DailyDose

శంషాబాద్ లో భారీగా బంగారం స్వాధీనం-నేరవార్తలు–07/03

Daily Crime News-Gold Seized In Shamshabad Airport-July32019

* తిరుమలలోని మణిమంజరి అతిథిగృహంలో బుధవారం చోరీ జరిగింది. హైదరాబాద్‌ వాసి విజయ్‌సేన్‌రెడ్డికి చెందిన నగదు, నగలను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. 10 తులాల బంగారం, రూ.2 లక్షల నగదును దొంగలించినట్లు తెలుస్తోంది. అతిథిగృహం వద్దకు చేరుకున్న పోలీసులు అక్కడి సిబ్బందిని విచారిస్తున్నారు. బాధితులు శ్రీవారి దర్శనానికి వెళ్లిన సమయంలో చోరీ జరిగినట్లుగా ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఘటనాస్థలిలో డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు చేస్తున్నారు.
* హెచ్1 బీ వీసా మోసాలకు పాల్పడుతున్న నలుగురు ఎన్ఆర్ఐలను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. న్యూజెర్సీ, కాలిఫోర్నియాలోని రెండు వేర్వేరు ఐటీ కంపెనీలకు చెందిన విజయ్ మానే(39), ఫెర్నాండో సిల్వా(53), సతీష్ వేమూరి(52), వెంకట రమణ మన్నెం(47) లను మంగళవారం అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే… వారు వెంటనే బెయిల్ పై బయటకు వచ్చారు. రూ.2.5లక్షల పూచీ కత్తుతో వారికి బెయిల్ ఇవ్వడానికి న్యాయస్థానం అంగీకరించింది. కాగా ఈ నలుగురు కలిసి న్యూజెర్సీ కేంద్రంగా ప్రొక్యూర్‌ ప్రొఫెషనల్స్‌, క్లైంట్‌ ఏ, కాలిఫోర్నియా కేంద్రంగా క్రిప్టో ఐటీ సొల్యూషన్స్‌ పేరిట ఐటీ స్టాఫింగ్‌ కంపెనీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అమెరికాలో ఉద్యోగం పొందాలనుకున్న విదేశీయులకు హెచ్‌1 బీ వీసా ఇప్పిస్తామని చెప్పి మోసం చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. నైపుణ్యమున్న విదేశీ ఉద్యోగులకు అమెరికా హెచ్‌1బీ వీసా జారీచేస్తుందన్న సంగతి తెలిసిందే.
* పాకిస్థాన్‌లోని లాహోర్‌ విమానాశ్రయంలో దుండగుల కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం ఉదయం పదిగంటలకు జరిగింది. సౌదీలో పవిత్ర ఉమ్రా యాత్ర ముగించుకుని వచ్చిన ప్రయాణీకులు విమానం దిగి ఇంటర్నేషనల్‌ లాంజ్‌లో ఉండగా, బయటినుంచి చొరబడ్డ వ్యక్తులు కాల్పులు జరిపారు. దుండగుల చర్యతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కాల్పులపై సమాచారం అందడంతో ఎయిర్‌పోర్టు ఎంట్రీ, ఎగ్జిట్‌ పాయింట్లను మూసేసిన పోలీసులు అర్షద్‌, షాన్‌ అనే ఇద్దరు వ్యక్తులను అనుమానితులుగా భావించి తమ కస్టడీలోకి తీసుకున్నారు.
