NRI-NRT

గుమ్మడి గోపాలకృష్ణకు తానా-ఎన్‌టీఆర్ సాంస్కృతిక పురస్కారం

TANA 2019 Awards List Is Here

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) రెండేళ్లకోసారి అందజేసే ప్రతిష్ఠాత్మక గిడుగు రామ్మూర్తి స్మారక పురస్కారానికి ప్రొఫెసర్ గారపాటి ఉమామహేశ్వరరావు ఎంపికయ్యారు. తెలుగు భాషావికాసానికి, అభ్యున్నతికి కృషి చేసిన వారికి గిడుగు రామ్మూర్తిపేరిట తానా ఈ పురస్కారాన్ని అందజేస్తోంది. 2019 సంవత్సరానికిగాను గారపాటిని ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. విజయవాడకు చెందిన గారపాటి హైదరాబాద్లో స్థిరపడ్డారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. మరోవైపు ఎన్టీవీ ఛైర్మన్ తుమ్మల నరేంద్ర చౌదరికి తానా జీవన సాఫల్య పురస్కారం, రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణకు ఎన్టీఆర్ సాంస్కృతిక పురస్కారం, డాక్టర్ గంగాచౌదరికి గుత్తికొండ రవీంద్రనాథ్ సేవా పురస్కారాన్ని ఇవ్వనున్నట్లు తానా అధ్యక్షుడు సతీష్ వేమన తెలిపారు. ఈనెల 4, 5, 6 తేదీల్లో వాషింగ్టన్ డీసీలో జరగనున్న తానా 22వ మహాసభల్లో ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. భారత్ బయోటెక్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్లా, గ్లోబల్ హాస్పిటల్స్ ఛైర్మన్ రవీంద్రనాథ్ కంచర్ల, కాకినాడ సీపోర్ట్స్ ఛైర్మన్ కేవీ రావు, మహిళా సాధికారత కోసం కృషి చేస్తోన్న బత్తుల విజయభారతికి తానా ప్రెసిడెంట్ అవార్డులను ప్రదానం చేయనున్నారు. వీరితోపాటు 12 మందికి తానా ఎక్సలెన్సీ, మరో 12 మందికి తానా మెరిటోరియస్ పురస్కారాలు ప్రకటించారు. శశికాంత్ వల్లిపల్లి, జయంత్రెడ్డి చల్లా, ప్రసాద్పాండా, మృణాళిని సదానంద, స్వాతి గుండపునీడి, అడపా ప్రసాద్, ప్రసాద్ కునిశెట్టి, రజనీకాంత్ గంగవరపు, నిత్య మలిశెట్టి, వసుంధర కలశపూడి, అనురాధ నెహ్రూ, రావు రాపాక, ప్రకాశం తాతా, హనుమయ్య బండ్ల, ధర్మప్రచారక్ రామినేని, స్నేహ తాళిక, లక్ష్మి లింగ, కృష్ణమోహన్ రావు జెజ్జల, ససల చల్ల, కావ్య కొప్పరపు, సందీప్ వోలేటి, నైషా బెల్లం, కుమార్ నందిగం, నాగరాజు నలజుల తదితరులకు 4న ఈ పురస్కారాలను అందజేయనున్నట్లు తానా కాన్ఫరెన్స్ అవార్డుల కమిటీ సభ్యులు రామ్ బొబ్బా, గోపాల్ శీలమనేని పేర్కొన్నారు.