WorldWonders

పాతికవేల కోట్లు అలా ఇచ్చేశారు

Warren Buffets New Donation To Gates Foundation

ప్రముఖ బిలియనీర్ వారెన్ బఫెట్ భూరి విరాళం ప్రకటించారు. బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్, నాలుగు ఇతర స్వచ్ఛంద సంస్థలకు 3.6 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.25000 కోట్లు) విలువైన బెర్క్షైర్ హాత్వే షేర్లను విరాళంగా ఇచ్చారు. గేట్స్ ఫౌండేషన్తో పాటు సుసాన్ ధామ్సన్ బఫెట్ ఫౌండేషన్, ది షెర్వుడ్ ఫౌండేషన్, ది హోవార్డ్ జి బఫెట్ ఫౌండేషన్, నోవో ఫౌండేషన్లు ఈ విరాళాన్ని అందుకోనున్నాయి. 2006 నుంచి ఇప్పటి వరకు ఈ అయిదు స్వచ్ఛంద సంస్థలకు సుమారు 34 బిలియన్ డాలర్లు విరాళంగా అందించారు.