* ప్రముఖ బాలీవుడ్‌ నటి భాగ్యశ్రీ (మైనే ప్యార్‌ కియా ఫేం) భర్త హిమాలయ దస్సానీ అరెస్ట్‌ అయ్యారు. ఓ గ్యాంబ్లింగ్‌ కేసులో భాగంగా ముంబయిలోని అంబోలీ ప్రాంతానికి చెందిన పోలీసులు దస్సానీని అరెస్ట్‌ చేశారు. స్థానిక న్యాయస్థానంలో ఆయన్ను ప్రవేశపెట్టిన అనంతరం బెయిల్‌పై విడుదల చేశారు. ఇటీవల సబర్బన్‌ జోగేశ్వరీ ప్రాంతంలో గ్యాంబ్లింగ్‌కు పాల్పడుతున్న కొందరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
* గుంటూరు డియఫ్ఓ మోహన్ రావు పై ఎస్పీకి ఫిర్యాదు చేసిన మహిళ.ఉద్యోగం ఇప్పిస్తానంటూ రెండు లక్షల రూపాయలు లంచం తీసుకుని శారీరక వాంచ తీర్చాలంటూ వేదిస్తున్నాడని ఫిర్యాదు లో పేర్కొన్న మహిళ.ప్రకాశం జిల్లా ఆదినారాయణ పురానికి చెందిన మహిళ.ఐదు నెలల క్రితం గుంటూరు జిల్లా అటవీశాఖ కార్యాలయంలో ఉద్యోగం కోసం డియఫ్ఓ మోహన్ రావు వద్దకు వెళ్ళిన మహిళ. ఉద్యోగం కావాలంటే రెండు లక్షల రూపాయలు ఖర్చవుతుందని చెప్పిన డియఫ్ఓ మోహన్ రావు.రెండు లక్షల రూపాయల నగదుతో పాటు సర్టిఫికెట్ లు ఇచ్చిన మహిళ.రెండు రోజుల తర్వాత రామనడంతో వెళ్ళిన మహిళ పై అసభ్యకరంగా ప్రవర్తించినా ఎవరికీ చెప్పుకోలేక ఐదు నెలల పాటు భరించిన మహిళ.ఇధ్వా మహిళా సంఘం సహాయంతో గుంటూరు అర్బన్ యస్పీకి ఫిర్యాదు.అంతకు ముందు హోమ్ మంత్రి కి ఫిర్యాదు చేసిన.డియఫ్ఓ మోహన్ రావు పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్.
*శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో 6.5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బంగారాన్ని తరలిస్తున్న 14 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ రూ. 2.20 కోట్లుగా ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, డీఆర్‌ఐ అధికారుల జాయింట్‌ ఆపరేషన్‌లో జెడ్డా నుంచి వచ్చిన 14 మంది బంగారంతో పట్టుబడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 14 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
*నల్లగొండ జిల్లాలోని గట్టుప్పల్‌లో ఏటీఎంలో ఉన్న నగదును దొచుకునేందుకు ఓ దొంగ ప్రయత్నించాడు. దీన్ని గమనించిన స్థానిక యువకులు.. ఏటీఎం దగ్గరకు వెళ్లారు. దీంతో అప్రమత్తమైన దొంగ తన బైక్‌పై పారిపోతుండగా.. అతడిని యువకులు వెంబడించారు. ఈ క్రమంలో దొంగ బైక్‌పై నుంచి కింద పడిపోయాడు. తీవ్ర గాయాలపాలైన దొంగను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
*హైదరాబాద్‌ నగరంలోని మొజాంజాహీ మార్కెట్‌ వద్ద ఇవాళ ఉదయం పెను ప్రమాదం తప్పింది. వేగంగా వెళ్తున్న లగ్జరీ బస్సు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. దీంతో బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో పాటు ఏడుగురి ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ప్రయాణికులను వేరే బస్సుల్లో వారి గమ్యస్థానాలకు పంపించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
* వృద్ధురాలిని దారుణంగా హత్య చేసి బంగారం, నగదుతో పరారైన ఘటన నిజామాబాద్‌లో కలకలం రేపుతోంది. స్థానిక న్యాల్‌కల్ రోడ్డులో ఈ దారుణం చోటు చేసుకుంది. సాయమ్మ అనే వృద్ధురాలిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసి.. ఆమె ఒంటిపై ఉన్న బంగారం, బీరువాలో నగదుతో పరారరయ్యారు. సాయమ్మ ముఖంపై దుండగులు బ్లేడ్‌తో కోశారు. ఆమెను అంతకు ముందు బయటి నుంచి ఓ ఆటోడ్రైవర్‌ తీసుకొచ్చాడని స్థానికులు పేర్కొంటున్నారు. అతనిపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
*లిబియాలో జరిగిన వైమానిక బాంబు దాడిలో కనీసం 40 మంది మృత్యువాత పడ్డారు. మరో 80మంది తీవ్రంగా గాయపడ్డారు. దేశ రాజధాని ట్రిపోలి నగర శివారులోని తజౌరా అనే ప్రాంతంలోని వలసదారుల పునరావాస కేంద్రంపై మంగళవారం రాత్రి ఈ దాడి జరిగింది.
* ఎద్దుల బండిని తప్పించబోయి బస్సు లోయలోకి దూసుకెళ్లిన ఘటన మంగళవారం ఉదయం మండలంలోని ఏటూరు గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించడంతో బస్సులోని 45 మంది ప్రయాణికులు ఎలాంటి గాయలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు.
