Politics

₹78లక్షలు నొక్కేసిన ఆదిలాబాద్ సబ్-రిజిస్ట్రార్ అధికారులు

Corrupt Officials In Adilabad SubRegistrar Office Frauds For 78Lakhs

ఆదిలాబాద్‍ సబ్‍ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో స్టాంపుల కుంభకోణంలో మంగళవారం ముగ్గురు సబ్‍ రిజిస్ట్రార్‌ లు సహా ఎనిమిది మంది అరెస్టయ్యారు. ఇంటిదొంగలపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. 2014 నుంచి 2018 ఆగస్టు వరకు సబ్​రిజిస్ట్రార్‌ ఆఫీస్‌లో రిజిస్ట్రేషన్ల కోసం ప్రజలు చలాన్ల రూపంలో చెల్లించే డబ్బులను ఖజనాకు జమచేయకుండా అవినీతికి పాల్పడ్డారు. దీనిపై కొత్తగా చేరిన సబ్‍ రిజిస్ట్రార్‌ జ్యోతిరెడ్డికి అనుమానాలు రావడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణలో సర్కారు ఖజనాకు చెల్లించాల్సిన చలానాల డబ్బు  రూ.78లక్షలు సొంతానికి వాడుకొని దుర్వినియోగం చేసినట్లుగా తెలిసింది. ముగ్గురు సబ్‍ రిజిస్ట్రార్‌ సహా తొమ్మిది మంది ఉద్యోగులు దీనికి బాధ్యులుగా ఉన్నట్లు గుర్తించారు. దీనిపై స్థానిక టూ టౌన్‍లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు మూడు నెలల క్రితం అవినీతికి పాల్పడ్డ నలుగురు అధికారులను అరెస్టు చేసారు. తాజాగా రిటైర్డు సబ్‍ రిజిస్ట్రార్ జయవంత్‍రావు, సబ్​రిజిస్ట్రార్‌ రావోత్‍ సాయినాథ్‍, జుట్టు మనోహర్‍,  సీనియర్‍ అసిస్టెంట్లు కనికారపు చంద్రశేఖర్‍, ఇమ్రాన్‍ఖాన్‍, వెబ్యారపు అరుణ్‍కుమార్‍, సీనియర్‍ అసిస్టెంట్‍ కామరి కల్పన, జూనియర్‍ అసిస్టెంట్‍ బక్షి సుజాతను అరెస్టు చేసి కోర్టులో
హాజరుపరిచారు.