DailyDose

మన్మోహన్‌‌‌‌‌‌‌‌కు నో చెప్పిన డీఎంకే-రాజకీయ–07/02

Daily Politics - DMK Against Rajysabha Seat To Manmohan Singh - July 2 2019

* మాజీ ప్రధాని మన్మోహన్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ కు రాజ్యసభ సీటు ఇవ్వాలన్న కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ రిక్వెస్ట్‌‌‌‌‌‌‌‌కు డీఎంకే నో చెప్పింది. తమిళనాడు నుంచి రాజ్యసభకు పోటీచేసే ముగ్గురు కేండిడేట్ల పేర్లను డీఎంకే ప్రకటించింది.రాష్ట్రం నుంచి ఖాళీకానున్న ఆరు రాజ్యసభ సీట్ల ఎన్నికలకు ఎలక్షన్‌‌‌‌‌‌‌‌ కమిషన్‌‌‌‌‌‌‌‌ గత నెలలోనే ప్రకటించింది. అసెంబ్లీలో పార్టీ బలాబలాలనుచూస్తే ఏఐఏడీఎంకే, డీఎంకే పార్టీలు చెరో మూడు సీట్లను గెలుచుకోనున్నాయి. అస్సాం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ ప్రధాని మన్మోహన్‌‌‌‌‌‌‌‌సింగ్‌‌‌‌‌‌‌‌ పదవీకాలం ముగిసింది. మరోసారి అక్కడ నుంచి ఆయన ఎన్నికయ్యేందుకు అవసరమైన బలం కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు లేదు. దీంతో ఒక సీటు తమకు తమిళనాడు నుంచి ఇవ్వాలని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీ డీఎంకేను కోరినట్టు వార్తలొచ్చాయి.
* చంద్రబాబు ఇంకా అదే భ్రమలో ఉన్నారు:సుచరిత
తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీరుపై ఏపీ హోంమంత్రి సుచరిత తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌కు ఆయనే ముఖ్యమంత్రిననే భ్రమలో చంద్రబాబు ఉన్నారని మండిపడ్డారు. విపక్ష నేతననే విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలని సూచించారు. ప్రతి అంశానికీ ఆయన రాజకీయ రంగు పులుముతున్నారని సుచరిత మండిపడ్డారు. చంద్రబాబుకు బుల్లెట్‌ ప్రూఫ్‌, ఎస్కార్ట్‌ కార్లు ఇచ్చామని, భద్రతా సమీక్ష కమిటీ చెప్పిన దానికంటే ఎక్కువ భద్రతే ఆయనకు కల్పించినట్టు ఆమె వెల్లడించారు. వాస్తవంగా చంద్రబాబు భద్రతకు 58 మందినే కేటాయించాలి.. కానీ ఆయనకు రక్షణగా 74 మంది భద్రతా సిబ్బంది ఉన్నారని హోంమంత్రి వివరించారు. భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు కోరలేదని సుచరిత తెలిపారు.
* టైంపాస్ కొచ్చి హడావుడి చేశారు: తలసాని
కాంగ్రెస్ నేతలు సెక్రటేరియెట్కు టైంపాస్, పబ్లిసిటీ కోసం వచ్చారని, మీడియా ఉందని ఏదో హడావుడి చేశారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. 30 నిమిషాల్లోనే పరిశీలించి వెళ్లిపోయారని దుయ్యబట్టారు. ఎప్పటి నుంచో సెక్రటేరియెట్ కట్టాలని సీఎం అంటున్నారని, నిన్న ఇవాళ వచ్చిన ప్రతిపాదన కాదన్నారు. సోమవారం సెక్రటేరియెట్లో మంత్రి మీడియాతో మాట్లాడారు. ఆరు నూరైనా కొత్త అసెంబ్లీ, కొత్త సెక్రటేరియెట్ కట్టితీరుతామన్నారు. ఇప్పుడున్న సెక్రటేరియెట్, అసెంబ్లీ ఇరుకుగా ఉందని, ఈ విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ‘‘రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ఎప్పుడు ప్రస్తావించని మీ ముఖాలు మాకు సజేషన్ చేయడమేంది? సెక్రటేరియెట్ పరిశీలనకు పిక్నిక్కు వచ్చినట్లు వచ్చిండ్రు, వెళ్లిపోయిండ్రు. మొత్తం చూడొచ్చు కదా? కండిషన్ ఎలా ఉందో పరిశీలించొచ్చు కదా. ఆ పని చేయలె. టీవీలకు, పేపర్లకు పోజులివ్వడానికే వచ్చిండ్రు” అని కాంగ్రెస్ నేతలపై తలసాని మండిపడ్డారు. అసెంబ్లీ, సెక్రటేరియెట్ కడితే కాంగ్రెస్ కు చెప్పి కట్టాలా అని ప్రశ్నించారు. అది ప్రభుత్వ ఆస్తి అని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీగా మంచి సలహాలు ఇస్తే స్వీకరిస్తామని, నిర్మాణాలను అడ్డుకుంటే ఊరుకోబోమని హెచ్చరించారు. కాంగ్రెస్ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని స్పష్టం చేశారు.
* ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా
దినదినగండంగా నడుస్తున్న కర్నాటక సంకీర్ణ సర్కారుకు మరో షాక్‌ తగిలింది. సోమవారం ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రమేశ్ జారకిహొళి, ఆనంద్ సింగ్ తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో 224 మంది సభ్యులున్న అసెంబ్లీలో కాంగ్రెస్, జేడీఎస్ సర్కారు బలం 117కు తగ్గింది. వీరిలో కాంగ్రెస్ 77, జేడీఎస్ 37, బీఎస్పీ 1, ఇద్దరు ఇండిపెండెంట్లు ఉన్నారు. బీజేపీకి 105 మంది సభ్యులున్నారు. మ్యాజిక్‌ ఫిగర్‌113. మరికొందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ప్రభుత్వం మైనార్టీలో పడే ప్రమాదం ఉంది. ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా బీజేపీ కుట్రేనని సీఎం కుమారస్వామి మండిపడ్డారు.
* ట్విట్టర్ లో నారా లోకేష్…
వైకాపా అధికారంలో ఉంద‌ని మ‌రిచిపోయారా?విత్త‌నాలో జ‌గ‌న్ ప్ర‌భో అంటూ రైతులు గ‌గ్గోలు పెడుతుంటే!చంద్ర‌బాబు వ‌ల్లే విత్త‌నాలు ఇవ్వ‌లేక‌పోతున్నామంటున్నారు. ఒక‌టో తారీఖుకొచ్చే పింఛ‌ను రాలేదేమ‌ని పండుటాకులు నిల‌దీస్తే!గ‌త ప్ర‌భుత్వం వ‌ల్లే ఆల‌స్య‌మైంద‌ని స‌మాధానం ఇస్తున్నారు.బీమా రాలేదు..మా బ‌తుకుల ధీమా ఏదీ అంటే!లుగుదేశం స‌ర్కారు వ‌ల్లే అంటూ మాట దాట‌వేస్తున్నారు.
నేను విన్నాను..నేను ఉన్నానంటూ సీఎం అయ్యి, పాలన చేతకాక..ఇప్పుడుచంద్ర‌బాబే వింటాడు..చంద్ర‌బాబే ఉంటాడు అంటున్నారు.
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికారం వెల‌గ‌బెడుతున్న‌ది వైకాపానా? తెదేపానా?
* చెదపురుగుల్లా తినేసి.. సుమతీ శతకాలా!
తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యా పీఠానికి కేంద్రీయ విద్యాలయం ప్రతిపత్తి కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, రాజ్యసభపక్ష నేత వీ విజయసాయిరెడ్డి కేంద్రానికి విఙ్ఞప్తి చేశారు. మంగళవారం రాజ్యసభలో చర్చ సందర్భంగా 60 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ విద్యాపీఠానికి సముచిత స్థానం కల్పించాలని కోరారు. అదే విధంగా భారతదేశ సందర్శనకు వస్తున్న మహిళా విదేశీ పర్యాటకుల భద్రత, రక్షణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటో చెప్పాలని రాజ్యసభలో పర్యాటక శాఖ మంత్రిని ఆయన ప్రశ్నించారు.
* టీడీపీ ప్రభుత్వం పై కక్ష సాధింపు:కేంద్ర మాజీమంత్రి డా: కృపారాణి
గత టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పులు వెలికితీయడం కక్ష సాధింపు చర్య ఎలా అవుతుంది…నెల రోజుల ముఖ్యమంత్రి పాలన ప్రజలు హర్షిస్తుంటే టీడీపీ నేతలు మాత్రం కళ్ళు తెరవడం లేదు..చంద్రబాబు పాలనలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, శాంతి భద్రతలు చిన్నాభిన్నం అయ్యాయి..
