DailyDose

నీరవ్ మోడీకి సింగపూర్ హైకోర్టు షాక్-నేరవార్తలు–07/02

Daily Crime News - Singapore High Court Shocks Nirav Modi - July 2 2019

* వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి సింగపూర్ హైకోర్టు షాక్ ఇచ్చింది. నీరవ్ మోడీ చెల్లెలు, బావకు చెందిన బ్యాంకు ఖాతాలను సీజ్ చేయాలని సింగపూర్ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మంగళవారం నాడు ఓ ప్రకటనను విడుదల చేసింది.
తమ వినతి మేరకు రూ.44.41 కోట్లు డిపాజిట్లు ఉన్న పెవిలియన్ పాయింట్ కార్పోరేషన్ కంపెనీ ఖాతాను సింగపూర్ కోర్టు నిలిపివేసినట్టుగా ఈడీ ప్రకటించింది. ఈ కంపెనీకి మయాంక్ మొహ్తా, పూర్వీ మోడీలు ఓనర్లు. భారత బ్యాంకుల నుండి ఈ సొమ్మును అక్రమంగా తరలించారని ఈ ఖాతాలను నిలిపివేయాలని ఈడీ అభ్యర్థించింది.ఈ అభ్యర్థన మేరకు సింగపూర్ హైకోర్టు ఈ నిర్ణయం తీసుకొందని ఈడీ తెలిపింది. నీరవ్ మోడీ, ఆయన సోదరి పూర్వి ఖాతాను స్విస్ ప్రభుత్వం స్థంభింపజేసింది. ఇదే తరహాలో సింగపూర్ సర్కార్ కూడ నిర్ణయం తీసుకొంది. ఈ ఏడాది మార్చిలో నీరవ్ మోడీని బ్రిటన్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది.
* కొత్తగూడెం ఎమ్మెల్యేపై కేసు నమోదు
కుమ్రం భీం జిల్లాలో అటవీ అధికారులపై దాడి ఘటన రచ్చ రచ్చ అవుతుండగానే.. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావు కేసులో చిక్కుకున్నారు. సిబ్బంది డ్యూటీని అడ్డుకున్నారని వనమాపై, ఆయన కుమారుడిపై కేసు నమోదైంది. మరోవైపు.. అనితపై దాడి చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఉద్యోగ సంఘాలు పోరుబాట పట్టాయి. సీఎస్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.
* ఎమ్మెల్యే వనమా, ఆయన కొడుకుపై కేసు
కొత్తగూడెం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు, ఆయన కొడుకు వనమా రాఘవపై కేసు నమోదైంది. తమ డ్యూటీని అడ్డుకున్నారంటూ ఫారెస్ట్‌ ఆఫీసర్లు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సోమవారం లక్ష్మీదేవిపల్లి స్టేషన్‌లో కేసు రిజిస్టర్‌ చేశారు. శనివారం లోతువాగు బీట్‌లోని ఇల్లెందు క్రాస్రోడ్డు సమీపంలో అటవీ భూములు కాపాడేందుకు అధికారులు వచ్చారు
* తన ప్రేమకు అడ్డు పడుతున్నారని కుటుంబాన్నే అంతమొందించే ప్రయత్నం చేశాడో ప్రేమోన్మాది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన నెల్లూరులో పెను సంచలనంగా మారింది. తన ప్రేమ వ్యవహరంలో కుటుంబ సభ్యులు అడ్డుపడుతున్నారని భావించిన వంశీకృష్ణ అనే యువకుడు పెట్రోల్ పోసి ఇంటికి నిప్పు పెట్టాడు. ఈ ఘటన సీసీ టీవీ ఫుటేజ్‌తో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు వంశీకృష్ణను అరెస్ట్ చేసి జైలుకి పంపారు.