* దొంగతనం చేయబోయి తప్పించుకునే ప్రయత్నంలో ఓ దొంగ తన ప్రాణాల్ని కోల్పోయాడు. ఈ ఘటన నల్గోండ జిల్లా చండూర్ మం. గట్టుప్పల్ లో జరిగింది. గట్టుప్పల్ లోని ఓ ఏటీఎమ్ లో చోరికి యత్నిస్తుండగా ఆ దొంగను స్థానిక యువకులు గమనించారు. దీంతో అప్రమత్తమైన దొంగ వారి నుంచి తప్పించుకోవడానికి, బైక్ పై పరారీ అవుతున్న క్రమంలో బైక్ పై నుంచి కింద పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన ఆ దొంగను పోలీసులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఈ ఉదయం మృతి చెందాడు.
* కర్ణాటక రాష్ట్రంలోని చింతామణిలో ఇవాళ ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. ప్రయివేటు బస్సు – ఆటో రీక్షా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
* కర్ణాటక చిక్కబళ్లాపుర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు బస్సు, టాటా ఏస్ఢీ కొన్న ఘటనలో 11 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
*ఆరుగాలం శ్రమించి తాము సాగు చేసుకునే భూములు పారిశ్రామిక అవసరాలకు తీసుకున్నా తమకు ఉపాధి చూపడం లేదంటూ ఓ నిరుద్యోగ యువకుడు విషద్రావకం తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన మంగళవారం అనంతపురం జిల్లాలోని తాడిపత్రి మండలం ఊరుచింతల గ్రామంలో చోటు చేసుకుంది.
*నైజీరియాలో సముద్రపు దొంగలు అపహరించిన విశాఖ నగరానికి చెందిన ఇద్దరు యువకులతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మరో ముగ్గురు ఎట్టకేలకు విడుదలయ్యారు.
*రియల్ఎస్టేట్ వ్యాపారంలో వివాదాల నేపథ్యంలో దంపతులిద్దరు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా తాళ్లముదునూరుకు చెందిన భర్త వెలగల పట్టాభిరామారెడ్డి(54) మూడేళ్లుగా రాజమహేంద్రవరం గ్రామీణం హుకుంపేట పరిధిలో ఓ అపార్టుమెంటులో రహస్యంగా నివసిస్తున్నారు.
*తీర్థయాత్రలు ముగించుకుని మరో అరగంటలో ఇంటికి అంతా చేరుకుంటారనుకునే సమయంలో బస్సు బోల్తాపడి 24 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి సమీపంలో చోటు చేసుకుంది.
*వ్యవసాయంలో నష్టం రావడంతో అప్పులు తీర్చే మార్గం కనిపించక ఓ కౌలు రైతు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు జిల్లా తాడికొండ మండలంలో ఈ విషాదం చోటుచేసుకుంది.
*అటవీ అధికారులపై మరో దాడి జరిగింది. తెలంగాణలోని కుమురం భీం జిల్లా కొత్త సార్సాల ఘటన మరువకముందే తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరో దాష్టీకం చోటుచేసుకుంది.
*దొంగచాటుగా విమానం ‘ల్యాండింగ్ గేర్ (చక్రాలు లోపలికి ముడుచుకునే ప్రాంతం)’ లోకి ఎక్కిన ఓ వ్యక్తి అందులోంచి జారిపడి.. మృతి చెందిన ఘటన లండన్లో చోటుచేసుకుంది.
*ఇన్స్టాగ్రాంలో పరిచయమై ప్రేమ పేరుతో సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన యువతిని మోసం చేసిన యానాం కిలాడీ ప్రేమికుడిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.
*ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలపై కడప జిల్లా మైలవరం మండలం పంచాయతీరాజ్ విభాగం సహాయ కార్యనిర్వాహక ఇంజినీరు (ఏఈఈ) పల్లా వెంకటసుబ్బయ్య ఇంటిపై అవినీతి నిరోధక శాఖ(అనిశా) అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు.
*సొంత శాఖలో పనిచేసిన వ్యక్తే అనే కనికరం చూపలేదు.. అనారోగ్యంతో అర్ధంతరంగా మృతి చెందాడని జాలైనా లేదు.. అతడి తాలూకు పింఛన్ దస్త్రం పరిష్కారానికి డబ్బులు అడిగి ఆ కుటుంబాన్ని వేదనకు గురిచేసి ఏసీబీకి చిక్కాడొక ఉద్యోగి. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా ఆబ్కారీ కార్యాలయంలో మంగళవారం జరిగింది.
*భవనం పైనుంచి పడి ఓ మహిళ మృతిచెందింది. ఈ విషాద సంఘటన నగరంలోని సరూర్నగర్లో చోటుచేసుకుంది. అపార్ట్మెంట్ మీద నుంచి పడి మహిళ(35) అనుమానాస్పదరీతిలో మృతిచెందిపడివుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.