*మాండ్యాకు నీళ్లివ్వండి : ఎంపీ సుమ‌ల‌త‌
ఎంపీ సుమ‌ల‌త ఇవాళ లోక్‌స‌భ‌లో మాట్లాడారు. మండ్యాలో క‌రువు ప‌రిస్థితి నెల‌కొన్న‌ద‌న్నారు. నీటి క‌రువు వ‌ల్ల జిల్లా రైతులు ఇబ్బందిప‌డుతున్నార‌ని ఆమె తెలిపారు. రైతుల నీటి క‌ష్టాల‌ను త‌క్ష‌ణ‌మే ప‌రిష్క‌రించాల‌న్నారు. వెంట‌నే స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ప్ర‌ధాని మోదీ, జ‌ల‌శ‌క్తి మంత్రిని వేడుకుంటున్న‌ట్లు సుమ‌ల‌త చెప్పారు. అన్న‌దాత‌ను ర‌క్షించుకోవాల‌ని, గౌర‌వంగా జీవించే హ‌క్కును కాపాడుకోవాల‌న్నారు. నీటి కొర‌త వ‌ల్ల రైతులు ప‌శువుల‌కు కూడా దాణా ఇవ్వ‌లేక‌పోతున్న‌ట్లు ఆమె తెలిపారు.
*ఇది కూల్చేసే ప్రభుత్వమే: యనమల
రాష్ట్రాభివృద్ధిని వదలి ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తెలంగాణ చుట్టూ తిరుగుతున్నారని తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. విత్తనాల కోసం రైతులు రోడ్డెక్కుతున్నా..వారి సమస్యలను పట్టించుకోకుండా ప్రతిపక్షంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. మంగళవారం యనమల విలేకరులతో మాట్లాడుతూ.. విత్తనాల కోసం రూ.380 కోట్లు ఇవ్వలేని ప్రభుత్వం.. రూ.వేల కోట్ల హామీలు ఎలా నెరవేరుస్తుందని ప్రశ్నించారు. నెలరోజుల్లోనే వైకాపా పరిపాలన ఏంటో జనాలకు బోధపడిందన్నారు. రాష్ట్రంలో తీవ్ర కరవు పరిస్థితులు నెలకొంటే..దీనిపై ప్రభుత్వం ఎలాంటి కసరత్తు చేయడం లేదని యనమల మండిపడ్డారు. ఇది కూల్చే ప్రభుత్వమే తప్ప, కాపు కాసే ప్రభుత్వం కాదని విమర్శించారు. పోలవరం పనులు నిలిచిపోయాయని, తిరిగి ఎప్పుడు మొదలవుతాయో చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాది వృద్ధి రేటు పడిపోయే అవకాశముందని యనమల హెచ్చరించారు. కమిటీల పేరిట రాజధాని నిర్మాణ పనులు ఆపేశారని ఆరోపించారు.
*యోగి సర్కార్‌ చేసింది కరెక్ట్ కాదు: కేంద్రం
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి మోదీ సర్కార్ షాకిచ్చింది. రాజ్యాంగానికి విరుద్ధంగా 17 ఓబీసీ కులాలను ఎస్సీల్లో చేర్చడాన్ని తప్పుబట్టింది. యూపీ ప్రభుత్వ చర్యలు రాజ్యాంగ విరుద్ధమని, సక్రమం కాదని తేల్చి చెప్పింది. రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు సామాజికన్యాయ శాఖ మంత్రి తవార్ చంద్ గెహ్లాట్ సమాధానమిస్తూ.. రాజ్యాంగపరమైన విధివిధానాలు పాటించకుండా యూపీ ప్రభుత్వం ఓబీసీలను ఎస్సీల్లో కలిపేసిందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అభ్యర్థనకు పార్లమెంట్ ఆమోదం పలికిన తర్వాతే అది రాజ్యాంగబద్ధమవుతుందని ఆయన అన్నారు.2017లో 17 ఓబీసీ కులాలను ష్కెడూల్డ్ క్యాస్టులలో చేరుస్తూ యోగి సర్కార్ నిర్ణయం తీసుకుంది. అప్పట్లో ఇది పెద్ద సంచలనమైంది. బీఎస్పీ అధినేత్రి మాయావతి తీవ్రస్థాయిలో ఖండించారు.
