NRI-NRT

H1B మోసం కేసులో అమెరికాలో ముగ్గురు తెలుగు ప్రముఖుల అరెస్ట్

Three Prominent Telugu NRIs Arrested In USA On H1B Fraud Case-H1B మోసం కేసులో అమెరికాలో ముగ్గురు తెలుగు ప్రముఖుల అరెస్ట్

ఒకప్పుడు అమెరికాలో తెలుగువారి పట్ల సముచితమైన గౌరవభావం ఉండేది. వారు బాగా కష్టపడతారని, నిజాయితీగా వ్యవహరిస్తారనే నమ్మకం అమెరికా ప్రజల్లో, ప్రభుత్వంలో మెండుగా ఉండేది. అమెరికాకు ప్రవాసుల వెల్లువ వెల్లువ అధికం కావడంతో రానూ రానూ ఈ దేశంలో ఇంతకు ముందే స్థిరపడిన తెలుగువారు నూతనంగా వచ్చినవారి అవసరాన్ని ఆసరాగా చేసుకుని అడ్డదారిలో కాసుల కోసం కక్కుర్తి పడుతూ పోలీసులకు, ఇమ్మిగ్రేషన్ అధికారులకు అడ్డంగా దొరికిపోతున్నారు. తాజాగా అమెరికాలోని తెలుగువారిలో ప్రముఖులుగా గుర్తింపు పొందిన ముగ్గురిని H1B అక్రమాల కేసులో న్యూజెర్సీ, కాలిఫోర్నియాలోని అధికారులు అరెస్ట్ చేశారు. వారికి సంబంధించిన మరింత సమాచారం దిగువ చూడవచ్చు.

హెచ్1 బీ వీసా మోసాలకు పాల్పడుతున్న నలుగురు ఎన్ఆర్ఐలను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. న్యూజెర్సీ, కాలిఫోర్నియాలోని రెండు వేర్వేరు ఐటీ కంపెనీలకు చెందిన విజయ్ మన్నే (39), ఫెర్నాండో సిల్వా(53), సతీష్ వేమూరి(52), వెంకట రమణ మన్నెం(47)లను మంగళవారం అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే… వారు వెంటనే బెయిల్ పై బయటకు వచ్చారు. రూ.2.5లక్షల పూచీ కత్తుతో వారికి బెయిల్ ఇవ్వడానికి న్యాయస్థానం అంగీకరించింది. కాగా ఈ నలుగురు కలిసి న్యూజెర్సీ కేంద్రంగా ప్రొక్యూర్‌ ప్రొఫెషనల్స్‌, క్లైంట్‌ ఏ, కాలిఫోర్నియా కేంద్రంగా క్రిప్టో ఐటీ సొల్యూషన్స్‌ పేరిట ఐటీ స్టాఫింగ్‌ కంపెనీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అమెరికాలో ఉద్యోగం పొందాలనుకున్న విదేశీయులకు హెచ్‌1 బీ వీసా ఇప్పిస్తామని చెప్పి మోసం చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. నైపుణ్యమున్న విదేశీ ఉద్యోగులకు అమెరికా హెచ్‌1బీ వీసా జారీచేస్తుందన్న సంగతి తెలిసిందే.

Four executives of two information technology staffing companies have been arrested on charges of fraudulently using the H-1B visa program to gain an unfair advantage over competitors, U.S. Attorney Craig Carpenito announced today. Vijay Mane, 39, of Princeton, New Jersey; Venkataramana Mannam, 47, of Edison, New Jersey; Fernando Silva, 53, of Princeton; and Sateesh Vemuri, 52, of San Jose, California, are each charged by complaint with one count of conspiracy to commit visa fraud. Vemuri made his initial appearance July 1, 2019, before U.S. Magistrate Judge Steven C. Mannion in Newark federal court. Mannam and Silva appeared before U.S. Magistrate Judge Leda Dunn Wettre in Newark federal court on June 25, 2019; Mane appeared before Judge Wettre on June 27, 2019. All were released on $250,000 bond. According to the documents filed in this case and statements made in court: Mane, Mannam, and Vemuri controlled two IT staffing companies located in Middlesex County, New Jersey – Procure Professionals Inc. and Krypto IT Solutions Inc. Silva and Mannam also controlled another New Jersey staffing company, referred to in the complaint as “Client A.” The defendants used Procure and Krypto to recruit foreign nationals and sponsor them for H-1B visas, which allow recipients to live and work temporarily in the U.S. in positions requiring specialized skills. To expedite their visa applications, the defendants caused Procure and Krypto to file H-1B applications falsely asserting that the foreign worker/beneficiaries had already secured positions at Client A, when, in reality, no such positions existed. Instead, the defendants used these fraudulent applications to build a “bench” of job candidates already admitted to the United States, who could then be hired out immediately to client companies without the need to wait through the visa application process, giving the defendants an advantage over their competitors in the staffing industry. The conspiracy charge carries a maximum potential penalty of five years in prison and a $250,000 fine. U.S. Attorney Carpenito credited special agents of the U.S. Department of Homeland Security, Homeland Security Investigations (HSI), under the direction of Special Agent in Charge Brian Michael; U.S. Citizenship and Immigration Services, Newark Office of Fraud Detection and National Security; the USCIS National Benefits Center; and the U.S. Department of Labor, Office of Inspector General, New York Region, under the direction of Special Agent in Charge Michael C. Mikulka, with the investigation leading to the charges. The government is represented by Assistant U.S. Attorney Sarah A. Sulkowski of the U.S. Attorney’s Office’s Public Protection Unit in Newark. The charges and allegations contained in the complaint are merely accusations, and the defendants are presumed innocent unless and until proven guilty.

Official Reference: https://www.justice.gov/usao-nj/pr/executives-staffing-companies-charged-visa-fraud