Movies

ఆచితూచి మాట్లాడాలి

Shruti Hassan Says She Thinks Twice Before Speaking

‘‘జీవితంలో ఎంతో మందికి లేని అవకాశాలు చిన్నప్పటి నుంచీ నా చుట్టూ ఉన్నాయి. అయితే వాటి గొప్పతనం అప్పుడు నాకు అర్థం కాలేదు. వాటి సీరియస్‌నెస్‌ని గ్రహించడానికి నాకు సమయం పట్టింది’’ అని అంటున్నారు శ్రుతీ హాసన్‌. ఇటీవల ఆమె మాట్లాడుతూ ‘‘ఇప్పుడొస్తున్న చాలా మంది అమ్మాయిలకు (మా చెల్లెలు అక్షర హాసన్‌ సహా) ఎక్కడ ఎలా ఉండాలి? ఎవరితో ఎలా ప్రవర్తించాలి? ఎక్కడ ఆచితూచి మాట్లాడాలి? వంటి విషయాలన్నీ తెలుస్తున్నాయి. కానీ నేను వాటి మీద ఎప్పుడూ ఫోకస్‌ చేయలేదు. చాలా స్వతంత్రంగా పెరిగా. అంతెందుకు… మేకప్‌, హెయిర్‌స్టైల్‌, డ్రెస్సింగ్‌ వంటివన్నీ నా తొలి చిత్రంలో నాకే పెద్దగా నచ్చలేదు. రెండో, మూడో చిత్రానికీ వాటిలో పర్ఫెక్షన్‌ వచ్చింది. అలాగే ‘దేవర్‌ మగన్‌’ సినిమాలో (తెలుగులో ‘క్షత్రియపుత్రుడు’గా విడుదలైంది) ‘పోట్రి పాడడి పెణ్ణే…’ అని పాడినప్పుడు ‘నాక్కూడా ఒక స్పెషల్‌ మైక్‌ ఇచ్చారు’ అనే ఆనందం తప్ప ఆ రోజు నాలో ఇంకేమీ లేదు. ఇళయరాజాగారి స్టూడియోలో నా పక్కనే మా అమ్మా, నాన్న అంత టెన్షన్‌గా నిలుచుని ఎందుకు చూశారో ఇప్పుడు అర్థమవుతోంది… ఇలా జీవితంలో గొప్ప గొప్ప విషయాలను చాలా అమాయకంగా దాటేశా’’ అని చెప్పారు.