*లోక్‌స‌భ‌లో మాట్లాడిన సోనియా గాంధీ
కాంగ్రెస్ పార్టీ ఎంపీ సోనియా గాంధీ ఇవాళ లోక్‌స‌భ‌లో మాట్లాడారు. ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌ను మోదీ స‌ర్కార్ విస్మ‌రిస్తోంద‌ని సోనియా ఆరోపించారు. ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు ఆధునిక దేవాల‌యాల‌ని మాజీ ప్ర‌ధాని నెహ్రూ అన్నార‌ని ఆమె గుర్తు చేశారు. అయితే అలాంటి ఆల‌యాలు ఇప్పుడు ప్ర‌మాద‌క‌ర స్థితిలో ఉన్న‌ట్లు సోనియా చెప్పారు. లాభాలు ఉన్నా.. ఆ పీఎస్‌యూల్లో ప‌నిచేస్తున్న ఉద్యోగుల‌కు స‌రైన స‌మ‌యంలో జీతాలు అంద‌డం లేద‌ని ఆమె విమ‌ర్శించారు. కొంద‌రు పారిశ్రామిక‌వేత్త‌ల‌కు లాభం చేకూర్చేందుకు మాత్ర‌మే ప్ర‌భుత్వం నిర్ణ‌యాలు తీసుకుంటున్న‌ద‌ని సోనియా ఆరోపించారు.
*చంద్రబాబు పిటిషన్‌పై విచారణ వాయిదా
తనకు భద్రత కుదించడంపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ ఇవాళ విచారణకు వచ్చింది. దీనిపై ఏజీ సమయం కోరడంతో విచారణను మధ్యాహ్నం 2.15 గంటలకు న్యాయస్థానం వాయిదా వేసింది. భద్రత కుదింపుపై పునఃసమీక్షించాలని చంద్రబాబు తన పిటిషన్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇద్దరు ప్రధాన భద్రతాధికారులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. గతంలో ఒక అదనపు ఎస్పీ, ఒక డీఎస్పీ, ముగ్గురు ఆర్‌ఐ బృందాలతో చంద్రబాబుకు భద్రత కల్పించేవారు. ప్రస్తుతం అందరినీ తొలగించి ఇద్దరు కానిస్టేబుళ్ల చొప్పున 3 బృందాలను కేటాయించారు. దీనిపై తెదేపా శ్రేణులు మండిపడుతున్నాయి. భద్రత కుదింపు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపేనని విమర్శిస్తున్నాయి.
*కాగజ్నగర్ ఘటనపై కాంగ్రెస్ నిజ నిర్ధారణ కమిటీ
సిర్పూర్ కాగజ్నగర్ అటవీ శాఖ అధికారి అనితపై ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కృష్ణ, తెరాస నేతలు దాడికి పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఘటన పూర్వాపరాలు పరిశీలించేందుకు పార్టీ తరఫున నలుగురు ఎమ్మెల్యే(డి.శ్రీధర్బాబు, పొదెం వీరయ్య, సీతక్క, జగ్గారెడ్డి)లతో నిజ నిర్ధారణ కమిటి వేసింది.
*కాంగ్రెస్ నేతలది విహారయాత్ర
తెలంగాణ సచివాలయం, శాసనసభ భవన నిర్మాణాలపై కాంగ్రెస్ నేతలు మసిబూసి మారేడు కాయ చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ధ్వజమెత్తారు. మీడియాలో ఉచిత ప్రచారం కోసం ప్రయత్నిస్తున్నారని, విహారయాత్రకు వచ్చినట్లుగా సచివాలయం, శాసనసభకు వచ్చి నాటకాలు ఆడారన్నారు. సోమవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
*తెరాసను వీడే ప్రసక్తే లేదు: కడియం
తాను తెరాసను వీడి భాజపాలో చేరుతున్నట్లు కొన్ని పత్రికలు, టీవీలు (ఈనాడు, ఈటీవీ కాదు) దుష్ప్రచారం చేస్తున్నాయని, తాను ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారే ప్రసక్తే లేదని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సోమవారం బహిరంగ లేఖ విడుదల చేశారు. రాజకీయ స్వార్థం కోసం పార్టీలు మారాల్సిన అవసరం కానీ, పదవుల కోసం పాకులాడాల్సిన పరిస్థితి తనకు లేవని అందులో పేర్కొన్నారు. కులం, మతం ఆధారంగా రాజకీయాలు చేసే పార్టీలకు దూరంగా ఉంటానని, దళిత, ముస్లిం, క్రైస్తవ వ్యతిరేకమైన భారతీయ జనతా పార్టీలోకి వెళ్లే పరిస్థితి లేదని లేఖలో ఆయన వెల్లడించారు.