* దక్షిణ మాలిలో జరిగిన మత ఘర్షణల్లో 23 మంది గ్రామస్థులు మృతి చెందారు. గత ఆదివారం రాత్రి సమయంలో బిడి, సంకోరో, సరన్ గ్రామాల్లో సాయుధ బలగాలు జరిపిన కాల్పుల్లో 23 మంది చనిపోయారని స్థానిక మేయర్ చీక్ హరౌనా సంకరే వెల్లడించారు. ఫులనీ కులానికి చెందిన పశువుల కాపరులు, డోగాన్ జాతి రైతులకు భూమితోపాటు ఇతర వనరులపై ఆధిపత్యం విషయంలో ఘర్షణలు నెలకొన్నాయి.
* గుంటూరుప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం వద్దజాతీయ రహదారిపై అదుపు తప్పి కాలువలో బోల్తా పడిన లారీ డ్రైవర్ మృతి మరోకరికి తీవ్ర గాయాలు పరిస్థితి విషమం
* కృష్ణా జిల్లా, మచిలీపట్నం…సెల్ ఫోన్ల దొంగ జంధ్యాల ఘర్షణరావును (21) చాకచక్యంగా ఆరెస్ట్ చేసిన సి.సి.ఎస్ పోలీసులు.సెల్ల్ఫోన్ దొంగతనాలు ఎక్కువగా జరుగుతుండటంతో సి.సి.ఎస్ పోలీసులను ఎలర్ట్ చేసిన ఉన్నతాధికారులు.బందరు డి.ఎస్.పి మహబూబ్ బాషా సమక్షంలో సెల్ల్ఫోన్ దొంగను మీడియా ముందుకు.పాత నెరస్తుడు, ఒకప్పటి మోటార్ వాహనాల దొంగ ఇప్పుడు సెల్ల్ఫోనులు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు వెల్లడి.2 లక్షలు విలువ చేసే 36 సెల్ ఫోన్లను స్వాధీనం.నెరస్తుడు ఘర్షణరావుపై ఇనుగుదురు పోలీసు స్టేషన్లో 6 కేసులు నమోదు.
* ఖమ్మం రైల్వే స్టేషన్‌ లో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం నుండి న్యూ ఢిల్లీకి వెళ్లే రైల్లో అక్రమ గంజాయిని రవాణా చేస్తున్న ముఠాను ఖమ్మం జిఆర్‌పి పోలీసులు పట్టుకొని, 21.700 కేజీల గంజాయిని స్వాధీనపరుచుకున్నారు. ఢిల్లీకి చెందిన ఇద్దరిని అరెస్ట్‌ చేసి జ్యూడిషియల్‌ రిమాండ్‌ కు తరలించారు
* కృష్ణాజిల్లా గన్నవరం గూడవల్లి నారాయణ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థికి అస్వస్థత.కామినేని ఆసుపత్రికి తరలించిన కాలేజీ యాజమాన్యం.చికిత్స పొందుతూ మృతి చెందిన విద్యార్థి.విద్యార్థి కడపజిల్లా ఓబులువారిపల్లికి చెందిన టి.హర్షవర్ధన్ రెడ్డిగా గుర్తింపు.కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్న గన్నవరం పోలీసులు.
* శిరువెళ్ల మండలం గోవిందపల్లె గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున దొంగలు దేవుడికే శఠగోపం పెట్టారు.తిరుమల తిరుపతి. మరియు అనుబంధ హిందూ ధార్మిక ప్రచారసంస్థల ఆర్టిక సహాయంతో సుమారు 20 రోజులక్రితం నిర్మించి ప్రారంభించిన వెంకట్ేశ్వర స్వామి ఆలయ హుండీని ధ్వంసం చేశారు.గతంలో శిరువెళ్ల మండలం కామినేనిపల్లె గ్రామంలో నూతనంగా నిర్మిచిన మారెమ్మ ఆలయంలో సైతం హుండీ లెక్కిoపు పూర్తికాక ముందే దొంగలు దేవుని హుండీని చోరీకి గురి చేశారు.సమాచారం అందుకున్న ఎస్సై తిమ్మారెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించి పరిశీలిస్తున్నారు.
