Movies

అనుపమ్‌కు ఆస్కార్ పిలుపు

Bollywood Actor Anupam Kher Invited To Oscars Ceremony

ప్రతిష్ఠాత్మక ఆస్కార్ పురస్కారాల అకాడెమీ నుంచి పలువురు భారతీయ సినీ ప్రముఖులకు ఆహ్వానం అందింది. వారిలో సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్, విభిన్న చిత్రాలతో మెప్పించిన దర్శకులు అనురాగ్ కశ్యప్, జోయా అక్తర్, రితేష్ బత్రాలతో పాటు ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘2.ఓ’ చిత్రాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించిన శ్రీనివాస్ మోహన్ కూడా ఉన్నారు. 2019కిగానూ వీరు ఆస్కార్ అకాడెమీ సభ్యులుగా వ్యవహరిస్తారు. వీరు ఈ ఏడాది ఆస్కార్ నామినేషన్లు దక్కించుకునే చిత్రాలను పరిశీలించి విజేతలను ఎంపిక చేసే విషయంలో భాగస్వాములు కానున్నారు.