*మేయర్, ఛైర్మన్లకు ప్రత్యక్ష ఎన్నికలు
రాష్ట్రంలో మున్సిపల్ ఛైర్మన్లు, మేయర్లకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించేలా కొత్త పురపాలక చట్టం ఉండాలని ప్రజాస్వామ్య పీఠం(ఎఫ్డీఆర్), లోక్సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ్ ముఖ్యమంత్రి కేసీఆర్ను కోరారు. కొత్త పురపాలక చట్టంలో ఉండాల్సిన అంశాలపై ముఖ్యమంత్రికి ఆయన సోమవారం లేఖ రాశారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అవినీతి, అక్రమాలను అరికట్టేలా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా సామాజిక తనిఖీ నిర్వహించేలా చట్టంలో అవకాశం కల్పించాలన్నారు. పురచట్టంలో భాగంగా పౌరసేవలు మెరుగుపడేందుకు పౌరసేవల చట్టాన్ని (రైట్ టు సర్వీసెస్) తీసుకురావాలని కోరారు.
*విపక్షాలది అనవసర రాద్ధాంతం: తెరా
తెలంగాణలోని విపక్షాలకు వేరే పని లేకనే శాసనసభ, సచివాలయం నిర్మాణాలు ఓ పెద్ద సమస్య అయినట్టు రాద్ధాంతం చేస్తున్నాయని తెరాస ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. తెలంగాణ బాగు పడడం వారికి ఏ మాత్రం ఇష్టం లేదని, కొత్త భవనాలను అందరూ స్వాగతిస్తుంటే… కాంగ్రెస్, భాజపా నేతలు గుడ్డిగా వ్యతిరేకిస్తున్నారన్నారు. సోమవారం తెలంగాణ భవన్లో సుమన్.. ఎమ్మెల్సీ ఎం.శ్రీనివాస్రెడ్డి, పార్టీ కార్యదర్శి గట్టు రామచందర్రావులతో కలిసి విలేకరులతో మాట్లాడారు.
*ఫిరాయింపులపై పోరాటం కొనసాగుతూనే ఉంటుంది
పార్టీ ఫిరాయింపులపై ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని కాంగ్రెస్ శాసనసభాపక్షనేత మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. దీనిపై త్వరలోనే రాజకీయ నాయకులు, న్యాయ ప్రముఖులతో హైదరాబాద్లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. సోమవారం ఆయన సీఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పార్టీ ఫిరాయింపులపై ఆగస్టు 15 నుంచి జనవరి 26 వరకు ప్రతి మండలంలో కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో చైతన్యం కల్పిస్తామన్నారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల అనర్హత విషయంలో లోతుగా అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. అంబేడ్కర్ అంటే ముఖ్యమంత్రి కేసీఆర్కు రుచించడం లేదని, అందుకే కాంగ్రెస్ చేపట్టిన డా.బి.ఆర్.అంబేడ్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో అంబేడ్కర్ పేరు తొలగించారని విమర్శించారు. ఏఐసీసీ కార్యదర్శి వీహెచ్ తయారు చేయించిన అంబేడ్కర్ విగ్రహాన్ని ఎక్కడ ఉంచినా పోలీసులు వెంటనే తీసుకువచ్చి పంజాగుట్ట సర్కిల్లో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కాంగ్రెస్ను వీడుతారని తాను భావించడం లేదని భట్టి తెలిపారు. పీసీసీ అధ్యక్ష పదవి కావాలని తాను అడగడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో అధిష్ఠానం నిర్ణయమే అంతిమం అన్నారు.
*తెరాస నేతలు గతంలోనూ ఇలా దాడులు చేశారు:తెదేపా
అటవీ శాఖ సిబ్బందిపై తెరాస నేతల దాడిని ఖండిస్తున్నట్లు తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. తెరాస నేతలు గతంలోనూ అనేక మంది అధికారులపై ఇలాంటి దాడులకు పాల్పడ్డ ఘటనలున్నాయని పేర్కొన్నారు. పోడు భూముల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు.