* లారీ డ్రైవర్‌తో పాటు బస్సులోని పలువురు ప్రయాణికులకు తీవ్రగాయాలుగుంటూరు జిల్లా నరసారావుపేట సమీపంలో ప్రమాదంప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు బస్సు కర్నూలు నుంచి విజయవాడకు వెళ్తుండగా ఘటన
* విజయవాడ రూరల్ గూడవల్లి నారాయణ కళాశాల భవనం పై నుండి కింది పడిన విద్యార్ధితీవ్రగాయాల పాలైన విద్యార్థి ని ఆసుపత్రి కి తరలిస్తుండగా మృతిమృతి చెందిన విద్యార్థి పేరు హర్షవర్ధన్ రెడ్డి, ఫిట్స్ వ్యాధి ఉందని చెపుతున్న కళాశాల నిర్వాహకుగూడవల్లి నారాయణ కళాశాల వేదవ్యాస్ భవనం జరిగిన సంఘటన.
* ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 61 మంది యువతులు, మహిళలను వంచించిన యువకుడుసెల్ ఫోన్ రిపేర్ షాప్ నడుపుతూ గ్రామ మహిళలను మాయమాటలు చెప్పి వంచించిన కామాంధుడుఅంతేకాకుండా మహిళలకు తెలియకుండా కామక్రీడలు వీడియోలో బంధించిన ప్రబుద్ధుడువీడియోలు లీక్ అయి వైరల్ అవడంతో విషయం బట్టబయలులీకైన వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి సొమ్ములు లాగిన మరో వ్యక్తివీడియోలు లీక్ చేసిన వ్యక్తితో పాటు, వంచకుడిని, బెదిరించిన మోసగాడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బాధితుల చిట్టాతో పోలీసులు ఆశ్చర్యం, దర్యాప్తు కొనసాగిస్తున్న మొగల్తూరు పోలీసులు.
* దక్షిణ మాలిలో జరిగిన మత ఘర్షణల్లో 23 మంది గ్రామస్థులు మృతి చెందారు. గత ఆదివారం రాత్రి సమయంలో బిడి, సంకోరో, సరన్ గ్రామాల్లో సాయుధ బలగాలు జరిపిన కాల్పుల్లో 23 మంది చనిపోయారని స్థానిక మేయర్ చీక్ హరౌనా సంకరే వెల్లడించారు.
* ఐఐటీ-హైదరాబాద్‌ ప్రాంగణంలో విషాదం చోటుచేసుకుంది. ఎం డిజైన్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసికి చెందిన మార్క్‌ ఆండ్రూ చార్లెస్‌గా గుర్తించారు. విద్యార్థి మృతితో సంగారెడ్డి సమీపంలోని కంది ఐఐటీ ప్రాంగణం వద్ద విషాద ఛాయలు అలముకున్నాయి. విద్యార్థి ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
* క్యాబ్ డ్రైవర్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. జూన్ 9న రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ పరిధి కోహెడ వద్ద క్యాబ్ డ్రైవర్‌పై దుండగులు హత్యాయత్నం చేశారు. కారు అపహరణకు వచ్చి హత్యకు యత్నించారు. ఈ ఘటనలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు తాజాగా ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.
* నిజామాబాద్‌ జిల్లాలోని వేల్పూర్‌ మండలంలో విషాదం చోటుచేసుకుంది. రెండేళ్ల కూతురితో పాటు తనకు కూడా నిప్పంటించుకుని ఒక తల్లి ఆత్మహత్యయత్నం చేశారు. ఈ ఘటనలో కూతురు మృతి చెందగా, 60 శాతం కాలిన గాయాలతో తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
* నెల్లూరు ఫత్తఖాన్‌పేటలోని రమేష్‌రెడ్డి నగర్‌లో దారుణం జరిగింది. తనను ప్రేమించలేదన్న కక్షతో అమ్మాయి ఇంటిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు ఆ శాడిస్ట్‌ ప్రేమికుడు. దీంతో.. ఇంట్లోని వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. జూన్‌ 24 వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత యువతి తల్లిదండ్రులు శాడిస్ట్‌ యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు నిందితుణ్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
* ఆషాడ మాసమని భార్యను అత్తవారింట్లో దింపి కారులో తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకరు మృతి చెందగా ఇంకొకరు గాయపడ్డారు. శంషాబాద్ మండలంలోని ఎయిర్ పోర్టు కాలనీ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
*మహారాష్ట్రను వర్షాలు వణికిస్తున్నాయి. పుణె ఆంబెగావ్లో సింహ్గడ్ కళాశాల ప్రహరిగోడ కూలి ఆరుగురు మరణించారు. మలాడ్ ఈస్ట్ ప్రాంతంలోని కురార్ గ్రామంలో గోడ కూలి 13 మంది మృతి చెందారు. మరో 10 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. జాతీయ విపత్తు నిర్వహణ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని.. సహాయక చర్యలు చేపట్టింది.
