింగరేణి సంస్థ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. గతేడాది ఇదే కాలంలో 1.45 కోట్ల టన్నుల బొగ్గు తవ్వగా ఈ ఏడాది 1.70 కోట్ల టన్నులు తవ్వినట్లు వెల్లడించింది. గత నెలలో గనుల నుంచి 55.19 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేసింది.
*రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాల మహిళల రుణాల వివరాలను ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి సమీక్షించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) అధికారులతో సోమవారం వెలగపూడి సచివాలయంలో సమావేశమైన ముఖ్యమంత్రి డ్వాక్రా సంఘాల విషయంపై చర్చించినట్లు తెలిసింది.
*రాష్ట్ర బడ్జెట్పై కసరత్తులో భాగంగా మంత్రుల స్థాయి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే అన్ని ప్రభుత్వశాఖల నుంచి ప్రతిపాదనలను తీసుకుని కొంతవరకు బడ్జెట్కు ప్రాథమిక రూపం ఇచ్చిన ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి మంత్రులతో చర్చలు జరుపుతున్నారు. వెలగపూడి సచివాలయంలో సోమవారం దాదాపు 9 శాఖలకు సంబంధించిన సమావేశాలు నిర్వహించారు.
*తమిళనాడులోని సేలం వద్ద ఉన్న జాతీయ చేనేత సాంకేతిక సంస్థ (ఐఐహెచ్టీ)లో చేనేత, జౌళి టెక్నాలజీ బీటెక్ మొదటి సంవత్సరం కోర్సు ప్రవేశాల్లో సీట్ల ఖరారు ప్రక్రియను నిలిపేయడానికి హైకోర్టు నిరాకరించింది.
* పోలవరం నిర్మాణం వల్ల తమ రాష్ట్రంలో ముంపు ప్రభావం ఉంటుందని, నిర్మాణం ఆపాలంటూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన ఒరిజనల్ సూట్(ఓఎస్)పై కౌంటరు దాఖలు చేయడానికి ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గడువు ఇచ్చింది.
*రహదారుల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యమిచ్చి పనులు పూర్తి చేసేలా బడ్జెట్లో తగిన నిధులు కేటాయించేలా ఆర్థిక మంత్రికి ప్రతిపాదనలు సమర్పించామని రహదారులు, భవనాలశాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు.
* రాజీవ్గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ఐటీల్లో ఈ విద్యాసంవత్సరం ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్ కోర్సు ప్రవేశాలకు జులై ఒకటో తేదీతో గడువు ముగిసింది.
*మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను ఈ నెల 4వ తేదీన నిర్వహించేందుకుగాను రూ.10 లక్షల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతినిచ్చింది. అల్లూరి జయంతిని రాష్ట్ర వేడుకగా విశాఖపట్నం జిల్లా పాండ్రంకి, కృష్ణదేవిపేటలలో నిర్వహించనున్నట్లు సంబంధిత ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
* దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 103 పాయింట్లు లాభపడి 39,789 వద్ద కొనసాగుతోంది.
నిఫ్టీ 30 పాయింట్లు లాభపడి 11,895 వద్ద కొనసాగుతోంది.