*ఉపసభాపతి పదవి భాజపాకే
లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవిని తామే తీసుకోవాలని భాజపా అధిష్ఠానం అభిప్రాయపడుతోంది. ఈ మేరకు స్థిరనిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఎన్డీయే ప్రభుత్వంలోని భాగస్వామ్యపక్షాలకు లేదా మద్దతుగా ఉన్న మిత్రపక్షాలకు ఈ పదవి ఇవ్వవచ్చనే ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో జేడీయూ, శివసేన, బీజేడీ లేదా వైకాపాలకు ఈ పదవి దక్కవచ్చని ప్రచారం సాగింది. అయితే భాజపాకు తగినంత సంఖ్యాబలం ఉన్నందున ఈ పదవిని తమ ఎంపీకే ఇవ్వాలని అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలిసింది.
*తెరాస నేతలు గతంలోనూ ఇలా దాడులు చేశారు: తెదేపా
అటవీ శాఖ సిబ్బందిపై తెరాస నేతల దాడిని ఖండిస్తున్నట్లు తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. తెరాస నేతలు గతంలోనూ అనేక మంది అధికారులపై ఇలాంటి దాడులకు పాల్పడ్డ ఘటనలున్నాయని పేర్కొన్నారు. పోడు భూముల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు.
*ఆర్టీసీకి రూ.6,900 కోట్లు అవసరం
సినిమా కష్టాలు ఎదుర్కొంటున్న ఆర్టీసీ నష్టాల నుంచి గట్టెక్కాలంటే రూ.6,900 కోట్లు అవసరమని రాష్ట్ర రవాణా, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తెలిపారు. ఆర్టీసీని రక్షించేలా చర్యలు తీసుకోవాలని ఆర్థికశాఖ మంత్రికి విజ్ఞప్తి చేశామన్నారు. సచివాలయంలో ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అధ్యక్షతన 2019 బడ్జెట్ అంచనాలపై శాఖల వారీగా నిర్వహించిన సమావేశంలో మంత్రి నాని పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల భవిష్యనిధి రూ.3 వేల కోట్లు నేరుగా వాడేసిందని, ఉద్యోగులకు పెంచిన వేతన సవరణ బకాయిలు ఇప్పటివరకు చెల్లించలేదని మండిపడ్డారు. రవాణాశాఖలో వంద ఖాళీలను భర్తీ చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆర్థిక మంత్రిని కోరానని తెలిపారు. స
*కర్ణాటకలో రాజీనామాల కలకలం
ముఖ్యమంత్రి కుమారస్వామి అమెరికా పర్యటనలో ఉన్న వేళ కర్ణాటకలో రాజకీయ కలకలం రేగింది. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామాలతో ఇబ్బందికర పరిస్థితులను సృష్టించారు. విజయపుర- హొసపేటె ఎమ్మెల్యే ఆనంద్సింగ్ సోమవారం స్పీకరు, గవర్నరులకు రాజీనామా సమర్పించారు. ఎప్పటి నుంచో రాజీనామా చేస్తానని ప్రకటిస్తున్న గోకాక్ ఎమ్మెల్యే రమేశ్ జార్ఖిహొళి ముంబయి నుంచి ఫ్యాక్స్ ద్వారా తన రాజీనామాను స్పీకర్కు పంపారు. ఈ పరిణామాలతో కాంగ్రెస్- జనతాదళ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
*విత్తన కొరత బాధ్యత చంద్రబాబుదే
రాష్ట్రంలో విత్తన కొరతకు చంద్రబాబే బాధ్యత వహించాలని వ్యవసాయ, ఉద్యానశాఖ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. జూన్ 8దాకా తానే ముఖ్యమంత్రినన్న ఆయనకు ఖరీఫ్ పంట కాలానికి విత్తనాలు సేకరించాలనే విషయం కూడా తెలియలేదని మండిపడ్డారు. విత్తన సేకరణకు సంబంధించి రూ.380 కోట్ల బిల్లులను చెల్లించకుండా పసుపు కుంకుమ పథకానికి మళ్లించారని విమర్శించారు. సోమవారం సాయంత్రం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
*రైతులకు రూ.611 కోట్లు చెల్లించండి
ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో విత్తనాల కొరతతో రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని జనసేన అధినేత పవన్కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి వరకూ క్యూలైన్లలో నిలుచుంటున్నా విత్తనాలు లభిస్తాయో లేదో తెలియని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలో 4.96 లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగు చేసేందుకు గాను 3 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమని అంచనా వేయగా..1.8 లక్షల క్వింటాళ్లు మాత్రమే ప్రభుత్వం నుంచి వచ్చాయని పవన్కల్యాణ్ ప్రస్తావించారు. ప్రభుత్వం సరఫరా చేసే కేంద్రాల్లో కంటే…వ్యాపారుల గోదాముల్లో ప్రభుత్వ సంచుల్లోనే వేరుశనగ విత్తనం లభిస్తోందని అక్కడ రైతులు చెబుతున్నారంటే లోపం ఎక్కడుందో ప్రభుత్వమే సమాధానమివ్వాలని పవన్ డిమాండు చేశారు. ఉత్తరాంధ్రలో వరి పంటకు అవసరమైన విత్తనాలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేవని అన్నారు. ఈ పరిస్థితిపై ప్రభుత్వం వెంటనే సమీక్షించాలని కోరారు.
*రైతుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం
రైతు సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు ట్విటర్ వేదిక విమర్శించారు. ‘‘రైతు రుణమాఫీ లేదు. అన్నదాత సుఖీభవను రద్దు చేశారు. మరోవైపు రైతు బకాయిలు చెల్లించకపోవడంతో సాగుకు పెట్టుబడి లేని పరిస్థితులున్నాయి. ఎలాగోలా సాగుకు సిద్ధమైతే విత్తనాలు దొరకని పరిస్థితి. ఇది ప్రభుత్వ ప్రణాళికా లోపమే’’ అని ట్వీట్ చేశారు.
*ఉపసభాపతి పదవి భాజపాకే!
లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవిని తామే తీసుకోవాలని భాజపా అధిష్ఠానం అభిప్రాయపడుతోంది. ఈ మేరకు స్థిరనిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఎన్డీయే ప్రభుత్వంలోని భాగస్వామ్యపక్షాలకు లేదా మద్దతుగా ఉన్న మిత్రపక్షాలకు ఈ పదవి ఇవ్వవచ్చనే ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో జేడీయూ, శివసేన, బీజేడీ లేదా వైకాపాలకు ఈ పదవి దక్కవచ్చని ప్రచారం సాగింది. అయితే భాజపాకు తగినంత సంఖ్యాబలం ఉన్నందున ఈ పదవిని తమ ఎంపీకే ఇవ్వాలని అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలిసింది.
*కుప్పం నియోజకవర్గంలో అర్ధరాత్రి ఉద్రిక్తం
తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మంగళవారం నుంచి 2 రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్న నేపథ్యంలో శాంతిపురం మండల కేంద్రంలో పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అర్ధరాత్రి కొందరు ధ్వంసం చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. చంద్రబాబుకు స్వాగతం పలుకుతూ బస్టాండువద్ద తెదేపా ఏర్పాటు చేసిన బ్యానర్లను సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి బ్యానర్లకు అడ్డుగా ఏర్పాటు చేశారంటూ ధ్వంసం చేశారు. దీనిని అడ్డుకునే ప్రయత్నంలో తెదేపా, వైకాపా శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
* చంద్రబాబు పథకాలపై సుప్రీం నోటీసులు.
ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రకటించిన నగదు బదిలీ పథకంపై దాఖలైన పిటీషన్ పై విచారణకు సుప్రీం కోర్టు అనుమతించింది. ఎన్నికలకు ముందు ప్రభుత్వ పథకాల పేరుతో నగదు పంపిణీ చేశారని ఆరోపిస్తూ జనసేన పార్టీ నేత పెంటపాటి పుల్లారావు గతంలో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషన్‌పై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, పశ్చిమబెంగాల్‌, ఒడిశా, జార్ఖండ్‌, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.ఎన్నికలకు సరిగ్గా ఆరు నెలల ముందు చంద్రబాబు ప్రభుత్వం పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ పేరుతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున నగదు పంపిణీ చేశారని, అదే విధంగా నగదు బదిలీ పథకం పై నిషేధం కూడా విధించాలని పిటిషనర్ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పథకాలను చట్టవిరుద్ధమైనవిగా, రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరారు. దీనిపై విచారణ చేపట్టేందుకు సిద్ధమైన సుప్రీంకోర్టు కేంద్ర ఎన్నికల సంఘానికి, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.