*గూడవల్లిలోని నారాయణ కాలేజ్‌లో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. కాలేజ్‌ సిబ్బంది గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించింది. విద్యార్థి మృతిపై వివరాలు వెల్లడించేందుకు కాలేజ్‌ సిబ్బంది నిరాకరిస్తుండటం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. విద్యార్థి మృతిపై పొంతన లేని సమాధానాలు ఇస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.
*హైదరాబాద్‌ నగరంలోని నల్గొండ పరిధి షేక్‌పేట వద్ద ఫ్లైఓవర్‌ వంతెన నిర్మాణ పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. క్రేన్‌ మీద పడటంతో డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో టోలీచౌకీ ప్రాంతంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.
*నల్లగొండ జిల్లా కేంద్రంలోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కేశవులు(36) తన ఇంటి ఆవరణలో మృతి చెంది ఉన్నాడు. మృతుని ముక్కు నుంచి రక్తం కారుతోంది. ఒంటిపై ఎటువంటి గాయాలు లేవు. అతని భార్య బెడ్‌రూంలో ఉండగా, ఆ గదికి బయట నుంచి గడియ పెట్టి ఉంది. హత్య చేశారనే ఆనవాళ్లు దొరకకుండా శవం చుట్టూ కారంపొడి చల్లారు. తన భర్తను ఎవరో హత్య చేశారని మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
*ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో మంగళవారం ఉదయం రోడ్డుప్రమాదం జరిగింది. 25 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రయివేటు బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న వారంతా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
*తండ్రికేమో పక్షవాతం.. క్యాన్సర్‌తో తల్లి మృతి చెందింది.. దిక్కు తోచని స్థితిలో ఇద్దరు అన్నదమ్ముళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలోని జనక్‌పురిలో సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.
*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ అధికారులపై పోడు సాగుదారులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన మంగళవారం వేకువజామున చోటుచేసుకుంది.
* ఒడిశాలోని భువనేశ్వర్లో ఆదివాసీ సంక్షేమాభివృద్ధి విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసతి గృహాల్లో నలుగురు విద్యార్థినులు గర్భం దాల్చడం కలకలం రేపింది.
*భార్యను, కన్నబిడ్డలను అత్యంత దారుణంగా హత్య చేసి… ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్న ఓ ఫార్మా సంస్థ సీనియర్ ఉద్యోగి ఉదంతం సోమవారం వెలుగు చూసింది. గురుగ్రామ్లోని ఉప్పల్ సౌత్ఎండ్హోంలో నివసించే ప్రకాశ్సింగ్(55) తన భార్య సోనూసింగ్(50), కుమార్తె అదితి(22), కుమారుడు ఆదిత్య(13)లను ఆదివారం రాత్రి హత్యచేసిన తీరు చూస్తే… పకడ్బందీగా.. పథకం ప్రకారమే చేసినట్లు స్పష్టమవుతోంది.
*అభం శుభం తెలియని ఓ బాలికను ఆమె బంధువు నమ్మించి అయిదు నెలల గర్భవతిని చేసిన ఘటన వేములవాడలో సోమవారం వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు రాగా స్టేషన్లోనే ఆమెకు గర్భస్రావమైంది.
*మాయమాటలతో పలువురు మహిళలను వంచించి అశ్లీల వీడియోలు తీసిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు ప్రాంతంలో కలకలం సృష్టిస్తోంది.
*కడప జిల్లాకే తలమానికంగా నిర్మిస్తున్న సౌరవిద్యుత్తు కేంద్రంలోని సౌర పలకలను ఆదివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు.
*కడప జిల్లా మైలవరం మండలం రామచంద్రాయపల్లెలో దుండగులు విధ్వంసం సృష్టించారు. సౌర విద్యుత్ కేంద్రంలో 1700 సౌర ఫలకాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.
* గ్రేటర్ నోయిడా ప్రాంతంలో ఓ భర్త తన భార్యకు విచిత్రమైన కారణం చూపిస్తూ విడాకులిచ్చాడు. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం.. నోయిడాలోని దాద్రి ప్రాంతం వద్ద ఉన్న నై అబాదీ మొహల్లా వద్ద జైనాబ్(30), తన భర్త సాబీర్(35)తో కలిసి నివసిస్తోంది.
*విహారానికి వెళ్లి ఇంటికి చేరుకున్న ఓ జంటను దోపిడీ దార్లు చుట్టుముట్టారు. ‘ఒంటిమీద ఉన్న నగలు ఒలిచిస్తావా బులెట్ దించమంటావా’ అంటూ ఇంటి యజమాని తలపై తుపాకీ గురిపెట్టారు
*నిలిచి ఉన్న లారీని ఓ ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. ఈ సంఘటన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనలో 15 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆళ్లగడ్డ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
*పుణెలోని అంబెగాన్లో పెను విషాదం చోటుచేసుకుంది. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు సిన్గాడ్ కళాశాల గోడ కూలి ఆరుగురు మృతిచెందారు. ముగ్గురు గాయపడ్డారు. ఈ సంఘటన సోమవారం అర్ధరాత్రి దాటాక 1.15 గంటలకు చోటుచేసుకుంది. ఘటన సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయకచర్యలు చేపట్టారు.
*విజయనగరం జిల్లా గురుగుబిల్లి మండలం తోటపల్లి వద్ద ఓ టూరిస్టు బస్సు అదుపుతప్పి నాగావళి నది కాల్వలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 25మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ అధికారులపై పోడు సాగుదారులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన మంగళవారం వేకువజామున చోటుచేసుకుంది.
*ఒడిశాలోని భువనేశ్వర్లో ఆదివాసీ సంక్షేమాభివృద్ధి విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసతి గృహాల్లో నలుగురు విద్యార్థినులు గర్భం దాల్చడం కలకలం రేపింది. ఇందుకు సంబంధించి జిల్లా శిశు సంక్షేమ కమిటీ (సీడబ్ల్యూసీ) ప్రతినిధులు భువనేశ్వర్ పోలీసు కమిషనర్ సత్యజిత్ మహంతికి ఫిర్యాదు చేశారు.
* స్థానిక పురుషోత్తమపట్నం అడ్డరోడ్డు వద్ద నివాసం ఉంటున్న తెదేపా నాయకుడు జవ్వాజి బుజ్జిబాబు ఇంటిపై సోమవారం రాత్రి వైకాపా నాయకులు దాడి చేశారు. ఇంటి ముందు ఉన్న ద్విచక్ర వాహనాన్ని ధ్వంసం చేశారు. అద్దాలు పగలగొట్టారు. విద్యుత్తు బల్బులు పగలగొట్టారు. తలుపు పగలగొట్టేందుకు విఫలయత్నం చేశారు.
*రంగారెడ్డి జిల్లా కోర్టులోని ఓ జడ్జి వద్ద కారుడ్రైవర్గా పనిచేసే యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మీర్పేట ఠాణా పరిధిలో జరిగింది.
*నల్గొండ జిల్లా కేంద్రంలో ఓ స్థిరాస్తి వ్యాపారి దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన మంగళవారం వేకువజామున జరిగింది.
*మాయమాటలతో పలువురు మహిళలను వంచించి అశ్లీల వీడియోలు తీసిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు ప్రాంతంలో కలకలం సృష్టిస్తోంది.
*నరసారావుపేట సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో లారీ డ్రైవర్తో పాటు బస్సులోని పలువురు ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి.
*ముంబయిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అధిక వర్షం కారణంగా మలాడ్ ఈస్ట్ ప్రాంతంలోని పింప్రిపాద నివాసప్రాంతంలో గోడకూలి 12 మంది మృతిచెందారు.